సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !


సరిహద్దు ఘర్షణ‌:మిజోరాం పోలీసుల కాల్పుల్లో ఆరుగురు అస్సాం పోలీసులు మృతి !

సరిహద్దు

26-07-2021

మిజోరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు 50 మందికి పైగా గాయపడ్డారు. అసోం, కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ కూడా గాయాలపాలయ్యారు. అస్సాం పోలీసులు తమపై గ్రైనేడ్లు ప్రయోగించడం వల్ల తాము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని మిజోరాం పోలీసులు తెలిపారు.

మిజోరం, అసోం రాష్ట్రాల మధ్య సుమారు 164 కి.మీ దూరం ఉంది. గత ఏడాది ఆగష్టు మాసంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా కాచర్ జిల్లాలో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి.
ʹʹఅసోం, మిజోరం సరిహద్దుల్లో చెలరేగిన అల్లర్లలో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన చాలా బాధించింది. ఆ కుటుంబాలకు నా సంతాపాన్ని ప్రకటిస్తున్నానుʹʹ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అసోంలోని కచార్ జిల్లాలో, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయని, ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పాటు అసోంలో పర్యటించారు. తిరిగి ఢిల్లీకి చేరుకోగానే ఈ అల్లర్లు జరిగాయి.

కాగా జరిగిన హింసకు అవతలి పక్షమే కారణమంటూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల అధికారులు కూడా ఒకరిపై ఒకరు విమర్షలు సంధించుకున్నారు.

మిజోరాం వైపు నుండే హింస జరిగిందని, తమపై ఆ రాష్ట్ర ప్రజలు, పోలీసులు హటాత్తుగా దాడికి దిగారని అస్సాంకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆరుగురు పోలీసు సిబ్బంది మరణించారని, కనీసం 50 మందికి గాయాలయ్యాయని ఆయన చెప్పారు.
"కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నింబల్కర్ వైభవ్ చంద్రకాంత్ కూడా గాయపడ్డారు" అని ఆయన‌ తెలిపారు.
"రాళ్ళ‌తో దాడి చేయడం వలన అనేక మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు," అని అధికారి అన్నారు.

మరో వైపు అసో వైపు నుండే మొదట దాడి జరిగిందని మిజోరాం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. "అస్సాం పోలీసులు నలభై రౌండ్ల టియర్ గ్యాస్ పేల్చారు, లాఠీచార్జ్ చేశారు" అని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు.

దీనిపై మిజోరాం సిఎం జోరమ్‌తంగా ఓ ట్వీట్ చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణను ఆపడానికి మిజోరాం పోలీసులు ప్రయత్నిస్తూ ఉండగా అసోం పోలీసులు మిజోరాం పోలీసులపై లైలాపూర్ వద్ద దాడికి దిగారని ఆయన ఆరోపించారు.

ʹʹమిజోరాం భూభాగంలోకి అస్సామీయుల‌ చొరబాటు, దురాక్రమణ క్రమంలో అస్సాం ప్రభుత్వం చేసిన అన్యాయమైన చర్యలను మిజోరాం ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. రెండు వైపులా జరిగిన అనవసరమైన హింస పట్ల‌ తీవ్రంగా విచారిస్తోంది. ʹ అని ముఖ్యమంత్రి ట్వీట్ లో పేర్కొన్నారు.

మిజోరాం రాష్ట్ర హోంమంత్రి లాల్ చామ్లియానా మాట్లాడుతూ ʹఅస్సాం ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజిపి) నేతృత్వంలోని 200 మంది సాయుధ అస్సాం పోలీసు సిబ్బంది వైరెంగ్టే ఆటో రిక్షా స్టాండ్‌కు వచ్చారు.అక్కడ సిఆర్‌పిఎఫ్ సిబ్బంది నిర్వహిస్తున్న డ్యూటీ పోస్టును బలవంతంగాదాటి, మిజోరాం పోలీసులు నిర్వహించే డ్యూటీ పోస్టును అధిగమించారుʹ అని అన్నారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న వైరెంగ్టే పట్టణ నివాసితులు ఏమి జరుగుతుందో ఆరా తీయడానికి అక్కడికి వెళ్లారని ఆయన చెప్పారు. "ఆ సమయంలో అస్సాం పోలీసులు నిరాయుధ పౌరులపై లాఠీ ఛార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనివల్ల అనేక మంది పౌరులు గాయపడ్డారు" అని హోంమంత్రి చెప్పారు.

మిజోరాం పోలీసులపైన అస్సాం పోలీసులు 10 గ్రెనేడ్లను ప్రయోగించారని ఆత్మరక్షణ కోసం మిజోరాంపోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

Keywords : assam, mizoram, 6 Assam policemen killed as border tensions with Mizoram escalate, cops says around 50 injured
(2021-09-23 05:51:50)No. of visitors : 279

Suggested Posts


ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు అన్నీ బూటకమే - CRPF ఐజీ సంచలన రిపోర్ట్

ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు లొంగిపోయి ఇతర కేసుల్లో అరెస్టయిన వారిని, చిల్లర దొంగలను, వారూ దొరకనప్పుడు అమాయకులను పట్టుకెళ్లి కాల్చి చంపుతారని ఆయన వివరించారు. చిల్లర దొంగలను, అమాయకులను పట్టుకెళ్లినప్పుడు వాళ్లను కొన్ని రోజులు రహస్యంగా నిర్బంధించి ఉంచుతారని, వారి గురించి ఎవరు ఫిర్యాదు చేయకపోతే వారి ఎన్‌కౌంటర్‌ త్వరగా పూర్తవుతుందని అన్నారు...

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని వ్యతిరేకిద్దాం - గుత్తా రోహిత్.

అస్సాం జనాభా 3.3 కోట్లకి పైమాటే. అందులో 3.29 కోట్ల మంది ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పత్రంలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 3.11 కోట్ల మంది పేర్లు ముఖ్య జాబితాలో చేరాయి. మిగతావి తిరస్కరనకి గురయ్యాయి. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నలభై లక్షల ఏడు వేల ఏడు మంది పేర్లు ఉన్నాయి.

అవును మేము గుండాలమే హిందువులు చర్చిలకు వెళ్తే దాడులు చేస్తాం....భజరంగ్ దళ్ నేత‌

ʹʹఅవును మేము గుండాలమే చర్చిలకు వెళ్ళే హిందువుల మీద దాడులు చేస్తాంʹʹ అని అస్సోంకు చెందిన భజరంగ్‌ దళ్ నేత మిథు నాథ్ రెచ్చిపోయాడు. కాచర్ జిల్లా సిల్‌చార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భజరంగ్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిథు నాథ్ ఈ విధమైన గుండా భాషను మాట్లాడాడు.

Search Engine

300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు
more..


సరిహద్దు