ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్


ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్

ʹమోడీప్లానింగ్


ʹమోడీ ప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ ( రైతు జాతి హననానికి మోడీ ప్రణాళిక) అనే హ్యాష్‌ట్యాగ్‌తో కూడిన ట్వీట్లను బ్లాక్ చేయాలని, రైతుల నిరసనలకు సంబంధించిన 257 యుఆర్‌ఎల్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను కోరగా ట్విట్టర్ అందుకు నిరాకరింది.ఇది వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశమని ట్విట్టర్ పేర్కొంది. దాంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ కు మళ్ళీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి.

ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ అనే హ్యాష్‌ట్యాగ్ మరియు యుఆర్‌ఎల్‌లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, దేశంలో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే హింసకు దారితీస్తుందని కేంద్రం పేర్కొంది.

"హ్యాష్‌ట్యాగ్ ప్రజలని హింసకు రెచ్చగొడుతుంది. నేరాలకు పాల్పడేలా ప్రజలను ప్రేరేపిస్తున్నది. ఇలా హింసను ప్రేరేపించేలా, ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పత్రికా స్వేచ్ఛను సాకుగా తీసుకోలేము" అని మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) ఫిబ్రవరి 2, 2021 నాటి నోటీసు‌లో ట్విట్టర్‌కు తెలిపింది.

కేంద్రం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ [3] కింద జరిమానా, జైలు శిక్ష‌ విధించాల్సి ఉంటుందని కేంద్రం నోటీసు ట్విట్టర్‌ను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రకారం, 69 (1) కింద జారీ చేసిన ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.

సంబంధిత URL లు మరియు హ్యాష్‌ట్యాగ్‌ను తీసివేయమని ట్విట్టర్‌ను కోరుతూ కేంద్రం జనవరి 31 న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిబ్రవరి 1 న జరిగిన కమిటీ సమావేశం ముందు ట్విట్టర్ ప్రతినిధు హాజరయ్యి ప్రభుత్వ ఉత్తర్వులను పాఠించడానికి నిరాకరించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ MEITYకి ట్విట్టర్ లేఖ కూడా రాసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు మళ్ళీ నోటీసులు జారీ చేసింది.

మరో వైపు దేశ వ్యాప్తంగా రెండు నెలలుకు పైగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఢిల్లీ బార్డర్ లో ఉన్న లక్షల మంది రైతులకు సర్కార్ కరెంట్ కట్ చేసింది. నీళ్ళు బందు పెట్టింది. ఇమ్టర్నెట్ బ్యాన్ చేసింది. రోడ్లపై బ్యారికేడ్లు పెట్టింది. ముళ్ళకంచెలు వేసింది. రోడ్లపై మేకులను దిగ్గొట్టింది. ఇవి చాలవన్నట్టు అనేక రైయులపై కేసులు నమోదు చేసింది. 200 మందికి పైగా రైతులను అరెస్టులు చేసింది. రైతు ఉద్యమంపై రాస్తున్నందుకు, చూపిస్తున్నందుకు పలువురు జర్నలిస్టులపై కేసులు బనాయింది. కొందరిని అరెస్టు చేసింది. ఇన్ని చేసినా రైతులు బెధరకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తుండటం, ఉద్యమం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రైతు అనుకూల ప్రచారం జరుగుతుండటం కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దాంతో ఇక సోషల్ మీడియాపై దాడి మొదలుపెట్టింది. పలు రైతు అనుకూల ట్విట్టర్ అకౌంట్లను బ్యాన్ చేయింది. అయితే దేశవ్యాప్తంగా విమర్షలు రావడంతో ట్విట్టర్ వెంటనే మేల్కొని ఆ అకౌంట్లను పునరుద్దరించింది. ఇప్పుడిక మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్ ను టార్గెట్ చేసింది. జైలు శిక్ష బూచి చూపుతూ ట్విట్టర్ ను బెధిరిస్తోంది. అయితే ట్విట్టర్ వాక్ స్వాతత్య్రమనే తన వాదనకు కట్టుబడుతుందా లేక మోడీ ప్రభుత్వానికి లొంగిపోతుందా అనేది వేచి చూడాలి.

Keywords : farmers protest, narendra modi, ModiPlanningFarmerGenocide,Twitter,Twitter refuses to comply with Centreʹs order to block one hashtag, 257 URLs on Farmers Protests; "Astonished" Centre warns of penal action
(2021-04-16 02:46:03)No. of visitors : 268

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌

నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


ʹమోడీప్లానింగ్