రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR


రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR

రైతుల

రైతు ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమ ప్రాంతంలోనే ఉంటూ నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టు మన్‌దీప్ పునియాను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ 36 సంఘాలతో కూడిన ʹక్యాంపెన్ అగేన్స్ట్ స్టేట్ రిప్రషన్ʹ (Campaign Against State Repression) విడుదల చేసిన ప్రకటన....

జర్నలిస్ట్ మన్‌దీప్ పునియాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించండి!
మన్‌దీప్ పునియాను వెంటనే విడుదల చేయాలని, జర్నలిస్టులను టార్గెట్ చేయడం మానుకోవాలని రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం డిమాండ్ చేస్తూంది!

జనవరి 30 న, ది కారవాన్ పత్రిక, జన్‌పథ్‌ల కోసం పనిచేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మన్‌దీప్ పునియాను సింగు బోర్డర్ వద్ద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతని ఆచూకీ గురించి అడిగినప్పటికీ పోలీసులు చెప్పలేదు. కానీ అలీపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు తెలిసింది.

మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు, ఆన్‌లైన్ న్యూస్ ఇండియాకు చెందిన మరో జర్నలిస్ట్ ధర్మేంద్ర సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకుని, హామీపత్రం మీద సంతకం చేసిన తరువాత వదిలేసారు. మన్‌దీప్ పునియాను పోలీసులు దారుణంగా కొట్టి, ఆ తరువాత అర్ధరాత్రి... భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 186 (ప్రభుత్వ సేవకుడికి విధి నిర్వహణలో అడ్డుకోవడం), 332 (ప్రభుత్వ సేవకుడి విధి నిర్వహణ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా బాధ పెట్టడం), 353 (ప్రభుత్వ సేవకుడి విధి నిర్వహణను అడ్డుకోడానికి దాడి లేదా నేరపూరిత బలాన్ని వుపయోగించడం) కింద అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ 52/2021 నమోదు చేశారు.

మన్‌దీప్ అధికారులతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే, పోలీసులకు, బారికేడ్ దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక స్థానిక వ్యక్తికి మధ్య జరిగిన వాగ్వాదాన్ని మన్ దీప్ రికార్డ్ చేయడాన్ని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారని, అందువల్ల అతన్ని అరెస్టు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మన్‌దీప్ సెప్టెంబర్ నుండి రైతు ఉద్యమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. కనీస మద్దతు ధర, నిరసనలు పుంజుకోవడం , సింగు బోర్డర్‌లో రైతులు - కార్మికుల మధ్య పెరుగుతున్న ఐక్యత వంటి అంశాలకు సంబంధించి మన్‌దీప్ వ్యాసాలు రాశారు.

ఆందోళనను, స్థానిక కార్మిక సంఘాల నాయకులను, ముఖ్యంగా ఇటీవల అరెస్టు చేసిన మజ్దూర్ అధికార్ సంఘటన్ నాయకులను, లక్ష్యంగా చేసుకోవడంలో వున్న పోలీసుల పాత్ర గురించి మన్ దీప్ వ్యాసాలు రాశారు. ఇటీవల, 2021 జనవరి 29న సింగు బోర్డర్‌లో రైతుల ఆందోళనపై స్థానికుల పేరుతో జరిగిన దాడికి చేసిందెవరనే దానిపై మన్ దీప్ పరిశోధనలు చేశారు. దాడి చేస్తున్నప్పుడు స్థానికులుగా నటించిన బిజెపి కార్యకర్తల జాడ ఆయన బైటికి తీశారు. ఈ దాడిలో పాలక బిజెపి పాత్రను బహిర్గతం చేయడంలో ఆయన చేసిన ప్రయత్నాలు, వాటిలో పోలీసుల పాత్ర అతని అరెస్టుకు దారితీసింది. అరెస్టు చేసిన మరుసటి రోజు, చెప్పిన సమయానికి ముందే మేజిస్ట్రేట్ ముందు అతని న్యాయవాది లేకుండానే హాజరుపరిచారు. బెయిల్ తిరస్కరించి, తిహార్ జైలుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

మన్‌దీప్ పునియా అరెస్టు ఒక ప్రత్యేక సంఘటన కాదు, 2021 జనవరి 26 న ట్రాక్టర్ ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలో జర్నలిస్టులపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లతో కలిపి మన్ దీప్ అరెస్టును చూడాలి. అనంత్ నాథ్, మృణాల్ పాండే, పరేష్ నాథ్, రాజ్‌దీప్ సర్దేసాయ్, వినోద్ కె జోస్, జాఫర్ ఆఘా తదితర‌ ఆరుగురు జర్నలిస్టులతో సహా అనేక మందిపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి.

వీటిలో, ఐపిసి సెక్షన్లు 120 బి (క్రిమినల్ కుట్ర), 124 ఎ (దేశద్రోహం), 153 (అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశం), 153 ఎ (శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 153 బి (నిందించడం, జాతీయ సమైక్యతకు భంగం కలిగించే పక్షపాత ప్రకటనలు), 504 (శాంతి ఉల్లంఘనను ప్రోత్సహించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 505 (2) (బహిరంగ దుశ్చర్యలకు అనుకూలమైన ప్రకటనలు) తదితర సెక్షన్లు ఉన్నాయి. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన నవ్రీత్ సింగ్ అనే రైతు హత్యపై జర్నలిస్టులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి.

పోలీసులు చెప్తున్న దానికి విరుద్ధమైన వాదనలు రైతు నవ్రీత్ సింగ్ కుటుంబం వినిపించింది. ఆ వాదనలతో కూడిన‌ కథనంపై ట్వీట్ చేసినందుకు జర్నలిస్ట్ సిద్ధార్థ్ వరదరాజన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు పోలీసులు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఐపిసి సెక్షన్లు 153 బి, 505 (2) ఉన్నాయి. విలేకరులను బెదిరించడానికి, వేధించడానికి, వారు మాట్లాడకుండా చేయడానికి లేదా ప్రభుత్వం చెప్పిన దానికి కట్టుబడి ఉండేట్లుగా బలవంతం చేయడానికి జర్నలిస్టులను టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెడుతోంది ప్రభుత్వం.

సింగు సరిహద్దు వద్ద సుమారు 200 మంది బిజెపి నేతృత్వంలోని గూండాలు తాము ʹస్థానికులంʹ అని చెప్పుకుంటూ రైతుల ఆందోళనపై దాడి చేసిన మర్నాడు మన్‌దీప్ పునియా అరెస్టు జరిగింది. వారు రాళ్ళు రువ్వారు, మహిళల కోసం వేసిన గుడారాలు, పరుపులు తగలబెట్టారు, ప్రజలను, ముఖ్యంగా సిక్కు యువతను దారుణంగా కొట్టారు. ఇదంతా జరుగుతున్నంత సేపూ, అలర్ల నివారణకు ప్రత్యేకంగా నియమించిన పోలీసులు ప్రేక్షకుల్లా నిలబడ్డారు, బిజెపి నేతృత్వంలోని గూండాల నుండి తప్పించుకున్న రైతులను చావబాదే చర్య మాత్రమే పోలీసులు తీసుకున్నారు.

ఈ చర్యల వీడియో సాక్ష్యాలు బయటికి రావడం ప్రారంభించినప్పుడు, అనేక మంది జర్నలిస్టులు ఈ స్థానికులు అని పిలవబడేవారిని గుర్తించడానికి ప్రయత్నించారు. రైతుల ఆందోళనపై దాడి చేసిన వారిలో అనేక మంది స్థానిక బిజెపి కార్యకర్తలను, ముఖ్యంగా ప్రదీప్ ఖత్రి తోలేదార్, అమన్ దబాస్‌లను గుర్తించే వీడియోను మన్‌దీప్ విడుదల చేశారు. జనవరి 26 న జరిగే ట్రాక్టర్ ర్యాలీలో ఈ బిజెపి నాయకులు, ముఖ్యంగా అమన్, దబాస్‌లు ప్రజలను ఎలా సమీకరించారు, పెట్రోల్ బాంబులను విసిరేందుకు ఎలా ఏర్పాట్లు చేశారనే వివరాల్ని బవానాలోని స్థానికులతో జరిగిన చర్చల ఆధారంగా అరెస్టుకు కొన్ని గంటల ముందు మన్‌దీప్ వివరించారు. పోలీసులు ఆమోదించిన మార్గం హింసాత్మక దాడులకు ప్రణాళికలు వేస్తున్న ప్రాంతాల గుండా వెళుతుందని రైతులు త్వరలోనే ఎలా గ్రహించారో ఆయన వివరించారు.

అంతేకాకుండా, పోలీసుల, ప్రత్యేకించి అలిపూర్ ఎస్ హెచ్ ఓ తోడ్పాటుతో , బిజెపి కార్యకర్తల నాయకత్వంలో దాడి జరిగిందని స్పష్టంగా వున్నప్పటికీ ʹస్థానికులుʹ - రైతుల మధ్య ఘర్షణగా చూపించడానికి కొన్ని మీడియా సంస్థలు, జర్నలిస్టులు వాస్తవాలను, ఫోటోలను ఏ విధంగా తారుమారు చేశారు అనే విషయాన్ని కూడా మన్‌దీప్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, సరిహద్దు వద్ద రైతులకు తగిలిన గాయాలను డాక్యుమెంట్ చేయవలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, హింసకు కారణమైన వారిని బాధ్యులను చేయడంలో తోడ్పడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బిజెపి గూండాలు, పోలీసులు దారుణంగా కొట్టి, పోలీసు వాహనంలో ఎక్కించుకెళ్లిన ఒక సిక్కు యువకుడు రంజీత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో తాను చేసిన ఒక తాజా పోస్ట్‌లో మన్‌దీప్ వివరించాడు. ప్రస్తుతం ఆ రంజీత్ సింగ్ ఆచూకీ తెలియడం లేదు. తాను, ఇతర జర్నలిస్టులు, న్యాయవాదులతో కలిసి సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తానని, అది తన పాత్రికేయ విధి అని మందీప్ అన్నాడు. విపర్యాసమేమిటంటే, మన్‌దీప్‌ను అరెస్టు చేసిన తరువాత, జర్నలిస్టులు, న్యాయవాదులు అతని ఆచూకీ గురించి అనేక గంటల దాకా అతని క్షేమ సమాచారం కోసం ఇలాంటి ఆందోళనలను నిర్వహించ‌లేదు. మన్‌దీప్ పునియా నిశితమైన దర్యాప్తు, నివేదికలు పోలీసులకు అసౌకర్యంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

పోలీసుల క్రూరత్వంపై రిపోర్టులను తయారుచేసే జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం అనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ అత్యాచారం కేసు నేపథ్యంలో కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ) కింద మరో ముగ్గురితో పాటు జర్నలిస్టు సిద్దిక్ కప్పన్‌ను అరెస్టు చేయడం అటువంటి ఒక ఉదహరణ‌. సోషల్ మీడియా పోస్టులు చేసినందుకు జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పదేపదే అరెస్టు చేయడం ఎంత అసంబద్ధమైనదో తేల్చిన మరో కేసు.

మణిపూర్‌లో ఇద్దరు జర్నలిస్టులు ధీరెన్ సడోక్పమ్, పావోజెల్ చౌబాలు రాసిన ఒక కథనం జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నదని అరెస్టు చేసి ,ఆ తరువాత హామీ తీసుకుని విడుదల చేయడం ఆ రాష్ట్రంలోని జర్నలిస్టులను భయ భ్రాంతులను చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదించినందుకు కాశ్మీరీ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్‌ను యుఎపిఎ కింద 2018 ఆగస్టు నుంచి నిరంతరాయంగా నిర్బంధించారు. 2020 లో యుఎపిఎ కింద మస్రత్ జహ్రా, గౌహర్ గీలానీలను లక్ష్యంగా చేసుకోవడం జరిగింది.

మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హాస్యం చెప్పాడని, అసలు అతను చెప్పకుండానే, కమెడియన్ మునవర్ ఫారుకిని అరెస్టు చేశారు. కమెడియన్ (హాస్యనటుడు) కునాల్ కమ్రా పైన దారుణంగా కోర్టు ధిక్కారం కేసు పెట్టారు. బిజెపికి అనుకూలంగా ఉన్న అబద్ధాలను ప్రచారం చేసే జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు ఇచ్చిన స్వతంత్రతకి విరుద్ధంగా పాలకవర్గాలకు వ్యతిరేకంగా వున్నారని భావించిన పాత్రికేయులను, కమెడియన్‌లను లక్ష్యంగా చేసుకోవడం జరుగుతోంది.

అర్నబ్ గోస్వామి విషయంలో ఈ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం, ఆర్టికల్ 21, స్వేచ్ఛా హక్కును కోరుతూ, ఉదారంగా న్యాయపర జోక్యం చేసుకోవడం, జర్నలిస్ట్ & మీడియా బ్రాడ్కాస్టర్ కమిటీ యొక్క మాజీ చీఫ్ మధ్య జరిగిన సంభాషణలు బహిర్గతం చేశాయి. ఇవి ప్రధాన స్రవంతి మీడియాలో వున్న లోతైన తెగులును, ప్రభుత్వ అగ్ర నాయకులతో ఆ సంస్థలకు వున్న సంబంధాలను వెల్లడిస్తుంది.

ప్రజాస్వామ్య సూత్రాలపై దూకుడుగా దాడి చేసే బ్రాహ్మణీయ‌ హిందుత్వ ఫాసిస్ట్ శక్తులను బహిర్గతం చేయడానికి ధైర్యం చేసిన వారు తిరుగుబాటు దారులుగా కటకటాల వెనుక వుంటున్నారు. రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం (సిఎఎస్ఆర్) జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మన్‌దీప్ పునియాను వెంటనే విడుదల చేయాలని, జర్నలిస్టులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూంది.

మీడియా సిబ్బందిని భయపెట్టడానికి, మాట్లాడకుండా చేయడానికి దేశద్రోహం వంటి వలస యుగ చట్టాలను ఉపయోగిస్తూ, హింసకు పాల్పడేవారిని అప్రకటితంగా నిర్దోషులుగా వదిలేస్తోంది. రాజ్య క్రూర అణచివేత శక్తిని ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజాస్వామ్యానికి అవసరమైనంత శ్రద్ధగా తన వృత్తిపరమైన బాధ్యతను స్వీకరించిన మన్‌దీప్ పునియాకు, అతనిలాంటి యితర పాత్రికేయులకు CASR సంఘీభావం తెలుపుతుంది.

Campaign Against State Repression
(Organising Team: AISA, AISF, APCR, Bhim Army, Bigul Mazdoor Dasta, BSCEM, CEM, CRPP, CTF, Disha, DISSC, DSU, DTF, IAPL, IFTU, IMK, Karnataka Janashakti, KYS, Lokpaksh, LSI, Mazdoor Adhikar Sangathan, Mazdoor Patrika, Mehnatkash Mahila Sangathan, Morcha Patrika, NAPM, NBS, NCHRO, Nowruz, NTUI, PDSU, Peopleʹs Watch, Rihai Manch, Samajwadi Janparishad, Satyashodak Sangh, SFI, United Against Hate, WSS)

Keywords : farmers protest, delhi, mandeep punia, arrest, journalist, CASR
(2021-04-13 12:57:18)No. of visitors : 190

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌

నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

Search Engine

ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్
మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
more..


రైతుల