రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు


రైతులపై దేశద్రోహం కేసు... బారికేడ్లను బద్దలు కొట్టి సిర్సా పట్టణంలోకి ప్రవాహంలా దూసుకవచ్చిన రైతులు

రైతులపై

18-07-2021

హర్యాణా లో 100 మంది రైతులపై దేశద్రోహం కేసు పెట్టడాన్ని, ఐదుగురు రైతులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న పోరాటంతో హర్యాణా అట్టుడికి పోతోంది. శనివారం సిర్సా జిల్లా ఎస్‌పి కార్యాలయంతో పాటు మంత్రులు దుష్యంత్‌, రంజిత్‌ సింగ్‌ నివాసాల ముట్టడికి కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. దాంతో రైతులు వేలమంది కదలి వచ్చారు. 10 వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేసి రైతులను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ప్రవాహంలా తరలివచ్చిన రైతులను ఆపడం వాళ్ళ తరం కాలేదు.

అనేక చోట్ల రైతులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టుకొని ముందుకు కదిలారు. రైతులు సిర్సా పట్టణానికి చేరుకోకుండా పోలీసులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాంతో పోలీసు అధికారులు రైతు నాయకులను చర్చలకు ఆహ్వానించారు. అందుకు అంగీకరించి చర్చలకు వెళ్ళిన రైతు నాయకుల పట్ల ఎస్‌పి అర్పిత్‌ జైన్ వ్య‌హరించిన తీరు రైతు నాయకులకు ఆగ్రహం కలిగించింది. రైతులపై దేశ‌ద్రోహం కేసు, అరెస్టులకు కారణమైన, సిర్సాలో ఈ నెల 11న రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ను అడ్డుకున్న ఘటనకు సంబంధించి అసత్యాలు మాట్లాడటమే కాక కల్పిత వీడియోలను చూయించి రైతులదే తప్పు అని మాట్లాడటంతో రైతులు చర్చలను బహిష్కరించారు.

చర్చలు విఫలమైన వార్త తెలిసి మరింత మంది రైతులు సిర్సా చేరుకోవడంతో సిర్సా పట్టణ రోడ్లన్నీ రైతులతో నిండిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రతిజాతి చౌక్‌తో పాటు సిర్సా-బర్నాలా జాతీయ రహదారిని దిగ్భంధించి ఆందోళన చేపట్టారు రైతులు. ఈ సందర్భంగా రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ మాట్లాడుతూ రైతులపై అన్యాయంగా దేశ‌ద్రోహం కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన విరుచుకపడ్డారు.

తమ పోరాటాన్ని ఆపలేని పాలకులు పోలీసుల సహాయంతో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్ర చేస్తున్నారని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక కార్పోరేట్ అనుకూల మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునేదాకా తమ పోరాటం కొనసాగుతుందని నరేష్ తికాయత్ స్పష్టం చేశారు.

Keywords : farmers protest, haryana, sedition, Farmers Knock Down Barricades In Haryana At Protest Against Sedition Case
(2021-09-22 04:17:51)



No. of visitors : 354

Suggested Posts


దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

Search Engine

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌
300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
more..


రైతులపై