SaveLakshaDweep: సేవ్ లక్ష ద్వీప్ - నిరసనల హోరు

SaveLakshaDweep:

లక్షద్వీప్ ను రక్షించుకునేందుకు సాగుతున్న ఉద్యమాన్ని అక్కడి ప్రజలు ఉదృతం చేశారు. ఈ రోజు (సోమవారం) 12 గంటల పాటు నిరాహార ధీక్షలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ నాయకుడు, లక్షద్వీప్‌ అడ్మినస్ట్రేటర్‌ ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుక వచ్చిన ʹడెవలప్‌మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్‌ (2021)ʹ లక్షద్వీప్ ను నాశనం చేస్తుందని, పర్యావరణాన్ని, ప్రజల సంస్కృతిని దెబ్బ తీస్తున్నదని ఆరోపిస్తున్న సామాజిక కార్యకర్తలు ప్రఫుల్ ఖోడా నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.

సేవ్ లక్ష ద్వీప్ అనే నినాదంతో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ రోజు అనేక చోట్ల ప్రజలు, అనేక మంది ప్రముఖులు ʹలక్షద్వీప్‌ను రక్షించండి (సేవ్‌ లక్షద్వీప్‌)ʹ అని నినదిస్తూ విభిన్న రీతిలో తమ నిరసన తెలిపారు. ఆ డ్రాఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ నిరసనలో భాగంగా కొందరు యువకులు సముద్ర గర్భంలోకి వెళ్లి నిరసన తెలిపారు.

ʹడెవలప్‌మెంట్ అథారిటీ డ్రాప్ట్ రెగ్యులేషన్‌ (2021)ʹపై లక్షద్వీప్‌ ఒక్కసారిగా భగ్గుమంది. ద్వీపకల్ప భూమిలో ఆ డ్రాఫ్ట్‌ అగ్గి రాజేసింది. దీనిపై లక్షద్వీపకల్పవాసులు సోమవారం 12 గంటల పాటు నిరసనల హోరు చేపట్టారు. ప్రజలతో పాటు ప్రముఖులందరూ ʹలక్షద్వీప్‌ను రక్షించండి (సేవ్‌ లక్షద్వీప్‌)ʹ అని నినదిస్తూ విభిన్న రీతిలో తమ నిరసన తెలిపారు. ఆ డ్రాఫ్ట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా నల్లజెండా కూడా ప్రదర్శించారు. కరోనా నేపథ్యంలో మాస్క్‌లు ధరిస్తూనే ఎవరికీ వారు ఉన్నచోటనే ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు.. నల్ల వస్త్రాలు.. నలుపు మాస్క్‌లు ధరించి లక్షద్వీప్‌ను పరిరక్షించండి అని నినాదాలు చేశారు. వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్ ఖోడా పటేల్ పై డ్రాఫ్ట్‌ను తీసుకువచ్చారు. అభివృద్ధి పేరుతో తమను ఇబ్బంది పెట్టడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. ద్వీపాల పర్యావరణ పవిత్రతను అణగదొక్కడానికి, భూ యాజమాన్య హక్కులను కాలరాయడానికి ఈ ముసాయిదా తీసుకువచ్చారని నిరాహార దీక్ష చేస్తున్న వారు ఆరోపించారు.

ఈ నిరసనలో భాగంగా కొందరు యువకులు సముద్ర గర్భంలోకి వెళ్లి నిరసన తెలిపారు. సేవ్‌ లక్షద్వీప్‌ అని ఆంగ్ల, మలయాళంలో రాసి ఉన్న పత్రాలు పట్టుకుని నీటిలోనే నినాదాలు చేస్తూ డ్రాఫ్ట్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ ముసాయిదాపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డ్రాఫ్ట్‌ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 90 మంది ఐఏఎస్‌లు డ్రాఫ్ట్‌ విరమించుకోవాలని లేఖ కూడా రాశారు. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న 32 చదరపు కిలోమీటర్ల మేర లక్షద్వీప్‌ ఉంది. లక్షద్వీప్‌ పాలనా వ్యవహారకర్తగా గుజరాత్‌ బీజేపీ నేత ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ నియమితులైనప్పటి నుంచి వివాదం రాజుకుంది.

Keywords : lakshadweep, hunger strikes , protest, demonstrations,
(2024-04-25 00:23:06)



No. of visitors : 593

Suggested Posts


భారత్ దేశ ప్రభుత్వం లక్షద్వీప్ లోని అతి పురాతన న్యూస్ పోర్టల్ ద్వీప్ డైరీని ఎందుకని నిషేధించింది?

గత కొన్ని రోజుల నుండి, #SaveLakshadweep కేంపెయిన్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఆహారపు అలవాట్లు, ద్వీపాల మత సంస్కృతి, భూ హక్కులు, పంచాయతీ ఎన్నికల అభ్యర్థిత్వానికి కుటుంబ నియంత్రణ,

సినీ నటిపై దేశ ద్రోహం కేసు

పటేల్ రాక ముందు వరకు లక్షద్వీప్ లో ఒక్కరికి కూడా కరోనా సోక లేదని, ఒక్క కోవిడ్ 19 పాజిటీవ్ కేసూ నమోదు కాలేదని, పటేల్ వచ్చాక తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాపించిందని ఆమె మండి పడ్డారు. ఓ మలయాళ టీవీ ఛానల్ లో చర్చలో పాల్గొన్న ఆమె...

lakshadweep సినీ నటిపై దేశద్రోహం కేసు - పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసిన బీజేపీ నాయకులు

లక్షద్వీప్ కు చెందిన సినీ నటి, నిర్మాత ఐషా సుల్తానా (Aisha Sultana)పై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ పలువురు బీజేపీ నాయకులు ఆ పార్టీకి మూకమ్మడి రాజీనామాలు చేశారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


SaveLakshaDweep: