సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న‌ భారీ ర్యాలీకి ప్రణాళిక‌


సిల్గర్ పోలీసు క్యాంపు ముందు వేల మందితో కొనసాగుతున్న నిరసన - జూన్ 27-29న‌ భారీ ర్యాలీకి ప్రణాళిక‌

సీఆర్పీ ఎఫ్ క్యాంపును ఎత్తివేయాలంటూ, కాల్పులు జరిపి నలుగురు ఆదివాసులను పొట్టన పెట్టుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో చత్తీస్ గడ్ లో ఆదివాసులు చేస్తున్న పోరాటం ఉదృతమైంది. సిల్గర్ లోని క్యాంపు వద్ద నిన్న కూడా వేల మంది ఆదివాసులు ప్రదర్శన నిర్వహించారు. తమపై ఎన్ని సార్లు దాడులు జరిగినా మొక్కవోని ధీక్షతో ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు.

భీజాపూర్ జిల్లా సిల్గర్ లో ఏర్పాటు చేసిన సీఆర్పీ ఎఫ్ క్యాంపుకు వ్యతిరేకంగా మే 13 నుండి శాంతియుత ప్రదర్శ్న మొదలు పెట్టిన ఆదివాసులపై 17 వ తేదీన పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు ఆదివాసులు అక్కడికక్కడే చనిపోగా పోలీసుల దాడిలో గాయపడ్డ ఓ గర్భవతి వారం రోజుల తర్వాత మరణించింది. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఆదివాసులు మరింతగా సమీక్రుతమయ్యారు. దాదాపు పదివేల మంది ఆదివాసులు రోజుల తరబడి అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. అయితే కొఈ ఉద్యమాన్ని దెబ్బ కొట్టడానికి చత్తీస్ గడ్ కాంగ్రెస్ ప్రభుత్వ‍ అనేక కుట్రలకు తెరలేపింది. ఈ సంఘటనపై విచారణకు పలువురు ఎమ్మెల్యేలతో విచారణ జరిపించి న్యాయం చేస్తామని ఉద్యమం ఆపేయాలని ఆదివాసులపై ఒత్తిడి తెచ్చింది. అయితే ఆ కమిటీ ఆ ప్రాతంలో పర్యటించి ఆదివాసులతో మాట్లాడింది కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు బైట పెట్టలేదు. కాల్పులకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోలేదు. పైగా క్యాంపు ఎత్తివేత గురించికానీ పోలీసులపై చర్యల గురించి కానీ ముఖ్యమంత్రి కనీసం మాట్లాడక పోగా ఆ సంఘటన దురదృష్టకరమంటూ ఓ ప్రకటన చేయడం ఆదివాసులను మరింత రెచ్చగొట్టింది.

అనంతరం పోలీసులు మళ్ళీ నిరసన తెలియజేస్తున్న ఆదివాసులపై వారం రోజులకు పైగా ప్రతి రోజూ లాఠీచార్జ్ చేసి అక్కడి నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దెబ్బలు తిన్నా పట్టు వ‌దలని ఆదివాసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు పారి పోయి మళ్ళీ కొద్ది సేపట్లోనే అక్కడికి వచ్చి బైటాయించేవాళ్ళు. అలా పది వేల మంది కాస్తా వేయి మందికి తగ్గిన ప్రజలు మళ్ళీ మెల్లెగా ఐదు వేలు...నిన్నటికి పది వేలకు చేరుకున్నారు.

క్యాంపు ఎత్తి వేసే వరకు తమ పోరాటం ఆపబోమంటున్న ఆదివాసులు ఈ నెల 27 నుండి 29 వరకు భారీ ర్యాలీ, ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. అందుకోసం వందల గ్రామాల నుండి ప్రజలు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

(చత్తీస్ గడ్ కు చెందిన Ashutosh Bhardwaj తదితర జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఈ రిపోర్టు రాయబడింది. వీడియో Ashutosh Bhardwaj ట్విట్టర్ అకౌంట్ నుండి....)

Keywords : chattis garh, silger, adivasi, protests,
(2023-09-28 21:57:26)



No. of visitors : 1446

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


సిల్గర్