kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI


kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMI

kashmir:

29-07-2021

అవార్డు గ్రహీత, కశ్మీరీ ఫోటో జర్నలిస్ట్, NWMI సభ్యురాలు మస్రత్ జహ్రా వృద్ధ తల్లిదండ్రులను వేధింపులు, హింసకు గురిచేయడం పట్ల నెట్ వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా (NWMI), ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దుర్బల కుటుంబ సభ్యులపై వేధింపులు, బెదిరింపుల లాంటి అసహ్యకరమైన ఎత్తుగడల్ని తీవ్రంగా ఖండించాలి.

ʹ2021, జూలై 25 సాయంత్రం శ్రీనగర్‌లోని బటమలూ ప్రాంతంలో మస్రత్ జహ్రా తల్లిదండ్రులు బంధువుల ఇంటికెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు పోలీసులు వారిని వెంబడించి, వృద్ధ దంపతులను కొట్టి వారిని కాల్చి చంపేస్తామనీ లేకుంటే జైలులో పడేస్తామని బెదిరించారు. ఆమె తండ్రి ఐడి కార్డు తీసుకున్న తరువాతనే వారిని వెళ్ళడానికి అనుమతించారు. ʹʹఅధికార ఉన్మత్తులైన, జమ్ము-కశ్మీర్ పోలీసులు ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో బటమలూలో నా తల్లిదండ్రులను కొట్టారు. నా తండ్రి ఐడి కార్డును పోలీసులు తీసుకేళ్తుంటే, అమ్మ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమెను కూడా కొట్టారు. వృద్ధ దంపతులపై జెకెపి చేసిన ఈ అధికార ఉన్మత్త ప్రవర్తన ఎంతవరకు సమర్థనీయం కాదుʹʹ అని మస్రత్ ట్వీట్ చేసింది. తెలియని వ్యక్తుల బెదిరింపు, నిఘా రూపంలో బెదిరింపు కొనసాగడంతో, తక్షణ వైద్య సహాయం పొందడం వారికి కష్టమైంది.

మస్రత్ జహ్రాను వేధించడం ఇదే మొదటిసారి కాదు. ఫేస్‌బుక్‌లో దేశ వ్యతిరేక పోస్ట్‌లను అప్ లోడ్ చేసిందనే ఆరోపణలతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) లోని సెక్షన్ 13, ఇండియన్ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 505 కింద 18 ఏప్రిల్ 2020 న ఆమెపై ఎఫ్‌ఐఆర్ దాఖలు అయింది. ఆ సమయంలో, కాశ్మీర్ క్షేత్ర వాస్తవికతను ధైర్యంగా ఆవిష్కరించిన సాహసోపేతమైన ఫోటో జర్నలిస్ట్‌ను బెదిరించడం, గొంతు నొక్కాలనే ఉద్దేశ్యంతో దాఖలు చేసిన ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా NWMI నిరసన వ్యక్తం చేసింది.

భారత సైన్యం- ఉగ్రవాదుల బృందం మధ్య షాపియన్ లోని కాచ్ డోర్వాలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ʹగన్ వర్సెస్ కెమెరాʹ అనే పేరుతో 2018, మే 15న పోస్ట్ చేయబడిన ఫోటో వల్ల 2018 లో మస్రత్‌ను ట్రోల్ చేసారు. అప్పటి NWMI జారీ చేసిన ప్రకటనలో చెప్పినట్లుగా, ʹఇప్పటికే ధ్రువపరచిన రాజకీయ వాతావరణంలో ఒక జర్నలిస్టును దుర్మారంగా, బాధ్యతా రహితంగా ముద్ర వేయడం ప్రమాదకరం, అలా చేయడాన్ని నిస్సందేహంగా ఖండించాలి.ʹ

న్యాయం, ఖచ్చితత్వం, సత్యాన్ని మాట్లాడే నిబద్ధత కలిగిన విలేకరులను, సంపాదకులను సత్కరించడానికి యిచ్చే పీటర్ మాక్లర్ బహుమతి-2020 మస్రత్‌కు లభించింది.

మహిళా ఫోటో జర్నలిస్టుల సాహసోపేతమైన పనికి మెప్పుదలగా యిచ్చే అంజా నీడ్‌రింగ్‌హస్ కరేజ్ ఇన్ ఫోటో జర్నలిజం అవార్డు (Anja Niedringhaus Courage In Photojournalism Award ) 2020 ను ఇంటర్నేషనల్ ఉమెన్స్ మీడియా ఫౌండేషన్ మస్రత్‌కు ప్రదానం చేసింది.

ప్రస్తుతం కాశ్మీర్ వెలుపల నివసిస్తున్న, పనిచేస్తున్న మస్రత్ జహ్రాపై ఒత్తిడి తీసుకురావడానికి, గొంతు నొక్కడానికి అమలుపరచే ఎత్తుగడలో భాగంగానే ఆమె తల్లిదండ్రులపై నిఘా, వెంటబడడం, వేధింపులు, హింసలకు గురి చేయడం చేస్తున్నారు. జర్నలిస్టులు తమకు లేదా తమ ప్రియమైనవారికి హాని జరగకుండా తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించటానికి వీలుగా, జర్నలిస్టుల, వారి కుటుంబ సభ్యుల భద్రత చాలా ముఖ్యమైనది.

ఇలాంటి వేధింపులు వెంటనే ఆపివేయాలనీ, ఈ ఘటనలో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

నెట్ వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా (NWMI)

26 July 2021

(తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి)

Keywords : NWMI, Kashmir, Masrat Zahra, The Network of Women in Media
(2021-09-23 05:02:04)No. of visitors : 225

Suggested Posts


కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం

తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు.

మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా

మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణ‌

ఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సం

లాక్డౌన్ సమయంలో తన సోదరి ఇంట్లో వుంటున్న కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ అక్టోబర్ 5, ఆదివారంనాడు తన ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లంతా భీభత్సంగా వుండటమే కాకుండా, పడకగదిలో మంచం మీద డాక్టర్ ఇమ్రాన్ గనై అనే వ్యక్తి పడుకొన్నాడు. అతనితో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

kashmir: UAPA కింద 15 ఏండ్ల బాలుడు అరెస్ట్

జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లా బుమ్హామా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో కలిపి 15 ఏండ్ల బాలుడు జహాబ్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద‌ కేసు నమోదు చేశారుపోలీసులు. ఈ నలుగురిని మే 29 న పోలీసులు అరెస్టు చేశారు

ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMI

The Network of Women in Media, India, expresses its outrage at the harassment and violence meted out to the elderly parents of award-winning Kashmiri photojournalist and NWMI member Masrat Zahra. Such harassment of vulnerable family members is an abhorrent strategy of intimidation that must be strongly condemned.

kashmir:పడవ ప్రమాదం పై వాట్సప్ లో స్టేటస్ పెట్టినందుకు జర్నలిస్టు అరెస్టు

గతంలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఓ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు.

Search Engine

న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభ‌
300 రోజులు పూర్తి చేసుకున్న రైతాంగ ఉద్యమం.... 27న దేశవ్యాప్త బంద్
నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌
Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman
The Maoist party has called for a successful ʹBharat Bandhʹ of farmersʹ unions on the 27th of this month
సెప్టెంబర్ 20 న ఛత్తీస్‌గఢ్ బంద్‌కు ఆదివాసీ సమాజ్ పిలుపు
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
17th Anniversary of the Maoist Party... Communist Party of the Philippines Revolutionary Greetings
భీమా కోరేగావ్ నిందితులను విడుదల చేయాలంటూ తమిళనాడులో మానవహారం
Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు
దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక
న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌
సెప్టెంబర్ 1948,17న సాధించిన విలువలు ఏమిటి - వరవరరావు
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం
సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్
పోలీస్ క్యాంప్ ల‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఉద్యమం - అనేక చోట్ల‌ రోడ్లను తవ్వేస్తున్న‌ ఆదివాసులు
పిల్లలపై నక్సలైట్లుగా ముద్ర వేసి జైలుకు పంపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నిరసన
చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
మహేందర్,కిరణ్ లకు ప్రాణహాని తలపెడితే తీవ్ర పరిణామాలు - మావోయిస్టు నేత గణేష్ హెచ్చరిక‌
సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు
ఈ రోజు రాజకీయ ఖైదీల దినోత్సవం... ʹజైలులో మనిషిగా ఉండటానికి జైలు నియమాలను ఉల్లంఘించడం చాలా ముఖ్యంʹ
పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌
Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru
Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !
more..


kashmir: