బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం


బస్తర్ లో పెరిగిపోతున్న సీఆర్పీఎఫ్ క్యాంపులు - ఆదివాసుల్లో తీవ్రమవుతున్న ఆగ్రహం

బస్తర్

19-06-2021

అక్టోబర్ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో కనీసం పన్నెండు నిరసనలు జరిగాయి.
సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడానికి సుదీర్ఘ ప్రయాణాలు చేసి వస్తున్న వేలాది మంది ఆదివాసీలకు దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో, సుక్మా జిల్లాలోని సిల్‌గేర్ గ్రామం నెల రోజులుగా కేంద్రంగా మారింది.
కరోనావైరస్ వ్యాప్తి, రుతుపవనాల రాకతో వ్యవసాయ పనుల ప్రారంభం గురించిన ఒత్తిడితో 5,000 మందికి పైగా ఆదివాసీలు పాల్గొన్న నిరసనలో సంఖ్య తగ్గింది. కానీ, 35 రోజుల తరువాత కూడా సుమారు 200 మంది ఉన్నారు.

ఇటీవలి నెలల్లో, రహదారి నిర్మాణానికి సహాయం చేసే పేరుతో భద్రతా శిబిరాల ఏర్పాటు జరుగుతున్న ఈ ప్రాంతంలో ఘర్షణలు పెరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుండి బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో, కనీసం 12సార్లు ఇటువంటి నిరసనలు జరిగాయి.

కాంకేర్ జిల్లాలో, పఖంజూర్- కోయిలిబెడాలో మధ్య 45 కిలోమీటర్ల విస్తీర్ణ రహదారిలో రెండు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజుల పాటు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన తరువాత, 38 సర్పంచ్‌లతో సహా 50 మంది ఎన్నికైన పంచాయతీ సభ్యులు డిసెంబరులో తమ పదవులకు రాజీనామా చేశారు.

రాయ్‌పూర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపూర్ జిల్లాలోని అబూజ్‌మడ్ ప్రాంతంలోని ధౌడై గ్రామంలో నవంబర్‌లో దాదాపు నాలుగు వేల మంది గ్రామస్తులు రోడ్డు నిర్మాణాన్ని మాత్రమే కాకుండా, కడెమెటాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ క్యాంప్ ఏర్పాటును, వారు పవిత్రంగా భావించే చోటే డోంగర్ గ్రామంలోని అమ్దై ఘాటి కొండపై జయస్వాల్ నెకో కంపెనీకి మైనింగ్ లీజును యివ్వడాన్ని కూడా వ్యతిరేకించారు.

బెచాపాల్‌లో కొత్త క్యాంపులను ఏర్పాటు చేయడానికి రెండు లైన్ల వెడల్పు గల తారు రోడ్డు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ బీజాపూర్ జిల్లాలో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. ఫిర్యాదు చేయడానికి వేలాది మంది గ్రామస్తులు గంగలూరు వెళ్ళినప్పుడు, పోలీసులు లాఠీచార్జ్‌ చేస్తే, నిరసనకారులు రాళ్ళు రువ్వడంతో ఒక భద్రతా సిబ్బంది వ్యక్తి గాయపడ్డాడు.

రహదారులకు భద్రత


అధికారిక నోట్ ప్రకారం, బస్తర్ పోలీసులు ʹవిశ్వాస్, వికాస్, సురక్షʹ (ట్రస్ట్, డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ) పాలసీ కింద – నారాయణపూర్‌లో ఒకటి, కాంకేర్, సుక్మాలలో రెండు, బస్తర్, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల్లో మూడు చొప్పున 2020 లో 14 కొత్త సెక్యూరిటీ క్యాంపులను స్థాపించారు. గత రెండేళ్లలో బస్తర్‌లో 28 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారి నిర్మాణానికి రక్షణ కల్పించడానికి ఈ శిబిరాలు అవసరమని పోలీసులు అంటున్నారు. గతంలో, మావోయిస్టులు తరచూ రహదారి పరికరాలను లక్ష్యంగా చేసుకున్నారు, కాంట్రాక్టర్లు, కార్మికులను కూడా అపహరించారు.

" వామపక్ష ఉగ్రవాదానికి సంధానం విరుగుడు" అని బస్తర్ రేంజ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ పి సుందర్రాజ్ అభిప్రాయం. ప్రభుత్వ దృక్పథాన్ని ప్రతిధ్వనిస్తూ, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రజా పంపిణీ కేంద్రాలు, విద్యుత్, ఫోన్ వంటి అభివృద్ధి మౌలిక సదుపాయాలను కల్పించడానికి రోడ్లు అవసరమని ఆయన అంటున్నారు.

రహదారి నిర్మాణ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారికి భద్రత కల్పించడానికని ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపులను ఆ పని అయిపోయాక తీసేస్తున్నారా?

రోడ్డు, వంతెన నిర్మాణ పనులు పూర్తయక ఖాళీ చేసిన నాలుగు క్యాంపులలోని రెండింటిలో, 2018 లో ఖాళీ చేసిన కొండగావ్‌లోని మంజిపారా క్యాంప్, సుక్మాలోని బోరెగుడా క్యాంప్‌లలో సీఆర్‌పిఎఫ్ బలగాలు వున్నాయి. ఇంద్రవతి నదిపై వంతెన నిర్మాణానికి భద్రత కల్పించడానికి 2017 లో బీజాపూర్‌లోని టైమేడ్ దగ్గర నిర్మించిన ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల క్యాంపు, చిత్రకోట్ సమీపంలోని మరో క్యాంపులో వున్న ఛత్తీస్‌గఢ్ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ 2020 లో ఖాళీ చేశారు అని ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ చెప్పారు.

ఏదేమైనా, రహదారి ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత ఈ ప్రాంతంలో నిర్మించిన అనేక ఇతర క్యాంపులు అలానే ఉన్నాయి. ఉదాహరణకు, బాసగూడ - సిల్‌గేర్ మధ్య 35 కిలోమీటర్ల విస్తీర్ణంలో, ప్రతి 7 కిమీకి ఒకటి చొప్పున నిర్మించిన ఐదు క్యాంపులు అలాగే వున్నాయి.

ఈ క్యాంపుల్లో ఎంత మంది సిబ్బందిని నియమించారనే విషయాన్ని చెప్పడానికి సుందర్‌రాజ్ నిరాకరించారు. సాధారణంగా, ఈ ప్రాంతంలోని పారా మిలటరీ క్యాంపులో సగటున 200 మంది భద్రతా సిబ్బంది కంటే తక్కువ వుండరు, అంటే ఈ చిన్న విస్తీర్ణంలో పోలీసు-పౌర నిష్పత్తి, భారతదేశంమొత్తంలోనే అత్యధికంగా ఉంది.

ఎక్కువగా దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కేంద్ర పారామిలిటరీ సిబ్బందికి స్థానిక సముదాయాల భాష, సంస్కృతి గురించి తెలియదు కాబట్టి, వారిని అనుమానంతో, శత్రుత్వంతో చూస్తారు. తత్ఫలితంగా, గ్రామస్తులు సెక్యూరిటీ క్యాంపులను నిఘా, హింసా స్థలాలుగా చూసి భయపడతారు. రహదారుల నిర్మాణానికి వారి వ్యతిరేకత ఈ క్యాంపులపై ప్రతిఘటనతో ముడిపడి ఉంది.

ప్రాంత ఆధిపత్యం


అభివృద్ధి ప్రయోజనాల కోసం రహదారులు నిర్మిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అంటుండగా, వామపక్ష ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ రోడ్ సంధాన కార్యక్రమ ప్రాధమిక లక్ష్యం అధికారిక పత్రాల ప్రకారం,, ʹవామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గుర్తించిన రహదారుల నిర్మాణం / అప్‌గ్రేడ్ చేయడం ద్వారా నిరాటంకమైన సంధానం, ప్రాంత భద్రత, ప్రాంత ఆధిపత్యంతో పాటు భద్రతా దళాలు సజావుగా సాగడంʹ.

కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం కింద, ఛత్తీస్‌ఘడ్‌కు 2016- 2020 మధ్య 2,479 కిలోమీటర్ల రహదారులను నిర్మించడానికి రూ. 1,637 కోట్లు మంజూరు అయింది. ఈ నిధులు పొందిన 35 జిల్లాల్లో, ఛత్తీస్‌గఢ్‌‌లో 16 వుండగా, వాటిలో ఏడు బస్తర్ డివిజన్‌లో ఉన్నాయి.

ఈ పత్రం ప్రకారం,ఈ రహదారులను, " రాష్ట్రాల హోం మంత్రిత్వ విభాగాలు, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పాల్గొన్న భద్రతా దళాలతో సంప్రదించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ" గుర్తించింది.

అభివృద్ధి ప్రాజెక్టుల కోసం షెడ్యూల్డ్ ప్రాంతాలలో, ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా ప్రభావితమైన వ్యక్తులను తిరిగి స్థిరపరచడానికి లేదా పునరావాసం కల్పించడానికి ముందు గ్రామసభ లేదా పంచాయతీని సంప్రదించాలని ʹ పంచాయతీ (షెడ్యూల్డ్ ప్రాంతాలు) చట్టంలోని సెక్షన్ 4 (i) ఆదేశించినప్పటికీ, "గ్రామాలు, అడవుల ద్వారా రహదారులు నిర్మిస్తున్నపుడు అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరపడానికి ఇటువంటి విధానం తక్కువ అవకాశాన్ని ఇస్తుంది"

సంప్రదింపులు లేకపోవడం

1996 లో ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన నియమాలను యింకా రూపొందించని నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ ఒకటి. 2018 లో అసెంబ్లీ ఎన్నికలకు విడుదల చేసిన తన మ్యానిఫెస్టోలో, ముఖ్యంగా షెడ్యూల్డ్ V, ఆదివాసి ప్రాంతాలలో పెసా చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కానీ రెండున్నర సంవత్సరాల తరువాత కూడా చేయలేదు.

"గ్రామసభలు లేకుండా గ్రామ భూమిని జప్తు చేయడం పెసా చట్టాలను ఉల్లంఘించడం" అని ఆదివాసీ మహాసభ నాయకుడు మనీష్ కుంజాం అన్నారు. "ఆదివాసీ హక్కులను గౌరవిస్తామని, పెసా చట్టాన్ని రూపొందిస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వెళ్ళిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా పెసా నియమాలను రూపొందించడం ముఖ్యమైనుకోలేదు."

దంతేవాడలోని పొటాలి గ్రామంలో భద్రతా శిబిరం ఏర్పాటు చేయడాన్ని ఇటీవల చట్టబద్ధంగా సవాలు చేసిన ఆదివాసీ కార్యకర్త సోని సోరి ʹప్రజలను సంప్రదించడానికి రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నప్పుడు, రాష్ట్రం తన విధుల నుండి ఎందుకు దూరంగా ఉంది? గ్రామాల్లోని ఆదివాసీలు నిరక్షరాస్యులు కావచ్చు, కాని వారికి మంచి, చెడు ఏమిటో అర్థం చేసుకునేంత తెలివిగలవారుʹఅని అంటున్నారు.

స్థానిక నివాసితులతో సంప్రదింపులు జరగనప్పుడు, దాదాపు ప్రతి క్యాంపు, రహదారి నిర్మాణ ప్రాజెక్టులు ఒకే లక్షణ నమూనాను చూశాయి: గ్రామస్తులు పెద్ద సంఖ్యలో శాంతియుతంగా నిరసనలు, తరువాత పోలీసులు లాఠీ ఛార్జ్, నిరసనకారుల ఆగ్రహం, చివరకు యధేచ్చగా చేసే అరెస్టులు, వారిని మావోయిస్టు కార్యకర్తలుగా ప్రకటించడం.
అన్ని పెసా చట్టాలన్నీ గ్రామస్తులను సంప్రదించాలని వుండగా అలా ఎందుకు చేయడం లేదు ? "ఏ ఒక్క గ్రామస్తుడూ తమ గ్రామంలో క్యాంపుని ఏర్పాటు చేయడానికి అంగీకరించడం లేదు. కానీ ఒకసారి స్థాపించాక మావోయిస్టుల నుండి వారికి మరింత భద్రతను కల్పించడమే కాకుండా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి ఎంపిక, ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర సమయాల్లో ప్రయాణించే సౌలభ్యంతో సహా అభివృద్ధిని కూడా తీసుకువస్తాయనే వాటి ప్రయోజనాన్ని గ్రహిస్తారని మాకు తెలుసు." అని సుందర్రాజ్ అన్నారు.

రోడ్లు, క్యాంప్ ల నిర్మాణం గురించి ఆందోళన చెందుతున్న మావోయిస్టులు ఈ నిరసనాలను ప్రేరేపిస్తున్నారని కొట్టిపారేస్తూ, "వారి ఉద్యమం పరిమితమైపోయింది, గ్రామాల నుంచి రిక్రూట్ మెంట్ తగ్గిపోయిందిʹ అని సుందర్రాజ్ చెప్పాడు. గ్రామస్తులు కావాలని కోరుకుంటున్నందున నెలాస్నర్ సమీపంలో నిర్మించిన కొడోలి క్యాంపును ఉపసంహరించుకోలేము అని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ అంటున్నారు.

గ్రామస్తులు ఏమంటున్నారు?

కానీ బీజాపూర్‌లోని అత్యధిక గ్రామస్తులు తమ ప్రయోజనం కోసం రోడ్లు నిర్మిస్తున్నారనే వాదనను ఒప్పుకోవడం లేదు. మేము ఫిబ్రవరిలో రహదారి నిర్మాణంపై అనేక నిరసనలు జరిగిన బీజాపూర్ జిల్లాలోని గంగలూరు బ్లాక్‌కు వెళ్లాము. 2020 డిసెంబరులో 15 గ్రామ పంచాయతీల నుండి 5,000 మంది గ్రామస్తులు బ్లాక్ ప్రధాన కార్యాలయానికి శాంతియుతంగా ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్‌కు పిటిషన్ ఇచ్చారు.

ర్యాలీని పోలీసులు అడ్డుకున్నప్పుడు, చెక్క దిమ్మలపై తీసుకువెళుతున్న గ్రామ దేవతలు నేలమీద పడటంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. భద్రతా సిబ్బందికి చెందిన ఒక వ్యక్తి గాయపడ్డారు. కొన్ని గంటల్లోనే, ఒక పెద్ద పోలీసు బృందం వచ్చి ప్రజలపై లాఠిచార్జ్ చేసింది. సాయంత్రం పరిస్థితిని అంచనా వేయడానికి నిరసనకారులు సమావేశమైనప్పుడు, నిరసనలో పాల్గొనడానికి వచ్చిన ముగ్గురు మైనర్లు, గ్రామంలో తన ఒకటిన్నర సంవత్సరాల కూతురును విడిచిపెట్టిన ఒక యువ తల్లితో పాటు, 17 మంది తప్పిపోయినట్లు గుర్తించారు. హత్య, అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశం, నేరపూరిత కుట్ర, ఇతర ఆరోపణలతో వారిని అరెస్టు చేశారు.

గంగలూరు నుండి మిర్తూర్ వరకు 10 గ్రామాల గుండా వెళ్తున్న 51 కిలోమీటర్ల రహదారిని వెడల్పు చేసే నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. గంగలూరు, కొడోలిలో ఇప్పటికే రెండు భద్రతా శిబిరాలు వున్నాయి. ఉన్నత స్థాయి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉన్న బైలాదిలా కొండ శ్రేణి కనిపించే బెచాపాల్ దగ్గర పెట్టబోయే మూడవ క్యాంప్‌ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. 1960 ల ప్రారంభం నుండి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాంతంలో మైనింగ్ చేస్తోంది.
ప్రాజెక్టు ప్రభావిత గ్రామం పుస్నార్‌ లో నివాసం వుండే దాస్నమోర్, "మేము రోడ్లను వ్యతిరేకించము, మేము కూడా పని కోసం ఆంధ్రాకు, బజార్‌కి వెళ్తాము. అయితే దయచేసి మా పొలాలను, మా చెట్లను నాశనం చేసే, చనిపోయినవారి కోసం మేము వేసిన రాళ్లను తొలగించే విధంగా విస్తృత రహదారులను నిర్మించవద్దు" అని అంటారు.

గంగలూరులో అరెస్టయిన 16 మందిలో వున్న లక్మా తండ్రి, యాభై-ఐదు సంవత్సరాల చాను పునేమ్, "మాకు మా పాత రోడ్లు అవసరం, మమ్మల్ని సమీప బజార్లకు తీసుకెళ్లడానికి బస్సులు, నాలుగు చక్రాల వాహనాలు వెళ్ళే రోడ్లు మాకు చాలు, మా పొలాల మధ్యలో వేస్తున్న 8 మీటర్ల వెడల్పు కొత్త రోడ్లు అవసరం లేదుʹ అన్నారు.

రహదారి వెడల్పు కారణంగా పుస్నర్‌లో సుమారు 20 మంది తమ భూమిని కోల్పోతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. వారి భూమికి పరిహారం ఇస్తే వారు సంతృప్తి చెందుతారా అని అడిగినప్పుడు, గ్రామ నివాసి అయిన మంగూ: ʹమేము శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాము. రహదారి, క్యాంపు లేదా పరిహారం ఏ శాంతినీ కలిగించవు.ʹఅని అన్నారు.
ప్రతిపాదిత భద్రతా శిబిరం ఉన్న ప్రదేశం గురించి తమకు సమాచారం లేదని గ్రామస్తులు చెప్పారు. సాంప్రదాయ గ్రామ పెద్దలను – పటేల్, పెర్మాను కూడా ప్రభుత్వం సంప్రదించాలనుకోలేదు. ప్రధానంగా మావోయిస్టుల బెదిరింపుల కారణంగా, నివసించే అంతర్గత గ్రామాల్లోని చాలా మంది సర్పంచ్‌లలాగానే, పుస్నర్ సర్పంచ్ బీజాపూర్‌లో బ్లాక్ ప్రధాన కార్యాలయంలో నివసిస్తున్నారు. అతను చాలా సంవత్సరాల నుంచి పుస్నర్‌కి రాలేదని గ్రామస్తులు చెప్పారు.

మూడేళ్ల క్రితం నిరసనలు చూసినప్పటికీ బ్లాక్ ప్రధాన కార్యాలయాన్ని బీజాపూర్‌కు అనుసంధానించే 25 కిలోమీటర్ల రహదారి వల్ల సంపర్క, వాణిజ్యం వ్యవ్స్థలు మెరుగుపడ్డాయని గంగలూరు సర్పంచ్ రాజు కల్ము అంటుండగా విన్న ఒక వ్యక్తి, రహదారిపై నడుస్తున్న ప్రైవేట్ వాహనాలను, రహదారి పక్కన వున్న దుకాణాలను ఎక్కువగా ఆదివాసేతరులే నడుపుతున్నారని, వారే ఎక్కువగా రహదారి వల్ల ప్రయోజనం పొందారని చెప్పారు.

ఆరోగ్య సంరక్షణవిషయంలో మాత్రం ప్రయోజనాలు ఉన్నాయనేది గ్రామస్తులు అంగీకరించిన విషయం. సమయానికి అంబులెన్స్ రావడం వల్ల ఒక వారం క్రితం గర్భధారణ దశలో ఉన్న ఒక మహిళ తన బిడ్డను బీజాపూర్ ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవించగలిగింది.

ఏదేమైనా, అధికమవుతున్న శత్రు అర్ధ సైనిక సిబ్బంది ఉనికి వల్ల ప్రయోజనాలు తగ్గిపోయాయని వారు తెలిపారు. "కొత్తగా నిర్మించిన రహదారులపై భారీ సంఖ్యలో భద్రతా దళాల రాకకు మేము మూగ ప్రేక్షకులుగా ఉన్నాము, అడవులను రాత్రిపూట యంత్రాలతో నరికేశారు, విశాల భూ భాగం చుట్టూ కన్సర్టినా వైర్లు ఏర్పాటు చేశారు, క్యాంపు బోర్డు పెట్టారు"అని ఈ ఏడాది జనవరి ప్రారంభంలో బెచాపాల్ శిబిరం ఏర్పాటు చేసిన విధానాన్ని బుగ్గ పునేమ్ వివరించారు.

డిసెంబర్‌లో గంగలూరు నిరసనలో అరెస్టయిన ఎనిమిది మంది మహిళల్లో పునేం కుమార్తె 25 ఏళ్ల శాంతి కూడా ఉన్నది. కోవిడ్ -19 పరిమితుల కారణంగా కుటుంబాలు జైలులో ఉన్న నిందితులను కలవలేకపోతున్నాయి.

అరెస్టుల తరువాత, వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 22 మంది గ్రామస్తుల బృందం డిసెంబర్ 28 న స్థానిక జర్నలిస్టుల సహాయంతో బీజాపూర్ కలెక్టర్‌ను కలిసింది. ప్రతినిధులలో ఒకరైన దస్నామోర్, తాము మరిన్ని భద్రతా శిబిరాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వివరించడానికి ప్రయత్నించామని చెప్పారు : ʹమేము మా ఇష్టానుసారం అడవుల్లో తిరగలేము. మహువా పువ్వులు ఏరుకుంటున్నప్పుడో లేదా పొలాలలో పని చేస్తున్నప్పుడో మమ్మల్ని బలగాలు ఎత్తుకెళ్ళిపోయి, మావోయిస్టులకు మద్దతు ఇస్తున్నట్లు మాపై ఆరోపణలు మోపుతాయి. ʹ

తమ దైనందిన జీవితానికి భద్రతా శిబిరాలు భంగం కలిగిస్తున్నాయని, మహిళలు, బాలికలని లైంగిక వేధింపులకు లక్ష్యంగా చేస్తున్నారనీ ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు పాఠశాలకు వెళ్లే పిల్లలతో సహా 17 మంది నిరసనకారులను విడుదల చేయాలని అభ్యర్థించారు. ముగ్గురు మైనర్లకు రెండు నెలల తరువాత బెయిల్ ఇవ్వగా, మిగతావారు ఇంకా జైలులో ఉన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని జిల్లా కలెక్టర్ హామీ యిచ్చినప్పటికీ, మరింత అధిక భద్రతా దళాల పర్యవేక్షణలో పున:ప్రారంభించటానికి ముందు రహదారి నిర్మాణం ఒక రోజు మాత్రమే ఆగింది అని గ్రామస్తులు చెప్పారు.
వ్యక్తిగతంగా పరిస్థితిని అంచనా వేయడానికి మరుసటి రోజు తాను పుస్నార్‌కు వెళ్ళానని, అయితే మావోయిస్టులు పేలుడు ఘటన జరపడంతో వెనక్కు తిరిగి రావాల్సి వచ్చిందని బీజాపూర్ కలెక్టర్, రితేష్ కుమార్ అగర్వాల్ అంటున్నారు.
మైనింగ్ కార్యకలాపాలు

సహజ వనరులను బయటకు తీసుకెళ్ళేందుకు ఉద్దేశించినవే రహదారులు అనే అనుమానం ఈ ప్రాంతం అంతటా ఉంది.
"రహదారి మా కోసం నిర్మించబడలేదు అనే విషయం మాత్రం స్పష్టం" అని దాస్నామోర్ వ్యంగమైన చిరునవ్వుతో అన్నాడు. గంగలూరులోని రహదారి ద్వారా బైలాదిల శ్రేణిలోని డిపాజిట్ నెంబర్ 10 నుండి ఇనుప ఖనిజాన్ని రవాణా చేయవచ్చు.
2016 నుండి చోటా డోంగర్ ప్రాంతంలో ఇనుప ఖనిజ తవ్వకాలు చేస్తున్న జైస్వాల్ నెకో లిమిటెడ్‌కు తన మైనింగ్ కార్యకలాపాలను సంవత్సరానికి 0.05 మిలియన్ టన్నుల నుండి 2.95 మిలియన్ టన్నులు చేయడానికి యిచ్చిన అనుమతికి నిరసనగా నారాయణపూర్ జిల్లాలో దాదాపు 5,000 మంది గ్రామస్తులు నవంబర్లో ప్రదర్శనను నిర్వహించారు.
స్థానికులు పవిత్రంగా భావించే అమ్దై ఘాటి కొండ పైన కడెమెట దగ్గర గని రక్షణ కోసం ప్రభుత్వం భద్రతా శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

అనేక రోజుల నిరసనల తరువాత, ఈ ఏడాది జనవరి ప్రారంభంలో, గ్రామస్తులతో పాటు సర్వ ఆదివాసీ సమాజ్, సంయుక్త్ సంఘర్ష్ సమితి, కార్యకర్త సోని సోరి, న్యాయవాది బేలా భాటియా, జిల్లా పరిపాలనా యంత్రాంగం, పోలీసులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు ఈ ప్రాంత సాంస్కృతిక ప్రాముఖ్యత, వారి జీవనశైలి, అడవితో వున్న సంబంధాన్ని వివరించారు. జిల్లా కలెక్టర్ వారి సమస్యలను ప్రభుత్వంతో చర్చిస్తానని, అప్పటి వరకు మైనింగ్ పనులు ప్రారంభం కావని వారికి హామీ ఇచ్చారు. మైనింగ్ పనులు ప్రారంభించనప్పటికీ, భద్రతా శిబిరం మాత్రం అక్కడే వుంది. 31 కిలోమీటర్ల చోటా డోంగర్-ఓర్చా రహదారి ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.

సుదీర్ఘమైన ప్రతిష్టంభన

బీజాపూర్ జిల్లాలోని బాసగూడ నుండి 12 కిలోమీటర్లు, సుక్మా జిల్లాలోని జాగర్గుండ నుండి 14 కిలోమీటర్ల దూరంలో వున్న సిల్‌గేర్ గ్రామంలో వివాదాస్పద క్యాంప్ ఉంది. బాసగూడ -జగర్గుండ మార్గం ఒకప్పుడు వాణిజ్య, వ్యాపారాల నాడీ కేంద్రంగా ఉండేది. రెండు జిల్లాల మధ్యనూ, పొరుగున ఉన్న మహారాష్ట్రకు భద్రకాళి, భోపాలపట్నం మీదుగానూ, డోర్నపాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వరకు బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ప్రయాణీకులను, వస్తువులను రవాణా చేసేవి.

కానీ 2005 లో సల్వాజుడుమ్ తరువాత ఈ మార్గం దుర్గమమైంది. మావోయిస్టులను ఎదుర్కోవటానికి రాజ్య ప్రాయోజిత సాయుధ పౌర అప్రమత్త ఉద్యమం (armed civilian vigilante movement), మావోయిస్టులకు సురక్షితమైన ఆశ్రయాలుగా పరిగణించబడే గ్రామాల్లోని యిళ్లను తగలబెట్టింది. సుక్మాను డోర్నపాల్ మీదుగా, దంతేవాడను అరన్పూర్ మీదుగా, బీజాపూర్‌ను బాసగుడ మీదుగా కలిపే ట్రై-జంక్షన్ (మూడు రోడ్ల కూడలి)వద్ద ఉన్న జాగర్గుండ గ్రామాన్ని జుడుమ్ క్యాంప్‌గానూ, సిఆర్పిఎఫ్ కోటగానూ మార్చారు. ప్రతిస్పందనగా, మావోయిస్టులు ఈ ప్రాంతంలోకి అన్ని వాహనాల కదలికలను అడ్డుకున్నారు. మార్గం వెంట వున్న దాదాపు వంద గ్రామాలు దీనిని నడక మార్గంగా ఉపయోగించుకొంటున్నాయి.

దశాబ్ద కాలంగా రహదారిని పునర్నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, రహదారి నిర్మాణ కార్యకలాపాలు 2017-18లో మాత్రమే ప్రారంభమయ్యాయి. పాత రోడ్డుని 8 మీటర్ల వెడల్పు గల రెండు-మార్గాల రహదారిగా నిర్మించడం ప్రారంభించారు. మావోయిస్టు బలమైన ప్రాంతాల గుండా రహదారి పోతుంది కాబట్టి , ప్రతి 5-7 కిలోమీటర్ల దూరంలో కేంద్ర పారామిలిటరీ శిబిరాలను ఛత్తీస్‌గఢ్ పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ స్థానిక కాల్బల సైనికుల (foot soldiers) సహాయంతో ఏర్పాటు చేశారు.

డోర్నపాల్ నుండి జగర్గుండ వరకు వున్న 58 కిలోమీటర్ల విస్తీర్ణంలో, ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇప్పటికే 11 శిబిరాలు ఉన్నాయి. ఇవి పూర్తయ్యే దశకు చేరుకోవడానికి 2012 నుండి తొమ్మిది సంవత్సరాలు పట్టింది. ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం డేటా ప్రకారం, 2012 నుండి 2020 మధ్య, పోలీసులు 87 మంది సిబ్బందిని కోల్పోయారు, వీరిలో 25 మంది బుర్కాపాల్ సమీపంలో మావోయిస్టు ఆకస్మిక దాడిలో మరణించారు. పోలీసు ఇన్ఫార్మర్లుగా ఎనిమిది మంది పౌరులను మావోయిస్టులు చంపారు, 34 మంది మావోయిస్టు కార్యకర్తలను అరెస్టు చేశారు, 50 పేలుడు పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు డేటా చూపిస్తుంది. అయితే రహదారి వెడల్పు చేయడం కోసం ఎంత మంది ప్రజలు తమ భూమిని కోల్పోయారు, ఎన్ని చెట్లను నరికివేశారు అనే రికార్డులు అందుబాటులో లేవు.

మరొక వైపు, బాసగూడ నుండి సిల్‌గేర్ వరకు 35 కిలోమీటర్ల విస్తీర్ణ రహదారి నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడు, సిల్‌గేర్, జగర్గుండ మధ్య 14 కిలోమీటర్లు మాత్రమే నిర్మించాల్సి ఉంది.

మే 13న సిల్‌గేర్‌లో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. గర్భిణీ స్త్రీ, తొక్కిసలాటలో చిక్కుకుని, గాయాల పాలై ఐదు రోజుల తరువాత మరణించింది. ఒక నెల తరువాత, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం భద్రతా శిబిరాన్ని ఉపసంహరించుకోవటానికి, రహదారి నిర్మాణాన్ని ఆపడానికి ఇష్టపడకపోవడంతో, నిరసన కొనసాగుతోంది.

(scroll.in సౌజన్యంతో)

Keywords : CRPF, Chattis garh, camps, adivasi, Silger protest taps into wider anger in Bastar over security camps coming up in the name of roads
(2022-08-10 06:15:49)No. of visitors : 1586

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

పోలీసు నిర్బంధాల మధ్య... 17మంది సర్కేగూడ అమరుల స్తూపావిష్క‌రణ - భారీ బహిరంగ సభ

ఈ హత్యాకాండ ఆపాలని, ఆ 17 మందిని హత్య చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ అమరులను స్మరించుకుంటూ సర్కేగూడాలో వాళ్ళు చనిపోయిన రోజైన జూన్ 28న భారీ బహిరంగ సభ జరిగింది.

Search Engine

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
more..


బస్తర్