రమాకాంత్ అమర్ రహే! ఈ విప్లవ యోధుడి అమరత్వానికి ఇరవై ఐదేళ్లు...

రమాకాంత్

23-06-2021

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం మొదలు పెట్టారు. లోపల ఉన్నది ఒకే ఒక వ్యక్తి అతను తేరుకొని ఆత్మరక్షణ కోసం తన దగ్గరున్న తుపాకీతో కాల్పులు మొదలు పెట్టాడు. ఓ సీఐ, ఓ కానిస్టేబుల్ చని పోయారు. అతన్ని ఎదుర్కోవడం 500 మంది పోలీసులకు, 500 తుపాకులకు, వేలాది తూటాలకు సాధ్యం కావడం లేదు.

పోలీసులు దుర్మార్గమైన కుట్ర పన్నారు. కొందరు పోలీసులు డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని ఆ ఇంటి పైకి ఎక్కారు. ఆ ఇంటి స్లాబుకు డ్రిల్లింగ్ చేసి రంద్రం చేశారు. అందులోనుండి లీటర్ల కొద్దీ పెట్రోల్ కుమ్మరించారు. అగ్గి పుల్ల గీసి విసిరేశారు. బయట నిలబడి చూస్తున్న వేలాది ప్రజలకు మంటల్లో తగలబడిపోతున్న ఆ వ్యక్తి ఇస్తున్న విప్లవం వర్ధిల్లాలనే నినాదాలు వినబడుతున్నాయి. కొందరు ఏడుస్తున్నారు.... కొందరు పోలీసులను, చంద్రబాబును శాపనార్దాలు పెడుతున్నారు.... మరి కొందరు విప్లవ నినాదాలిస్తున్నారు... అక్కడున్న ప్రజలు దగ్గరికి రాకుండా పోలీసులు తుపాకులతో బెధిరిస్తున్నారు..... చివరకు ఆ ఇంటి లోపల వ్యక్తి చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత పోలీసులు వెనుదిరిగారు.

అతనో విప్లవ వీరుడు... తల్లితండ్రులు పెట్టుకున్న పేరు సమ్మిరెడ్డి, సింగరేణి కార్మికులు, వారి కుటుంభాలు ప్రేమగా పిల్చుకునే పేరు కామ్రేడ్ రమాకాంత్, సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి. కార్మికుల జీవితాల కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టిన త్యాగ జీవి. తాను కలలు కన్న సమామాజం కోసం చివరి రక్తం బొట్టు వరకు పోరాడి అమరుడైన దన్యజీవి. ఒక్కడే అయినా వందలాది మంది శతృ మూకలను ఒంటి చేత్తో ఎదుర్కొన్న పోరాట యోధుడు. సింగరేణి కార్మికుల గుండెల్లో, పీడిత ప్రజల గుండెల్లో ఎర్రజెండై ఎగురుతున్న కామ్రేడ్ సమ్మన్న

కరీంనగర్ జిల్లా.. కమలపూర్ దగ్గర కానిపర్తి గ్రామానికి.. చెందిన మాదిరెడ్డి లక్మరెడ్డి, ప్రమీల ల ప్రధమ పుత్రుడైన కామ్రేడ్.సమ్మిరెడ్డి మందమర్రి కె.కె 5ఏ గనిలో కోల్ కట్టర్ గా పని చేస్తూ కార్మిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చాడు..సికసా మొదటి మహా సభల్లో కమిటిలోకి ఎన్నిక కాబడి సికసా కోశాధికారిగా భాద్యతలు నిర్వర్తించారు..1984 లో తన ఉద్యోగాన్ని భార్య ,ఇద్దరు పిల్లల కుటుంబాన్ని వదులుకొని పూర్తి కాలం కార్యకర్తగా పార్టీ లోకి వచ్చాడు..ఆర్గనైజర్ గా సింగరేణి బెల్ట్ కమిటీ సభ్యునిగా అశోక్ పేరుతో భాధ్యత లు నిర్వర్తించారు ..సింగరేణి లో జరిగిన అనేక సంఘటిత , సమరశీల దీర్ఘకాలిక పోరాటాలకు నాయకత్వం అందించాడుకార్మిక శక్తి ప్రదర్శింప చేస్తూ ,కంపెనీ అధికారులు లొంగి వచ్చి సమ్మె పోరాటాల డిమాండ్లు ఒప్పుకునేల...సమర శీల పోరాటాలు సాగి విజయాలు సాధించేలా పోరాటాల యోధుడు సమర్ధవంతంగా నేతృత్వం వహించాడు.కోమ్రేడ్ సమ్మిరెడ్డి అమరుడు కావడం ..సింగరేణికార్మిక ఉద్యమానికి ఎంతో నష్టం చేకూర్చింది .
1986 నుండి రమాకాంత్ పేరుతో పత్రిక ప్రకటనలు ఇస్తూ..వచ్చిన సింగరేణి బెల్ట్ కమిటీ సభ్యులు 1996 లో కామ్రేడ్ సమ్మిరెడ్డి అమరుడు అయిన అనంతరం " రమాకాంత్ " అనే పేరును సమ్మిరెడ్డి కె అంకితం చేస్తూ ఆ తరువాత ఆ పేరు ను ఉపయోగించడం ఆపివేయడం జరిగింది...
అమర్ రహే ! కామ్రేడ్ సమ్మిరెడ్డి ఎలియాస్ రమాకాంత్..

Keywords : ramakanth, sikasa, madireddy sammireddy, maoist, peoples war
(2024-04-24 23:43:27)



No. of visitors : 2566

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రమాకాంత్