ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
కేంద్రం తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుకు పైగా పోరాడుతున్న రైతులకు సీపీఐ మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....
మోదీ ప్రభుత్వ మూడు ప్రజావ్యతిరేక వ్యయసాయచట్టాలను
పూర్తిగా రద్దు చేసేంత వరకూ పోరాటాన్ని కొనసాగించండి!
మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.
జనవరి 26న రైతులు చేసిన ట్రాక్టర్ పెరేడ్ ను మేం ఉత్సాహంగా స్వాగతిస్తున్నాం.
దిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ జరుగుతున్న రైతు ఆందోళనలు బ్రిటిష్ వాళ్లు చేసిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు వున్నది బ్రిటిష్ వాళ్లు. నేడున్నది మోదీ. అనాడు భగత్ సింగ్ వుంటే నేడు పోరాడుతున్న రైతుల రూపంలో లక్షలాది ఆయన వారసులున్నారు. ప్రభుత్వం చట్టాల్ని రద్దు చేయడం కాకుండా నాన్చుతూ పోరాటాలను నీరుకార్చే విధానాలను అవలంభిస్తున్నది. 11 దఫాలుగా జరిగిన చర్చల సందర్భంగా ప్రతీసారీ రైతు నాయకులు చట్టాలను రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్ నే స్పష్టంగా చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తున్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామ్రాజ్యవాదుల, భారత దళారీ కంపెనీలకు సేవ చేసేది కనుక.
జనవరి 26న లక్షలాది రైతులు ట్రాక్టర్లతో దిల్లీకి దూసుకుపోయి ఈ గణతంత్రం ఎంత పక్షపాతమైనదో, రైతు వ్యతిరేకమైనదో ప్రపంచానికి చాటారు. ర్యాలీకి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పోలీసుల ద్వారా రైతులను ఆపడానికి అన్ని ప్రయత్నాలూ చేసింది. రైతులు వచ్చే మార్గంలో కావాలని బ్యారికేడ్లు నిర్మించింది. భాష్ప వాయువు వదిలింది. లాఠీఛార్జి చేసింది. ఈ సందర్భంగా నవరీత్ సింగ్ అనే యువకుడు మరణించాడు. చట్టాలూ, సువ్యవస్థ ప్రభుత్వ బాధ్యత అవుతుంది. రైతుల శాంతియుత అందోళనను హింసాత్మకం చేయడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ ఆందోళనల్లో చొరబడి చీలికలు, అల్లర్లు సృష్టించడానికి మోదీ ప్రభుత్వం మొదటి నుండి ప్రయత్నం చేస్తున్నది. జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనల వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ హస్తం వున్నది. బీజేపీ ఏజెంట్లు దీప్ సిద్ధూ, లబ్బా సిధ్ నాలను ఆందోళనను రెచ్చగొట్టడానికి జొప్పించారు. ప్రత్యేక రక్షణ వున్నప్పటికీ ఈ ఏజెంట్లను ఎర్రకోట వైపుకు పోనిచ్చారు. ఎర్రకోటపై జెండా ఎగరేయడం, ట్రాక్టర్ ర్యాలీని హింసాత్మకం చేయడం, రైతు నాయకులపై నేరాన్ని మోపడం బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు మోదీ ప్రభుత్వపు కుట్రపూరిత పథకం. ఈ నీచమైన, నిరంకుశమైన ప్రభుత్వ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిగ్రహం పాటించాలనీ, రైతులకు మద్దతుగా నిలబడాలనీ పోలీసు, సైన్యానికి చెందిన జవానులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్లు కూడా రైతు బిడ్డలే!
ఎర్రకోట వద్ద తనను తాను ప్రధాన సేవకుడని చెప్పుకునే మాటల మాయగాడు మోదీ కపటత్వాన్ని ఈ ర్యాలీ బహిర్గతం చేసింది. నరేంద్రమోదీ దేశ ప్రజల సేవకుడు కాదు. సామ్రాజ్యవాదుల కార్పొరేట్ సంస్థల సేవకుడు. ఈ నిజం మరొకసారి బహిర్గతం అయింది. చట్టాల రద్దును తప్ప మరి దేన్నీ అంగీకరించని దృఢ సంకల్పాన్ని తమ ఐక్యత ద్వారా ప్రదర్శించిన రైతులు మోసపూరిత రాజీ చర్యలను ఈసడించారు. ఇప్పటికీ రైతుల ఐక్య వేదిక బయట కొన్ని శక్తులు వున్నాయి. వర్తమాన అవశ్యకతను అర్థం చేసుకొని ఈ చట్టాలను రద్దు చేసేవరకూ కలిసి పోరాడాలని ఈ శక్తులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం.
మోదీ ప్రభుత్వం ఆహార ధాన్య భాండాగారాన్ని అదానీ, అంబానీల చేతికిచ్చి పేద ప్రజల నోటికాడి ముద్దని లాక్కుంటున్నది. ప్రైవేట్ మండీలను తెరిచి, భూములను కార్పొరేట్ల చేతుల్లో పెట్టి రైతుల మెడలకు కార్పొరేట్ ఉచ్చును బిగిస్తున్నారు. చిన్న వ్యాపారాలనూ, వ్యాపారుల ఉపాధిని కూడా ఈ చట్టాలు లాక్కుంటున్నాయి. ఈ చట్టాల మూలంగా రైతులే కాదు 80 శాతం సాధారణ ప్రజలు ప్రభావితం కానున్నారు.
కనుక రైతుల పోరాటంలో పాల్గొనమని ప్రజలందరికీ మేం విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు మద్దతుగా తమ తమ రంగాల్లో పోరాడమనీ, ఈ చట్టాలను వెనక్కి తీసుకునేలా మోదీ ప్రభుత్వపు మెడలు వంచాలని ప్రజలను కోరుతున్నాం. రైతు పోరాట కమిటీ ద్వారా 2021, ఫిబ్రవరి 1న పార్లమెంట్ ను ముట్టడించాలని తీసుకున్న కార్యక్రమంతో పాటు ఇతర పోరాటాలూ, కార్యక్రమాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా అందోళనలూ, ప్రదర్శనలూ చేపట్టాలని మేం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతరం పోరాటాలు చేపట్టవల్సిందిగా మా పార్టీ శ్రేణులకూ, పీఎల్ జీఏ కూ, అన్ని విప్లవ ప్రజాసంఘాలకూ, జనతన సర్కార్లకు పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా మహాన్ భూంకాల్ దివస్ సందర్భంగా 2021,ఫిబ్రవరి 10న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేయాలని పిలుపునిస్తున్నాం.
అభయ్, అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : farmers protest, delhi, red fort, cpi maoit
(2022-06-27 17:53:07)
No. of visitors : 1332
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని |
| ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹhe Central Committee of our Party firstly conveys its revolutionary greetings to the Indian peasantry that is fighting non-compromisingly and with a strong will against the central government to achieve their |