మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ


మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల‌ లేఖ

మరింత

నాగ్ పూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినప్పటికీ సరైన వైద్యం అందక ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకూ విషమిస్తున్నది. ఆయన ప్రస్తుతం ఆకలి, రుచి, వాసన కోల్పోయాడు. ఆహారాన్ని మింగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు, రక్తపోటు (బిపి) ఊహించని విధంగా 90/50కి పడిపోయింది. శ్లేష్మం అడ్డుకోవడంతో నిరంతర దగ్గు, ఊపిరి ఆడకుండా ఉంది. గొంతు ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. చాలా బలహీనం ఉండి రోజువారీ కార్యకలాపాలను చేసుకోలేకపోతున్నాడు. తీవ్రమైన గొంతు మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నందున సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. ఈ విషయాలను సాయిబాబా ఈ నెల 23 న తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరించాడు. ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు కుటుంబ సభ్యులు లేఖ రాశారు. దీనిపై ప్రొఫెసర్ హరగోపాల్ చైర్మన్ గా గల ʹసాయిబాబా రక్షణ విడుదల కమిటీʹ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం...

ప్రొ.జి.ఎస్. సాయిబాబాకు తక్షణ వైద్య సహాయం అవసరం

మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రొ. జి.ఎన్. సాయిబాబాకువైద్య సహాయం కోసం జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యుల వినతి

నిన్న సాయంత్రం అంటే 23.02.2021 నాడు నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి ప్రొ. జి.ఎన్. సాయిబాబా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాడు. తాను తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడని, రక్తపోటు (బిపి) ఊహించని విధంగా 90/50కి పడిపోయిందని తెలియజేశారు. శ్లేష్మం అడ్డుకోవడంతో నిరంతర దగ్గు, ఊపిరి ఆడకుండా ఉంది. గొంతు ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. చాలా బలహీనం ఉండి రోజువారీ కార్యకలాపాలను చేసుకోలేకపోతున్నాడు. తీవ్రమైన గొంతు మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నందున సరిగ్గా మాట్లాడలేకపోయాడు. ఆకలి, రుచి, వాసన కోల్పోయాడు. ఆహారాన్ని మింగడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. తక్కువ రక్తపోటు (బిపి) కారణంగా జైలులో మంచం నుండి 2021 ఫిబ్రవరి 18 నాడు కిందపడిపోయాడు.
అతను వీల్ చైర్ లేకుండా కదలలేడు కాబట్టి సహాయం కోసం మరొకరిని పిలవలేడు. జైలులో తక్షణ సహాయం అందించే వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు కనుక, ఇలాంటి సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సహ నిందితులలో కోవిడ్ -19 బారిన పడిన ఒకరిని మాత్రమే సాయిబాబాకు సహాయకుడిగా కేటాయించారు. అతను సాయిబాబాకు సహాయపడడంలో న్యాయం చేయలేడు, ఎందుకంటే అతను కూడా విశ్రాంతి తోబాటు సరైన మందులు తీసుకోవాలి.
నాగపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సాయిబాబాకు CT స్కాన్ ద్వారా కోవిడ్-19 CORADS స్థాయి-5 ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించింది. వైద్య పరీక్షల అనంతరం వెంటనే అతన్ని తిరిగి నాగపూర్ జైలు లోని ఆండా సెల్ పంపించారు. సాయిబాబాకు తీవ్రమైన సహ-అనారోగ్యాలు (Comorbidities) ఉన్నాయి. సహ-అనారోగ్యాలు ఉన్న కోవిడ్ రోగులు ప్రాణాంతక పరిణామాలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెప్పుతున్నారు. ఊపిరితిత్తులలో CORADS స్థాయి -5 వలన మాకు తీవ్రమైన ఆందోళన కలుగుతుంది. కోవిడ్ కు ముందు రక్తపోటు మరియు గుండె సమస్యల కారణంగా, ప్రొ.జి.ఎన్. సాయిబాబా బిపి నియంత్రణ గోళీలు తీసుకుంటున్నాడు. బిపి స్థాయి పడిపోయిన్నపుడు ఆ గోళీలు తీసుకోవడం తాత్కాలికంగా ఆపివేయాలని కనీస వైద్య సలహా కూడా అందలేదు.
కోవిడ్ పర్యవసానంగా అతని సహ-అనారోగ్యాలలో ఏదైనా తిరగబెట్టితే సాయిబాబా జీవితం ప్రమాదంలో పడుతుందని భయపడుతున్నాము. పోలియోతో బాధపడుతున్నవారికి, కోవిడ్ కి ముందు ఆ తర్వాత
క్రియాశీలం అయ్యే సహ-అనారోగ్యాల (Comorbidities) వలన తీవ్ర అస్వస్థతకు గురౌతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి క్లిష్ట ఆరోగ్య పరిస్థితులలో ఉన్న ప్రొ. సాయిబాబా ను వీలైనంత త్వరగా ఏదైనా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము.
కోవిడ్ సంబంధిత కారణంగా అతనికి తక్షణ వైద్య పర్యవేక్షణ మరియు చికిత్స అవసరం. ప్రొ. సాయిబాబా ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితిని పరిగణన లోకి తీసుకుని మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, వెంటనే చక్రాల కుర్చీ తిరిగే సౌకర్యం ఉన్న ఏదైనా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రొ. జి.ఎన్. సాయిబాబా ఉన్న అనేక సహ అనారోగ్యాలకు అవసరమైన వైద్య సహాయం అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

హరగోపాల్, చైర్మన్
కే. రవిచందర్, కన్వీనర్, తెలంగాణ‌
G N సాయిబాబా రక్షణ, విడుదల కమిటీ

Keywords : professor GN Saibaba, nagpur jail, corona, covid 19
(2021-04-17 02:20:43)



No. of visitors : 435

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO

నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు.

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.

ముగిసిన అమ్మ ఎదురు చూపులు

విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


మరింత