ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!


ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!

ఉమ్మడి

18-07-2021

హరిత హారం పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్టు అధికారులు ఆదివాసులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆదివాసులు తరతరాలుగా తాము సాగుచేసుకుంటున్న భూములను ఆక్రమించుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు హింసాయుతంగా మారుతున్నవి.

ఈ నేపథ్యంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ విడుదల చేసిన ప్రకటన‌

అనేక దశాబ్దాలుగా పొడుగొట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న పోడు రైతులను ఈనాడు పెద్ద ఎత్తున పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో మోహరించి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పందిపంపుల గ్రామంలో కామ్రేడ్ మోకాళ్ళ మురళీ కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు. ఆయన ట్రాక్టర్ను ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్తుండగా అడ్డుకొని వెనక్కి తీసుకొచ్చారు.

పందిపంపుల, కొత్తూరు గిరిజనులు దశాబ్దాలుగా సాగుచేసుకొంటున్న భూములలో ఈరోజు ఫారెస్టు వాళ్ళు,పోలీసులు కలిసి మొక్కలు పెడుతున్నారు.రెండు గ్రామాలనుండి ప్రజలను బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు దిగ్భందనం చేసి భూములలో మొక్కలు పెట్టడానికి కూలీలను తీసుకువెళ్తుండగా పందిపంపులలో ప్రజలు అడ్డుకున్నారు.దానితో పందిపంపుల గ్రామ మాజీ సర్పంచ్, సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడైన మురళీ కృష్ణ ను అరెస్టు చేయడానికి పూనుకొన్నారు.ప్రజల ప్రతిఘటనతో అది సాధ్యం కాలేదు.

పోలీసు వలయాన్ని ఛేదించుకొని వెళ్లిన కొందరు మొక్కలు పెట్టడాన్ని అడ్డుకోగా వారిపై పోలీసులు, ఫారెస్ట్ వాళ్ళు లాఠీచార్జి చేసి ప్లాంటేషన్ పనులు కొనసాగిస్తున్నారు.AIKMS రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుతరామారావు ఆధ్వర్యంలో పందిపంపుల వెళ్లిన ప్రతినిధులను భూమి వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉన్నత అధికారులు పోడుభూముల జోలికి వెళ్ళొద్ద‌ని ప్రకటిస్తుండ‌గానే మరో వైపు ఫారెస్ట్ వాళ్ళు,పోలీసులు పోడు భూముల్లో హరితహారం పేరిట సాగు భూముల్లో మొక్కలు పెట్టడం దారుణ‌మైనది.అడవి బిడ్డల బతకుల్లో నిప్పులు పోయటమేనని మా పార్టీ ప్రకటిస్తున్నది.ఇప్పటికైనా కేసీఆర్ ముఖ్యమంత్రి గా గతంలో పొడుభుములకు పట్టాలిస్తమనే వాగ్దానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాము. అప్పటివరకు ఎలాంటి మొక్కల్ని సాగు భూముల్లో పెట్టరాదని కోరుతున్నాము. మడగూడ, కొత్తురు, పందిపంపుల గ్రామ ప్రజలపై మోపిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
కామ్రేడ్ మురళీకృష్ణ , తదితరులపై రౌడీ షీటర్ గా నమోదు చేసే అక్రమ పద్దతులను మానుకోవాలని హెచ్చరిస్తున్నాము.
సాదినేని వెంకటేశ్వరావు
రాష్ట్ర కార్యదర్శి
సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమాక్రసీ
18-7-2021

Keywords : khammam, warangal, mahabubabad, adivasi, cpi ml new democracy
(2022-06-29 03:54:38)No. of visitors : 420

Suggested Posts


న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ‌

లింగన్నను పోలీసులు కాల్చి చంపిన సమయంలో అక్కడికి చేరుకున్న చుట్టు పక్క గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ అన్నను అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ పోలీసులపైకి వెళ్ళారు. కొద్ది దూరం పోలీసులను తరిమి కొట్టారు. ఈ సమయంలో పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజలు వెన్ను చూపలేదు.

ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹ

న తండ్రిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని బుధవారంనాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు లింగన్న కుమారుడు హరిఆరోపించారు.

న్యూ డెమాక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలి..హైకోర్టు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని

నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్

46 వ ఎమర్జెన్సీ దినం సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ "ఎమర్జెన్సీ నాడు - నేడు" అనే అంశం పై జూన్ 26 న ఆన్లైన్ బహిరంగ సభ ను నిర్వహించింది.ఈ సభ కు సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరావు

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌

సి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడుగా, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమ బాధ్యతలు చూస్తున్న కా॥ ముఖ్తార్ పాష 2020 సెప్టెంబర్ 24న, కార్పోరేట్ క్రూర కరోనాతో అమరుడైన విషయం తెలిసిందే.

Search Engine

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
యేడాది సిలింగేర్‌ ఏం చెబుతోంది? - ధరణి
ఆయన షోమా సేన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు
ఛత్తీస్‌గఢ్ గ్రామాలపై వైమానిక బాంబు దాడులను ఖండించండి -కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక
శ్రీలంక పరిణామాలు – భారత సమాజానికీ పోలికలు
గౌతమ్ నవ్లాఖా కోసం ఆమె ఎదురుచూస్తూనే ఉంది - అజాజ్ అష్రఫ్
త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
అమ్మల దినం తల్లుల గుండెకోత|మమత
నాగరాజు హత్యను ఖండించిన‌ ముస్లిం థింకర్స్ డయాస్
Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
Madhya Pradesh: ఇద్దరు గిరిజనులను కొట్టి చంపిన ʹగోరక్షకులుʹ
ఉత్తరప్రదేశ్ లో ఈ ఏడాది 10వ తరగతి, ఇంటర్ హిందీ పరీక్షల్లో 8 లక్షల మంది ఫెయిల్
అదానీ కోసం అడవిని నరికేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.....రక్షించుకోవడానికి ఆదివాసుల ఉద్యమం
ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌
హిందీ భాష మాట్లాడని వారు ఈ దేశం వదిలి వెళ్ళాలి - యూపీ మంత్రి భాషాహంకారం
more..


ఉమ్మడి