kashmir: UAPA కింద 15 ఏండ్ల బాలుడు అరెస్ట్

kashmir:

జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లా బుమ్హామా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో కలిపి 15 ఏండ్ల బాలుడు జహాబ్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద‌ కేసు నమోదు చేశారుపోలీసులు. ఈ నలుగురిని మే 29 న పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారని వారిపై ఆరోపణలు చేశారు. ఈ నలుగురిని కుప్వారా పోలీసు స్టేషన్ కు తీసుకరావలసిందిగా పోలీసులు ఆ గ్రామ సర్పంచ్ నజీర్ అహ్మద్ ను పోలీసులు ఆదేశించగా సర్పంచ్ తో పాటు వెళ్ళిన ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

కుప్వారా జిల్లాను జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్తో కలిపే ప్రధాన రహదారిపై మే 28 న రాత్రి 9 గంటలకు, 29 ఏళ్ల బుమ్హామా గ్రామ నివాసి మొహమ్మద్ అమిన్ దార్ ఓ ప్రమాదంలో మరణించాడు. మరుసటి రోజు, అతని అంత్యక్రియలకు స్థానిక గ్రామస్తుఅలతో పాటు ప్రక్క గ్రామాల నుండి కూడా వందలాది మంది పాల్గొన్నారు.

వాళ్ళ ఆచారం ప్రకారం మతపరమైన నినాదాలు ఇచ్చారు. ఆ నినాదాల మధ్య , జనంలో ఎవరో ఒకరు ʹహమ్ క్యా చహతే(మనకు ఏమి కావాలి)?ʹ అని ఎవరో నినదించగా ఆజాదీ (స్వేచ్చ‌)అంటూ మరికొందరు ప్రతి నినాదాలు చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో మరుసటి రోజు, డ్రగ్ముల్లా వద్ద ఉన్న పోలీసు పోస్ట్ పోలీసు అధికారులు గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులను తమ దగ్గరికి తీసుకరావాలని గ్రామ సర్పంచ్ ను ఆదేశించారు.
అయితే ఎనిమిది మంది నిందితులలో నలుగురిని సర్పంచ్ నజీర్ తనతో పాటు పోలీసు పోస్టుకు రావడానికి ఒప్పించాడు. వాళ్ళు అక్కడికి చేరుకోగానే పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని కుప్వారాలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు

"ఈ నినాదాలు ఎవరు ఇచ్చారో కూడా మాకు అర్థం కావడం లేదు" అని గ్రామ‌ సర్పంచ్ నజీర్ అహ్మద్ దార్ ది వైర్‌తో చెప్పారు.

అరెస్టయిన నలుగురిలో ముగ్గురు అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. నాల్గవవాడు మైనర్. ʹఅని నజీర్ అన్నారు.

అరెస్టు చేసిన యువకులను విడుదల చేయమని నజీర్ మరియు గ్రామ పెద్దలు పోలీసు అధికారులను ఒప్పించడానికి ప్రయత్నించారు, కాని అధికారులు వారిని పట్టించుకోలేదు.

15 ఏండ్ల బాలుడైన‌ జహాబ్ తండ్రి కైఫ్ తన కుమారుడి విడుదల కోసం ప్రతి ఒక్కరినీ ప్రాదేయపడ్డాడు. తన కుమారుడు నిర్దోషి మరియు మైనర్ అని కుప్వారా పోలీస్ స్టేషన్ అధికారులకు చెప్పాడు. జహాబ్ డ్రగ్ముల్లాలోని ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థి. ʹనేను అతని జనన ధృవీకరణ పత్రాన్ని వారికి చూపించాను. కానీ వారు (పోలీసులు) కనికరం చూపించలేదు, అతనిని శ్రీనగర్ జైలుకు పంపారు, ʹఅని కైఫ్ చెప్పారు.

కైఫ్ రోజు కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి ఐదుగురు పిల్లలు. తన కొడుకుపై ఏ అభియోగాలు మోపారో అతనికి తెలియదు. యూఏపీఏ అనే ఓ చట్టం ఉందని కూడా కైఫ్ కు తెలియదు. బెయిల్ కోసం దరఖాస్తు చేసిన‌ వెంటనే జహాబ్ విడుదల అవుతాడని ఆయన భావిస్తున్నారు.

ʹదీని గురించి నాకు ఏమీ తెలియదు. రాబోయే కొద్ది రోజుల్లో నా కుమారుడిని విడుదల చేస్తామని వారు (పోలీసులు) నాకు చెప్పారు. నేను నిరక్షరాస్యుడిని, నా కొడుకు విడుదల కోసం నేను ప్రతి తలుపు తట్టాను. ʹఅని అతను చెప్పాడు.

అరెస్టయిన నలుగురిలో 28 ఏళ్ల ఐజాజ్ అహ్మద్ షేక్ ఒకరు అతను ఛెస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఐజాజ్‌కు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు . అతని తల్లితండ్రులిద్దరూ అనారోగ్యంతో ఉన్నారు.

ʹఐజాజ్ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో అతను లేడు పైగా అతనిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవు ʹఅని ప్రభుత్వ ఉద్యోగి అయిన‌ ఐజాజ్ మామ ఫరూక్ అహ్మద్ గనీ అన్నారు.

అరెస్టు చేసినప్పటి నుండి ఐజాజ్ కుటుంబం నిరాశలో ఉంది. ʹఐజాజ్ అరెస్టుతో ఇంట్లో అందరి గుండెలు బద్దలయ్యాయి. వాళ్ళు రోజంతా ఏడుస్తూనే ఉన్నారు. ʹఅని ఫరూక్ అన్నారు. ʹʹగ్రామంలో ఐజాజ్ ఒక టీ స్టాల్ నడుపుతున్నాడు. అతను సంపాదించా చాలీచాలని డబ్బులతోనే కుటుంబం జీవనం సాగిస్తోంది."అని ఫరూక్ తెలిపాడు

ఐజాజ్‌ను విడుదల చేయించడం కోసం అతని కుటుంబం ఉత్తర కాశ్మీర్‌కు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ఫయాజ్ అహ్మద్ మీర్‌ను కలవడానికి కూడా వెళ్ళింది.

కైఫ్ మాదిరిగానే ఐజాజ్ కుటుంబానికి కూడా UAPA అంటే ఏమిటో తెలియదు. "మేము ఒక స్థానిక న్యాయవాదిని సంప్రదించాము. గ్రామానికి చెందిన పురుషులందరినీ త్వరలో విడుదల చేస్తార‌ని మేము ఆశిస్తున్నాము" అని ఫరూక్ చెప్పారు.

అరెస్టయిన మరో ఇద్దరు అన్నదమ్ములు. 31 ఏళ్ల కైజర్ అహ్మద్, 27 ఏళ్ల బిలాల్ అహ్మద్ మీర్. వీళ్ళిద్దరూ గ్రామంలో విడిభాగాల దుకాణాన్ని నడుపుతూ సాదారణ‌ జీవితాన్ని గడుపుతున్నారు..

"బిలాల్ మరియు కైజర్ ఇద్దరూ వచ్చే నెలలో జరగబోయే కైజర్ వివాహం కోసం సన్నాహాలలో బిజీగా ఉన్నారు" అని వారి బంధువు చెప్పారు. "అంత్యక్రియల్లో వీళ్ళు నినాదాలు చేసినట్టు పోలీసులు ఆరోపించారు. కానీ వీడియోలో వీళ్ళు నినానాదాలు ఇచ్చినట్టు కనిపించలేదు. పైగా నినాదాలకు వందలాది మంది స్పందించినట్టు వీడియోలో కనపడుతోంది వారు (పోలీసులు) వారందరినీ అరెస్టు చేస్తారా? ʹ అని అతని అన్నాడు.

ʹఇది అన్యాయం, క్రూరత్వానికి పరాకాష్ట. ఇలాంటి చిన్నచిన్న వాటి కోసం ప్రజలను అరెస్టు చేసుకుంటూ పోతే మనమందరం జైళ్ళలోనే ఉంటాం. ʹ అని అన్నారాయన.

కాగా ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి ది వైర్‌తో చెప్పారు. " అంత్యక్రియల్లో వాళ్ళు దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. అందుకే మేము వారిని UAPA క్రింద బుక్ చేసాము" అని ఆయన చెప్పారు.

వారిలో ఒకరు మైనర్ ఆ పోలీసు అధికారి ధృవీకరించారు. అతన్ని జువెనిల్ హోం కు పంపించామని చెప్పారు. ఆ నలుగురిపై కేసుకు సంబంధించి తమ దగ్గర‌ వీడియో సాక్ష్యం ఉందని ఆ అధికారి చెప్పాడు.

Keywords : kashmir, kushvara, Arrest of a 15-Year-Old Under UAPA in J&K Shows the Govtʹs Insecurity
(2024-04-13 12:36:45)



No. of visitors : 1427

Suggested Posts


కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం

తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు.

హక్కుల కార్యకర్తను మావోయిస్టుగా మార్చే ప్రయత్నం చేసిన పోలీసులు

ʹసివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకుంటే మరొకరు, నా నడుముకి రివాల్వర్‌ ఎక్కుపెట్టి బొలెరోలోకి లాగినప్పుడు, నేను చాలా భయపడ్డాను. వీళ్ళు నన్ను థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురి చేయడమో లేదా, ఎన్‌కౌంటరే చేసేస్తారేమోననిపించింది.ʹ

ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI

The Network of Women in Media, India, expresses its outrage at the harassment and violence meted out to the elderly parents of award-winning Kashmiri photojournalist and NWMI member Masrat Zahra. Such harassment of vulnerable family members is an abhorrent strategy of intimidation that must be strongly condemned.

మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా

మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌

ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం

లాక్డౌన్ సమయంలో తన సోదరి ఇంట్లో వుంటున్న కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ అక్టోబర్ 5, ఆదివారంనాడు తన ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లంతా భీభత్సంగా వుండటమే కాకుండా, పడకగదిలో మంచం మీద డాక్టర్ ఇమ్రాన్ గనై అనే వ్యక్తి పడుకొన్నాడు. అతనితో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన జమ్ముకశ్మీర్ విద్యుత్ ఉద్యోగులు- ఆర్మీని దించిన ప్రభుత్వం

మోడీ-షా ప్రభుత్వం భారత రైతాంగ పోరాట అణిచివేతకు బరితెగించి భంగపడింది. నాగాలాండ్ ప్రజల్ని టెర్రర్ చేయబోయి చతికిల పడింది. విదేశీ యుద్దాలకై శిక్షణ ఇచ్చి నిర్మించిన ఇండియన్ ఆర్మీని ఇండియన్ పౌరులపై యుద్దానికి వాడుకుంటోంది. ఇప్పుడు జమ్మూ& కాశ్మీర్ లో ఆర్మీ మరో క్రూర ఫాసిస్టు చర్యకు బరితెగిస్తోంది.

kashmir:పడవ ప్రమాదం పై వాట్సప్ లో స్టేటస్ పెట్టినందుకు జర్నలిస్టు అరెస్టు

గతంలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఓ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు.

kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI

అవార్డు గ్రహీత, కశ్మీరీ ఫోటో జర్నలిస్ట్, NWMI సభ్యురాలు మస్రత్ జహ్రా వృద్ధ తల్లిదండ్రులను వేధింపులు, హింసకు గురిచేయడం పట్ల నెట్ వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా (NWMI), ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


kashmir: