దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన


దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

దేశంలో

30-07-2021

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 8 నెలలకు పైగా దేశ రైతాంగం చేస్తున్న పోరాటానికి విప్లవ జేజేలు చెబుతూ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....

24 జూలై, 2021

దృఢ సంకల్పంతో రాజీలేని పోరాటం సాగిస్తున్న భారత రైతాంగానికి విప్లవ జేజేలు

ప్ర‌జా నినాదంగా మారిన ʹసాగు చట్టాలు రద్దుʹ కై తుదివరకూ పోరాడుదాం

గత నవంబర్ 26 నుండి నేటి వరకు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా దృఢ సంకల్పంతో పోరాడుతున్న భారత రైతాంగానికి మా పార్టీ కేంద్రకమిటీ మున్ముందుగా విప్లవ జేజేలు తెలుపుతోంది. ఈ 8 మాసాల కాలంలో దాదాపు 500 మందికి పైగా ఉద్యమ రైతులు రాజ్యహింస సహా అనేక కారణాలతో అసువులు బాసారు. అశయ సాధనలో అసువులు బాసిన వారందరికి వినమ్రంగా మా కేంద్రకమిటీ తలవంచి విప్లవ జోహార్లు చెపుతోంది. జియో టవర్లను కూల్చడంపై పార్లమెంటులో తన విచారాన్ని ప్రకటించిన మోదీ అన్నదాతల మరణాలపై మౌనం వహించి తన దోపిడీ వర్గ స్వభావాన్ని చాటుకున్నాడు.

కొరోనా కాలంలో రైతుల ధర్నాను నిలిపివేయాలని ప్రభుత్వం కోరడం కౄర పరిహాసంగా ఉంది. చట్టాల రూపకల్పనలో ప్రభుత్వాలకు అడ్డం రాని కొరోనాను వాటిని వ్యతిరేకిస్తూ అన్నింటికి తెగించి పోరాటాలకు దిగక తప్పని రైతుల ధర్నాను నిలిపివేయడానికి మాత్రం ఒక సాకుగా చూపడాన్ని ఆ రైతాంగంతో పాటు మా పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నది. దేశంలో రెండవ విడుత కొరోనా అల ʹడెల్టాʹ అతి వేగంగా విస్తరించడానికి పూర్తిగా బాధ్యత పడాల్సిన కేంద్రం కనీసం ఆ మహమ్మారితో దేశంలో వాటిల్లిన మరణాలపై ప్రజలకు నిజాలు వెల్లడించడానికి ధైర్యం చేయడం లేదు. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాలను బట్టి దేశంలో ప్రభుత్వ లెక్కల కన్నా ఐదు రెట్లు అధికంగా మరణాలు సంభవించాయి. కొరోనా నివారణ చర్యలు చేపడుతూనే సాగు చట్టాల రద్దుకై ఉద్యమించక తప్పదు.

గత మూడు దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న ఉదారవాద ఆర్థిక విధానాలు భారత వ్యవసాయ రంగాన్ని అతలా కుతలం చేస్తూ లక్షలాది రైతుల ప్రాణాలను బలిగొన్నాయి. ఆ విధానాల పరాకాష్టగా మోదీ ప్రభుత్వం ముందుకు తెచ్చిన సాగు చట్టాలతో భారత రైతాంగ జీవితాలే కడతేరనున్నాయి. ఆ వినాశకర పరిస్థితులకు దారి తీయకుండా దోపిడీ ప్రభుత్వ చట్టాల రద్దుకై తుదివరకూ పోరాడుదాం. ఉదారవాద ఆర్థిక విధానాలను అడుగడుగునా ఎదుర్కోవాలని మా పార్టీ ప్రజలకు పిలుపిస్తోంది.

2021 జూన్ 5నాటికి ఆర్డినెన్సుల (సుగ్రీవాజ్ఞ) రూపంలో సాగు చట్టాలు ఉనికిలోకి వచ్చి యేడాది పూర్తయింది. రైతు అందోళనకూ యేడాది నిండింది. ఆర్డినెన్సన్లను రూపొందించిన నాటి నుండే రైతులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందోళనకు దిగారు. అవి చట్టరూపం తీసుకున్నాక మొట్టమొదట హర్యానాలోని కురుక్షేత్ర లో గల ʹవీప్లిʹ మండీ ఎదుట 2020 సెప్టెంబర్ 10 నాడు తొలి ర్యాలీ జరిగింది. ʹకిసాన్ బచావో, మండీ బచావోʹ నినాదాలతో ట్రాక్టర్ ర్యాలీ జరిపిన రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. రైతులు రాళ్లనే అయుధాలుగా మలచుకొని ప్రతిఘటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రైతుల ఆందోళన అంచెలంచెలుగా విస్తరిస్తూ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరితో అది దిల్లీ ముట్టడిగా మారింది.

ప్రపంచంలోనే అద్వితీయమైనదిగా సాగుతున్న రైతాంగ పోరాటం ఫలితంగా 2021 జనవరి 12న సుప్రీంకోర్టు నూతన చట్టాల అమలుపై స్టే విధించింది. వారితో చర్చలకు నలుగురితో కూడిన ఒక కమిటీని నియమించింది. కానీ ఆ కమిటీలోని నలుగురిలో భూపేంద్ర సింగ్ మాన్ తాను ఆ కమిటీలో ఉండనని తన పేరును వెంటనే ఉ పసంహరించుకోవడం గమనార్హం. రైతు నాయకులు కూడ ఆ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించారు.

సుప్రీం కోర్టు విధించిన స్టే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 20 నాడు ఆ చట్టాల అమలును కేవలం 18 మాసాలు వాయిదా వేసుకుంది. రైతుల ఆందోళన ఫలితంగా 1. ఎన్‌సీఆర్లో కాలుష్యాన్ని ఆపడానికి చేపట్టిన చర్యలలో రైతులను దోషులుగా పేర్కొనబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2. విద్యుత్తు సవరణ బిల్లు (2020) డ్రాప్టును వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అమోదించింది. ఇవన్నీ రైతుల విజయాలే! అయితే, అసలు చట్టాల రద్దు మాత్రం మిగిలే ఉంది. అలాగే, కనీస మద్దతు ధర విషయంలో కూడ ప్రభత్వం చట్టాన్ని రూపొందించే హామీ ఏదీ ఇవ్వలేదు. మరోవైపు రైతు నాయకులతో జనవరి 22నాడు జరిపిన 10వ విడుత చర్చల అనంతరం కేంద్రం చర్చల నుండి వైదొలగి తన రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల వైఖరిని చాటుకుంది. ఈ వైఖరిని మా పార్టీ ఖండిస్తోంది. ʹసంయుక్త కిసాన్ మోర్చాʹ మాత్రం అలాంటి మొండి వైఖరి ఇప్పటివరకు చేపట్టకుండా చర్చల ద్వార సమస్య పరిష్కారాన్ని కోరుకోవడం అభినందనీయం.

కేంద్ర నాయకులు, బూటకపు రైతు నాయకుడు హర్పాల్ సింగ్ బెలారీ లాంటి వారి తొత్తులు, ప్రభుత్వ అనుయాయులు ముందునుండి కూడా రైతులను ఖలిస్తాన్ వాదులుగా, మావోయిస్టులుగా పేర్కొంటున్నారు. రైతుల డిమాండ్ల పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్రం ఎర్రకోటపై జెండా ఎగురవేయడం నుండి రైతాంగ డిమాండ్లను పక్కదారి పట్టించడానికి చేస్తున్న అన్ని కుట్రలను మా పార్టీ ముందు నుండి తీవ్రంగా ఖండిస్తున్నది.

దేశంలోని రైతాంగం సహ సమస్త పీడిత ప్రజల సమస్యలకు సరైన మార్గదర్శకత్వం వహిస్తూ వాటి పరిష్కారానికై తుదివరకూ రాజీలేని పోరాటాలను కొనసాగించే పార్టీ మా పార్టీయేననీ ఈ సందర్భంగా మేం మరోసారి స్పష్టం చేస్తున్నాం. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని ప్రతి ప్రజా సమస్య వెనుక మావోయిస్టులున్నారంటూ కలవరపడుతూ కంపించి పోతున్నాయి. మా పార్టీ దేశంలోని పీడిత ప్రజల పోరాటాలనన్నిటినీ నిస్సందేహంగా సమర్థిస్తున్నది. వాటికి నాయకత్వం వహించడం విప్లవకారులుగా మా బాధ్యత. అర్బన్ నక్సలైట్లన్నా, టర్బన్ నక్సలైట్లన్నా, ప్రభుత్వాలు ఇంకెన్ని పేర్లు పెట్టినా, ఎన్ని చట్టాలు సవరించినా, రూపొందించినా ప్రజా పోరాటాలను అపలేరు. వాటన్నిటిని సమర్థించకుండా, నాయకత్వం వహించకుండా ఏ శక్తులూ మమ్మల్ని అడ్డుకోలేవు.

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తులతో వారి సామ్రాజ్యవాద అనుకూల విధానాలతో రాజీలేని పోరాటాలు కొనసాగించకుండా ఈ దేశంలోని రైతుల ఏ ఒక్క సమస్య మౌలికంగా పరిష్కారం కాదని కూడ మాపార్టీ ఈ సందర్భంగా మరోమారు తేటతెల్లం చేస్తోంది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడడం కేవలం రైతాంగానికి మాత్రమే సంబంధించిందెంత మాత్రం కాదు. దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు చౌక దుకాణాల ద్వార లభించే సరుకులు సాగు చట్టాల అమలుతో కరువవుతాయి. దేశంలో అమలులోకి వచ్చిన ʹవన్ నేషన్ వన్ రాషన్ కార్డుʹతో పేదలకు సబ్సిడి బియ్యం గతంలా దొరకకుండాపోతాయి. భారత ప్రభుత్వం చౌక ధరల నిమిత్తం 3 లక్షల 17 వేల కోట్ల రూపాయల సబ్సిడికి తిలోదకాలు ఇవ్వనుంది. ఇలా అనేక రకాలుగా అ సాగుచట్టాలు విశాల ప్రజారాసుల జీవితాలను అస్తవ్యస్తం చేయనున్నాయి. అందుకే వాటిని భారత ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించి వాటి రద్దుకై పోరాడాలని మా పార్టీ పిలుపునిస్తోంది.

దేశంలోని సాగు చట్టాల రద్దుకై పోరాడుతున్న రైతాంగ నాయకులు ఇటీవల జరిగిన రాష్ట్రాల విధాన సభల ఎన్నికలలో జాతీ మత విష విద్వేషాలను రెచ్చగొట్టే హిందుత్వ శక్తుల ఓటమికి పిలుపునివ్వడం అభినందనీయం. రానున్న సంవత్సరం ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో విధానసభల ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడా హిందుత్వ శక్తుల ఓటమికి పిలుపివ్వాల్సిందే! కానీ, అదే సమయంలో పార్లమెంటరీ రాజకీయ పార్టీల అసలు నైజాన్ని మరిచిపోకూడదు. అవన్నీ దేశంలో సామ్రాజ్యవాద నియో లిబరల్ ఆర్థిక విధానాల అమలుకు అంకితమైనవేనన్న నిజాన్ని సదా గుర్తుంచుకోవాలి. అవి చేపట్టిన వినాశకర విధానాల ఫలితమే భారత వ్యవసాయ రంగం అధోగతి పాలు కావడం! కాబట్టి రైతుల పక్షాన నిజాయితీగా నిలిచే శక్తులతో, సంస్థలతో గట్టిగా సమైక్యమవుతూ సాగు చట్టాల రద్దుకై దిల్లీ కేంద్రంగానే తుదివరకూ భుజం భుజం కలిపి పోరాటాన్ని ఉధృతం చేయాలని మా పార్టీ కోరుతున్నది.

దిల్లీ నుండి రైతులను మరోప్రాంతానికి గెంటేయచూస్తున్న ప్రభుత్వ కుట్రలను ఓడించాలి. ప్రభుత్వ చట్టాలను సమర్ధించే దుష్ట పార్లమెంటరీ వ్యవస్థ ప్రతినిధులందరినీ సర్పంచ్ నుండి యంపీ వరకు ఎవరినైనా వారి గృహ గ్రామం నుండి తన్ని తరమండి. వారిపై అన్ని విధాల బహిష్కరణను అమలు చేయండి.

అభయ్,
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : farmers protest, cpi maoist, delhi, abhay
(2021-10-26 13:28:13)No. of visitors : 1178

Suggested Posts


ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !

బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది.

Search Engine

UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
లఖింపూర్ ఖేరీ లో రైతుల హత్య వెనుక కేంద్రమంత్రి హస్తం - యూపీ బీజేపీ నేత సంచలన ఆరోపణ
Haryana: రైతుల దెబ్బకు కార్యక్రమం రద్దుచేసుకొని వెనక్కు మళ్ళిన ముఖ్యమంత్రి
బస్తర్ లో మరో సిల్ గేర్...గంగులూరులో ఐదురోజులుగా వందలాది మంది ఆదివాసుల ప్రదర్శన‌
more..


దేశంలో