అతని మరణం ఒక సత్య ప్రకటన -విరసం
06-07-2021
విప్లవ రచయితల సంఘం ప్రతికా ప్రకటన
ఇంత దుఃఖం ఉంటుందా?
ఫాదర్.. మిమ్మల్ని వాళ్లు హత్య చేశారని బిగ్గరగా అరవండి
అతను వెళ్లి పోయాడు. మనందరిని వదిలి సాగిపోయాడు. అతను భూగోళం ఖాళీ చేసాక దుఃఖ పడటం మన వంతయింది. అతను గౌరవ వీడ్కోలు తీసుకోలేదు. శిలువతో సెలవంటూ వెళ్లి పోయాడు. మానవ జీవితంలో ఇంతటి విషాదం వుంటుందా. మనుషులను ప్రేమించే వాళ్ళు తాము నివసించే సమాజాన్ని, కాలాన్ని సౌందర్యమయం చేసే వాళ్లు భౌతికంగా వెళ్లి పోయినప్పటి దుఃఖం ఇది. మనిషిగా అతనిని మనం ఎన్నడూ కలవక పోవొచ్చు. ఒక ఆత్మీయ సంభాషణ అయినా లేకపోవొచ్చు. అతనిని చూసి చిరునవ్వు అయినా జత కలపకపోవొచ్చు. అతను మన మనిషి. మహా మనిషి. ఈ దేశపు సంపద. ఆతనే ఫాదర్ స్టాన్ స్వామి.
శరీరం సహకరించని స్థితిలో ఎనభై మూడేళ్ళ వయస్సులో 8-10- 2020న మోది, షా నేతృత్వంలో నడుస్తున్న ఎన్ ఐ ఎ బృందం ఆయనను అరెస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీపై హత్యా ప్రయత్నం చేశాడన్న ఆరోపణపై ʹఉపాʹ కింద అరెస్ట్ చేయబడిన వారిలో 16వ ముద్దాయి. స్టాన్ స్వామి తమిళనాడులో పుట్టి కర్ణాటకలో పెరిగి విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేస్కొని బెంగుళూరులో సోషల్ సైన్సస్ రీసెర్స్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ గా చేస్తూ అన్నీ వదులుకొని జార్ఖండ్ ఆదివాసుల మధ్య జీవిస్తున్నాడు.
భారత దేశంలో లభ్యమౌతున్న ఖనిజ సంపద నలభై శాతం జార్ఖండ్ రాష్ట్రంలో వుంది. ఇక్కడ మైనింగ్ చేయడం వలన రాష్ట జనాభాలో నాలుగో వంతు నిరాశ్రయులవుతున్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వలన ఆదివాసుల అస్థిత్వమే ప్రశ్నార్థకంగా మారిన వేళ వారికోసం స్టాన్ స్వామి నిలబడ్డాడు.
ఫాదర్ హృదయంలో అణగారిన వారి పట్ల మమకారం.
వారి పట్ల అంతులేని ప్రేమ. మనిషిగా వారిపట్ల బాధ్యత. వారి విముక్తి కోసం ఆరాటం. అందుకే సహజంగా స్టాన్ స్వామి మావోయిస్టు అయినాడు. ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలదే అన్నందుకు, ఆదివాసులుకు హక్కులు ఉంటాయన్నందుకు, అక్రమ కేసుల్లో వేలాది మంది ఆదివాసులు దీర్ఘ కాలం జైళ్లలో వుంటున్నారని అన్నందుకు, వారిని విడుదల చేయాలని జార్ఖండ్ ప్రభుత్వం పై పోరాటం చేసినందుకు, ఖనిజ సంపదను దోచుకునే కార్పొరేట్లకు అడ్డు నిలిచినందుకు కేంద్ర ప్రభుత్వం భీమా కోరేగాం కుట్ర కేసు బనాయించింది.
వృద్ధాప్యం, అనారోగ్యాలతో తన పనులు తాను చేసుకోలేని, తన కనీస అవసరాలు తాను తీర్చుకోలేని స్టాన్ స్వామిపై భారత ప్రజాస్వామ్యం ప్రతీకారం తీర్చుకుంది. ఆయన దాదాపు తొమ్మిది నెలలుగా జైల్లో వున్నారు. అనేక దఫాలు బెయిల్ రిజెక్ట్ అయింది. అంతిమంగా రాజ్యం చేతిలో హత్యకు గురయ్యాడు. తనకంటూ ఏమీ లేని ఫాదర్ బహుశా తన జీవితకాలంలో ఎన్నడూ ఒంటరిగా గడిపి ఉండడు. ఆదివాసుల మధ్యనే జీవితమంతా కొనసాగించి ఉంటాడు. అణగారిన సమూహాల కోసం కాలాన్నంతా వెచ్చించి ఉంటాడు. ఇప్పుడాయన ఈ కాలగమనంతో తెగతెంపులు చేసుకొని, ఒంటరిగా వెళ్లిపోయాడు.
ఆయన ప్రజల కనీస అవసరాల కోసం గళం విప్పితే మత మార్పిడులు చేస్తున్నాడని సంఘ్ పరివార్ ఆరోపించింది. ఇంకా ఎన్నో ఆరోపణలు చేసింది. కానీ ఆయనేం చేశారు? అత్యంత ʹవెనుకబడినʹ అనేక సహజ సంపదల సంపన్న జార్ఖండ్ ప్రాంతంలో ఆయన ప్రజలను చైతన్యవంతం చేయడంలో నాలుగు దశాబ్దాలుగా కృషి చేశారు. ఆ చైతన్యాన్ని రాజ్యం భరించలేకపోయింది. ఆయన చేసిన కృషిని పూర్వపక్షం చేయాలనుకున్నది. ఆయన మీద హింసారోపణలు చేసింది. దేశ ద్రోహి ముద్ర వేసింది. అక్రమ ఆరోపణలతో ఖైదు చేసింది. చివరకు కరోన కాలంలో మానసికంగా, శారీరకంగా వేధించి ఆసుపత్రి గదిలో రాజ్యం హంతక పాత్ర పోషించింది. ఆయనను ఈ రాజ్యం హత్య చేసింది.
ఆయన తను నమ్మిన విలువల కోసం అమరత్వం చెందాడు. జననం నుండి మరణం వరకు నమ్మిన విశ్వాసాల పునాది పై పని చేసాడు. ఆయనకు ఈ దేశమంతా ఇవాళ కన్నీటితో నివాళి ప్రకటిస్తున్నది. ఈ హత్యతో భారత రాజ్య యంత్రం తన జీవిత చరమాంకంలోకి చేరుకున్నది. దేశ ప్రజల కోసం కలలు గన్న అన్వేషకుని ఊపిరి తీసింది. రాజ్యం చివరి ఊపిరి తీసుకుంటున్నది. భారతదేశంలో రాజకీయ అసమ్మతికి కాలం తీరిందని, పీడిత అస్తిత్వ వ్యక్తీకరణలకు, ఆకాంక్షలకు కాలం లేదని, ఏ మాత్రం భిన్నాభిప్రాయాలకు భారత ప్రజాస్వామ్యంలో చోటు లేదని ఈ హత్యతో సంఘ పరివార్ బరితెగించి ప్రకటిస్తున్నది.
మనుషులపట్ల ప్రేమ తప్ప మరేమీ తెలియని ఫాదర్ స్టాన్‌స్వామిని భీమా కొరేగావ్ అక్రమ కేసులో నిందితుడ్ని చేయడంలోనే కుట్ర దాగి ఉన్నది. ఈ కుట్ర కేసులో మూడేళ్ళుగా మహారాష్ట్ర జైలులో నిర్భంధంలో ఉన్న వారు చాలా వరకు తీవ్ర అనారోగ్య సమస్యలతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా పరిస్థితి దయనీయంగా ఉంది. ఇంకా సీఏఏ వ్యతిరేక ఆందోళనల కాలంలో అక్రమ కేసుల్లో అరెస్టయిన వాళ్లు ఎందరో జైళ్లో ఉన్నారు. అయినా వారెవరికీ బెయిల్ ఇవ్వడానికి సంఘ్ పరివార్ కనుసన్నలలో నడుస్తున్న న్యాయస్థానాలు సిద్ధంగా లేవు.
స్టాన్ స్వామి మరణం ఇవాల్టి దేశ వ్యాప్తంగా అమలవుతున్న అణిచివేత కోణానికి ఉదాహరణ. ఈ దేశంలో ఫాసిజం రాజ్యమేలుతున్నదనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి. ఈ పాలక చర్యలను ముక్తకంఠంతో ధిక్కరించవలసిన సమయం ఇది. ఈ వేదనా భరిత కాలంలోనే ఫాదర్ స్టాన్ స్వామి జైలు సహచరులందరి విడుదల కోసం మనం కృషి చేయాల్సి ఉన్నది. రాజకీయ దురుద్దేశాలతో దేశవ్యాప్తంగా నమోదైన అక్రమ కేసులన్నీ ఎత్తేయాలని కోరాలి.
అత్యంత అమానుష, రాజ్యాంగ వ్యతిరేక, మానవ వ్యతిరేక ఉపా చట్టాన్ని రద్దు చేయాలని నినదిద్దాం. ఉపా వ్యతిరేకంగా పోరాడి అదే ఉపాకు బలైపోయిన ఫాదర్‌కు నివాళి ప్రకటించడమంటే ఉపా రద్దు కోసం పోరాడటమే. ఈ దేశపు లౌకిక, ప్రజాస్వామిక, విప్లవకర జీవధార ఫాదర్ స్టాన్‌స్వామి. అలాంటి వైవిధ్యభరితమైన మేధావి, ప్రజా ప్రేమికుడు జీవించి కాలం ఇది. ఆయన ఆచరణతో, ఆలోచనలతో ఈ పోరాట కాలమంతా తేజోవంతమైంది. ఆయన మరణంతో ఈ దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తన ఫాసిస్టు స్వభావాన్ని చాటుకున్నది. ఆ రకంగా ఆయన మరణించీ మన ముందు ఒక సత్య ప్రకటన చేసి వెళ్లిపోయాడు. ఆయన అమరత్వానికి విప్లవ రచయితల సంఘం జోహార్లు ప్రకటిస్తున్నది.
అరసవెల్లి కృష్ణ
అధ్యక్షుడు, విరసం
Keywords : stanswamy, bhimakoregaon, virasam, BK16, NIA
(2025-03-15 05:28:09)
No. of visitors : 1536
Suggested Posts
| ఆదివాసీల సహవాసి వెళ్ళిపోయాడు!గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మరణించారు. ఆయన వయసు 84. మే నెలలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి స్వామి తొమ్మిది నెలలు జైలులో ఉన్నారు . పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు . |
| ఫాదర్ స్టాన్ స్వామి జైలు కవితభయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే అతి కనీస అవసరాలు మినహా నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు |
| Stan Swamy death an institutional murder by Modi government - Maoist Party
rrest, the governments would announce that they did all the needed and were helpless. As he guessed, the Indian Foreign Minister immediately responded and issued a report that his arrest was legal.
|
| ఫాదర్ స్టాన్ స్వామిది హత్యే... భీమా కోరేగావ్ కేసును వెనక్కి తీసుకోవాలి - మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రకటనదేశ దళిత అదివాసీ పీడిత ప్రజా సముదాయాల ప్రజలు తమ శ్రేయోభిలాషిని, ఒక నిజమైన ప్రజాస్వామికవాదినీ కోల్పోయారు. భారత దేశంలోని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల రాజ్య నిరంకుశత్వానికి 84 ఏళ్ల జిస్యూట్ ప్రీస్ట్ ఫాదర్ స్టానిస్లాస్ లూర్గుసామి బలైపోయారు. |
| స్టాన్ స్వామికి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీలు - నిరాకరించిన కోర్టుభీమాకోరేగావ్ కేసులో జైల్లో ఉండి మరణించిన ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కి నివాళులు అర్పిస్తామన్న మావోయిస్టు ఖైదీల విఙప్తిని కోర్టు తిరస్కరించింది. |
| ఆదివాసీలతో పోరాడటానికి, వాళ్ళను చంపడానికి... ఫాదర్ స్టాన్‌స్వామి రాసిన వ్యాసం ఈ వార్తాపత్రిక సమాచారం ప్రభుత్వ ప్రణాళికను వివరిస్తుంది. రాష్ట్రంలోని ఆదిమ ఆదివాసీ సమూహాల యువతతో రెండు ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేసి అడవుల్లోని మావోయిస్టులతో పోరాడటానికి అధునాతన గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇవ్వనున్నారు. తిరుగుబాటు నిరోధక చర్యలలో వారు భద్రతా దళాలకు సహాయం చేస్తారు.
|
| స్టాన్ స్వామి మృతి కలచి వేసింది, రాజకీయ ఖైదీలను విడుదల చేయండి -ఐక్యరాజ్యసమితి ఫాదర్ స్టాన్ స్వామి జైల్లోనే రిమాండు ఖైదీగా మృతి చెందడం పట్ల ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమిషనర్ మైఖేల్ బ్యాచ్‌లెట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. |
| bhima koregaon: స్టాన్ స్వామి చనిపోలేదు - చంపబడ్డాడుఫాదర్ స్టాన్ స్వామి మరణం అనేకమందిని ధుంఖంలో ముంచింది. పీడితుల పక్షాన ఉన్నందుకే అతనిపై అబద్దపు కేసులు బనాయించి, జైల్లో వేధించి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా అతని మరణానికి |
| వాళ్ళు ఈ నేలకు శాపం పెట్టారు ---- అరుంధతీ రాయ్భారతదేశ ప్రజాస్వామ్యం క్రమేపీ పయనిస్తున్న ʹహత్యాపథంలోʹ స్టాన్ స్వామి హత్య ఒక పెద్ద పరిణామం. చూడటానికి చిన్నదిగా కనిపించినా, నిజానికి ఇది చాలా పెద్ద సంఘటన. విస్తృతంగా ప్రభావం వేసిన ఒక అత్యంత పెద్ద సంఘటన. |
| మమ్మల్ని మన్నించు సామీ! బ్రతుక్కి అర్థం తెలీనోళ్లంబాగా చదువుకుని, రెండు చెవులూ సరిగా పనిచేయక, అవయవాలు సరిగా పనిచేయని పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ, వెన్నెముక కిందిబాగం పాడైపోయి సరిగా కూర్చోలేని స్తితిలో జనంలో బ్రతికే అదివాసీల తరపున మాట్లాడే ఒక 84 ఏళ్ల ముసలితనపు హక్కుల కార్యకర్త, ఎవరి హత్యకోసం? ఏ రకంగా కుట్ర పన్నాడో? ఆధారాలు లేకుండా, ఇలా జైలులో నిర్బంధించి, చావుకి ఎరవేయడాన్ని ఏమందాం? |