త‌లోజా సెంట్రల్ జైలు ఖైదీల కబేళా - ప్రమాదంలో అడ్వకేట్ సురేంద్ర గాడ్లింగ్, ఇతర ఖైదీల ప్రాణాలు

త‌లోజా

09-06-2021

చాలా రోజుల నుంచి , తలోజా సెంట్రల్ జైలు ఖైదీలు జీవిస్తున్న తీవ్ర అమానవీయ పరిస్థితుల గురించి వింటున్నాము. ముఖ్యంగా ఈ కోవిడ్ రోజుల్లో, ఈ పరిస్థితి నానాటికి మరింత తీవ్రతరమవుతోంది.
కొద్ది రోజుల క్రితం సాగర్ గోర్ఖే, రమేష్ గాయ్‌చోర్, మహేష్ రౌత్‌లకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత వారికి ఏ మాత్రం చికిత్స చేయించలేదు. మేము గట్టిగా అడిగిన తరువాతనే, ప్రాథమిక చికిత్స ప్రారంభమైంది. ఇప్పుడు అడ్వకేట్ సురేంద్ర గాడ్లింగ్ పట్ల కూడా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఖైదీలందరికీ ఆర్టీ-పిసిఆర్ పరీక్ష జరిగింది, ఇందులో సురేంద్ర సర్‌కి నెగేటివ్ రావడం లోపల ఉన్న అతనికి, బయట వున్న మాకు కాస్త ఉపశమనాన్ని కలిగింది. కానీ బహుశా తలోజా జైలు సూపరింటెండెంట్ కౌస్తుబ్ కుర్లేకర్‌కి ఈ ఉపశమనం యిష్టం లేనట్లుంది. అందుకే సురేంద్ర సార్‌కు ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ గత 10 రోజుల నుండి అంటే 2021 మే 31 నుండి 40 మందితోపాటు క్వారన్‌టైన్ బ్యారక్‌లో (నం 9) ఉంచారు.
అంటే అతనికి కోవిడ్ రావాలనే ఉద్దేశ్యంతో అక్కడ ఉంచారా? అంతే కాకుండా, గత 7 రోజులుగా వర్షం కారణంగా ఆ బ్యారక్‌లోని పైకప్పు కారడంతో, వర్షపు నీరు నేల మీద జమ అయింది. పక్కబట్టలు తడిసిపోయాయి, పడుకోడానికి, సరిగ్గా కూర్చోవడానికి కూడా చోటు లేదు.
ఈ తేమ కారణంగా సురేంద్ర గాడ్లింగ్, యితర ఖైదీలకు గత ఏడు రోజులుగా నిద్రలేదు. వారు ఈ తడి నేల మీద పొడి జాగాను వెతుక్కోవాలి లేదా నిలబడి నిద్రపోవాలి. అడ్వకేట్ సురేంద్ర గాడ్లింగ్‌కు బిపి, షుగర్, స్పాండిలైటిస్ వంటి వ్యాధులు ఉన్నాయి. బహుశా ఇతర ఖైదీలకు కూడా ఇలాంటి వ్యాధులు ఉండవచ్చు, వారు ఎలా తట్టుకుంటారు? సురేంద్ర సార్ గత మార్చి నుండి కంటి చూపుకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు, కళ్ళద్దాలు అడుగుతుంటే ఇవ్వడం లేదు. ప్రస్తుతం తేమ వల్ల అతను ఉన్న బారక్ మురికిగా అయింది.
మరుగుదొడ్డి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. డేటాయిల్ లేదు, ఫినాయిల్ లేదు, శానిటైజర్ లేదు, ఏమీ లేవు. గత 15 నెలలుగా అతనికి జైల్లో ఒక మాస్క్, ఒక సబ్బు మాత్రమే ఇచ్చారు. వీటన్నిటితో మనం పరిశుభ్రత గురించి ఏం మాట్లాడగలం?? ఈ జైలులోనే వరవరరావు, ప్రొ. హనీ బాబు, ఫాదర్ స్టాన్ స్వామిలతో అదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి వారిని మరణం అంచుకు తీసుకువెళ్లారు. కోర్టు నుండి ఉపశమనం లభించకపోతే, పర్యవసానం గురించి ఆలోచించడానికి కూడా భయమేస్తోంది.
ఇది ఒక వ్యక్తిని శరీరం నుండి మాత్రమే కాదు, మనస్సు నుండి, మనస్సాక్షి నుండి కూడా తొలగించడానికి జరుగుతున్న ప్రయత్నం. అది బ్రాహ్మణీయ ఆలోచన ద్వారా మాత్రమే పెంపొందుతుంది. అడ్వకేట్ సురేంద్ర గాడ్లింగ్ వంటి అసంఖ్యాక రాజకీయ, ఇతర ఖైదీల జీవితాలతో ఆడుతున్న ఈ ఆటకు వ్యతిరేకంగా మనం సంపూర్ణ శక్తితో ధిక్కార గళాన్ని ఎలుగెత్తాలి.
ఇనుప కటకటాల వెనుక బందీలుగా ఉండి, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమ సమాజ ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్న అడ్వకేట్ సురేంద్ర గాడ్లింగ్, యితర రాజకీయ ఖైదీలందరి స్ఫూర్తికి విప్లవాభివందనాలు.
మీ అమూల్య త్యాగాలు రాబోయే తరాలకు ప్రేరణనిస్తాయి.
జై భీం!
‍(ʹహర్షాలీ పొద్దార్ʹ ఫేస్ బుక్ పోస్ట్)

Keywords : maharashtra, taloja jail, bk16, Surendra Gadling and other prisoners lives at stake, varavararao, stan swamy, hany babu
(2024-04-23 03:48:42)



No. of visitors : 907

Suggested Posts


bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌

కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది.

UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి

భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది.

Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది.

Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర

బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది.

కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


త‌లోజా