విద్యార్థినులపై ఆద్యాత్మిక గురువు లైంగిక వేధింపులు... కేసు నమోదు కాగానే ఆస్పత్రిలో చేరిన బాబా

విద్యార్థినులపై

13-06-2021

ఆయనో (Self-styled spiritual guru) స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఎలియాస్ బాబా ప్రజలకు బోధనలు చేసే వ్యాపారమే కాక విద్యావ్యాపారం చేస్తున్నాడు. అసలే భక్తి బోధనలు చేసే బాబా... పైగా ఇంటర్నేషనల్ స్కూల్... అందులోనూ రెసిడెన్షియల్ స్కూల్. ఇక మధ్యతరగతి ప్రజలు ఊరుకుంటారా పొలోమంటూ వాళ్ళు అడిగినంత ఫీజులు కట్టి మరీ తమ పిల్లలను ఆ స్కూల్ లో చేర్పించారు. అయితే ఆ స్కూల్ మాటున ఆ ఆధ్యాత్మిక గురువు ఎలియాస్ బాబా చేసిన పనులు చూసు ఇప్పుడు బోరుమంటున్నారు ఆ తల్లి తండ్రులు.

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఎలియాస్ బాబా పేరు (Shiv Shankar Baba) శివశంకర్ బాబా. ఈయన‌ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కేలంబక్కంలో సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నాడు. అందులో చదువుకుంటున్నవిద్యార్థినులపై లైంగిక వేధింపులకు (sexual abuse ) పాల్పడ్డాడు. ఈ దుర్మార్గం ఎప్పటి నుండి జరుగుతుందో కానీ ఈ స్కూల్ లో చదువుకున్న కొందరు విద్యార్థినులు ఈ మధ్య శివశంకర్ బాబా దుర్మార్గాలను సోషల్ మీడియాలో వెల్లడించారు. పోలీసులకు కూడా పిర్యాదు చేశారు.

ఇక ఈ విషయాలు బైట పడగానే రంగంలోకి దిగిన శిశు సంక్షేమ కమిటీ శివ‌ శంకర్ బాబా కు నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజర్ కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. అయితే అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న ఆ ఆధ్యాత్మిక గురువులు హటాత్తుగా ఛాతి నొప్పి వచ్చింది. డెహ్రాడూన్ వెళ్ళి ఓ ఆస్పత్రిలో జాయిన్ అయిపోయాడు.

తమ గురువు గారికి ఆరోగ్యం బాగా లేదని అందుకే డెహ్రాడూన్ లోని ఆస్పత్రిలో చేరాడని కాబట్టి శిశు సంక్షేమ కమిటీ ముందు హాజరు కాలేడని ఆయన శిష్య‌ బృందం తెలిపింది.

కాగా బాధిత విద్యార్థినుల పిర్యాదు ఆధారంగా కేలంబక్కం మహిళా స్టేషన్ లో శివశంకర్ బాబాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి 354, 363,365, 366 సెక్షన్ల కింద అభియోగాలు, పోక్సోలోని పలు విభాగాలకి ఈ కేసు నమోదు అయ్యింది.

అయితే ఈ కేసు యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిసిఐడికి బదిలీ చేసింది. ఇద్దరు మైనర్లతో సహా 13 మంది బాధిత విద్యార్థినులను త్వరలోనే విచారిస్తామని పోలీసులు చెప్పారు.

Keywords : tamilanadu,chennai, Kelambakkam, spiritual guru Shiv Shankar Baba,sexual abuse, Self-styled guru Shiv Shankar Baba booked after sexual abuse complaints
(2024-04-18 23:38:02)



No. of visitors : 1038

Suggested Posts


విద్యార్థినులపై లైంగిక వేధింపులు... 500 మంది స్టూడెంట్స్ కంప్లైంట్ - ఉపాధ్యాయుడు అరెస్ట్

దిగ్భ్రాంతి కలిగించే ఘోరమైన ఓ సంఘటన చెన్నై లోని ఓపాఠశాలలో జరిగింది. ఓ టీచర్ తన విద్య అభ్యసించే విద్యార్థినులను లైంగికంగా వేదించాడు.

దేవుడు లేడని చెప్పే హక్కు రాజ్యాంగం కల్పించింది...మద్రాస్ హైకోర్టు

దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే.. దేవుడు లేడని చెప్పే హక్కు కూడా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుందని కోర్టు పేర్కొంది.

చెన్నై వీధుల్లో పడవల్లో ప్రయాణం

వెనీస్ నగరంలో తిరిగినట్టు చెన్నై వీధుల్లో జనం ఇప్పుడు బోట్లల్లో తిరుగుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ట్యాక్సీ సర్వీసులను అందిస్తున్న ఓలా కంపెనీ తాజాగా ఇప్పుడక్కడ బోటింగ్ సర్వీసులను....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విద్యార్థినులపై