ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి సభలను సమరొత్సాహంతో జరుపుకుందాం ‍- మావోయిస్టు పార్టీ పిలుపు

ఇంద్రవెల్లి

ఏప్రెల్ 20, 1981 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పాలక వర్గాలు నెత్తురు పారించిన రోజు. గిరిజన రైతు కూలీ సంఘం మహా సభ జరుపుకునేందుకు వస్తున్న వేలాది ఆదివాసులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తూటాల వర్షం కురిపించింది. దాదాపు వంద మంది చనిపోగా వందలాది మంది గాయాలపాలైన ఆరోజు జలియన్ వాలా బాగ్ ను గుర్తు చేసింది. ఇప్పటికీ ఆదివాసులకు, పోరాట ప్రజలకు ఇంద్త్రవెల్లి ఓ పోరు పతాక. ఈ నేపథ్యంలో ఇంద్రవెల్లి మారణ హోమం జరిగిన ఏప్రెల్ 20 న గ్రామాలలో, గూడాలలో, బస్తీలలో, పట్టణాలలో, పని స్థలాల్లో సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించి ఇంద్రవెల్లి అమరుల స్ఫూర్తిని ఎత్తిపట్టాలని పిలుపునిస్తూ సీపీఐ మావోయిస్టు పార్టీ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం....‌

కొండ గోగులు ఎరుపు కొండలే ఎరుపు

కొండల్లో అక్కల, అన్నల అమరత్వం ఎరుపు

ఇంద్రవెల్లి అమరులు మృత్యుంజయులు!

నలభై ఏళ్ళ ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని సమరొత్సాహంతో ఘనంగా జరుపుకుందాం!

గ్రామాలలో, గూడాలలో, బస్తీలలో, పట్టణాలలో, పని స్థలాల్లో సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించి ఇంద్రవెల్లి అమరుల స్ఫూర్తిని ఎత్తిపడుదాం!

పీపుల్స్ వార్ పార్టీ (పొరకల సార్లు) నాయకత్వంలో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో గిరిజన రైతుకూలీ సంఘం మహాసభను జరుపుకొని సభలో అటవి భూముల పట్టాల కోసం ఆదివాసి సమస్యలపై చర్చించుకోవాలని నిర్ణయించుకొని ప్రభుత్వాన్ని మహాసభ కొరకు అనుమతిని కోరినారు. ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే గాకా 144 సెక్షన్ విధించింది. ఈ విషయం తెలియని గోండు గిరిజనులు ఇంద్రవెల్లికి లోతట్టు గూడాల నుండి గుంపులు గుంపులుగా
మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, మహాసభ కోసం వేలాదిగా చేరుకున్నారు. ఇంద్రవెల్లికి చేరుకున్న గిరిజన గోండులపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు చేసి వందలాది మందిని గాయపర్చి పదుల సంఖ్యలో హత్యలు చేశారు. (జలియన్ వాలాబాగ్ లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై కాల్పులు చేసి చంపిన విధంగా) ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహాన్ని సృష్టించింది.

దోపిడీ పాలక వర్గాలు గోండులపై జరిపిన ఫాశవిక నరమేధాన్ని మేధావులు, పౌరహక్కుల సంఘాలు విద్యార్థులు, వివిధ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలతో సహా ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. 1982లో గోండులు అమరత్వం చెందిన స్థలంలో పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో గిరిజన రైతుకూలీ సంఘం ఆద్వర్యంలో 120 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. ప్రభుత్వం 1986లో పోలీసులతో స్థూపాన్ని కూల్చివేసి ఇంద్రవెల్లి పోరాట జ్వాలను ఆర్పివేయాలని చూసింది. ఆదివాసుల నుండి వెల్లువెత్తిన నిరసనలతో ఎన్టీఆర్ ప్రభుత్వం మళ్లీ స్థూపాన్ని నిర్మించి అర్థ సైనిక బలగాలు, పోలీసులతో ఆ ప్రాంతాన్ని దిగ్భందించి 144 సెక్షన్ విధించి స్థూపం వద్దకు ఎవరిని రానియకుండా నిషేదాజ్ఞలు విధించింది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న ఆదివాసులు నిషేదాజ్ఞలను ధిక్క‌రిస్తూ పోలీసుల దిగ్భందాన్ని చేదించుకొని స్థూపం వద్దకు చేరుకొని జెండాలు ఎగుర వేసి ఇంద్రవెల్లి అమరులను స్మరించుకుంటూ జల్, జంగల్,జమీన్ ఇజ్జత్, అధికారంకై ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా పోరాట వారసత్వాన్ని ఇప్పటికి కొనసాగిస్తూ, వారి ఆశయాలను తుదకంటా కొనసాగిస్తామని శపథం చేస్తూ పోరాడుతున్నారు.

పీపుల్స్ వార్ పార్టీపై తీవ్రంగా కొనసాగుతున్న నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే గిరిజనుల పోరాటాలకు నాయకత్వం వహించింది. భూములపై హక్కు కరువు సమస్యల పరిష్కారం, సమిష్టి వ్యవసాయం, సమిష్టి ఆర్థిక గ్రూపులు, కూలీరేట్ల పెంపుదల, గిట్టుబాటు ధరల పోరాటం లాంటి పోరాటాలు చేపట్టి గిరిజన రైతుకూలీ సంఘాలు గ్రామాల్లో అధికారాన్ని నడిపాయి. పార్టీ భూమి, భుక్తి, విముక్తి నినాదంతో (జల్-జంగల్-జమీన్-ఇజ్జత్ అధికారం) ప్రజలను కదిలించింది. ఆదివాసీ, ఆదివాసేతర రైతాంగ ఐక్యత కోసం కృషి చేసింది. మరాఠా, లంబాడీ, ముస్లీంలోని పేద ఆదివాసేతరులతో ఐక్యత నెలకొల్పింది. ఆదివాసేతర భూస్వాములకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడింది. గిరిజనుల మౌళిక హక్కుల కోసం పోరాడుతూనే వారిని నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో సమీకరించింది. గ్రామాల్లో ప్రజాధికార సంఘాలుగా గ్రామ రాజ్య కమిటీలను నిర్మించింది. ఈ రోజు దండకారణ్యంలో ʹజనతనా సర్కార్లుʹ పని చేస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు సామ్రాజ్యవాద, బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు, భూస్వామ్య నిరంకుశ దళారీ బూర్జువాలకు తలవొగ్గి దోపిడి పాలక వర్గాలు, ఉద్యమ ప్రాంతంలో అణచివేత దాడులు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా ఆదివాసీ ప్రజలు విప్లవ పార్టీని, దళాలను గుండెలకు హత్తుకొని, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ నాయకత్వంలో సంఘటితం అవుతూ జల్-జంగల్-జమీన్-ఇజ్జత్ అధికారంకై ఇంద్రవెల్లి స్ఫూర్తితో నేటికి పోరాడుతున్నారు.
గత 40 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు విప్లవోద్యమాలకి అంకితమై అనేక త్యాగాలు చేసారు. అనేక మంది విప్లవ కార్యకర్తలు పోలీసు ఎన్‌కౌంటర్లలో అమరులైనారు. అయినప్పటికీ జిల్లా ప్రజలు పోరాట రంగాన ఉజ్వలమైన చరిత్ర నిర్మించుకుంటున్నారు. అందుకు 40 ఏళ్ళ ఇంద్రవెల్లి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది.
ఇంద్రవెల్లి గాయాలు మానినా గుర్తులు మాసిపోలే. ఇంద్రవెల్లి పోరాట జ్వాల నేటికి నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది. ఆదివాసుల హక్కు జల్-జంగల్-జమీన్-ఇజ్జత్ అధికారం దక్కేంత వరకు ఉద్యమజ్వాల నిరంతరం ద్వేదీప్యమానంగా జ్వలిస్తూనే ఉంటుంది.
విప్లవాభినందనలతో,
జగన్ ,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).



Keywords : jindravelli, adivasi, adilabad, maoists, firing, police
(2024-04-24 01:51:53)



No. of visitors : 2325

Suggested Posts


ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడు రోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ఏప్రిల్ 20 తేదీ సాయంకాలం నాలుగు గంట లకు గిరిజన ప్రదర్శన, ఆరు గంటలకు బహిరంగసభ ఉంటాయని ఆదిలాబాద్ జిల్లా అంతటా గోండు, కొలామ్ తెలుగు భాషల్లో పోస్ట‌ర్లు పడ్డాయి. కరపత్రాలు పంచ‌ బడ్డాయి. ఈ ప్రదర్శనకు ముప్పైవేల మంది పైగా గిరిజనులు హాజరవుతారని అంచనా వేయబడింది.

ఇంద్రవెల్లి ఘటన జరిగిన మూడురోజులకు రాడికల్స్ వేసిన కరపత్రం పూర్తి పాఠం

ʹరగల్ జెండా ఇంత ఎరుపేమిటని అడుగ గిరిజనుల రక్తంతో తడిసెనని చెప్పాలి.ʹ పీడిత వర్గం మొత్తం మీద సాగుతున్న అణచివేత, దోపిడీ, పీడనల్లో భాగం గానే దేశంలో గిరిజన ప్రజానీకం మీద పోలీసుల, మైదాన ప్రాంతాలనుంచీ వచ్చి స్థిరపడిన భూస్వాముల, ఫారెస్టు అధికారుల దోపిడీ, పీడనా సాగుతున్నాయి.. మేలుకున్న‌ గిరిజన ప్రజానీకం

పోలీసుల వలయంలో ఇంద్రవెల్లి...స్వరాష్ట్రంలోనూ అమరులకు నివాళులు అర్పించుకోలేని దుస్థితి

ఇంద్రవెల్లి నెత్తుటి మడుగై 38 ఏండ్లయ్యింది. ఇప్పటికీ ఆ గాయం సలుపుతూనే ఉన్నది. వందమందికి పైగా ఆదివాసులను కాల్చి చంపిన నయా డయ్యర్లు నేటికీ రాజ్యమేలుతూనే ఉన్నారు. తమతో కలిసి జీవించి తమ హక్కులకోసం ప్రాణాలర్పించిన ఆదివాసీ యోధులకు నివాళులు అర్పించడానికి కూడా

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇంద్రవెల్లి