కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్


కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కు బెయిల్

కార్మిక

రైతుల ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేసిన కార్మిక, దళిత హక్కుల కార్యకర్త నవదీప్ కౌర్ కు బెయిల్ లభించింది. ఈ రోజు(26 ఫిబ్రవరి) పంజాబ్, హర్యానా హైకోర్టులో జస్టిస్ అవనీష్ జింగాన్ ధర్మాసనం నవదీప్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు మంజూరు చేశారని లైవ్ లా వెబ్ సైట్ తెలిపింది. ఆమె హత్యా ప్రయత్నం చేసిందనడానికి ఎలాంటి సాక్షాలు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‌నవదీప్ కౌర్ పై పోలీసులు మోపిన మరో రెండు కేసుల్లో గతంలో బెయిల్ వచ్చింది.

రైతుల ఉద్యమంలో కౌర్ పాల్గొన్నందువల్ల ఆమెను లక్ష్యంగా చేసుకొని పోలీసులు తప్పుడు కేసుల్లో ఇరికించారని కౌర్ తరపు అడ్వకేట్ ఆర్.ఎస్.చీమా వాదించారు. తనను అరెస్టు చేసినప్పుడు మహిళా పోలీసులు లేకుండానే స్టేషన్ లో ఉంచారని, హింసించారని కౌర్ తన బెయిల్ పిటిషన్ లో ఆరోపణలు చేశారు.

23 ఏళ్ల నవదీప్ కౌర్ మజ్దూర్ అధికార్ సంగట‌న్ సభ్యురాలు. ప్రస్తుతం ఆమె హర్యానాలోని కర్నాల్ జైలులో ఉన్నారు. ఆమెపై హత్య మరియు దోపిడీకి పాల్పడిన ఆరోపణలతో సహా మూడు కేసులు పోలీసులు బనాయించారు.

రైతుల ఆందోళ‌నలకు మద్దతుగా నవదీప్ ఢిల్లీ సరిహద్దు సింఘూ వద్ద రైతులను, కార్మికులను సమీకరించారు. అలా ప్రజలను రైతు ఉద్యమానికి మద్దతుగా సమీకరించడంతో హర్యాణా ప్రభుత్వం ఆమెను లక్ష్యంగా చేసుకుంది. జనవరి 12 న సోనీపట్ జిల్లాలోని ఓ పరిశ్రమ‌ కార్మికులకు మద్దతుగా జరిగిన ఓ ధర్నాలో ఆమె పాల్గొంది. ఆ సందర్భంగా పరిశ్రమ యాజమాన్యాన్కి మద్దతుగా రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులపై లాఠీచార్జ్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో నవ్దీప్ ను అరెస్టు చేసిన పోలీసులు ఆమెపై పలు కేసులు బనాయించారు.

కాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ నవదీప్ కౌర్ అరెస్టుపై ట్వీట్ చేసిన తరువాత కౌర్ అరెస్టు అంతర్జాతీయ ప్రాముఖ్యత లభించింది. " 23 సంవత్సరాల కార్మిక హక్కుల కార్యకర్త నవ్ దీప్ కౌర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఆమె హింసించబడ్డారు, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఆమెను 20 రోజులకు పైగా బెయిల్ లేకుండా జైల్లో ఉంచారు.ʹʹ అని మీనా హారిస్ ట్వీట్ చేశారు.ʹʹ

కౌర్‌ను అరెస్టు చేసిన కొద్ది రోజుల తర్వాత ఆమెతో పాటు పనిచేసే మరో కార్మిక కార్యకర్త శివ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. శివ కుమార్‌ను కస్టడీలో దారుణంగా హింసించారని, గోర్లు పీకేశారని, కాళ్ళు విరిచేశారని శివకుమార్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. వైద్యుల రిపోర్ట్ ఆధారంగా ఆయన ఈ కేసు ఫైల్ చేశారు.ఈ కేసు మార్చి 16 న విచారణకు రానుంది.

Keywords : navdeep kaur, haryana, arrest, bail, Punjab and Haryana HC Grants Bail to Labour Activist Nodeep Kaur
(2021-04-15 02:53:57)



No. of visitors : 191

Suggested Posts


ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం

హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక‌ చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి.

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన‌

నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా

రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
more..


కార్మిక