జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్


జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య‌ డిమాండ్

జి.

డాక్టర్ జి. ఎన్. సాయిబాబా కోవిడ్ పాజిటివ్‌ను వచ్చింది:
పర్యవేక్షణను, ప్రైవేట్ ఆసుపత్రికి మార్చాలని డిమాండ్ చేస్తున్నాం.

90% శారీరకంగా వికలాంగుడిగా వీల్‌చైర్‌లో వుండే ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి. ఎన్. సాయిబాబా నుండి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు, తనకు కోవిడ్ పాజిటివ్‌ను వచ్చింది అని మాకు ఫోన్ కాల్‌లో చెప్పారు. మూడు రోజుల క్రితం, డాక్టర్ సాయిబాబా మాకు ఫోన్ చేసి తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని, అనేక కోవిడ్ -19 లక్షణాలు కనిపిస్తున్నాయనీ చెప్పారు. మేము వెంటనే కోవిడ్ పరీక్షను చేయించాలని జైలు అధికారులకు విజ్ఞప్తి చేస్తే, నిన్న సాయంత్రం డాక్టర్ సాయిబాబాకు కోవిడ్ వచ్చిందని రిపోర్టు వచ్చింది..

19 ఆరోగ్య రుగ్మతలతో బాధపడుతున్న డాక్టర్ సాయిబాబాపై ఇది అనారోగ్యం చేసిన మరొక తీవ్రమైన దాడి, కోవిడ్ వల్ల మరింత సమస్యలకు దారితీసే గుండె, మూత్రపిండాల సమస్యలతో సహా తీవ్రమైన సహ-అనారోగ్యాలు సాయిబాబాకు ఉన్నాయి. ప్రస్తుతం, తీవ్రమైన జ్వరంతో, తక్కువ ఆక్సిజన్ లెవెల్‌తో బాధపడుతున్నాడు. వెంటనే అవసరమైన చికిత్స అందకపోతే లేదా ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉంటే ఆక్సిజన్ లెవెల్‌ మరింతగా పడిపోవచ్చు.

కోవిడ్ కారణంగా, రక్తప్రసరణ జరగడానికి గుండెపై ఎక్కువ ఒత్తిడి కలిగి వాపు, బ్లాకేజీ రావడం వల్ల యిప్పటికే ప్రమాదంలో వున్న అతని గుండె పరిస్థితి (హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి విత్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్) మరింతగా క్షీణిస్తుంది.

ఈ పరిస్థితి గురించి ఆందోళన చెందిన మేము ప్రొఫెసర్ సాయిబాబాను పెరోల్ మీద జైలు నుండి విడుదల చేయాలని కరోనా తీవ్ర వ్యాప్తిలో వుండిన గత సంవత్సరం విజ్ఞప్తి చేశాం. పెరోల్ అభ్యర్థనలన్నీ నిరాకరణకు గురయ్యాయి. ప్రస్తుతం, అతనికి తీవ్రమైన తలనొప్పి, శ్వాస పీల్చడంలో నిరంతర యిబ్బంది, తరచుగా ఎక్కిళ్ళు, ముక్కు, గొంతుల్లో తీవ్ర యిబ్బంది, విపరీతమైన కండరాల నొప్పులతో బాధపడుతున్నాడు. గొంతులో వున్న యిబ్బంది వల్ల ఫోన్ కాల్‌లో మాతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు.

జైలులో డాక్టర్ సాయిబాబాతో పాటు పరీక్షించిన 25 మంది ఖైదీలలో, 10 మందికి పాజిటివ్ రావడం, నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో కరోనా వ్యాప్తి చెందే అవకాశం వుండడాన్ని సూచిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో డాక్టర్ సాయిబాబాను వెంటనే అపరిశుభ్రమైన జైలు ప్రాంగణం నుండి బైటికి తీసుకరావాలి.

90% శారీరకంగా వికలాంగుడైన డాక్టర్ సాయిబాబాకు నియమించిన ఇద్దరు సహాయకులకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ కారణంగా, ప్రస్తుతం సాయిబాబాకు సహాయకులను తీసేశారు. సాయిబాబాను ఒంటరిగా వుంచడం వల్ల అతని రోజువారీ అవసరాలను చూసుకోవటానికి లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయపడటానికి సహాయకులు లేరు. అతనిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం గురించి మేం చాలా ఆందోళన చెందుతున్నాం. కోవిడ్ కారణంగా యితర అనారోగ్య సమస్యలు తీవ్రతరమయ్యే అవకాశం వున్నందువల్ల, అతనికి వెంటనే క్రియాశీల చికిత్స, సంరక్షణ అవసరం.

సాంక్రమిక వ్యాధులతో, రోగుల అధిక రద్దీతో వున్న నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అతన్ని వుంచడానికి సరైన ప్రదేశం కాదు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆసుపత్రిలో మెడికల్ కిట్ల కొరత ఉందని ఇటీవలి వార్తాపత్రిక నివేదికలు సూచిస్తున్నాయి.

డాక్టర్ సాయిబాబాకు యిప్పటికే వున్న అనారోగ్య పరిస్థితుల కారణంగా వచ్చిన కోవిడ్ వల్ల తక్కువ రోగనిరోధక శక్తి వున్న ఆయన GMCHలో ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా, ఆ ఆసుపత్రిలో వీల్-చైర్‌తో వెళ్లగల బాత్రూమ్ లేదు, ఇది గతంలో డాక్టర్ సాయిబాబాకు చాలా ఇబ్బందిని కలిగించింది.

పై పరిస్థితుల వల్ల, వచ్చే 24 గంటల్లో శారీరకంగా వికలాంగుడైన సాయిబాబాను సరైన చికిత్స కోసం అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు ఉన్న నాగ్‌పూర్‌లోని మంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మహారాష్ట్ర హోంమంత్రికి కూడా మేము ఒక లేఖ పంపాము. అతని చికిత్సను కుటుంబ సభ్యులు పర్యవేక్షించాలి, అవసరమైనప్పుడు తన న్యాయవాదులతో మాట్లాడే సౌకర్యం ఉండాలి. యిప్పటికే ఉన్న యితర అనారోగ్యాల కారణంగా అత్యవసర సంరక్షణ లేకుండా సురక్షితంగా కోలుకోవడం సాధ్యం కాదు. డాక్టర్ సాయిబాబా పరిస్థితి గురించి జైలు అధికారులు కుటుంబ సభ్యులైన మాకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాము. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్ సాయిబాబాను పెరోల్ ద్వారా విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.

వసంత, డాక్టర్ జి. ఎన్. సాయిబాబా కుటుంబ సభ్యులు
13-02-21

Keywords : professor saibaba, nagapur jail, corona, hospital, wife, vasanthakumari
(2021-02-25 06:31:08)No. of visitors : 150

Suggested Posts


Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital

This is a serious attack on Dr. Saibaba, who suffers from 19 health ailments and has serious co-morbidities, including heart and kidney issues that can lead to further complications under Covid.

Search Engine

మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ
దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం
అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు
వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగర‌న్ మంచ్ʹ మూక దాడి
Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital
ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR
రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన‌ పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ?
రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన‌ ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్
CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers
నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన‌ రైతు నాయకుడు
జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన‌
రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు
కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌
నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ‌ !
ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
వ్యవ‌స్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె
ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
more..


జి.