అంబేడ్కర్ పోస్టర్లను చించేసి, అడ్డుకున్న దళిత యువకుడిని కొట్టి చంపారు !


అంబేడ్కర్ పోస్టర్లను చించేసి, అడ్డుకున్న దళిత యువకుడిని కొట్టి చంపారు !

అంబేడ్కర్

12-06-2021

బాబా సాహెన్ అంబేడ్కర్ పోస్టర్లను చించేసిన వారిని అడ్డుకున్నందుకు ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. చంపిన వాళ్ళు ఓబీసీ వర్గానికి చెందినవాళ్ళుగా పోలీసులు పేర్కొన్నారు.

రాజస్థాన్ రాష్ట్రం హనుమన్గడ్ జిల్లా కిక్రాలియా గ్రామానికి చెందిన వినోద్ బామ్నియా భీమ్ ఆర్మీ లో సభ్యుడు దళితులపై జరిగే అణిచివేత , కుల వివక్షలకు వ్యతిరేకంగా గళం విప్పుతుంటాడు. తన ఇంటి గోడలపై ఏప్రెల్ 14 న అంబేడ్కర్ జయంతి కి సంబంధించి పోస్టర్లను అంటించాడు, బ్యానర్లను కట్టాడు. కొద్ది రోజుల తర్వాత ఆ బ్యానర్లను పోస్టర్లను అదే గ్రామానికి చెందిన అనిల్ సిహాగ్ మరియు రాకేశ్ సిహాగ్ లు చించేశారు. దాన్ని అడ్డుకున్న వినోద్ బామ్నియా వారిపై గ్రామ పంచాయితీకి పిర్యాదు చేశాడు. పంచాయితీ పెద్దలు ఆ ఇద్దరితో క్షమాపణ చెప్పించి సమస్యను అప్పటికి పరిష్కరించారు.

అయితే వినోద్ బామ్నియా పై కోపంతో ఉన్న వాళ్ళిద్దరు అదే గ్రామానికి చెందిన మరికొందరుకలిసి దాడికి పథకం రచించారు. జూన్ 5 వ తేదీన వినోద్ పై దాడి చేశారు. ఈ దాడికి ప్రత్యక్ష సాక్షి , హత్య కేసులో ఫిర్యాదుదారుడు బామ్నియా బంధువు ముఖేష్ మాట్లాడుతూ....
"ఇటీవల, మా గ్రామంలో నివసించే అనిల్ సిహాగ్ మరియు రాకేశ్ సిహాగ్లతో సహా మరి కొందరు ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి నుండి మా ఇంటి వెలుపల ఉంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యానర్లను చింపివేశారు. మేము వారిపై ఫిర్యాదు చేసాము ఈ విషయం పంచాయతీ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించబడింది. వారి కుటుంబ సభ్యులు వారి తరపున క్షమాపణలు చెప్పారు, ʹఅని ముఖేష్ అన్నారు.

ʹఅయితే అసలు నేరస్థులు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. జూన్ 5 న, వినోద్ మరియు నేను గ్రామంలోని మా పొలాలకు వెళుతుండగా రాకేశ్, అనిల్ మరియు మరికొందరు మాపై దాడి చేశారు, వారు మా కోసం కర్రల పట్టుకొని ఎదురు చూస్తున్నారు. నేను స్వల్ప గాయాలతో తప్పించుకోగలిగాను. కానీ వారు వినోద్‌ను హాకీ కర్రలతో 20-30 సార్లు కొట్టారు. అతన్ని రావత్‌సర్‌కు తీసుకెళ్లి హనుమన్గడ్, శ్రీగంగనగర్‌లోని ఆసుపత్రులకు పంపారు, అక్కడ అతను చనిపోయాడు ʹఅని ముఖేష్ చెప్పారు.

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అనిల్ సిహాగ్, రాకేశ్ సిహాగ్ లతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల‌ ఎఫ్ఐఆర్ ప్రకారం వినోద్ పై దాడి సమయంలో నిందితులు అతన్ని కులంపేరుతో తిట్టారని
"ఆజ్ తుమ్ తుమ్హారా అంబేద్కర్వాడ్ యాద్ దిల్వాయెంగే (ఈ రోజు మీ అంబేద్కరైట్ భావజాలాన్ని గుర్తుంచుకునేలా చేస్తాము.)ʹʹ అని అరిచారు.

పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం , వినోద్ బామ్నియా ఈ సంవత్సరం ప్రారంభంలో రెండుసార్లు వేర్వేరు సమస్యలపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదులను నమోదు చేశాడు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో హనుమాన్ చలీసా కాపీలను పంపిణీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు వినోద్ కు ఏప్రిల్‌లో బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన పోలీసులకు పిర్యాదు చేశాడు. గ్రామస్తులు కొంత మంది గ్రామంలోని ఓ రోడ్డును బ్లాక్ చేసినప్పుడు వినోద్ అడ్డుకున్నందుకు అతనిపై దాడి జరిగింది. ఈ విషయంపై కూడా వినోద్ పోలీసులకు పిర్యాదు చేశాడు.

"వినోద్ భీమ్ ఆర్మీలో చాలా చురుకైన సభ్యుడు మరియు కుల వివక్ష పై క్రమం తప్పకుండా గళం ఎత్తుతాడు. అతని హత్య వెనుక కులతత్వం కారణం. ʹ అని భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షుడు సత్యవన్ ఇందాసర్ అన్నారు.

"స్థానిక పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. అంతకుముందు వినోద్ పిర్యాదులపై సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే వినోద్ సజీవంగా ఉండేవాడు. దాడి చేసిన‌ నిందితులంతా ఒకే వర్గానికి చెందినవారు ʹఅని ఆయన అన్నారు.

Keywords : Rajasthan, dalit youth, killed, Dalit youth killed in Rajasthan after row over Ambedkar poster
(2021-09-23 04:07:05)No. of visitors : 448

Suggested Posts


సీఎం ఆదేశాలతో...బహిర్భూమికి వెళ్ళిన మహిళల ఫోటోలు తీశారు.. అడ్డుకున్నందుకు కొట్టి చంపారు.

స్త్రీలు బహిర్భూమికి వెళ్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేవాళ్ళను ఏమంటారు. పోకిరీలు... జులాయీలు... ఈవ్ టీజర్లు.... అలా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటివాళ్ళను ఏమనాలి ? బ్లాక్ మెయిలర్స్ అనే కదా అంటారు. అలా ఫోటోలు తీసేవాళ్ళను అడ్డుకుంటే అలా అడ్డుకున్నవాళ్ళను కొట్టి చంపేవాళ్ళను ఏమంటారు ? హంతకులనే కదా ! కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ....

Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks

The family of a Muslim man, whose dismembered body was found on the railway tracks near Govindgarh in Alwar district of Rajasthan on Friday, has claimed that he was thrashed and shot dead by a crowd of cow vigilantes when he was transporting four cows to his native village Ghatmika in Bharatpur....

గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రి

గోరక్షక ముసుగులో ఉన్న మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్‌లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్‌ ఖాన్‌ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై పడేశారు. భరత్‌పూర్‌ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్‌....

బీజేపీ,కాంగ్రెస్ సేమ్ టూ సేమ్... గోరక్ష‌కుల మూక దాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్ పై చార్జ్ షీట్

ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బాధితులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసును ఎత్తి వేసి పెహ్లూ ఖాన్ హంతకులను శిక్షిస్తుందని ఆ కుటుంభం భావించింది. అయితే బీజేపీ కన్నా తామేమీ తక్కువ తినలేదని మరో సారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. చనిపోయిన పెహ్లూ ఖాన్ పై, అతని కొడుకుపై చార్జ్ షీట్ దాఖలు చేశారు.

పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!

ఆవులను అక్రమ రవాణా చేశాడన్న నెపంతో రాజస్తాన్ లో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తిని మతోన్మాద‌ మూక కొట్టి చంపిన కేసును రాజస్థాన్‌లోని ఆల్వార్‌ జిల్లా కోర్టు ఈ రోజు కొట్టివేసింది. నిందితులైన ఆరుగురిని నిర్దోషులని కోర్టు ప్రకటించింది.

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులు

మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఓ ముస్లిం వ్యక్తిపై దారుణంగా దాడి చేశారు మతోన్మాదులు. రాజస్థాన్ లోని షికార్ జిల్లా సదర్ పోలీసు స్టేషన్ పరిథిలో గఫార్ అహ్మద్ అనే ఆటో నడుపుకొని జీవించే 53 ఏళ్ళ వ్యక్తి తన ఆటోలో పాసింజర్లను గమ్య స్థానాల్లో దింపి

హైకోర్టులో మనువు విగ్రహం తొలగించాలని దశాబ్దాల పోరాటం

1989 నుండి రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో మనువు విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించాలని 32 ఏళ్ళుగా పోరాటం సాగుతుంది. దళిత, బహుజనులు, ప్రజాస్వామిక వాదులు ఆ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Search Engine

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌
300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
more..


అంబేడ్కర్