సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్

సుప్రీం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే రాజీనామా చేయాలని నాలుగు వేల‌మందికి పైగా ప్రముఖ వ్యక్తులు, ‌హ‌క్కుల నేత‌లు, పౌర‌, స్వ‌చ్ఛంద ‌సంఘాల నేత‌లు, మ‌హిళా హ‌క్కుల నేత‌లు ఓ బ‌హిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఆ లేఖ పూర్తి పాఠం...

కొన్ని రోజుల్లో అంత‌ర్జాతీయ మ‌హ‌ళా దినోత్స‌వం రాబోతున్న త‌రుణంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎస్‌.ఏ. బోబ్డే ఓ అత్యాచారం కేసు విష‌యంలో ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్ప‌దం అవుతున్న‌ది. లైంగిక దాడికి పాల్ప‌డిన వాడినే బాధితురాలిని పెండ్లి చేసుకొని, అత్యాచార నేరం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి చెప్పిన తీర్పుప‌ట్ల మ‌హిళాసంఘాల‌తో పాటు హ‌క్కుల నేత‌లు, ప్ర‌ముఖులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సీజేఐ వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. రాజీనామా చేయాల‌ని లేఖ‌ద్వారా డిమాండ్ చేసిన వారిలో న్యాయ‌వాదులు, విద్యార్థులు, మేధావులు, సీనియ‌ర్ సిటిజ‌న్స్‌, అభ్యుద‌య వాదులతో పాటు స‌మాజంలోని అన్ని వ‌ర్గాల వారుండ‌టం గ‌మ‌నార్హం.

లైంగిక దాడి కేసులో త‌నను అరెస్టునుంచి త‌ప్పించాల‌ని సుప్రీంకోర్టులో నిందితుడు పెట్టుకున్న పిటిష‌న్‌ను విచారిస్తూ.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పులో.. బాధితురాలి ప‌ట్ల జ‌రిగిన ఘ‌ట‌న తీవ్ర విచార‌క‌రం, బాధాక‌రం. జ‌రిగిన ఘోరం గురించి ఏమీ చెప్పుకోలేని వ‌య‌స్సులో జ‌రిగింది. బాలిక‌పై లైంగిక దాడి, మోసం, పెండ్లి విష‌యాల గురించి అవ‌గాహ‌న లేని వ‌య‌స్సులో జ‌రిగిన ఘ‌ట‌న ఇది.. అంటూ తీర్పులో న్యాయ‌మూర్తి పేర్కొన్నారు. నిజానికి పాఠ‌శాల‌కు పోతున్న అమ్మాయిని అగంత‌కుడు అనేక విధాలుగా బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. పెట్రోల్ పోసి త‌గుల‌బెడుతాన‌ని బెదిరించాడు. యాసిడ్ పోస్తాన‌ని, ఆమె అన్న‌ను చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డి బాలిక‌ను చెర‌బ‌ట్టి లొంగ‌దీసుకున్నాడు. ఆ బెదిరింపుల‌తోనే అనేక మార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఆ వేదింపుల‌కు త‌ట్టుకోలేక చివ‌రికి ఆ బాలిక ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన‌ప్పుడు మాత్ర‌మే జ‌రిగిన ఘోరం వెలుగులోకి వ‌చ్చింది. ఇలాంటి దురాగ‌తానికి పాల్ప‌డ్డ వాడిని అమ్మాయిని పెండ్లి చేసుకొని చేసిన త‌ప్పును స‌రిదిద్దుకోవాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చెప్ప‌టం విడ్డూరం. ఇదే దేశ వ్యాప్తంగా జ‌నాగ్ర‌హానికి కార‌ణ‌మవుతున్న‌ది.

పౌర, మ‌హిళా, హక్కుల సంఘాల నేత‌లు రాసిన లేఖ‌లో మ‌రో ఉదంతాన్ని కూడా ఉద‌హ‌రించారు. విన‌య్ ప్ర‌తాప్ సింగ్ వ‌ర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో.. సీజేఐ చేసిన వ్యాఖ్య‌లు కూడా అభ్యంత‌ర‌క‌ర‌మైన‌వ‌ని అంటున్నారు. ఈ కేసు సంద‌ర్భంగా.. సీజేఐ.. ఒక చ‌ట్ట‌బ‌ద్ధంగా పెండ్లి చేసుకున్న‌ భార్య భ‌ర్త‌ల్లో భ‌ర్త క్రూరుడై, బ‌ల‌తవంతంగా బార్య‌తో శృంగారంలో పాల్గొంటే, దాన్ని అత్యాచారం అనాలా? అని ప్ర‌శ్నాంచారు. ఈ వ్యాఖ్య‌లు భ‌ర్త‌ల స్థానంలో ఉన్న వారు ఎలాంటి అమాన‌వీయ ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డా, ఎలా ప్ర‌వ‌ర్తించినా దాన్ని స‌హేతుకం చేస్తున్న‌ద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల కుటుంబంలో మ‌హిళ‌ల‌కు ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ న్యాయం, ర‌క్ష‌ణ క‌రువ‌వుతుంద‌ని నిర‌సించారు.

వారి లేఖ‌లో వారింకా ఇలా పేర్కొన్నారు- సుప్రీంకోర్టు సీజేఐ మాట‌ల ద్వారా దేశంలోని కోర్టులు, పోలీసులు, ఇత‌ర న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌కు మ‌హిళ‌ల హ‌క్కుల‌కు ఎలాంటి చ‌ట్ట‌బ‌ద్ధ ర‌క్ష‌ణ లేద‌ని సందేశం ఇచ్చిన‌ట్ల‌య్యింద‌ని అంటున్నారు. ద‌శాబ్దాలుగా మ‌హిళ‌లు పోరాడుతున్న హ‌క్కుల ర‌క్ష‌ణ‌ప‌ట్ల వారి నోరును నొక్కేశారు. మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు వివాహం లైసెన్స్ పొందిన‌ట్ల‌యి, అది పురుషుల వికృత లైంగిక దాడుల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తుంది.

ఈ లేఖ‌పై సంత‌కం చేసిన ప్ర‌ముఖులు.. అన్ని రాజా, మ‌రియ‌మ్ ధ‌వాలే, క‌వితా కృష్ణ‌న్‌, క‌మ‌లా భాసిన్‌, మీరా సంఘ‌మిత్ర‌, అరుధ‌తి ధురు మైమూనా మొల్లా, జ‌కియా సోమ‌న్‌, చ‌య‌నికా షా, హ‌సినా ఖాన్...
ఇంకా మేధావులు, రచ‌యిత‌లు, జ‌ర్న‌లిస్టులు, సాంస్కృతిక కార్య‌క‌ర్త‌లు, ఇంకా ప్ర‌ముఖులు.. అడ్మిర‌ల్ ఎల్ రామ్‌దాస్‌, అరుణ్ రాయ్‌, నిఖిల్ దేవ్‌, ప‌మిలా ఫిలిపోస్‌, ఆనంద్ స‌హాయ్‌, దేవికా జైన్‌, జాన్ ద‌యాల్‌, ల‌క్ష్మి మూర్తి, అపూర్వానంద్‌, ఫ‌రా న‌ఖ్వి, అయేషా కిద్వాయ్‌, అంజా కోవాక్స్‌, గీతా శేషు, మాయా రావ్‌, సూని త‌పొరేవాలా, అంజ‌లీమాంటీరియో, కేపీ జ‌య‌శంక‌ర్‌, నుపుర్ బసు, అనామికా హ‌క్స‌ర్ 50 హ‌క్కుల, పౌర‌ సంఘాలు ఉన్నా‌యి.
అవి.. ఆల్ ఇండియా ప్రొగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేష‌న్‌, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేష‌న్‌, నేష‌న‌ల్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఉమెన్‌, స‌హేలీ, ఉమెన్ అగ‌నెస్ట్ సెక్సువ‌ల్ వాయిలెన్స్ అండ్ స్టేట్ రిప్రెష‌న్‌, థిట్స్ (టీహెచ్ఐటీఎస్‌), ఫోరం అగ‌నెస్ట్ అప్రెష‌న్ ఆఫ్ ఉమెన్‌, బెబాక్ క‌లెక్టివ్‌, భార‌తీయ ముస్లిం మ‌హిళా ఆందోళ‌న్‌, డొమెస్టిక్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌, ద‌ళిత్ ఉమెన్స్ ఫైట్‌, బాసో (బీఏఎస్ఓ), ఉమెన్ అండ్ ట్రాన్స్‌జెండ‌ర్ ఆర్ట‌నైజేష‌న్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ, ఫెమినిస్ట్స్ ఇన్ రెసిస్టెన్స్‌, గాద‌ర్ సిస్ట‌ర్స్‌, మ‌హిళా సంప‌ర్క్ స‌మితి, హ్యూమ‌న్ రైట్స్ ఫోరం, మ‌జ్దూర్ కిసాన్ సంఘ‌ర్స్ స‌మితి, జ‌న చేత‌న మంచ్‌, ఎక‌ల్ నారీ శ‌క్తి సంఘ‌ట‌న్‌, పీపుల్స్ యూనియ‌న్ ఫ‌ర్ సివిల్ లిట‌ర్బీస్‌, ఉమెన్ అగ‌నెస్ట్ సెక్సువ‌ల్ హ‌రాస్‌మెంట్‌, ఒరినామ్ క‌లెక్టివ్‌, జ‌న స్వాస్త్య అభియాన్‌, న్యూ సోష‌లిస్ట్ ఇనిషియేటివ్‌,నేష‌న‌ల్ అల‌యెన్స్ ఆఫ్ పీపుల్స్ మువ్‌మెంట్స్‌..

Keywords : supreme court, Sharad Arvind Bobde, chief justice of india,
(2024-04-25 00:45:53)



No. of visitors : 552

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సుప్రీం