చరిత్రాకాశంలో ధ్రువనక్షత్రం

చరిత్రాకాశంలో

27-07-2021

చారు మజుందార్‌కు నూరేళ్ళు. ఆయన నిర్మించిన విప్లవ పార్టీకి యాభై ఏళ్లు. ఆయన ఆరంభించిన నక్సల్బరీకి యాభై రెండేళ్లు. ఆయన జీవించింది యాభై మూడేళ్లు మాత్రమే. ఇది చారుమజుందార్‌ శతజయంతి సంవత్సరం. నేడు శతజయంతి కార్యక్రమాలు ఆరంభమవుతున్నాయి. చరిత్రలో ఆయన వేలాది విప్లవకారుల మూర్తిమత్వంగా రూపొందారు. చారుమజుందార్‌ నక్సల్బరీ నిర్మాత మాత్రమే కాదు. ఆయన ఆలోచనలు భారత విప్లవోద్యమంలో నేటికీ కొనసాగుతున్నాయి. ఆయన కలలు బీజరూపంలో వాస్తవమవుతున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తి చారుమజుందార్‌. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయనలాంటి వ్యక్తి ఆయన ఒక్కడు మాత్రమే.

ఆయన దేశ చరిత్రను ఒక పెద్ద మలుపు తిప్పారు. భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని వర్గపోరాట పట్టాల మీదికి ఎక్కించారు. ఈ ప్రయాణంలో అంతులేని సంక్షోభాలు ఉన్నాయి. లెక్కలేనన్ని ఒడుదొడుకులు ఉన్నాయి. కానీ కొనసాగింపు ఉన్నది.విస్తృతి ఉన్నది. విప్లవ తీక్షణత ఉన్నది. ఆయన గురించి చెప్పే ఏ మాట అయినా చారిత్రక విశ్లేషణకు లోబడి ఉండాలి. చరిత్రతో సంబంధం లేకుండా చారుమజుందార్‌ను అర్థం చేసుకోలేం. నక్సల్బరీకి ముందు పార్టీలో ఆయన జిల్లా స్థాయి నాయకుడు. కాకపోతే అప్పటికే ఆయనకు తెభాగా ఉద్యమ అనుభవం ఉన్నది. పార్టీ చరిత్రలో ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న కామ్రేడ్స్ వందలాది మంది ఉన్నారు. దీనికి భిన్నమైన వ్యక్తిగా చారుమజుందార్‌ రూపొందారు. మిగతా వాళ్లకంటే భిన్నమైన పాత్ర పోషించారు. అందరికీ ఉన్నట్లే ఆయనకూ ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తిస్తూనే ఆయన పాత్రను చరిత్రలో భాగంగా చూడాలి. చరిత్ర నిర్మాణంలో భాగంగా చారుమజుందార్‌ వ్యక్తిత్వ నిర్మాణాన్ని కూడా చూడాలి.

నిజానికి ఏ చారిత్రక వ్యక్తినైనా ఇలాగే చూడాలి. చరిత్రతో సంబంధంలేని వ్యక్తి గుణ గానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. చరిత్రలో వాళ్ల నిజ పాత్ర అర్థం కాదు. ఈ దృష్ట్యా ఆయన్ను స్థూలంగా రెండు ప్రాతిపదికలపై పరిశీలించవచ్చు. ఒకటి: నక్సల్బరీ నిర్మాతగా ఆయన పాత్రను అంచనా వేయాలి. రెండు: ఈ యాభై ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలోంచి ఆయన ప్రాసంగికతను ఎత్తి చూపాలి. ఆయన శత జయంతి సందర్భంలో విప్లవ శక్తులు చేయాల్సిన కనీసమైన పని ఇది. ఈ చారిత్రక రాజకీయ ప్రాతిపదికల మీది నుంచి సాహిత్య సాంస్కృతిక మేధో రంగాలపై ఆయన వేసిన ప్రభావాన్ని పరిశీలించవచ్చు.

అయితే చారుమజుందార్‌ను చారిత్రకంగా అర్థం చేసుకోవడానికి కూడా రెండు పెడ ధోరణులు అడ్డం ఉన్నాయి. దీనికీ చరిత్రలోనే కారణాలు ఉన్నాయి. ఆయన సొంత వ్యక్తిత్వంలో కూడా ఉన్నాయి. ఆయన ఎంత ప్రభావశీలమైన నాయకుడంటే ఈ తరానికీ ఆయన విప్లవ కథా నాయకుడు. బహుశా విప్లవ శిబిరంలో భగత్‌ సింగ్‌ తర్వాత అంత ప్రజ్వలనశక్తి చారుమజుందార్‌కే ఉన్నది. అదే సమయంలో ఆయన మీద ఒక హేతుబద్ధ విమర్శను కూడా సహించలేనివాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి ఉద్వేగ స్థితి విప్లవ శిబిరంలో ఉంది. మూడు తరాల తర్వాత కూడా అది ఉన్నదంటే ఆయన పాత్ర ఏమిటో తెలుసుకోవచ్చు. ఆయన ప్రభావం ఏమిటో గమనించవచ్చు.

చరిత్రలో ఆయన నిత్య పునర్జీవన శక్తి. చరిత్ర ప్రజల భౌతిక ఆచరణను మాత్రమే భవిష్యత్‌ తరాలకు అందించదు. ఆ ఆచరణలోని ఉద్వేగాలను కూడా నిత్యం సరఫరా చేస్తుంది. అదే తిరిగి భౌతిక ఆచరణకు పురికొల్పుతుంది. అంటే చరిత్రలో మానవ అనుభవం మాత్రమే ఉండదు. దాని చుట్టూ పోగుపడిన ఉద్వేగాలు కూడా చరిత్రలో భాగమే. దీన్ని అర్థం చేసుకోలేకపోతే చరిత్రలోని చాలా విషయాలు విస్మరణకు గురవుతాయి. అయితే విస్తారమైన ప్రజా ఆచరణలో భాగమైన చారుమజుందార్‌ లాంటి వ్యక్తులను ఉద్వేగాల నుంచి సక్రమంగా అంచనా వేయలేం. చరిత్ర – చారుమజుందార్‌ అనే ఫ్రేంవర్క్‌లో పరిశీలించాలి. లేకపోతే హేతుబద్ధత లోపించే ప్రమాదం ఉంది.

అలాగే ఆయన చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పరస్పర విరుద్ధమైన అంచనాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు వచ్చినవి కావు. ఆయన ఒక ఉత్తేజపూరిత నాయకుడిగా జీవించి ఉన్న రోజుల్లోనే ఈ వివాదాలు తలెత్తాయి. వాటి గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకుంటే సరిపోతుంది. భారత విప్లవోద్యమం ఇప్పుడీ దుస్థితిలో ఉండటానికి ఆయన నాయకత్వంలో నక్సల్బరీ మొదలు కావడమే కారణం అనే వాళ్లున్నారు. అనేక పరిస్థితుల వల్ల ఆ ఉద్యమానికి ఆయన నాయకుడు అయి ఉండవచ్చు... కానీ భారత విప్లవోద్యమానికి నాయకత్వాన్ని అందించే స్థాయి ఏ రకంగానూ ఆయనకు లేదు. అందుకే ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం విఫల సన్నివేశంగా మారిపోయిందనే వాళ్లూ ఉన్నారు. ఈ కారణం వల్ల నక్సలైట్‌ ఉద్యమంలోని త్యాగనిరతిని గౌరవిస్తాం.. కానీ ఆ మార్గాన్నీ అంగీకరించలేమని అంటూ ఉంటారు. అసలు నక్సల్బరీ పంథా విప్లవ మార్గమే కాదని తేల్చేసేవాళ్లనూ చూస్తుంటాం. ఇదొక చారిత్రక అంధత్వం.

ఈ రెండు పెడ ధోరణులు ఇప్పటికీ ఎంతో కొంత బతికే ఉన్నాయి. చారుమజుందార్‌ను చారిత్రకంగా అంచనా వేసేటప్పుడు వీటిని మర్చిపోడానికి లేదు. ఈ యాభై ఏళ్లలో విప్లవోద్యమంలో చాలా మార్పులు వచ్చాయి. మన వ్యవస్థలో తీవ్రమైన మార్పులు జరిగాయి. రాజ్యం విస్తరించింది. అనేక కొత్త ఉద్యమాలు రంగం మీదికి వచ్చాయి. ఈ వ్యవస్థ సహజంగానే తనకు తగిన ఒక కొత్త తరాన్ని ఇప్పుడు తయారు చేసుకుంది. దానితో కలిసి నడుస్తోంది. ఈ కొత్త తరం మానసికతలో వ్యవస్థ ప్రతిబింబిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక కొత్త సామాజిక చారిత్రక భావజాల ప్రపంచంలో విప్లవం చేస్తున్నాం. ఈ కొత్త ప్రపంచంలో విప్లవోద్యమం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సవాళ్లు విప్లవోద్యమం ముందుకే వచ్చి నిలబడతాయి. వర్గపోరాటమే అన్ని సవాళ్లను పరిష్కరిస్తుంది. కాబట్టి ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. అయితే ఇదొక కొత్త సంక్షోభం. దీని అర్థం ఏమిటో తెలుసుకుంటూ విప్లవోద్యమం పురోగమిస్తోంది.
పాణి

(జూలై27, 2019 న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనది)

Keywords : charumajumdar, naxalbari, maoists, cpi ml,
(2024-04-24 23:28:01)



No. of visitors : 1281

Suggested Posts


చారు మజుందారికి 50 ఏండ్లు...చారు మజుందార్ కు 100 ఏండ్లు

ఎవరైనా ఒకటో రెండో విప్లవ కార్యమాల్లో పాల్గొని , దాన్నో పచ్చబొట్టుగా చూపించుకొని మురిసిపోతారు. కానీ అజన్మాంత విప్లవకారుడు గా జీవించడం,మరణించడం మహత్తరమైన విషయం. అది పలప్రదమైన ప్రజాజీవితం. 1967 లో జరిగిన నక్సల్బరీ రైతాంగ సాయుధ తిరుగుబాటుకు ముందు ఎప్పుడూ వినిపించని చారూ మజుందార్ పేరు, ఇప్పుడు ప్రపంచంలోనే విప్లవం అనే పదానికి పర్యాయం.

Historic Eight Documents of Charu Majumdar (8th Document)

In the post-election period our apprehensions are being proved correct by the actions of the party (CPI-M) leadership itself. The Polit Bureau has directed us to ʹcarry on the struggle to defend the non-Congress ministries against reactionʹ. This suggests that the main task of Marxists is not to intensify the class struggle,

Historic Eight Documents of Charu Majumdar (1st Document)

The Congress government has arrested one thousand communists during the last one month. Most of Central and Provincial leadership are in jail today. Gulzarilal Nanda has announced that he will not accept the verdict of the electorate

భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌ - రేపే శతజయంతి సదస్సు

ఆయన అద్భుతమైన సాహసి. ఏటికి ఎదురీదాడు. ఒక తరాన్ని విప్లవంలోకి నడిపించాడు. అనేక తరాలకు విప్లవోత్తేజాన్ని అందించాడు. ఆలోచనలను ఆచరణగా మార్చడంలో సాటిలేని నిపుణుడు. సాయుధ పోరాట రాజకీయాలకు తిరుగులేని ప్రతినిధి. కా. చారుమజుందార్‌ భారత విప్లవోద్యమ నాయకుడు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం.

Learn From Charu Mazumdar! -Communist Workers Front, Canada

On May 15, 1919, Charu Mazumdar, General-Secretary of the Communist Party of India (Marxist-Leninist) [CPI(ML)] was born in Siliguri under British occupation. In his short life, Comrade Mazumdar

Historic Eight Documents of Charu Majumdar(2nd Document)

As revisionist thinking nestled in the Indian party for a long time, we could not build up a correct revolutionary party. Our primary task today is to build up a correct revolutionary party fighting uncompromisingly against this revisionist thinking.

Historic Eight Documents of Charu Majumdar (7th Document)

During the last two years, the spontaneous struggles of the petty-bourgeois youths and students have created a stir from one end of India to another. Although at the beginning the demand for food was the main demand, but gradually the demand for ousting the Congress government has become main.

Historic Eight Documents of Charu Majumdar (4thDocument)

We shall have to carry on daily the struggle against revisionism, adopting the tactics of area-wise seizure of power. Certain revisionist ideas are firmly rooted inside the party. We shall have to carry on the struggle against them. We are discussing some questions here.

Historic Eight Documents of Charu Majumdar (5th Document)

There are some comrades who get scared at the mentioning of armed struggles, and go on seeing the spectre of adventurism. They think that the work of building a revolutionary party has ended with the very adoption of the programme in other

Historic Eight Documents of Charu Majumdar (6th Document)

The Party leaders after long imprisonment, after the Party Congress, for the first time had a session of the full Central Committee. The central leadership of the party which was formed through struggles against revisionism, adopted an ideological resolution and declared bluntly

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చరిత్రాకాశంలో