అడ్డగూడూరు లాకప్ డెత్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి - POW

అడ్డగూడూరు

యాదాద్రి భవనగిరి జిల్లా అడ్డగూడూరులో మరియమ్మ అనే దళిత మహిళను చిత్ర హింసలు పెట్టి చంపేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం నాయకురాలు సంధ్య తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసిన ప్రకటన‌


ఖమ్మం జిల్లా చింతకాని వాసీ నిరుపేద దళిత మహిళ మరియమ్మను హింసించి కొట్టి చంపిన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పోలీసులను కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.
మరియమ్మ అనే మహిళ ఖమ్మం జిల్లా, ఇల్లందు ముకుందాపురం నివాసి. ఆమె తెలిసిన బంధువుల ద్వారా అడ్డగూడూర్ మండలం, గోవిందాపురం గ్రామం (కమ్మగూడెం) యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న చర్చి ఫాదర్ ఇంటిలో పనికి కుదిరింది. తనతో పాటు తన కుమారుడు ఉదయ్ కూడా వెంట ఉంటున్నాడు. ఇటీవల చర్చి ఫాదర్ ఏదో పనిపై ఊరికి వెళ్లగా, ఆయన తిరిగి గోవిందాపురం వచ్చేసరికి మరియమ్మ తన ఊరికి వెళ్లింది. ఆ తర్వాత చర్చి ఫాదర్ తన ఇంటిలో రెండు లక్షల రూపాయలు దొంగతనం జరిగిందని, మరియమ్మ సమాచారం ఇవ్వకుండానే సొంత ఊరికి వెళ్ళింది కనుక తనే ఈ రెండు లక్షలు తీసి ఉంటుందని ఆరోపణ చేసాడు. ఈ ఆరోపణ మేరకు మరియమ్మను పిలువగానే వచ్చింది. ఆ డబ్బులు తను తీసుకు వెళ్లలేదని, తనకు ఏ పాపము తెలియదని అందరినీ ప్రాధేయపడి మరీ చెప్పిందట. మరియమ్మ ఊరికి వెళ్లడానికి ముందు చర్చి ఫాదర్ అనుమతి కూడా తీసుకునే వెళ్లామని పదిమంది ముందు ఆమె చెప్పినట్టు జనం చెబుతున్నారు. గతంలో కూడా ఎప్పుడూ తాము అనుమతి లేకుండా వెళ్లలేదని, ఫాదర్ అనుమతి ఇచ్చినాడు కనుకనే ఊరికి వెళ్తున్నామని మిగతా చర్చి పని వారికి కూడా చెప్పినది. మరియమ్మ నెత్తీనోరు మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చర్చి ఫాదర్ మరియమ్మనే డబ్బు తీసిందని ఫిర్యాదు చేశారు. చర్చి ఫాదర్ ఫిర్యాదు ఆధారంగా మరియమ్మను అడ్డగూడూరు పోలీసులు పిలిచి తీవ్రంగా కొట్టారని అడ్డగూడూరు స్థానిక ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. జూన్ 15 న మరియమ్మను గోవిందాపురం పిలిపించి 18 వ క్తేదీన పోలీసులకు అప్పజెప్పినారని ప్రజలు చెబుతున్నారు.
తల్లిని కొడుతుండగా కుమారుడు ఉదయ్ కొట్టవద్దని వారించబోగా అతనిని, ఉదయ్ స్నేహితుడు శంకర్ ను కూడా కొట్టారని వారు చెబుతున్నారు. వీరిద్దరు కూడా పోలీసులు కొట్టిన తీవ్రమైన దెబ్బలతో హాస్పిటల్ లో చేరి ఆందోళనకర స్థితిలో ఉన్నారు. దెబ్బలు తగిలి పోలీస్ స్టేషన్ లోనే కుప్పకూలిన మరియమ్మను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళగా సీరియస్ అని చెప్పడంతో భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరియమ్మ చనిపోయిందని చెప్పారు. "మా అమ్మ అ పోలీసు కొట్టిన దెబ్బలకే చనిపోయిందని" ఉదయ్, అతని మిత్రుడు చెబుతున్నారు.
మరియమ్మ మరణం పై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి లాకప్ మరణాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నది.
అడ్డగూడూర్ లో మరియమ్మ లాకప్ హత్యపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి.
మరణానికి కారకులైన వారందరిని కేసును తారుమారు చేయకుండా తక్షణమే అరెస్ట్ చేయాలి.
మరియమ్మను అమానుషంగా కొట్టి, ఆమె చావుకు కారకులైన పోలీసులను ఉద్యోగాల నుండి తొలగించాలి.
నిరుపేద రాలైన మరియమ్మ పై అక్రమ కేసు బనాయించిన చర్చి ఫాదర్ ను తక్షణమే అరెస్టు చేసి ఖఠినంగా శిక్షించాలి.
మరియమ్మ కుటుంబానికి రూ. 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి.
మరియమ్మ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
భువనగిరిలో మరియమ్మ లాకప్ డెత్ ను నిరసిస్తూ ప్రదర్శన చేసిన వారిపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
నేరస్తులను కఠినంగా శిక్షిస్తూ, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో లాకప్ డెత్ లు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఎన్ కౌంటర్లు, లాకప్ హత్యలు లేని తెలంగాణ కోసం పోరాడుదాం.

Keywords : yadadri district, addaguduru, police station, lockup death, dalit women, mariyamma, POW,
(2024-03-26 00:20:38)



No. of visitors : 1366

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అడ్డగూడూరు