రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్


రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్

రేప్

కేంద్రం తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా రైతులు చేస్తున్న ఆందోళనలను అణిచివేయడానికి, దెబ్బ తీయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా ప్రభుత్వమే కాకుండా బీజేపీ దాని అనుబంధ సంస్థలు కూడా రైతుల ఉద్యమాన్ని దెబ్బతీయడానికి దాడులు చేయడం, దుష్ప్రచారాలకు పూను కోవడం లాంటి అనేక పనులకు పాల్పడుతున్నాయి. ఇక వీరికి మద్దతుగా ప్రధాన మీడియా సంస్థలు కూడా రైతులపై తమ శాయశక్తులా దాడి చేస్తూనే ఉన్నాయి. అయితే సమాజం పట్ల బాధ్యత కల్గిన కొందరు జర్నలిస్టులు మాత్రం బీజేపీ ప్రభుత్వం, పార్టీ రైతులపట్ల అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారు. అలాంటి నిజాయితీ కల్గిన జర్నలిస్టులపై కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులు చేయడం పనిగా పెట్టుకుంది ప్రభుత్వం. మరో వైపు ఆ పార్టీ కార్యకర్తలు కూడా రైతులనే కాకుండా జర్నలిస్టులను కూడా బెధిరించడం, హత్య చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం, మహిళా జర్నలిస్టులనైతే రేప్ చేస్తానని బెధిరించడం చేస్తున్నారు.

ది వైర్ తదితర మీడియాల కోసం పని చేసే రోహిణీ సింగ్ అనే సీనియర్ జర్నలిస్టు రైతుల ఉద్యమాన్ని కవర్ చేస్తోంది. రైతు ఉద్యమంపై అనేక వ్యాసాలు రాయడమే కాక ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నది. ఆమె రాతల పట్ల సహజంగానే రైతు వ్యతిరేకులు కోపం పెంచుకున్నారు. అలా నిజాలు భరించలేని రాజస్థాన్ కు చెందిన కపిల్ వియాన్ అనే ఏబీవీపీ కార్యకర్త జర్నలిస్టు రోహిణీ సింగ్ పై బెదిరింపులకు దిగాడు. ఆమెను హత్య చేస్తానని, ఆమెపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు. 26 ఏళ్ల కపిల్ వియాన్ ʹలాʹ చదువుతున్నాడు. అతనిది ఉదయపూర్ జిల్లా సెమారీ గ్రామం.

అతని బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని రోహిణీ సింగ్ ఉదయపూర్ రేంజ్ పోలీసులను, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ట్విట్టర్ లో ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గెహ్లాట్ ఉదయపూర్ ఐజి, ఎస్పీలను ఆదేశించారు. కపిల్ వియాన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.

ʹʹజర్నలిస్ట్ రోహిణి సింగ్‌కు హత్య, అత్యాచార బెదిరింపులు పంపిన సెమారి నివాసి కపిల్ సింగ్‌ను మా బృందం అరెస్టు చేసింది ʹ అని ఉదయపూర్ పరిధిలోని ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) సత్యవీర్ సింగ్, ట్వీట్ చేశారు.

రైతుల ర్యాలీపై రోహిణీ సింగ్ రాసిన రాతలు తనకు కోపం తెప్పించాయని వియాన్ పోలీసులకు చెప్పాడు. " ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆమె నివేదికలు తనకు కోపం తెప్పించినందువల్లే జర్నలిస్టును బెదిరించినట్టు విచారణ సమయంలోనిందితుడు ఒప్పుకున్నాడు" అని ఉదయపూర్ ఐజి హిందుస్తాన్ టైమ్స్‌తో అన్నారు.

కాగా తాను ట్వీట్ చేసిన‌ వెంటనే చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ , ఉదయపూర్ పోలీసులకు జర్నలిస్టు రోహిణీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

ʹది వైర్ʹ సౌజన్యంతో

Keywords : farmers protest, journalist, women, abvp, Law Student Affiliated With ABVP Arrested Over Rape Threats to Journalist Rohini Singh
(2021-04-17 09:17:59)No. of visitors : 252

Suggested Posts


0 results

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


రేప్