ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి - మావోయిస్టు పార్టీ పిలుపు

ఏప్రిల్‌‌

ఆప‌రేష‌న్ ప్ర‌హార్ పేరుతో దండ‌కార‌ణ్యంలో జ‌రుగుతున్న పోలీసు, అర్థ సైనిక బ‌ల‌గాల దాడుల‌ను ఎదిరిస్తూ అమ‌రులైన వారిని స్మ‌రిస్తూ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ ‌‌ 25 వరకు ప్రజా ఉద్యమాల ప్రచార ఆందోళనల మాసంగా పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ నిర్మూల‌న కోసం సాగుతున్న ఆప‌రేష‌న్ స‌మాధాన్ ను, ప్ర‌జా ఉద్య‌మాల‌పై అమ‌ల‌వుతున్న నిర్బంధాన్ని నిర‌సిస్తూ ఏప్రిల్ 26న త‌ల‌పెట్టిన భార‌త్ బంద్ ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చింది. రైతు ఉద్య‌మానికి దేశ ప్ర‌జ‌లంతా అండ‌గా నిల‌వాల‌ని పిలునిచ్చింది.

(మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ అధికార ప్ర‌తినిధి అభ‌య్ పేరిట విడుద‌లైన ప‌త్రికా ప్ర‌క‌ట‌న పూర్తి పాఠం కింద‌)

సాహసిక గెరిల్లా యోధులకు రెడ్‌సెల్యూట్‌
ఏప్రిల్‌‌ 25 వరకు ప్రజా ఉద్యమాల ప్రచార ఆందోళనల మాసంగా పాటిద్దాం
ఏప్రిల్‌‌ 26 భారత్ బంద్ ను జ‌య‌ప్ర‌దం చేయండి
ఢిల్లీ రైతు ఉద్య‌మానికి దేశ ప్ర‌జ‌లంతా అండ‌గా నిల‌వాలి

2021 జనవరి నుండి ఏప్రిల్ 3 వరకు భారత విప్లవోద్యమంలో మనం పలువురు ప్రియమైన విప్లవ సహోదరులను, కామ్రేడ్స్ ను కోల్పోయాం. వారంతా దోపిడీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి భద్రతా బలగాలు (పోలీసులు, అర్థ సైనిక బలగాలు) కలిసి నిర్ణయించిన ఆపరేషన్‌ సమాధాన్‌లో భాగంగా కొనసాగిస్తున్న ʹఆపరేషన్‌ ప్రహార్‌ʹ నిర్ణయాత్మక దాడుల నుండి భారత విప్లవోద్యమాన్ని, దేశ వనరులను, దేశ సార్వభౌమత్వాన్ని, భారత విప్లవ ప్రజలను రక్షించుకోవడంలో భాగంగా 28 మంది విప్లవ గెరిల్లాలు తమ నులి వెచ్చని నెత్తుర్లను ధారపోశారు. జార్ఖండ్‌లో 7గురు, ఒడిశాలో ఒకరు, దండకారణ్యంలో 17 మంది, తెలంగాణలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు కామేడ్స్ ‌భారత ప్రజల ప్రజాస్వామిక విప్లవోద్యమ సిద్ధికై నిస్వార్థంగా తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారందరి త్యాగాలను గుర్తుచేసుకుంటూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ వినమ్రంగా విప్లవ జోహార్ల‌ర్పిస్తోంది. ఆ దాడులలో గాయపడిన గెరిల్లాలు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాయుద్ధ భూమికి తరలివెళ్తారనీ పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉంది. మీ త్యాగాలు వృధా పోవనీ భరోసా ఇస్తోంది.

మన పార్టీ, కేంద్ర సైనిక కమిషన్‌ నిర్ణయించిన విధంగా భారత విప్లవోద్యమ రక్షణకై బహుముఖ ప్రహార్‌ దాడులను ఎదుర్కోవడంలో భాగంగా ఎత్తుగడల ఎదురుదాడులు, ఎదురుదాడుల కేంపెయిన్‌లు అన్ని ఉద్యమ ప్రాంతాలలో కొనసాగుతున్నవి. అసమాన త్యాగాలకు సిద్ధపడి ʹప్రజా విముక్తి గెరిల్లా సైన్యంʹ (పీఎల్‌జీఏ) చేపట్టిన ఆత్మరక్షణా చర్యలలో ఇప్పటికి దాదాపు వంద మంది పోలీసు, అర్ధ సైనిక బలగాలకు చెందిన జవాన్‌లు మరణించారు లేదా గాయపడినారు. పశ్చిమ‌ సింగ్‌భూం, బొకారో, లోహర్‌దగ్గా, బీజాపుర్‌, నారాయణపుర్‌, గడ్‌చిరోలీ, మల్కన్‌గిరి, కాంకేర్‌ జిల్లాలలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వారిలో ఆయా రాష్ట్రాల, జిల్లాల ప్రత్యేక పోలీసు, కమాండో బలగాలు (ఎస్‌ఓజీ, డీవీఎఫ్‌; జార్ఖండ్ జాగ్వార్, డీఆర్‌జీ, సీఏఎఫ్‌; సీ-60) కేంద్ర అర్థ సైనిక బలగాలకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ సహ వారి కోబ్రా, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌, బస్తర్ బెటాలియన్‌ జవాన్‌లున్నారు. వీరి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌ పూర్తి బాధ్యత వహించాలి.

గడిచిన మూడు మాసాలలో మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలలోని ప్రతిచోట దృఢ సంకల్పంతో చొరవ, సమయస్ఫూర్తి, సాహసం ప్రదర్శించిన పీఎల్‌జీఏ వీర గెరిల్లాలకు ముఖ్యంగా ʹజీత్‌ హీ లక్ష్య్‌ హైʹ మోటోతో ప్రజలపై విరుచుకుపడే జార్ఖండ్‌ జాగ్వార్‌ బలగాలతో పళ్చిమ్‌ సింగ్‌భూం జిల్లాలోని హోయహాత్‌ వద్ద , నారాయణపుర్‌ జిల్లా కడెనార్‌ వద్ద కరుడుగట్టిన ప్రజా వ్యతిరేక డీఆర్‌జీ శక్తులతో, బీజాపుర్‌ జిల్లా జోన్నగూడ వద్ద డీఆర్‌జీ, బస్తర్‌ బటాలియన్‌, కోబ్రాతో కూడిన వేలాది సంయుక్త బలగాలతో అత్యంత సాహసికంగా, త్యాగనిరతితో పోరాడి ఆ బ్యాటిల్స్‌లో విజయం సాధించిన వీర గెరిల్లాలకు కేంద్ర కమిటీ రెడ్ సెల్యూట్స్‌ అందచేస్తున్నది. వారినుండి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడాన్ని అభినందిస్తున్నది. ఆ వీర గెరిల్లాలందరికీ అడుగడుగునా అన్ని విధాలా సహకరించిన విప్లవ ప్రజలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నది.

దేశంలో కొనసాగుతున్న ప్రజా పోరాటాలను సమున్నతంగా ఎత్తిపడుతూ మా పార్టీ ఎప్రిల్‌ 1 నుండి 25 వరకు ప్రజా ఉద్యమాల ప్రచార ఆందోళనల మాసంగా పాటించాలనీ, ఏప్రిల్‌‌ 26 భారత్‌ బంద్‌ జయప్రదం చేయాలనీ పిలుపు నిస్తోంది. ప్రజా ఉద్యమాలపై విరుచుకుపడుతున్న ప్రభుత్వ అణచివేత విధానాలను నిర్ధంద్వంగా ఖండించాలనీ, అందుకు వ్యతిరేకంగా పోరాడాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

ప్రపంచ మహమ్మారీగా మారిన కోవిడ్‌ నుండి ప్రజలను రక్షించడం కాకుండా ఎన్నికలు, ʹమావోయిస్టు భూతంʹ, ప్రజావ్యతిరేక చట్టాల రూపకల్పనపై భారత ప్రభుత్వం కేంద్రీకరించడాన్ని ఖండించండి.

ఈ దేశంలో పోరాడుతున్న ప్రతి ఒక్కరినీ కాషాయ ఉగ్రవాద హిందుత్వ భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా, మావోయిస్టులుగా గుర్తించడంలో అశ్చర్యం ఏమీ లేదు. మావోయిస్టు పార్టీ అంటేనే పాలకులు హడలిపోతున్నారు. మా పార్టీ సమూల నిర్మూలనే తమ లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. బీజాపుర్‌ దాడి తరువాత కేంద్రం, యావత్తు కాషాయ బ్రిగేడ్‌ పోలీసు జవాన్‌లను బదులు తీర్చుకుంటామంటూ రెచ్చగొట్టడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పోరాడుతున్న ప్రజల సమస్యలపై పల్లెత్తు మట్లాడకుండా వారిపై పోలీసు దాడులను తీవ్రం చేస్తామనడం వారి ఫాసిస్టు స్వభావాన్ని చాటుతోంది. ముందు ఢిల్లీ రైతులు సహ దేశ వ్యాపితంగా పోరాడుతున్న ప్రజల సమస్యలకు సమాధానం చెప్పండి.

ఒడిశా డీజీపీ అభయ్‌ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా చేస్తామనీ, మావోయిస్టులు ఆయుధాలు దించాలనీ కోరుతున్నాడు. జార్ఖండ్‌‌లోని కొల్హాన్‌ డీఐజీపీ రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ మాట్లాడుతూ నక్సలైట్లను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదనీ, వారిని సమూలంగా నిర్మూలించేవరకు దాడులు ఆపే ప్రసక్తే లేదన్నాడు. కొరోనా నివారణలో ఘోరంగా విఫలమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్దవ్‌ ఠాక్రే మావోయిస్టులు కొరోనా కన్నా ప్రమాదకరం అంటూ పోలీసుల దాడులను ముమ్మరం చేయాలనీ రెచ్చగొడుతున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య శాంతి వార్తలంటూ పాత్రికేయ వృత్తికి సలాం కొట్టి సామాజిక కార్యకర్తగా అవతారమెత్తిన శుభ్రాంశు చౌదరీ మార్చ్ 12నుండి ఏప్రిల్‌ 6వరకు పాదయాత్ర తలపెట్టాడు. ప్రభుత్వంతో శాంతి చర్చలకు మేం సిద్ధమేనంటూ మా పార్టీ దండకారణ్య అధికార ప్రతినిధి కామ్రేడ్‌ వికల్ప్‌ జవాబు ఇస్తూ అందుకు ముందు అనుకూల వాతావరణాన్ని కల్పించాలనీ కోరగా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ వాటిని ముందస్తు షరతులుగా చిత్రించి నక్సలైట్లు హింసను, సాయుధ పోరాటాన్ని వదలాలనే లొంగుబాటు షరతులు విధించడంపై శాంతీ, అహింసల తాజా వకాల్తాదారు సంస్థ సీ-4 ముందు జవాబు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఈ వైఖరిని విప్లవ ప్రజలంతా ముక్త ఖంఠంతో ఖండించాలి.

దేశంలోని విప్లవ ప్రాంతాలపై, ప్రజలపై సైనిక దాడులను మరింత తీవ్రతరం చేయడానికే పాలకులు ఉవ్విళ్లూరుతున్నారనీ వారి ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్రం అర్ధ సైనిక బలగాలను, సైన్య భర్తీని పెంచుతోంది. అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక పోలీసు బలగాలను పెంచుకుంటున్నారు. దేశ ప్రజల సవాలక్ష సమస్యలకు పరిష్కారాలు లేని దోపిడీ వర్గాలు ఫాసైజేషన్‌ మార్గాన్నెంచుకుంటున్నాయి. కానీ, నిజానికి వాటి గోరీని అవే తవ్వుకుంటున్నాయి. మా పార్టీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతోంది. ఆ సమస్యల తుది పరిష్కారం వరకు పోరాడాల్సిందేననీ మా పార్టీ ప్రజలకు స్పష్టం చేస్తున్నది.

పార్టీ కార్యకర్తలు, గెరిల్లాలు అత్యంత జాగరూకతతో ఉండాలి. విప్లవోద్యమాన్ని తుదముట్టించడానికి పోలీసు ఉన్నతాధికారులు అనేక రకాల కుట్రలకు పాల్పడుతున్నారు. ఇటీవలే తెలంగాణలో విష ప్రయోగం వెలుగులోకి వచ్చింది. దండకారణ్యంలో కోవర్టులు, ఎలక్ట్రానిక్‌‌ గాడ్జెట్స్‌లలో జీపీఎస్‌లు అమర్చడంతో నష్టాలు వాటిల్లినవి. రూర్ఖండ్‌లో కోవర్టులు ఉద్యమాన్ని నష్టపరిచారు. పోలీసులు లొంగుబాటు పథకాలతో దుష్ప్రచారాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మానసిక యుద్దాన్ని ముమ్మరం చేయడానికి వారు చేయని కసరత్తు లేదు. కాబట్టి విప్లవ ప్రజల అండదండలతో పోలీసుల అన్ని రకాల కుట్రలను ఓడించాలి.

రెండుచోట్ల జరిగిన పొరపాటుతో కుక్కర్లు పేలి యువ గెరిల్లాలు ఇద్దరు అమరులయ్యారు. ఇలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదు. మన సైనిక చర్యలలో అక్కడక్కడ పొరపాటున కొంత మంది పౌరులకు నష్టం వాటిల్లడం పట్ల కేంద్రకమిటీ విచారం వ్యక్తం చేస్తున్నది. ఇలాంటివి జరుగకుండా అన్ని చర్యలూ చేపట్టండి. ప్రస్తుత 8 మాసాల వర్తమాన ప్రహార్‌ కెంపెయిన్‌తో వారి బహుముఖ దాడులు ముగియవు. వారి ఫాసిస్టు దాడుల తీవ్రతకు ఇది ఒక సంకేతం. హోయాహత్‌, కదెనార్‌, జొన్నగూడ (తరైం)లను సమీక్షించుకొని వారు మరింత క్రౌర్యానికి పూనుకుంటారు. గత 15 యేండ్లుగా జరుగుతుందిదే! దీన్ని దృష్టిలో పెట్టుకొని విప్లవోద్యమ పురోగమనానికి మరింత సాహసోపేతంగా కృషి చేయండి. అన్ని ప్రజా సమూహాలతో కలిసి ప్రహార్‌కు వ్యతిరేకంగా ఎప్రిల్ 26 భారత్ బంద్ ‌ జయప్రదం చేయండి.

గణనీయమైన సంఖ్యలో పోలీసులు, అర్ధ సైనిక జవాన్‌లు మరణించడం సహజంగానే దోపిడీ వర్గాలలో తీవ్ర కలవరపాటునే కలిగిస్తున్నది. దానితో, విప్ల‌వోద్యమంపై బదులు తీసుకోవాలనీ వారు పోలీసులను రెచ్చగొడుతున్నారు. అదే వారి నైజం. కానీ, ఆ దాడులలో మరణించిన వారిలో అసోంకు చెందిన నారాయణ ఛెత్రీ మొదలుకొని హర్యానాకు చెందిన లక్ష్మీకాంత్‌ ద్వివేది, తమిళనాడుకు చెందిన బాలస్వామి, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ , పంజాబ్‌, మహారాష్ట్ర , ఛత్తీస్‌గఢ్‌ సహ దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందినవారున్నారు. వారి వారి ప్రాంతాలలో వారి పార్థివ శరీరాలతో పాటు భారత విప్లవోద్యమ సందేశం తప్పనిసరి చేరుతుందనీ మేం విశ్వసిస్తున్నాం. వారి అనివార్య మరణం పట్ల మా పార్టీ కేంద్రకమిటీ ఎంతగానో విచారిస్తున్నది. ఆ ప్రాంతాల ప్రజలూ మరణించిన వారి బంధు మితృలూ భారత విప్లవోద్యమం గురించి ఆలోచించాలనీ, తమ పిల్లలను భద్రతా బలగాలలో చేరకుండా నిరోధించాలనీ మా పార్టీ పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. దోపిడీ శక్తుల ప్రయోజనాల కోసం మీ పిల్లలు మరణించడం కన్నా ప్రజల కోసం పనిచేయాలనీ, పోరాడాలనీ కోరండి.

2020 నవంబర్‌ 26 నుండి భారత రైతాంగం ఢిల్లీలో తమ డిమాండ్ల సాధనకై పోరాడుతోంది. ఏప్రిల్‌‌ 26కు ఐదు మాసాలు పూర్తవుతాయి. వారి సమస్యలపట్ల కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి దాని నయా ఉదావవాద ఆర్థిక విధానాల లోంగుబాటు తప్ప మరేం కాదు. దేశ వ్యాపిత రైతాంగం పోరాడుతుంటే అన్ని సెక్షన్ల ప్రజలు వారికి అన్ని విధాల అండగా నిలిచారు. మా ఉద్యమ ప్రాంతాల ప్రజలు వ్యవసాయ చట్టాల రద్దుకై దిల్లీ పోరాటంతో భుజం భుజం కలిపి పోరాడుతున్నారు. ఫలితంగా, మోదీ తన చట్టాల అమలును రెండేళ్లు వాయిదా వేసుకోక తప్పలేదు. ఇది ప్రజల ప్రధానంగా రైతుల విజయం. కానీ ఆ చట్టాల రద్దు వరకు పోరాడాల్సిందే! జనవరి 26 తరువాత రైతాంగ డిమాండ్‌లపై ప్రభుత్వం చర్చలు ఉపసహరించుకున్నది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ సహ అన్ని రైతు సంఘాల నాయకులపై ప్రభుత్వ పోలీసుల దాడులు, అణచివేత చర్యలు పెచ్చరిల్లుతున్నాయి. వారికి అండగా నిలిచిన ప్రజాస్వామిక ప్రగతిశీల శక్తులపై దాడులు తీవ్రమవుతున్నాయి. వీటిని ఖండిస్తూ ఏప్రిల్‌ 26 భారత్‌ బంద్‌ జయప్రదం చేయండి.

ప్రభుత్వాలు నయా ఉదారవాద హిందుత్వ విధానాలను వదలుకోకుండా దేశంలోని ఏ పీడిత ప్రజా సమూహ సమస్యను పరిష్కరించలేవనీ గత 75 సంవత్సరాల స్వాతంత్ర్యానంతర చరిత్ర నిరూపిస్తున్నది. గత 75 సంవత్సరాలలో పెరిగిన భారత పరాధీనతను ప్రజల ముందుంచాల్సిన మహత్తర సమయం ఇది. భారత ప్రజలు విప్లవ పోరాటాల ద్వారానే తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ మార్గాన్నే మా పార్టీ మీ ముందుంచుతోంది. మే 10 నుండి తమ ఆందోళనలను మరింత తీవ్రం చేయబూనుకున్న రైతుల పక్షాన యావద్ధేశం నిలవాలనీ మా పార్టీ మరోసారి కోరుతోంది.

(అభయ్‌)
అధికార ప్రతినిధి, కేంద్రకమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : maoist, operation prahar, operation samadhan
(2024-04-16 03:48:27)



No. of visitors : 825

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఏప్రిల్‌‌