హిప్నాటిజం చేసి డబ్బులు దోచుకున్నాడు !


హిప్నాటిజం చేసి డబ్బులు దోచుకున్నాడు !

హిప్నాటిజం

మోసం చేయడానికి ఉన్న అనేక మార్గాల్లో ఇప్పుడు హిప్నటిజం కూడా చేరింది. ఓ బ్యాంకు మేనేజర్ ను హిపటైజ్ చేసిన ఓ అగంతకుడు 93 వేల రూపాయలు తీసుకొని పరారయ్యాడు. ముంబైలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో ఈ సంఘటన జరిగింది. బ్యాంకు మేనేజర్ భూపేంద్ర కుమార్ మణిరామ్ వద్దకు తన పేరు ఎంకే శర్మ అని చెప్పుకొని ఓ వ్యక్తి వచ్చాడు. తాను మహారాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. తన తమ్ముడు వికలాంగుడని, అతడి పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని వచ్చానన్నాడు. ఎంహడాలో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇప్పిస్తానని కూడా తెలిపాడు. తన పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా చెప్పి, పాన్ కార్డు ఇతర వివరాలు ఇవ్వాలన్నాడు. మేనేజర్ ఆ వ్యక్తితో కాసేపు అలా మాట్లాడారో లేదో.. ఏదో మత్తులో ఉన్నట్లుగా క్యాషియర్ వద్దకు వెళ్లి, 90 వేల రూపాయలు అడిగి తీసుకున్నారు. తన జేబులో ఉన్న మరో రూ. 3వేలు కలిపి.. మొత్తం రూ. 93 వేలు ఆ వ్యక్తికి ఇచ్చేశారు. పది నిమిషాల తర్వాత గానీ ఏం జరిగిందో ఆయనకు తెలియలేదు. విషయం ఏమిటంటే, అవతల వచ్చిన వ్యక్తి మేనేజర్‌ను ʹహిప్నటైజ్ʹ చేశాడు! హిప్నాటిజం ప్రభావంలో పడి సదరు బ్యాంకు మేనేజర్ అక్షరాలా 93 వేల రూపాయలు పోగొట్టుకున్నారు.

తానేదో ట్రాన్స్‌లో ఉన్నానని, తనకేమీ తెలియలేదని, పదినిమిషాల తర్వాత మాత్రమే పూర్తిగా తెలివి వచ్చిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. తీరా చూస్తే ఎంహడాలో ఎంకే శర్మ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని తెలిసింది. హిప్నాటిజంతో డబ్బులు దోచుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు కూడా అంటున్నారు.

Keywords : Mumbai, bank manager, hypnotism,
(2018-09-24 13:17:53)



No. of visitors : 1753

Suggested Posts


హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో దభోల్కర్‌ కుమార్తె

పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్‌ కుమార్తె ముక్తా దభోల్కర్‌ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్‌) తెలిపింది.

LOOKING BACK AT 50 YEARS OF A PEOPLEʹS MOVEMENT

The Naxalbari movement began 50 years ago, and is still on. ʹNowhere else in the world will you find a continued class struggle that has lasted so many years,ʹ said Vara Vara Rao, the famous Telugu poet and writer, speaking on ʹ50 Years of Naxalbari, Looking Back, Looking Forwardʹ.....

Search Engine

అంటరాని ప్రేమ
వీవీ ఇంటిని చుట్టుముట్టిన ఏబీవీపీ.. అడ్డుకున్న స్థానికులు
ప్రజా కోర్టులో తేలిన నిజం.. బాక్సైట్ తవ్వకాలు, భూకబ్జాలే ఎమ్మెల్యే హత్యకు కారణం
అమృతకు క్షమాపణలతో..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది-ఒడిషాలో బలపడ్డాం..విస్తరిస్తున్నాం: మావోయిస్టు పార్టీ
నన్నో దేశద్రోహిగా చిత్రీకరించాలని పోలీసులు ప్రయత్నించారు..!
ఓటమిని అంగీకరించలేక బీభత్సం సృష్టించిన ఏబీవీపీ.. గూండాలతో లెఫ్ట్ విద్యార్థులపై దాడి
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టుల కేసులో పిటిషనర్ల లాయర్ సుప్రీంకు చెప్పిన నిజాలు ఇవే
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ఆంటీ! చంపేసారాంటీ..నా ప్రణయ్‌ను చంపేసారు
జేఎన్‌యూపై ఎర్రజెండా రెపరెపలు.. మతోన్మాదులను మట్టి కరిపించి లెఫ్ట్‌ను మళ్లీ గెలిపించిన విద్యార్థులు
నీ కోసం వేలాది మంది వచ్చారు.. ఒక్కసారి లే ప్రణయ్..
ప్రొఫెసర్ సాయిబాబకు చిన్నారి సాహస్ లేఖ.. ప్రశ్నించడమే నువ్వు చేసిన తప్పా..?
ఇవి పరువు హత్యలు కావు.. దేశం పరువు తీసే హత్యలు
అమృత తండ్రి దుర్మార్గపు చరిత్ర.. కూతురు కంటే పరువే ముఖ్యమంటున్న కులోన్మాది
ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పెద్దలను కూడా ఈడ్చిపడేయటమే
ప్ర‌శ్నించ‌డ‌మే నేర‌మైన‌ప్పుడు : క్రాంతి
తలపాగా ధరించాడని ఎస్సీ వర్గీయుడి తల ఒలిచేసిన అగ్రకుల ఉన్మాదులు
ʹక్రాంతి కోస‌మే ఈ ప్ర‌యాణంʹ
SUSPEND AGREEMENTS WITH INDIA UNTIL THE HUMAN RIGHT ACTIVISTS ARE RELEASED : MEP TO EUROPEAN COMMISSION
స్వచ్చమైన హిందీ, సంస్కృత భాషలో ఉన్న ఉత్తరం వరవరరావు రాసిందేనా.?
మొదటి అర్బన్ నక్సల్ భగత్ సింగ్
ʹజీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లుʹ
70 ఏండ్ల చరిత్రను తిరగరాసిన విద్యార్థిని.. మతోన్మాద శక్తులపై లెఫ్ట్ విజయం
ప్రజల సభంటే.. ఇట్లుంటది
more..


హిప్నాటిజం