అభయ్ పేరిట విడుదలైన ప్రకటనకు జంపన్న జవాబు

అభయ్

20-06-2021

రెండు రోజుల క్రితం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన ఓ ప్రకటనలో జంపన్నపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై జంపన్న స్పంధించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

జంపన్నవిడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

మావోయిస్ట్ పార్టీ అభయ్ పేర జూన్ 18 వ తేదీన విడుదల అయిన ప్రకటనలో జంపన్న పై హేళన లతో, నిరాధార ఆరోపణ లతో, అప్రజాస్వామికంగా, హెచ్చరికలతో కూడిన దాడి ని ఖండిస్తున్నా ను.
అభయ్ పేరుతో ఇచ్చిన ప్రకటన వారిదా కాదా అనే సంశయం,క్లారిటీ కానీ స్థితిలో జవాబు రాస్తున్నాను.
అభయ్ ప్రకటనలో జంపన్న పై ఈ విధంగా వుంది."విప్లవ రాజకీయాల నుండి హీనాతి హీనంగా దిగజారి పోయిన జంపన్న కు విప్లవరాజకీయాలపై, మా పార్టీపై మాట్లాడటానికి కనీస నైతిక అర్హత కూడా లేదని మా పార్టీ ఈ సందర్భంగా మరో సారి స్పష్టం చేస్తోంది. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్న చీటికి మాటికీ పోలీసుల కథనాలకు వంత పాడుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాం."

అభయ్ పత్వాకు నా జవాబు.

నేను నేర్చుకున్న సైద్ధాంతిక రాజకీయ అవగాహన, ఉద్యమ పాఠాలు నా వర్గ దృక్పథం, మొదటి నుండి విమర్శనాత్మకంగా వుండే నా స్వేచ్ఛాయుత మైన దృక్పథం తో మాత్రమే గత 2 యేండ్ల కు పైగా ఇంటర్వ్యూ లు,సోషల్ మీడియా లో చేస్తున్న కామెంట్లు. జంపన్న ఇంటర్వ్యూ ల్లో కామెంట్లలో మావోయిస్ట్ ఉద్యమం పై మాత్రమే కాకుండా వివిధ సామాజిక రాజకీయ సమస్యల పై ,వివిధ ప్రముఖ ఘటన ల పై,వివిధ పార్టీ ల వైఖరుల పై ,అప్రజాస్వామిక చర్యల పైన అనేకం వున్నాయి. వీటి పై వీక్షకులు, పాఠకులు గమనిస్తూ తమ స్పందనలు తెలియ చేస్తున్నారు. వీరెవ్వరికి జంపన్న పోలీసులకు వంత పాడు తున్న విషయం దృష్టి కి రాలేదు.

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కి తప్పు గా అర్థం అవుతున్నప్పుడు ప్రజా స్వామిక పద్దతి లో ఎత్తి చూపవచ్చు విమర్శ చేయవచ్చు . వివిధ పార్టీ ల రాజకీయాల పై అనేక మంది అనేక రకాలు గా వ్యాఖ్యానించడం ,మావోయిస్ట్ పార్టీని సైతం విమర్శించడం సమాజం లో సాధారణము గా జరుగుతున్నదే. విమర్శ లకు వ్యాఖ్యానాల కు జవాబు లు వుంటాయి. ప్రతి వ్యాఖ్యానాలు వుంటాయి కానీ అభయ్ ప్రకటన లో బెదిరింపులు, నిషేధాలు, ముద్రలు వున్నాయి. ఇది ప్రజా స్వామిక అవగాహన కాదు నియంతృత్వ పోకడ మాత్రమే అవుతుంది.మీరు నాపై ఇచ్చిన ప్రకటనకు సాధారణ ప్రజల్లో గానీ ప్రజాస్వామిక వాదుల్లో గానీ, విప్లవాభిమానుల్లో గానీ మద్దతు లేదు.ఆశ్చర్యం తో కూడిన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
నూరు పూలు వేయి ఆలోచనలతో బావాలు సంఘర్షించాలనే గొప్ప సూక్తి ని నిజ జీవితం లో ఎత్తి పట్టండి.నూతన ప్రజాస్వామ్యం అనే వారు ప్రజాస్వామ్యం ఆచరించి ఆదర్శం కండి.

నా ఇంటర్వ్యూ ల్లో వివిధ సోషల్ మీడియా కామెంట్లలో మావోయిస్ట్ పార్టీ కి సంబంధించి అనేక విషయాల్లో స్పష్టీకరణ తో కూడిన విషయాలు మాత్రమే ప్రధాన మైనవి. విధాన పరమైన విషయానికి వస్తే భారత సమాజం నేడు భూస్వామ్య వ్యవస్థ ఆధిపత్య స్థానం లో లేదని, పెట్టుబడి వ్యవస్థ మాత్రమే ఆధిపత్య స్థానంలో నిర్ణయాత్మక స్థానం లో వుందని దానికి తగిన విధంగా తమ లైన్ మార్చు కోవాలని వివిధ ఇంటర్వ్యూ ల్లో చెప్పినాను.అర్ధ భూస్వామ్య వుందని బావించే వివిధ పార్టీ లు కూడా దేశం లో వున్నాయి.నేను మాట్లాడే విషయం వారికి కూడా వర్తిస్తుంది.సైద్ధాంతిక విమర్శ లకు సైద్ధాంతిక జవాబు మాత్రమే తోడ్పడుతుంది. సైద్ధాంతిక మైన విభేదాలు ప్రజాస్వామిక పద్దతి లో చర్చ ద్వారానే కానీ హేళన తో చీప్ కామెంట్లతో పరుష పదజాలంతో శత్రు పూరితంగా చూసే వైఖరి మిత్రుల ను దూరం కొట్టేదే.తమను తాము ఒంటరి చేసుకునేది మాత్రమే అవుతుంది.

ఒక పార్టీని విడిచి పెట్టినంత మాత్రాన తదనంతర ము రాజ్యం తో వారి వైఖరి తో సంబంధం లేకుండా, లేదా పై పై విషయాల పై ఆధారపడి ద్రోహులు అనడం పూర్తిగా sectarian జడ్జుమెంటు మాత్రమే. ఆయుధాలు పట్టుకొని త్యాగాలు చేసినంత మాత్రాన ఇష్టాను సారమైన సంకుచిత మొరటు తీర్పులు ఇవ్వడం మార్క్సిజం కాదు.ప్రజా పంథా కాదు. అర్థం చేసుకోవడం లో వున్న భ్రమలు,పై పై విశ్లేషణ తప్పుడు నిర్ణయాలకు కారణమవుతుంది.పిడి వాద మూస రొడ్డ కొట్టుడు పదజాలం పనికి రాని కొలతలు, ప్రజలను మిత్రులను ఐక్యం చేయకుండా దూరం కొట్టడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది.ఇలాంటి పద్దతులను ప్రజలు మిత్రులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ని లోతుగా సమీక్షించుకోవాలి.

గత మీ ఘనమైన ఉద్యమ చరిత్ర పలితంగా,ఇప్పటికీ మీరు చేస్తున్న త్యాగాలకు నేటి సమాజం లో మీకు గొప్ప స్థానం ఇప్పటికీ వుంది కానీ దేశం లో అనేక మైన ప్రజా సమస్యల పరిష్కారానికి గత 2 దశాబ్దాలకు పైగా మీ కార్యాచరణ ఏమి లేక విశాల ప్రజా రాశులకు దూరమైన విషయం గత కొన్ని సంవత్సరాలుగా మీకు అర్థం అవుతున్నప్పటికీ వాటిని దాట వేస్తూ కాలం గడపడం భారత పీడిత ప్రజలను నిరాశ పరస్తున్నది.

నేడు దేశంలో సకల సమస్యలకు మూల కారణమైన పెట్టుబడి దారీ వ్యవస్థ అంతానికి మీ శక్తి యుక్తుల తో నిజమైన ప్రజా దాడి ని ఎక్కుపెట్టండి. నిజమైన శత్రువులను గుర్తించి వేరు చేయండి.అన్ని రకాల మిత్రులతో కలిసి నడవండి.విశాల ప్రజలకు నాయకత్వం అభివృద్ది చేయండి.కాలం చెల్లిన పాత పోరాట నిర్మాణ రూపాల తో కాకుండా దేశంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలతో మమేకం కండి.విశాలమైన ప్రజా ఉద్యమం నిర్మించడానికి కలిసి వచ్చే మిత్రుల కోసం కేంద్రక రించండి.
June 20/2001
జంపన్న

Keywords : cpi maoist, abhay, jampanna, Telangana
(2024-04-07 19:12:32)



No. of visitors : 3651

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అభయ్