ʹప్రజా సంఘాలపై నిషేధం కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టʹ

ʹప్రజా

పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితలసంఘం, చైతన్య మహిళా సంఘం, అమరుల బందు మిత్రుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ సహా 16 సంఘాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించడంపై వివిధ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రజా సంఘాల ప్రతినిధులు కేసీఆర్ ప్రభుత్వ నియంత్రుత్వ పోకడలను ఖండించాయి. ప్రజా సమస్యలపై మిరంతరం పోరాడుతున్న ఈ 16 సంఘాలకు మావోయిస్టులతో ముడిపెడుతూ నిషేధించడం అప్రజాస్వామికమంటూ ఆ సంఘాలు ఆరోపించాయి. తమ సంస్థల పనులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని ఒక్క సారి కూడా తమ దృష్టికి తీసుకరావడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ చేయకుండా ఒక్క కలంపోటుతో నిరంకుశంగా నిషేధం విదించిందని ప్రజా సంఘాలు ఆరోపించాయి.

ఈ మీడియా సమావేశంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ లక్ష్మణ్, తెలంగాణ రైతాంగ సమితి ప్రధాన కార్యదర్శ్ జక్కుల వెంకటయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు రవిచంద్, అమరుల బంధు మిత్రుల సంఘం ప్రతినిధి సత్య, విప్లవ రచయితల సంఘం తరపున పాణిలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో...నిషేధ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజా సంఘాలపై నిషేధం వెంటనే ఎత్తి వేయాలని, 16 సంఘాలను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 73 ను రద్దు చేయాలని, పబ్లిక్ సెక్యూరిటీ చట్టాన్ని ఎత్తివేయాలని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

మరో వైపు ప్రజా సంఘాలపై నిషేధాన్ని ఖండిస్తూ కరీం నగర్ ఉమ్మడి జిల్లా పౌరహక్కుల సంఘం, ప్రజాఫ్రంట్, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరో ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రజా, హక్కుల సంఘాలపై విధించిన నిషేధం అప్రజాస్వామ్యం - రాజ్యాంగ విరుద్ధం

మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రజా, హక్కుల సంఘాలపై విధించిన నిషేధం ముమ్మాటికీ అప్రజాస్వామ్యం - రాజ్యాంగ విరుద్ధమని హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఖండిస్తున్నాయి.

పౌర హక్కుల సంఘం తెలంగాణ, TPF , విరసం తదితర ప్రజాసంఘాలు సంయుక్త ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండించాయి.

తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, స్వచ్ఛంద సంఘాలు మన హక్కుల సాధనకై ఈ అక్రమ నిషేధాన్ని ఖండించాలని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి.

తెలంగాణా రాష్ట్రంలో 16 ప్రజా సంఘాలను మావోయిస్టు పార్టీ కి అనుబందంగా పనిచేస్తున్నాయని పేర్కొంటూ, వాటిని నిషేధిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం 30-03-2021న ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సంస్థలు చట్టవిరుద్ధమని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. 23ఏప్రిల్, 2021 న పత్రికలలో ప్రచురణకు ప్రెస్ నోట్ జారీచేసిందన్నారు.

మార్చి 12, 2021న డిజిపి కార్యాలయం నుంచి వచ్చిన లేఖ ఆధారంగా, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మార్చి 31న జివో జారీ చేశారు. తెలంగాణ ప్రజ ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంగటిత కర్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్ధి వేదిక (టివివి) సహా 16 స్వచ్ఛంద సంస్థల పేర్లు పెట్టారని వారు సూచించారు. డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (డిఎస్‌యు), తెలంగాణ విద్యార్తి సంఘం (టివిఎస్), ఆదివాసీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఎస్‌యు), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి), తెలంగాణ రైతాంగ సమితి (టిఆర్‌ఎస్), తుడుమ్ దేబ్బా (టిడి), ప్రజాకళా మండలి ( పికెఎం), తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టిడిఎఫ్), ఫోరమ్ ఎగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్ (ఎఫ్‌హెచ్‌ఎఫ్‌ఓ), సివిల్ లిబర్టీస్ కమిటీ (సిఎల్‌సి), అమరుల బంధు మిత్రుల సంఘం (ఎబిఎంఎస్), చైతన్య మహిలా సంఘం (సిఎంఎస్), రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యుఎ) మార్చి 30, 2021 నుండి ఒక సంవత్సరం పాటు రాష్ట్రంలో ఈ నిషేధం అమలులో ఉంటాయని తెలిపినారని ఇది మన భారత రాజ్యాంగ విరుద్ధం అన్నారు.

16 సంస్థలు హింసాయుత చర్యలను ప్రోత్సహిస్తున్నాయని, నిషేధిత సంస్థలకు సహాయపడుతున్నాయని, సంస్థల కార్యకర్తలు పట్టణ గెరిల్లా వ్యూహాలను అవలంబించడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కదులుతున్నారని GO లో పేర్కొనడం ఏమాత్రం వాస్తవం కాదన్నారు. ఛత్తీస్‌గడ్ లో 16 సంస్థల కార్యకర్తలు మావోయిస్టు నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేసిన విరసం వ్యవస్థాపకుడు పి.వరవర రావు, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, రోనా విల్సన్, ఇతరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొందన్నారు. అది ప్రజా సంఘాల, హక్కుల సంఘాల బాధ్యత అని వారు ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 16 సంస్థలను ఒక సంవత్సరం పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామ్యం అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధమని, ప్రకటించే ముందు అనుసరించాల్సిన విధానం ప్రకారం ప్రభుత్వం నుండి పౌర హక్కుల సంఘానికి గాని, ఇతర ప్రజా సంఘాలకు గాని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ప్రజాస్వామ్యం లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న ప్రజాసంఘాలు, మేధావులను మాట్లాడకుండా చేయడం భావ వ్యక్తీకరణను అడ్డుకోవడం లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవరిస్తున్నాయని ఆరోపించారు. మోడీ కేంద్ర ప్రభుత్వం, కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకుంటున్న విధానాలను ప్రజల పక్షాన మాట్లాడడం భరించలేకనే తెలంగాణ ప్రభుత్వం ఈ అక్రమ నిషేధం విధించిందన్నారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వామపక్షాలు, స్వచ్ఛంద సంఘాలు ఈ అప్రజాస్వామిక నిషేధాన్ని వ్యరేకించాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్, విరసం, ఇతర ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిషేధిత ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ రద్దు చేయాలని, పౌర హక్కుల, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని వారు తెలిపారు.

ప్రకటన విడుదల చేసిన వారు

1)మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘంతెలంగాణ

2) కోట శ్రీనివాస్, తెలంగాణ విద్యార్థి సంఘం (TVS) రాష్ట్ర అధ్యక్షులు

3) GAV ప్రసాద్, అధ్యక్షులు ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

4) ఏనుగు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

5).మహ్మద్ అక్బర్,
ఉపాధ్యక్షులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

6) శ్రీపతి రాజగోపాల్,
జిల్లా ఉపాధ్యక్షులు,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

7) బాలసాని రాజయ్య, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా

8) గుమ్మడి కొమురయ్య, కన్వీనర్,
తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా

9). గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ మెంబర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపెల్లి జిల్లా

10).పుల్ల సుచరిత, సహాయ కార్యదర్శి,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

11).వేల్పుల బాలయ్య, సహాయ కార్యదర్శి,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

12) నారా వినోద్, కోశాధికారి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

13) B. లక్ష్మణ్, E C మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.

14).పోగుల రాజేశం, E C మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

15) కడ రాజయ్య, E C మెంబర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
16) యాదవనేని పర్వతాలు, E C మెంబర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
17) బొడ్డుపెల్లి రవి, E C మెంబర్,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

18) మోటపలుకుల వెంకట్, E C మెంబర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం

Keywords : virasam, CLC, TPF, CMS, ABMS, TVV, TVS
(2024-04-04 15:28:44)



No. of visitors : 516

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹప్రజా