అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు


అగ్రకుల అహంకారం: మీసాలు పెంచాడని దళిత విద్యార్థిపై దాడి చేసి మీసాలు గీయించిన ఠాకూర్లు

అగ్రకుల

24-07-2021

అతనొక దళితుడు. పేరు రజత్ కుమార్. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ గ్రామం అతనిది. గత ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో రజత్ తన ఇంటి నుండి బైటికి వచ్చి రోడ్డు మీద నడిచి పోతుండగా ఓ అగ్రకుల ఉన్మాద మూక ఆయనకు అడ్డు తగిలింది. నీరజ్ రానా, సత్యం రానా, మోకం రానా, రిపాంటు రానా, మోంటీ రానా , సందీప్ రానా అనే ఠాకూర్ కులానికి చెందిన ఈ మూక చేతుల్లో కత్తులున్నాయి. హటాత్తుగా రజత్ పై దాడికి దిగారు. కులం పేరుతో బూతులు తిడుతూ కొట్టడం మొదలు పెట్టారు. ʹʹఅరేయ్...దళిత... గడ్డం, మీసాలు పెంచుకుంటావా? గడ్డం , మీసాలు పెంచుకోవడం ఠాకూర్లు మాత్రమే చేయాలిʹʹ అని చెప్పరాని భాషలో బూతులు తిడుతూ, కొట్టుకుంటూ ఆ మూక రజత్ ను లాక్కుంటూ బార్బర్ షాపుకు తీసుకెళ్ళారు. అక్కడ బలవంతంగా బార్బర్ తో రంజిత్ కుమార్ మీసాలు తీసేయించారు. పైగా ఈ తతంగాన్ని వీడియో తీశారు. పోలీసులకుపిర్యాదు చేస్తే మొత్తం కుటుంబాన్ని సజీవ దహనం చేస్తామని వదిలారు.

ఇంత జరిగినా భయంతో రజత్ కుటుంబం పోలీసులకు పిర్యాదు మాత్రం చేయలేదు. ఠాకూర్ల దాడితో రజత్ కు తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ జ్వరంతోనే మర్నాడు జరిగిన బీటెక్ పరీక్షలకు హాజరయ్యాడు. ఇక ఆ ఠాకూర్ల మూక ఈ సంఘటన వీడియోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయడం మొదలు పెట్టారు. అక్కడి నుండి ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశారు. అప్పటికే అవమానంతో రగిలిపోతున్న రజత్ కుమార్ సోష‌ల్ లో ఆ వీడియోను చూసి ... తనపై దాడి జరిగి ఐదు రోజుల తర్వాత పోలీసులకు పిర్యాదు చేశాడు.
ʹʹఆదివారం ఉదయం 7 గంటల సమయంలో నేను మా గ్రామమైన సిమ్లానాలో ఒక వీధి గుండా వెళుతుండగా, నీరజ్ రానా, సత్యం రానా, మోకం రానా, రిపాంటు రానా, మోంటీ రానా మరియు సందీప్ రానా నన్ను చుట్టుముట్టారు. వారు నన్ను కులం పేరుతో తిట్టారు, కొట్టారు. వారి దగ్గర కత్తులు మరియు ఇతర పదునైన ఆయుధాలు ఉన్నాయి. వారు నన్ను చంపేస్తామని బెదిరిస్తూ బార్‌షాప్‌కు లాక్కెళ్ళారు. అక్కడ నా మీసాలు కత్తిరించారు. దాన్ని వీడియో తీశారుʹఅని పోలీసులకు రజత్ చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు..

" గడ్డం, మీశాలు పెంచుకోవడానికి మీకు ఎంత ధైర్యం? మీరు మా లాంటి ఠాకూర్లలా ఉండగలరని అనుకుంటున్నారా? మాకు మాత్రమే గడ్డం, మీసాలు ఉంటాయి. పోలీసులకు పిర్యాదు చేస్తే నన్ను, నా కుటుంబాన్ని సజీవ దహనం చేస్తాము" అని రంజిత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

రంజత్ పిర్యాదు ఆధారంగా గురువారం సాయంత్రం బాద్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదు. విచారణ చేస్తున్నామని చెపుతున్నారు.

ʹʹఆ ఏడుగురు నిందితులను ఇంకా అరెస్టు చేయ‌లేదు కాని వారిని మేము ట్రాక్ చేస్తున్నాము" అని సహారాన్పూర్ ఎస్పీ శివసింపి చనప్ప చెప్పారు.

ʹమా గ్రామంలో ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి కాదు. ఉన్నత కులాల ఆధిపత్యం ఎప్పటి నుండో ఉన్నది. మేము అణచివేతకు గురవుతునే ఉన్నాము, ʹఅని రంజత్ కుమార్ సోదరుడు సోను కుమార్ అన్నారు. భీమ్ ఆర్మీ సహారాన్పూర్ యూనిట్ అధ్యక్షుడు రోహిత్ రాజ్ ఇలా అన్నారు, "సహారాన్పూర్లో అనేక గ్రామాలు ఉన్నత కులాల ఆధిపత్యం కింద ఉన్నాయి. కొన్ని సమయాల్లో, వారు మాతో తింటారు, త్రాగుతారు. మరి కొన్నిసార్లు వాళ్ళిలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు.

Keywords : uttar pradesh, meerat, Saharanpur, Thakur men, dalit youth, Dalit techie thrashed, beard shaved by Thakur men in Uttar Pradesh
(2021-09-22 07:07:19)No. of visitors : 426

Suggested Posts


అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లల‌కేమో చావుకేకలు !

ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక‌ 63మంది చిన్నారుల‌ ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు ....

అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది

నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మ‌ల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి

రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే ‍- బీజేపీ నేత

రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు.

అది మనువాదపు కసాయి రాజ్యం ‍‍- ప్రేమంటే నరనరాన ద్వేషం

ఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు....

యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !

ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్‌ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి....

అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?

విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది....

యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు

అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు....

ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్‌ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీత

ఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి.

ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్‌ ఉదంతం మరవకముందే బదూన్‌లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది.

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల‌ బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


అగ్రకుల