ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్


ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్

ఆదివాసీ

మావోయిస్టు ముద్ర వేసి ఛత్తీస్ గడ్ లో మార్చి 9 న ఓ మానవహక్కుల కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. హిడ్మే మార్కమ్ అనే ఈ మహిళా కార్యకర్త ఛత్తీస్ గడ్ లో ఆదివాసుల హక్కుల కోసం పనిచేస్తోంది. 2016 -2020 మధ్య నమోదైనా కేసుల్లో ఇప్పుడు ఈమెను చేర్చి అరెస్టు చేశారు.

మావోయిస్టులతో పని చేసిన 20 ఏళ్ల ఆదివాసీ యువతి పాండే కవాసి 2021 ఫిబ్రవరి లో పోలీసుల ముందు లొంగిపోయింది. లొంగి పోయిన కొద్ది రోజులకే ఆ యువతి కావాసి కర్లి పోలీస్ లైన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నది. ఆమెకు నివాళులు అర్పించడానికి హిడ్మే మార్కమ్, మరి కొందరు ఆదివాసీ మహిళలు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశమయ్యారు. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీలను చైతన్యపరచడానికి, వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి ʹజైలు బంది రిహాయ్ కమిటీʹ, ʹఛత్తీస్‌ గఢ్ మహిళా అధికార్ మంచ్ʹ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా పోలీసులు హిడ్మేను అరెస్టు చేశారు.

ʹ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హిడ్మే మార్కమ్‌ను జనతన సర్కార్ రేంజ్ అధ్యక్షురాలు గా అరన్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. చట్టబద్దమైన ప్రక్రియ తరువాత ఆమెను సమేలి గ్రామ సమీపంలో అరెస్టు చేశారు. ఆమె తలపై 1.10 లక్షల బహుమతి వుంది. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 10 రోజుల రిమాండ్‌కు పంపించారు.ʹ అని దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ్ చెప్పారు. అయితే అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షులు మాత్రం పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్ళి తమ వాహనంలో తీసుకెళ్లిపోయారని, ఎలాంటి వారంట్ చూపించలేదనీ, ఆమె అరెస్టుకు కారాణాలేమిటో చెప్పలేదనీ అంటున్నారు.

అరెస్ట్ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న, ప్రసిద్ధ ఆదివాసీ హక్కుల కార్యకర్త సోని సోరి, హిడ్మేను ʹనక్సల్ʹఅనడాన్ని తోసిపుచ్చారు, "పోలీసులు పేర్కొన్నట్లు ఆమె మావోయిస్టు కాదు. బస్తర్‌లోని ఆదివాసీల జల్-జంగల్-జమీన్ (నీరు, అటవీ, భూమి) కోసం పోరాడుతోంది. ఆదివాసీల సమస్యల పైన ఆమె ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు తరచూ వెళుతూ ఉండేది. ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్, గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖ వ్యక్తులను అనేక సార్లు కలిసింది.ʹ ʹఎవరైనా మావోయిస్టు ఎస్పీ లేదా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడం , ముఖ్యమంత్రి, గవర్నర్‌ ని కలిసి తమ గుర్తింపును బహిరంగంగా వెల్లడిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా?" అని సోని సోరి ప్రశ్నిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2019 లో దంతేవాడలోని పోటాలి గ్రామంలో, పోలీసు క్యాంప్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీ గ్రామస్తులు నిరసన తెలియ చేసినప్పుడు తీసిన ఒక వీడియోలో, మార్కమ్ దంతేవాడ ఎస్పీ, అభిషేక్ పల్లవ్‌తో మాట్లాడుతుండడాన్ని చూడవచ్చు.

ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ నేతృత్వంలోని ఛత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల మేరకు ఏర్పడిన ʹజైలు బంది రిహాయి మంచ్ʹ వేదిక ఏర్పాటు సందర్భంగా కార్యకర్త సోని సోరితో కలిసి మార్కమ్ కూడా కనిపించారు,

ఎమ్మెల్యేలు, దంతేవాడ సబ్ డివిజనల్ ఆఫీసర్ చంద్రకాంత్ గవర్ణతో పాటు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులతో, బస్తర్ డివిజన్ లోని ఇతర ప్రముఖ వ్యక్తులతో హిడ్మే మార్కమ్ తీసుకున్న ఫోటోలు వున్నాయి.


(కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హిడ్మే మార్కమ్)

పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఛత్తీస్‌గఢ్‌, మహిళా అధికార్ మంచ్‌లు మార్కమ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు సంయుక్తం ప్రకటన‌ విడుదల చేశాయి.

మార్కమ్ హిడ్మే పారామిలిటరీ శిబిరాల నిర్మాణానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే గొంతుగా, నిర్వాసిత‌ వ్యతిరేక పోరాటంలో ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కార్యకర్త అనీ ఆ ప్రకటన పేర్కొంది. ʹజైలు బంది రిహాయి కమిటీʹ కన్వీనర్గా... తప్పుడు ముద్రలు వేస్ అరెస్టు చేయబడిన, దోషులుగా జైళ్లలో, పోలీసు శిబిరాల్లో నిర్బంధించిన ఆదివాసుల విడుదల కోసం, వ్యవసాయ‌ భూములలో మైనింగ్ కు వ్యతిరేకంగా గవర్నర్, ముఖ్యమంత్రి, పోలీసు సూపరింటెండెంట్, కలెక్టర్ తదితర అనేక ఇతర ఉన్నత స్థాయి అధికారులతో హిడ్మే మార్కం అనేక సార్లు కలిశారని ఆప్రకటనలో తెలిపారు.

ఇది అరెస్టు కాదు కిడ్నాప్ అని మరో ఆదివాసీ హక్కుల కార్యకర్త, ఛత్తీస్‌ గఢ్ మహిళా అధికార్ మంచ్ సభ్యురాలు రిన్చిన్ అన్నారు. "ఇది అరెస్టు కాదు, ఇది ప్రణాళికాబద్ధమైన అపహరణ. హిడ్మే ఒక సామాజిక కార్యకర్త, ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేసే ప్రజా నాయకురాలు. ఆమె ముఖ్యమంత్రితో సహా అనేక యితర రాజకీయ నాయకులతో సమావేశాలకు హాజరయ్యారు, బహిరంగంగా ఆందోళనలకు నాయకత్వం వహించారు. ఆమె ఎలా వాంటెడ్ నక్సల్ అవుతుంది? ʹఅని ఆమె ప్రశ్నించించారు.

" ఒకవేళ ఆమె నక్సలైట్ అయితే, 2016 నుండి పోలీసుల దగ్గర ఆమెకు వ్యతిరేకంగా సమాచారం వుంటే, ఇంతకు ముందు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆదివాసీలు, మహిళలు, వారి హక్కుల గురించి మాట్లాడే గొంతులను అణచివేయడానికి పోలీసులు చేసిన మోసపూరిత చర్య యిది, ʹఅని రిన్చిన్ పోలీసు ఆరోపణల్లోని అవకతవకలను ఎత్తిచూపారు.

అయితే హిడ్మేను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలను దంతెవాడ ఎస్పీ తోసిపుచ్చారు. "మావోయిస్టు కేడర్‌ను గుర్తించడం ఈ ప్రాంతాల్లో కష్ట‌మైన పని. 2016 నుండి వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మాకు సమాచారం ఉంది, కాని ఆ పేరు గల ఆమె ఈవిడేననే విషయం మాకు తెలియదు. మాకు ధృవీకరణ దొరకగానే మా సిబ్బంది హిడ్మేను మావోయిస్టుగా గుర్తించారు. వెంటనే చర్య తీసుకొని ఆమెను అరెస్టు చేసాము, ʹఅని ఎస్పీ అన్నారు.

గత నాలుగు-ఐదు సంవత్సరాలుగా ఆదివాసీల వివిధ సమస్యల కోసం పోరాడుతున్న ఈ ప్రాంత సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ మార్కమ్ అరెస్టుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు, న్యాయవాదుల కూడా ట్విట్టర్లో తమ స్పందన తెలియచేసారు. పి యు సి ఎల్ కు చెందిన డిగ్రీ ప్రసాద్ ʹఇది స్పష్టంగా రాజ్య అణచివేత కేసు. జిల్లా పోలీసులు భద్రతా సిబ్బందితో కలిసి ఆదివాసీల ప్రాధమిక హక్కులను కాలరాస్తూ, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిర్బంధిస్తున్నారు.ʹ అని అన్నారు.

అయితే, ఇది ఒక్క సంఘటనే కాదు . హిందూస్తాన్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, మానవ హక్కుల కార్యకర్తలను బెదిరించి ఆదివాసీల సమస్యలపై పని చేయకుండా వుండడానికి పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసిన‌ ఘటనలకు సంబంధించి చత్తీస్ ఘడ్ కు పెద్ద చరిత్రే ఉంది.

(న్యూస్ క్లిక్ సౌజన్యంతో)

Keywords : chattis garh, markam hidme, adivasi activist, danthewada, arrest
(2021-04-16 19:45:27)No. of visitors : 405

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రజలపై పారామిలిటరీ, డిఆర్‌జి బలగాల దౌర్జన్యాలు -మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ ప్రెస్ నోట్

భద్రతా దళాల సిబ్బంది గ్రామస్తులను వేధిస్తున్నారని సిపిఐ-మావోయిస్టు కిష్టారామ్ ఏరియా కమిటీ ఆరోపించింది. ఏరియా కమిటీ తొలిసారిగా వీడియో, ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

సిఆర్ పి ఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు నిరసనగా ఆదివాసీల భారీ ర్యాలీ...పోలీసులతో ఘర్షణ

చత్తీస్ గడ్ రాష్ట్రం బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలోని గంగళూరు ప్రాంతం గిరిజనులు మరోసారి వీధుల్లోకి వచ్చి భద్రతా దళాలు మరొక కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియచేశారు.

విచారణ లేకుండా మూడున్నరేళ్ళుగా జైలులో వున్న 120 మంది ఆదివాసీలు

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా అడవి ప్రాంతంలో, భద్రతా దళాల క్యాంపుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం బుర్కాపాల్. ఈ గ్రామానికి వెళ్తే తమ పనులలో నిమగ్నమై వున్న మహిళలు లేదా వడిసెలతో ఆడుకుంటున్న పిల్లలు కనిపిస్తారు. కొంతమంది పురుషులు కూడా కనపడవచ్చు కానీ వారు బయటి వారితో మాట్లాడడానికి భయపడతారు.

మా జీవితాన్ని,సంస్కృతిని నాశ‌నం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన‌ 9 మంది సర్పంచ్ లు

వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాల‌నే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

హక్కుల కార్యకర్త సోనీ సోరీని హత్య చేసేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారా ?

ఆ 17 మంది స్మృత్యర్థం అక్కడ ఓ స్తూపం నిర్మించాలనుకుంటున్నారు ఆదివాసులు ఆ కార్యక్రమానికి సోనీ సోరీని ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం జరగ కూడదని, సోనీ సోరీ అక్కడికి వెళ్ళకూడదని ప్రభుత్వం అనుకుటోంది. అందుకే ఆమె వెళ్ళకుండా పోలీసులు అనేక ఆటంకాలు కల్గిస్తున్నారు.

రైతుల ఉద్యమంలాంటిదే అక్కడా నడుస్తోంది - 4 రోజులుగా చలిలో వాళ్ళు రోడ్లమీదే ఉన్నారు

కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా లక్షలాదిమంది రైతులు ఉద్యమిస్తున్నారు. దాదాపు పది రోజులుగా వణికించే చలిలో ఢిల్లీ శివార్లలో కూర్చొని ఉన్నారు రైతులు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఆదివాసులు దాదాపు ఇటువంటి ఉద్యమాన్నే ప్రారంభించారు.

Search Engine

వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్‌ జాయింట్‌ డైరెక్టర్ మృతి
వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన‌ నెటిజనులు
దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు...
ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు
కుంభమేళాలో కరోనా తాండవం
కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు
ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు
తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు
Chattisghar Encounter: Maoist Party released a Letter
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన
సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే ‍- కే.కేశవరావు
అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత‌
Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages
శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు
జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన‌
విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists
హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
more..


ఆదివాసీ