UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి


UPలో ఎన్నికలొస్తున్నాయి... ఉగ్రవాదుల పేరిట అమాయకుల అరెస్టులు మొదలయ్యాయి

UPలో

17-07-2021

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికలకు ముందు హటాత్తుగా దేశంలో ఉగ్రవాదుల హడావుడు మొదలవుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు మొదలవుతాయి. అనేక మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేస్తూ ఉంటారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఉగ్రవాదుల హడావుడి మొదలయ్యింది. ఈ నెలలో ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ʹఉగ్రవాదులʹను ATS అరెస్టు చేసింది. అయితే వీళ్ళంతా ఉగ్రవాదులు కాదని కావాలనే పోలీసులు తమ వాళ్ళను కేసుల్లో ఇరికిస్తున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

దీనిపై రిహాయి మంచ్ అనే సంస్థ లక్నోలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఉగ్రవాదం పేరిట, లక్నోలో, ఇతర ప్రాంతాల్లో అరెస్టు కాబడ్డ‌ వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ʹʹఅల్‌ఖైదా పేరిట జరిగిన అరెస్టుల తర్వాత పోలీసులు కుక్కర్ బాంబులంటూ ప్రచారం చేసిన పద్ధతిని చూస్తే ఇంట్లో కుక్కర్‌ను ఉంచుకోవడమే నేరమైపోతుందనిపిస్తోంది. అంతకుముందు ఉగ్రవాదం పేరిట తప్పుడు ఆరోపణలతో చేసిన అరెస్టుల్లో కూడా డజన్ల కొద్దీ యువత నిర్దోషులుగా విడుదలవుతున్నారనేది వాస్తవంʹʹ అని మెగసేసే అవార్డు గ్రహీత సోషలిస్ట్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సందీప్ పాండే అన్నారు

అల్‌ఖైదాతో సంబంధాలు వున్నాయిని 2021జూలై 11 న మిన్హాజ్, ముసీరుద్దీన్‌లను, 2021 జూలై 14న షకీల్‌ను అరెస్టు చేయడం ప్రజలలో అనేక సందేహాలను, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయని, రిహాయ్ మంచ్ అధ్యక్షుడు ముహమ్మద్ షుయబ్ అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైఫుల్లా ఎన్‌కౌంటర్, ఐఎస్ పేరిట అరెస్టులు చేసినట్లే, ఓట్ల కోసం ఇలాంటి అరెస్టులు జరిగాయని సాధారణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లక్నోలో జూలై 11 న మొహిబుల్లాపూర్‌లోని దుబగ్గాలో, జూలై 14 న జనతా నగ్రిలో ముగ్గురిని అల్‌ఖైదాతో సంబంధాలు వున్నాయిని అరెస్టు చేశారు. రిహాయి మంచ్ బృందం ఆ ముగ్గురి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ʹసుమారు 10 గంటలకు ఇంట్లోకి వచ్చిన ఎటిఎస్ సిబ్బందిని చూసి ఆశ్చర్యపోయాను, అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన నాకు అంతమందిని చూసి భయమేసి నోటమాట రాలేదు, మిన్హాజ్ గదిలోకి వెళ్ళిన ఏ‌టి‌ఎస్ సిబ్బంది ఏవో వస్తువులు దొరికాయని హడావిడిగా వెళ్లిపోయారు. నన్ను, నా భార్యను తిట్టి, ఒక గదిలో కూర్చోబెట్టారు. ఆకలి, దప్పికలతో మేము అలాగే కూచుని ఉన్నాము. నా భార్యకు వున్న వ్యాధి వల్ల ఎక్కువసేపు కూర్చోడానికి చాలా యిబ్బంది పడుతుంది. రాత్రి 7 గంటల వరకు, ఎటిఎస్, బ్లాక్ కమాండోలు మా యింటిని, మా సోదరుడి ఇంటిని కూడా చుట్టుముట్టారు. సాయంత్రం 7 గంటలకు, షెరాజ్‌ను అతని భార్యను ఎటిఎస్ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్ళారు. ఎవరికీ నిజం చెప్పవద్దని, ఎవరడిగినా ATS చేసిన దానితో సంతృప్తి చెందామనే ఒకే మాట చెప్పమని బెదిరించారు. మీడియాతో ఎప్పుడూ మాట్లాడకూడదని పదే పదే చెబుతూనే ఉన్నారు. తాము చెప్పినంతే మాట్లాడాలని, లేకపోతే మీ వృద్ధాప్యజీవితాన్ని నాశనం చేస్తామని బెదిరించారు. ATS ప్రధాన కార్యాలయంలో ఒక తెల్ల కాయితం మీద బలవంతంగా సంతకం చేయించారు. ఆ తరువాత, రాత్రి 9 గంటలకు దుబగ్గా పోలీసు పోస్టు దగ్గర వదిలితే, అక్కడ నుండి రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నాముʹ అని అని మిన్హాజ్ తండ్రి షెరాజ్ అహ్మద్ వివరించారు.

ʹఆ రోజు తాను ఆలస్యంగా లేచి టీ తాగి, అలా కూచుని వుంటే ఇద్దరో, ముగ్గురో వ్యక్తులు వచ్చి తలుపు తట్టితే, తలుపు తెరచి బయటికి వెళ్ళి ఎవరు కావాలని అడిగితే, ముసీరుద్దీన్ ఎవరు అని అడిగారు, నేనే అని చెప్పగానే అతన్ని తీసుకెళ్ళిపోయారు, ముసీరుద్దీన్ బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేదు బనీను, నిక్కరు మీద వున్నాడు. బట్టలు వేసుకోవడానికి కూడా సమయమివ్వలేదు. మేము ఫాంట్, షర్ట్ ఇస్తే వేసుకున్నాడు. ఆ తరువాత మేము కూడా అతనితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాము, మా కూతురు కూడా వెంట వచ్చింది. ఆ తర్వాత కమాండోలు వచ్చి ఇంటిని సోదా చేసారు. ప్రతిదీ చెల్లాచెదురు చేశారు. ఒక కుక్కర్‌ని కూడా తమతో తీసుకెళ్ళారు. మేము కొన్ని కాయితాలను, ఐడి లాంటివి ఒక పెట్టెలో వుంచితే అన్నింటినీ తీసుకెళ్లిపోయారు. ఇద్దరు కూతుళ్లను తరిమేసారు. నా అత్తగారు అలా కూర్చుని వుంది. ఏం జరుగుతోందని అడిగితే మేము ఆమెకు ఏమీ చెప్పలేదుʹ. అని ముసీరుద్దీన్ భార్య సయీదా వివరించారు.

ఆమె ఇంకా ఇలా చెప్పారు...

ʹమేము పోలీస్ స్టేషన్లో ఉన్నంతసేపూ అతన్ని కారులో కూచోబెట్టారు. ఆ తరువాత తనకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారని చెప్తున్నాడు, వాళ్ళని తీసుకువచ్చి చూపించి అతన్ని తీసుకెళ్లమని చెప్పారు. మేము ఇంటికి వచ్చి రోగిష్టి అయిన మా అత్తగారిని రిక్షాలో తీసుకువెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ముసీరుద్దీన్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారు అనడిగితే సరిగ్గా చెప్పకుండా, ఠాకూర్‌గంజ్, కకోరి పోలీస్ స్టేషన్‌లలో వున్నాడేమో చూడమని చెప్పారు. మేము సుమారు 8 గంటలకు ఠాకూర్‌గంజ్, కకోరి పోలీస్ స్టేషన్‌లకు వెళ్ళాము కానీ అక్కడ కనిపించలేదు. ఎటిఎస్ వాళ్ళు అక్కడికే తీసుకెళ్లి వుండచ్చని అన్నారు. మాకు చాలా అన్యాయం జరుగుతోంది. మధుమేహ వ్యాధి వున్న నా కుమార్తె నాన్నని చూపించండీ అని అడుగుతోంది. ఇప్పుడు దాని మందులు ఎవరు తెస్తారు? ఇన్సులిన్ ఇంజక్షన్ ఎవరు ఇస్తారు? బస్తీ ప్రజలను అడగండి, అతను తప్పు చేశాడని ఎవరూ చెప్పరు.

ఎటిఎస్ వాళ్ళు తమకు దొరికిన పిల్లల పుస్తకాలను కూడా తీసుకెళ్లారు. మిన్హాజ్‌కి 14 వేల బ్యాటరీ ఎక్కడినుంచి వచ్చింది అని అడిగారు. అంత డబ్బు చెల్లించి బ్యాటరీలను కొనే స్థితిలో లేము, మేము వాయిదాలలో బ్యాటరీలను తీసుకునేవాళ్ళం. ఇంత పెద్ద ఉగ్రవాది అని పిలవబడే అతను ఇల్లనబడే రేకుల షెడ్‌లో నివసిస్తున్నాడు. అతను కుమార్తె అనారోగ్యం గురించి, ఆమెకు మందులు, మా అందరికీ రెండుపూట్లా తిండి దొరికితే చాలు అనుకొనేవాడుʹ అని ముసీరుద్దీన్ భార్య సయీదా వివరించారు.

ఉగ్రవాది అని అరెస్టు చేసిన షాకీల్ కుటుంబాన్ని కలిసిన రిహాయి మంచ్ ప్రతినిధి బృందం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉగ్రవాద కేసులో అరెస్టు చేసీన షకీల్ కుటుంబాన్ని రిహాయి మంచ్ నాయకులు కలిశారు. షాకీల్ అన్నయ్య ఇలియాస్, తన సోదరుడు నిర్దోషి అని, అతన్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారనీ చెప్పారు. అతను ఎన్నో ఏళ్లుగా రిక్షా నడుపుతూ ఏదో ఒకవిధంగా తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అసలు ఇంటి నుండి ఎక్కడికీ వెళ్ళనివాడు ఎప్పుడు, ఎలా ఉగ్రవాదిగా మారాడు అని ప్రశ్నించారు.

ʹరోజూలాగానే ఆ రోజు కూడా ఉదయం రిక్షాతీసుకుని బయటకు వెళ్ళాడు. ఉదయం 9 గంటలకు, తెలిసినవాళ్లు షకీల్ భార్య మొబైల్‌కు ఫోన్ చేసి, షకీల్‌ను పోలీసులు తీసుకెళ్ళారని చెప్పారు. షకీల్ భార్య నాకు చెబితే, నేను ఇంటికి వచ్చేటప్పటికి, వీధి మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మేము విషయమేమిటని పోలీసులనడిగితే, మమ్మల్ని తిట్టారు. సార్ మేము అలాంటివాళ్ళం కాదని, కావాలంటే మా ఇంటిని సోదా చేసుకోండీ అని ఇంటికి తీసుకెళ్లి ఒక్కో సామాను తీసి చూపించాము. మీకేమీ తెలియదని మాకు తెలుసు అని ఒక పోలీసు అన్నాడు కూడా. నా తమ్ముడిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవడానికి మేము వజీర్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఒక పోలీసు మాస్క్ తియ్యమన్నాడు. మేము మాస్క్ తీయగానే, వెళ్ళండి ఇక్కడనుండి, మీలాంటివాళ్ళే ఉగ్రవాదులవుతారని వెళ్లగొట్టాడు.ʹ అని ఇలియాస్ చెప్పారు.

షకీల్ పాత రిక్షా స్థితిని రిహాయ్ మంచ్ బృందానికి ఇలియాస్ చూపించి, నా అన్న ఉగ్రవాది అయితే, ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ విరిగిన రిక్షాను ఎందుకు నడపాల్సి వస్తోందో మీరు నాకు చెప్పాలి అని ప్రశ్నించారు.

రిహాయ్ మంచ్ ఛైర్మన్ అడ్వకేట్ ముహమ్మద్ షువాబ్ మాట్లాడుతూ ʹʹఎన్నికలు దగ్గరకు రాగానే ఇలాంటి అరెస్టులు ఇంతకు ముందు కూడా జరిగాయని, అలాచేసి మెజారిటీ సముదాయాలలో భయాందోళనలు పెంచి ఓట్లు సంపాదించే ప్రయత్నమనీ అన్నారు. వాస్తవాలను వెలికితీసే ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి. పోలీసులు, మీడియా స్వయంగా న్యాయమూర్తులై తీర్పులిస్తున్నారు. తత్ఫలితంగా, అమాయకులైన వారు నిర్దోషులైనప్పటికీ, తమ జీవితంలోని అమూల్య సమయాన్ని జైలులో గడపాల్సి వస్తోంది. ʹభయంకరమైన ఉగ్రవాదిʹ అని పోలీసులు అరెస్టు చేస్తే నిర్దోషి అని కోర్టు విడుదల చేసిన ఇలాంటి కేసులేన్నింటినో మేము చేశాముʹʹ అని అన్నారు.

రిహాయ్ మంచ్ ప్రతినిధి బృందంలో ఛైర్మన్ అడ్వకెట్ ముహమ్మద్ షువాబ్, షబ్రోజ్ మొహమ్మది, అడ్వకెట్ మొహమ్మద్ కాలిమ్ ఖాన్, రాజీవ్ యాదవ్ మొదలైనవారు ఉన్నారు

(పత్రికా ప్రకటన ఆధారంగా.)

సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తోందని రిహాయ్ మంచ్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ యాదవ్ అన్నారు. యోగిజీ జనాభా నియంత్రణ గురించి ఆందోళన చెందుతున్నాడు, కాని కరోనాతో చనిపోయిన వారి కుటుంబాల పరిస్థితి గురించి కాదు. ఆవులను పట్టించుకునే యోగిజీ, మనుషుల గురించి ఆందోళన చెందకుండా, కరోనా వల్ల సంభవించిన మరణాలకు పరిహారం అనే ప్రశ్న వచ్చినప్పుడు, పూర్తిగా నిరాకరించాడు. లవ్ జిహాద్ గురించి చూపించిన వేగం ప్రాణాలను కాపాడటంలో చూపించి వుంటే చాలా మంది తమ ప్రియమైన వారిని కోల్పోయేవారు కాదు. కరోనా మరణాల కారణంగా ప్రజలు ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తితే ఎన్నికల్లో గెలవడం సంగతి పక్కన పెడితే అసలు ప్రచారం చేయడమే కష్టమైపోతుంది. అందుకని, అల్-ఖైదా, జనాభా నియంత్రణ, కామన్ సివిల్ కోడ్ వంటి సమస్యలను ప్రభుత్వం లేవనెత్తుతోంది అని రాజీవ్ యాదవ్ అన్నారు.

(janchowk.com సౌజన్యంతో)

Keywords : uttar pradesh, terrorists, arrests,
(2021-09-23 05:52:06)No. of visitors : 259

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌
300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
more..


UPలో