అమ్మను కూడా కలవనివ్వరా ? - షోమాసేన్ కూతురు లేఖ
గత శనివారం అమ్మను కలవడానికి (ములాఖాత్) బైకుల్లా జైలుకు వెళ్ళాను కాని అనుమతి దొరకలేదు. నేను జైలు బయట 6 గంటలపాటు ఎదురు చూసాను !! (నేను మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎదురు చూసాను).
నేను ‘అమ్మ కూతుర్ని’ అని స్థానిక పోలీసు స్టేషన్ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోలేదని కలవనీయ లేదు.
మా ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే, నా ఆధార్ కార్డులో నేను షోమా సేన్ కూతురిని అని చాలా స్పష్టంగా వుంది. గతంలో 4-5 సందర్భాలలో అమ్మను కలవడానికి అనుమతిచ్చారు కూడా.
నేను ఇంతకు ముందు మూలాఖాత్ కు వచ్చాననీ, స్థానిక పోలీసు స్టేషన్ లో వేరిఫికేషన్ అంటే చాలా సమయం తీసుకునే ప్రక్రియ అనీ, నేను కేవలం మా నాయనమ్మ, అంటే అమ్మ అత్తగారు చనిపోయారనే సమాచారాన్ని తెలియచేయడానికి మాత్రమే వచ్చానని చెప్తున్నా కూడా నన్ను రోజంతా అలా వుంచేశారు. సూపరింటెండెంట్‌తో మాట్లాడాలనుకున్నాను కానీ ఆయన నా ముందు నుంచి అలా అన్నం తినడానికి వెళ్లిపోతే, మరో రెండు గంటలు ఎదురుచూశాను. ఆయన ఒంటి గంట నుంచి 4 గంటల దాకా మధ్యాహ్న భోజన విరామం సమయాన్ని తీసుకున్నాడంటే మీరు నమ్ముతారా?
నేను ఆయనతో మాట్లాడగలిగేటప్పటికి ములాఖాత్ సమయం అయిపోయింది. బయటే నిలబడి ఉన్నప్పటికీ, నేను రోజంతా జైల్లో గడిపినట్లనిపించింది. ఇంటికి తిరిగి వచ్చాక కలిగిన మానసిక, శారీరక క్షోభతో తెల్లవారు ఝామున నాలుగు గంటల వరకు నిద్రపట్టలేదు.
నిన్న రాత్రి కూడా ఆందోళనతో, గుండె దడతో అర్థరాత్రి మెలకువ వచ్చింది. నేనేం తప్పు చేశాను? నావల్ల ఎక్కడ తప్పిదం జరిగింది? కూతురిగా వారానికి ఒకసారి అమ్మను కలిసే చట్టబద్ధ హక్కు నాకు లేదా? UAPA, MCOCA లాంటి ప్రత్యేక చట్టాల క్రింద అరెస్టు అయిన వారి కుటుంబ సభ్యులైన మాలాంటి కొంతమందిని జైలు అధికారులు ఎందుకని వేధిస్తున్నారు. అందులోనూ ఈ కేసులో వున్న ఒక వ్యక్తికి బెయిల్ వచ్చాక కూడా. ఇది కేవలం ఖైదీల కుటుంబ సభ్యులను వేధించడం తప్ప మరొకటి కాదు. మా కుటుంబ సభ్యుల్ని కలవడానికి వెళ్తున్న న్యాయవాదులు కూడా ఇలాంటి వత్తిడికే లోనవుతున్నారు.
తెల్లారేటప్పటికి ఈ నియమాలను ఎవరు చేస్తున్నారు/మారుస్తున్నారు? లాక్ డౌన్ తరువాత జైలు నియమాల్లో మార్పులు చేయడం ఇంత సులభం ఎలా అయింది? జైల్లో వున్న వారిని కుటుంబ సభ్యులు కూడా చూడ్డానికి వారిని యిష్టం లేదని అర్ధమౌతోంది. మనం యిప్పుడు పూర్తిగా చట్టాలు అమలు కాని స్థితిలో వున్నాం.
ఈ విధంగానే మన న్యాయ వ్యవస్థ ఒక వ్యక్తిని, వారి కుటుంబాన్ని, నేర నిరూఫణకు సరియైన సాక్ష్యాధారాలు లేనప్పటికి, ఎలాంటి విచారణ జరపకుండా అందుకు జరిగే ప్రక్రియ ద్వారానే శిక్షిస్తుంది. ఈ ప్రక్రియనే నాకూ నాన్నకూ, అమ్మను చూడ్డానికి జైలు కెల్లడమనే, మూడుసంవత్సరాల శిక్షగా మారింది.
(ప్రొఫెసర్ షోమా సేన్ కూతురు, కోయల్ సేన్ ఫేస్ బుక్ పోస్ట్ నుంచి)
Keywords : Shomasen
(2021-04-17 07:48:38)
No. of visitors : 311
Suggested Posts
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |
| మృత్యు శయ్యపై ఉన్న వరవర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టువరవరరావు మృత్యుముఖంలో చావుబతుకుల్లో మంచంపై పడిఉన్నాడు. అతనికి తగు చికిత్స అత్యవసరం. |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరెఆరు సంవత్సరాలుగా UAPA కేసులో విచారణ ఖైదీగా పూణే జైల్లో ఉన్న కామ్రేడ్ కంచన్ నానావరె జనవరి 24న మరణించారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన 38 సంవత్సరాల, ఆదివాసీ కామ్రేడ్ కంచన్ నానవారే మావోయిస్టు ఉద్యమంలో పాల్గొందని ఆరోపిస్తూ 2014లో |
| Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movementActivists-Intellectuals detained in the Elgar Parishad-Bhima Koregaon case, to join farmers in their struggle by observing day long symbolic hunger
strike. |
| రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్షవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది. |
| వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకున్నాక కూడా... కరోనాతో చత్తీస్ గడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ మృతి |
| వైరల్ అయిన మెడికోల డాన్స్ వీడియో: మతం రంగు పూసేందుకు ఉన్మాదుల ప్రయత్నం - తిప్పికొట్టిన నెటిజనులు |
| దారుణం... చెత్త లారీల్లో కోవిడ్ పేషెంట్ల మృతదేహాలు తరలింపు... |
| ఉమర్ ఖలీద్ కు బెయిల్ మంజూరు |
| కరోనా మరణాలపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు |
| ఏప్రిల్ 26 భారత్ బంద్ ను జయప్రదం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం - మావోయిస్టు పార్టీ పిలుపు |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు |
| Chattisghar Encounter: Maoist Party released a Letter |
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే - కే.కేశవరావు |
| లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి |
| సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన ప్రముఖ రచయిత
|
| ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్
|
| Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages |
| శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమంపై ఏబీవీపీ దాడి - చూస్తూ నిల్చున్న పోలీసులు |
| జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్ |
| విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
|
| విప్లవ స్వాప్నికుడు ఉప్పు కృష్ణ అమర్ రహే !
|
| టైమ్ మాగజైన్ కవర్ స్టోరీ: రైతాంగంపోరాటం - మహిళల నాయకత్వం
|
| సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే రాజీనామా చేయాలని 4వేల మంది ప్రముఖుల డిమాండ్ |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
|
| Supreme Court Chief Justice Bobde should resign immediately - Letter from 4,000 women and rights activists |
| హత్రాస్ లో మరో ఘోరం: యువతిపై అత్యాచారం చేసిన వాడే ఆమె తండ్రిని కాల్చి చంపాడు
|
more..