విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలపై నిషేధం రాజ్యాంగ వ్యతిరేకం - న్యూ డెమాక్రసీ

విరసం,

విరసం, పౌరహక్కుల సంఘం సహా 16 సంఘాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించడాన్ని ఖండిస్తూ సీపై ఎంఎల్ న్యూ డెమాక్రసీ విడుదల చేసిన ప్రకటన‌

విరసం సహా 16 ప్రజా సంఘాలపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి!
సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ డిమాండ్

సిపిఐ(మావోయిస్టు) పార్టీకి అనుబంధంగా వున్నాయనే పేరిట విప్లవ రచయితల సంఘం (విరసం), సిఎల్‌సి, సిఎంఎస్ తదితర 16 ప్రజా సంఘాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని మా పార్టీ-సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాజకీయ సంస్థలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు యీ నిషేధాన్ని ఖండించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నది. నిషేధం ఎత్తివేత కోసం అందరూ డిమాండ్ చేయవలసినదిగా కోరుతున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖంగా పాల్గొన్న సంస్థలు, నాయకులు కలిగిన సంస్థలు అనేకం యీ నిషేధిత జాబితాలో వున్నాయి. విరసం, పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి), చైతన్య మహిళా సంఘం (సిఎంఎస్), ప్రజా కళా మండలి (పికెఎం) లాంటి ప్రజా సంఘాలు తెలంగాణ‌లోనూ, తెలుగు నేల మీదా అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి. ఇలాంటి ప్రజా సంఘాలను మావోయిస్టు పార్టీకి అనుబంధం పేరిట నిషేధించడం ముమ్మాటికీ నిరంకుశమని మా పార్టీ- సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలియజేస్తున్నది. ఈ నిషేధం భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ పై దాడిగానే చూడాలి. బహిరంగంగా ప్రజల మధ్యవుండి పనిచేస్తున్న కార్యకర్తలపై, రచయితలపై ఆంక్షలు పెట్టి, అరెస్టులు సాగించడానికి, జైళ్లల్లో కుక్కడానికి తప్ప యీ నిషేధం మరెందుకూ పనికి రాదు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని స్పష్టం చేస్తున్నాము.
"నక్సలైట్ల అజెండానే మా అజెండాʹ అని ఉద్యమ కాలంలో స్వయంగా కెసిఆర్ యే ప్రకటించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఆరేళ్ళ తరువాత విరసం సహా 16 ప్రజా సంఘాలపై నిషేధం విధించడం నీతిబాహ్యమైన చర్యగా, నిరంకుశ చర్యగా భావిస్తున్నాము.

తెగించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిషేధాలు, అంక్షలు, అడ్డంకులు, అవరోధాలు ఎంత మాత్రమూ వుండరాదని మా పార్టీ కోరుకుంటున్నది. ఇలా వ్యవహరించడం తెలంగాణ ప్రజల ఆకాంక్షయే గాకుండా ఆశయమని మా పార్టీ మరోసారి స్పష్టం చేస్తున్నది.

16 సంఘాలపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని మా పార్టీ-సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. నిర్బంధం, అణచివేత సమస్యకు పరిష్కారం కాదని మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నది.
(సాదినేని వెంకటేశ్వరరావు)
రాష్ట్ర కార్యదర్శి సిపిఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ
తెలంగాణ రాష్ట్ర కమిటీ

Keywords : virasam, clc, tpf, cns, cpi ml new democracy , kcr, telangana
(2024-04-25 00:39:17)



No. of visitors : 554

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విరసం,