bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు - చంపబడ్డాడు
05-07-2021
ఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి ఈ రాజ్యం కారణమయ్యిందని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో మా దృష్టికి వచ్చిన కొన్ని ప్రకటనలు, కామెంట్లు....
ఫాదర్ స్టాన్ స్వామి మరణం గురించి తెలిసి షాక్ అయ్యాను. స్వామి గిరిజన హక్కుల కోసం పనిచేస్తూ తన జీవితాన్ని వారికే అంకితం చేశాడు. అతని అరెస్టు, జైలు శిక్షను నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అతని మరణానికి దారితీసిన నిర్లక్ష్యానికి, సకాలంలో వైద్య సేవలను అందించకపోవటానికి కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి.
-హేమంత్ సోరెన్, ముఖ్యమంత్రి, జార్ఖండ్
#BJPKilledStanSwamy
న్యాయవ్యవస్థ చేతులకు రక్తం
ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి చేతులకు రక్తం
ఎన్‌ఐఏ చేతులకు రక్తం
రాజ్యం తరపున ప్రచారం చేసిన మీడియా చేతులకు రక్తం
దీని నుండి బయటపడటానికి మోడీ-షాను అనుమతించే ప్రతిపక్ష చేతులకు రక్తం
మనందరొ చేతులకు రక్తం
RIP Fr #StanSwamy
-మీనా కందస్వామి, సామాజిక కార్యకర్త
న్యాయం ఆలస్యం, న్యాయం నిరాకరణే
ఆదివాసీ సామాజిక కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి ఈ రోజు జైలులో కన్నుమూశారు. కొన్నేళ్లుగా అడవిలో ఆదివాసులకు సేవ చేసిన ఆయన జైల్లో తీవ్రంగా అనారోగ్యంతో సరైన వైద్యం అందక చంపబడ్డాడు. ఈ హత్యకు కారణం క్రూరమైన ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ.
- కిసాన్ ఏక్తా మోర్చా
తమదైన మార్గాల్లో ఈ ప్రపంచంలో సానుకూల మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వారికి స్టాన్ స్వామి మరణం చాలా పెద్ద నష్టం. తన మార్గంలో స్థిరంగా నిలబడి, మరింత మానవత్వంతో కూడిన, న్యాయమైన ప్రపంచం కోసం పోరాడిన వ్యక్తికి ఆయన చక్కటి ఉదాహరణగా గుర్తుంచుకోబడతారు. మేము మిమ్మల్ని మరచిపోలేము, స్టాన్.
- బేలా భాటియా, సామాజిక కార్యకర్త
ఫాదర్ స్టాన్ స్వామి ఎప్పటికీ మరణించరు. తన జీవితాంతం ఫాసిస్ట్ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన హీరోగా ఆయన మన హృదయాల్లో జీవిస్తారు.
ఫాదర్ స్టాన్ స్వామి నెత్తురు అంటిన చేతులతో ఉన్న మోడీ, షాలను ఈ దేశం ఎప్పటికీ క్షమించదు
- జిగ్నేష్ మేవానీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, గుజరాత్
ఫాదర్ స్టాన్ స్వామి చనిపోలేదు...దుర్మార్గ వ్యవస్థ చేతనే చంపబడ్డారు!
ఫాదర్ స్టాన్ స్వామికి జోహార్లు!!
భీమా కోరేగావ్ కేసులో గత తొమ్మిది నెలలుగా ఫాదర్ స్టాన్ స్వామి జైలులో ఉంచగా అక్కడే కరోనా బారిన పడ్డారు.కోలుకున్న తర్వాత అనారోగ్యం బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించారు. ఎనబై మూడేళ్ల వయసులో ఆయనకు బెయిల్ ఇవ్వకుండా తీవ్రంగా అడ్డుపడిన ఈ దుర్మార్గ వ్యవస్థనే స్టాన్ స్వామిని నిర్ధాక్షిణ్యంగా చంపేసింది. ప్రముఖ హక్కుల కార్యకర్తగా, మానవతావాదిగా స్టాన్ స్వామి ఆదివాసీలకు ఎంతగానో సేవ చేశారు. వృద్ధుడైన ఫాదర్ కు పలుసార్లు ఎన్ఐఏ ద్వారా బెయిల్ రాకుండా చేసి అతని మరణానికి ఈ ప్రభుత్వమే కారణం అయింది.
ఇప్పటికైనా జైళ్లలోమగ్గుతున్న వరవరరావు తో సహా భీమా కోరెగావ్ కేసు లోని ముద్దాయులందరికి బేషరతుగా విడుదల చేయించాల్సిన బాధ్యతను భారత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
స్టాన్ స్వామి కి జోహార్లు!
చంద్రన్న
ప్రధానకార్యదర్శి
సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ
5-7-2021
ఆయన జీవితమంతా నిస్వార్థంగా ఆదివాసుల కోసం పనిచేశారు. జార్ఖండ్ ఖనిజ సంపద ఆదివాసులదేనని, బహుళజాతి సంస్థలది కాదని పోరాడారు. ఆ కృషే కంటగింపైన బహుళజాతి సంస్థలు, వాటి తొత్తు సంఘ్ పరివార్ అల్లిన అబద్ధపు కేసులో వేధింపులకు గురయ్యారు. జైలు పాలయ్యారు. ఎనబై మూడు సంవత్సరాల వయసులో, పార్కిన్సన్ వ్యాధితో సహా సున్నితమైన ఆరోగ్యంతో జైలులో ఆరోగ్యరక్షణ కరవై, చిట్టచివరికి కోర్టు ఆదేశాల మీద ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆ కోర్టు కూడ బెయిల్ ఇవ్వడానికి నెలల తరబడి తాత్సారం చేసింది.
ఫాదర్ స్టాన్ స్వామిది సహజ మరణం కాదు, వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య.
ఆదివాసుల మిత్రుడు, గురువు, ఫాదర్ స్టాన్ స్వామికి కన్నీటి జోహార్లు....
- ఎన్ వేణు గోపాల్, ఎడిటర్, వీక్షణం
పేదవారి కోసం తన జీవితమంతా పోరాడిన వృద్దుడైన ఫాదర్ స్టాన్ స్వామి కనికరం లేకుండా జైలు శిక్ష అనుభవించాడు. మొదట నీరు త్రాగడానికి ఒక స్ట్రాను కూడా తిరస్కరించారు. సకాలంలో వైద్య సహాయం నిరాకరించారు. పదేపదే బెయిల్ నిరాకరించారు. అతనిప్పుడు కస్టడీలో మరణించాడు. ఇది జాతీయ విషాదం. ఫాదర్ స్టాన్ స్వామిని చంపింది ఎవరు?
- సాగరికా ఘోష్, జర్నలిస్టు
జోహార్ ఫాదర్ స్టాన్ స్వామి.... ఏ హక్కుల కోసం మీ జీవితాంతం కృషి చేశారో దానికి నిదర్శనం ఈ చిత్రం.
మిమ్మల్ని కుట్ర కేసుల్లో ఇరికించి, రాజ్యాంగ విలువలు పాటించకుండా, చట్టబద్ధమైన బెయిల్ ని నిరాకరించి, సరైన చికిత్స అందించకుండా, కాలయాపన చేసి భౌతికంగా లేకుండా చేయగలిగామని ఈ హంతక మో...షా... లు విర్రవీగుతూ వుండవచ్చు గాక...
కానీ మీరు ఈదేశ మూలవాసుల గుండెల్లో ఎప్పటికీ సజీవులే.
- సజయ కాకర్ల, సామాజిక కార్యకర్త
కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ విధానాలకు బలి అయిన ఉన్నత విలువలు కలిగిన మానవతావాది స్టాన్ స్వామి మృతి. సరి అయిన వైద్యం చేయించక జ్యూడిషల్ కస్టడీ లొనే స్టాన్ స్వామి ని చనిపోయేలా చేసిన కేంద్ర మరియు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఖండించండి, వెంటనే దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలి ముఖ్యంగా మహారాష్ట్ర జైళ్లలో ఉన్న Prof. సాయిబాబా మరియు భీమా కోరేగాము కేసులో అక్రమంగా ఉన్న వారందరిని వెంటనే విడుదల చేయాలి, ఆదివాసుల పక్షపాతి ఫాథర్ స్టాన్ స్వామికి విప్లవ జోహార్లు
- బల్ల రవీంద్రనాథ్, న్యాయవాది
ఫాదర్ .. మీ మరణం తో మేమొక కుటుంబ పెద్ద దిక్కుని , ప్రజాస్వామిక ఉద్యమం ఒక ధీరుణ్ణి కోల్పోయింది.
మీకు ఒక సిప్పర్ కూడా ఇవ్వని ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం తన మరణ శాసనాన్ని రాసిపెట్టుకుంది.
ఒక కంట కన్నీరు తుడుచుకొంటూ, మీ స్పూర్తితో మరింత దృఢంగా చివరికంటా నిలబడేందుకే మేము ప్రయత్నిస్తాం.
జోహార్ ఫాదర్ స్టాన్ స్వామి జోహార్ ..
- టీమ్ .. పర్స్పెక్టివ్స్
Keywords : stan swamy, BK16, bhima koregaon, death
(2025-03-15 15:40:35)
No. of visitors : 1570
Suggested Posts
| ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు . |
| ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవితభయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే అతి కనీస అవసరాలు మినహా నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు |
| Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party
rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.
|
| ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటనదేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు. |
| స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టుభీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది. |
| ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.
|
| స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి -ఐక్యరాజ్యసమితి ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెందడం పట్ల ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. |
| అతని మరణం ఒక సత్య ప్రకటన -విరసంఅతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు. |
| వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన. |
| మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లంబాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం? |