జై శ్రీరాం అనాలని జర్నలిస్టుపై దాడి చేసిన హిందుత్వ మూక - ధైర్యంగా ఎదుర్కొన్న యువ జర్నలిస్టు


జై శ్రీరాం అనాలని జర్నలిస్టుపై దాడి చేసిన హిందుత్వ మూక - ధైర్యంగా ఎదుర్కొన్న యువ జర్నలిస్టు

09-08-2021

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓ హిందుత్వ గుంపు ఆదివారం నాడు ముస్లింలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు. భారత్ జోడో ఉద్యమం ఇన్‌ఛార్జ్ షిప్రా శ్రీవాస్తవ, సుప్రీంకోర్టు న్యాయవాది, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ యూనిట్ మాజీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ నాయకత్వంలో దాదాపు 5 వేల మంది ఈ ప్రదర్శన‌లో పాల్గొన్నారు. బిజెపి నాయకుడు గజేంద్ర చౌహాన్ ట్పాటు పలువు ఆ పార్టీ నాయకులు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

ʹముస్లింలను చంంపండిʹ ʹఇస్లాం ను నాశనం చేయండిʹ ʹముస్లింలను నరికితే అప్పుడు వాళ్ళు రాం రాం అని అరుస్తారుʹ అని నినాదాలతో ముస్లిలపై విద్వేషంతో సాగిన ఈ ప్రదర్శన అనుమతి లేకుండా జరిగిందని పోలీసులు ప్రకటించారు. ప్రదర్శనకు నాయకత్వం వహించిన వారితో సహా అనేక మంది అందరికీ తెలిసిన వ్యక్తులే అయినప్పటికీ పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ముస్లిం వ్యతిరేక నినాదాలు చేశారని కేసు నమోదు చేశారు. ఈ ప్రదర్శ్నకు హాజరైన వారు కరోనావైరస్ మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారు, అందులో ఒక్కరు కూడా మాస్కులు ధరించలేదు, భౌతిక దూర నిబంధనలను పాటించలేదు.

కాగా ఈ ముస్లిం వ్యతిరేక ప్రదర్శనను కవర్ చేయడానికి ʹనేషనల్ దస్తక్ʹ అనే యూట్యూబ్ ఛానెల్‌లోని రిపోర్టర్ అన్మోల్ ప్రీతమ్ అక్కడికి వెళ్ళారు. ఈ సమయంలో ఆ హిందుత్వ మూక జర్నలిస్టును చుట్టుముట్టి దాడి చేశింది. జై శ్రీరాం అని నినాదాలు చేయాలని ఆ మూక జర్నలిస్టుపై ఒత్తిడి తెచ్చింది. అయితే ఆ 24 ఏళ్ళ యువ జర్నలిస్టు ధైర్యంగా వాళ్ళను ఎదుర్కొన్నాడు. ఏ మాత్రం తొణకకుండా జై శ్రీరాం అని నినాదాలు నేను ఇవ్వబోనని కరాకండిగా చెప్పేశాడు. ఏ నినాదాలు ఇవ్వాలన్నా నాకు ఇష్ట్మైనప్పుడు ఇష్టమైన‌ నినాదాలు ఇస్తాను. ఎవరో ఒత్తిడి చేశారని నేనేపనీ చేయను అన్నాడు ప్రీతమ్ దాంతో మరింత రెచ్చిపోయిన హిందుత్వ మూక ఆయనను పలు రకాలుగా వేదించారు. అతన్ని ʹజిహాదీʹ అని అంటూ పలు రకాలుగా దూషించారు.

"అన్మోల్ ప్రీతమ్‌కు సెల్యూట్ చేయండి, మీరు ధైర్యవంతులైన జర్నలిస్ట్. మీరు ఆందోళనకరమైన‌ పరిస్థితుల్లో కూడా అపారమైన నైతిక మరియు మానసిక బలాన్ని చూపారు ʹఅని రచయిత ప్రొఫెసర్ దిలీప్ మండల్ ట్వీట్ చేశారు.

కాగా ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన రెండవ ప్రదర్శన ఇది. శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీ మరియు ఇతర స్థానిక హిందూత్వ గ్రూపులు ఈ ప్రాంతంలోని సెక్టార్ 22 లో హజ్ హౌస్ నిర్మాణానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలోని ద్వారకాలోని భర్తల్ చౌక్‌లో ముస్లిం వ్యతిరేక మహాపంచాయత్‌ను నిర్వహించాయి. అందులో కూడా హిందుత్వ మూకలు ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. హజ్ హౌస్ నిర్మిస్తే హింసకు పాల్పడాలని పిలుపునిచ్చాయి.

ఈ ర్యాలీలో హిందుత్వ మూక‌ "జై శ్రీ రామ్" నినాదాలు చేయడంతోపాటూ "యే భూమి హమారీ హై, ఇస్కా ఫైస్లా హమ్ కారెంగే (ఈ భూమి మాది ఇక్కడ ఏం చేయాలో మేమే నిర్ణయిస్తాం ) వంటి నినాదాలు చేశారు.

Keywords : delhi, hindutva, muslim, journalist, anmol preetam, Journalist forced to chant ʹJai Shri Ramʹ by Hindutva group in Jantar Mantar
(2023-03-24 20:11:00)No. of visitors : 986

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
more..


జై