ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఆఫ్ఘనిస్తాన్ మావోయిస్ట్ పార్టీ ప్రకటన


ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఆఫ్ఘనిస్తాన్ మావోయిస్ట్ పార్టీ ప్రకటన

ఆఫ్ఘనిస్తాన్‌లో

కీలుబొమ్మ పాలన పతనం, యుఎస్ సామ్రాజ్యవాదపు అవమానకరమైన ఓటమి, తాలిబాన్ ఛాందసవాదం అధికారంలోకి రావడం నేపథ్యంలో ఈ అంశంపై ఆఫ్ఘనిస్తాన్ మావోయిస్ట్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం...

సామ్రాజ్యవాద ఆక్రమణ సైన్యాలను ఉపసంహరించుకోవడానికి గడువు ఆగష్టు 31 వ తేదీ వుండింది, కానీ కాబూల్‌లో కీలుబొమ్మ పాలన ఆగస్టు 15 న కూలిపోయింది. ʹసైగాన్ సమయంʹ పునరావృతం కాదని అమెరికన్ అధికారులు నిరంతరం చెప్పినప్పటికీ, కాబూల్ సమయం అధ్వాన్నంగా మారింది.

కాబూల్‌ను తాలిబాన్‌లు స్వాధీనం చేసుకున్న రోజున, అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి వేలాది మంది అమెరికా సైనిక సిబ్బందిని కాబుల్ విమానాశ్రయంలో ఉంచారు. తాలిబాన్లు కాబూల్ ద్వారాల వద్ద నిలబడినప్పుడు, అమెరికా, ఇతర పాశ్చాత్య దౌత్యవేత్తలు ʹశాంతియుతʹ అధికార బదిలీ కోసం వేచి ఉండమని వారిని వేడుకుంటున్నారు.

సున్నితమైన పత్రాలను తగలబెట్టడం వల్ల అమెరికన్ రాయబార కార్యాలయాలు, ఇతర పశ్చిమ రాయబార కార్యాలయాల నుండి దట్టమైన నల్లటి పొగలు లేస్తున్నాయి. దౌత్య కార్యాలయాన్ని వదిలివేయడం మొదలుకొని, అర్ధరాత్రి బగ్రామ్ స్థావరం నుండి ఏ ప్రకటన చేయకుండానే బయలుదేరడం వరకు జరిగిన పూర్తి ప్రకరణ, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికన్ సామ్రాజ్యవాద ప్రణాళిక చూపిన సైనిక, రాజకీయ ఓటమిల అద్భుతమైన ప్రదర్శన.

ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదులు ఆఫ్ఘనిస్తాన్‌లో తమ సిగ్గుమాలిన ఓటమి ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి మొండిగా ప్రయత్నిస్తున్నారు. అల్ ఖైదాను ఓడించాలనే ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ పరిమితమైన ప్రణాళిక 2011లో ఒసామా మరణంతో నెరవేరిందని వారు నొక్కిచెప్తున్నారు. బిడెన్, అతని సహచరులు తమ రాజ్య నిర్మాణ లక్ష్యాల ప్రాధాన్యతను తక్కువ చేసి చూపిస్తున్నారు. వేస్తున్నారు; మానవ హక్కులు, మహిళల హక్కులను గౌరవించే ఆధునిక రాజ్య సంస్థలను నిర్మించాలనే నినాదాలు పోయాయి. బిడెన్ తన సామ్రాజ్యవాద, జాత్యహంకార ప్రపంచ దృష్టికోణంతో, సామరస్యంతో జీవించడానికి అసమర్థులైన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వైఫల్యానికి కారణమని నిందించాడు.

ఆఫ్ఘనిస్తాన్‌లో గత 40 సంవత్సరాలుగా సంక్షోభాన్ని, గందరగోళాన్ని సృష్టించడంలో వున్న తమ పాత్రను దాచడానికి బిడెన్, అమెరికా సామ్రాజ్యవాదులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని, గందరగోళాన్ని సృష్టించడంలో యుఎస్ సామ్రాజ్యవాద పాత్ర గురించిన చరిత్ర ప్రపంచానికి తెలియడం వల్లనూ, బాగా డాక్యుమెంట్ చేసినందు వల్లనూ ఈ వాస్తవాన్ని మరుగుపరచడంలో వారు విజయం సాధించలేకపోయారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా పరాజయం, అన్నింటికంటే ఎక్కువగా, సామ్రాజ్యవాదులు కాగితపు పులులని చూపిస్తుంది. కానీ ఈ కాగితపు పులి నిజంగానే క్షీణించే, కుళ్లిపోయే దశలో ఉంది. ఈ పరాజయం దాని ఆధిపత్యపు క్షీణత, దౌత్యపు చంచల ప్రభావం, నేరపూరిత విస్తారమైన, ఖరీదైన సైనిక శక్తి అసమర్థతను చూపుతుంది.

బుష్ అధ్యక్ష పదవి ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా తన వైఫల్యాన్ని గ్రహించింది. ఒబామా పరిపాలన తమ నష్టాలను తగ్గించడం, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉపసంహరించుకోవడం గురించి చర్చించింది. అయినప్పటికీ, ఒబామా పరిపాలన, స్పష్టంగా పెంటగాన్, సైనిక-పారిశ్రామిక సముదాయాల ఒత్తిడికి లోనై, తాలిబాన్లను ఓడించడానికి అమెరికన్ దళాలను అధికం చేయడాన్ని ఎంచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఆక్రమిత దళాలు చేపట్టిన జాతీయ పునర్నిర్మాణం ప్రణాళికలో ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ [ANDSF] ఏర్పాటు అత్యంత ముఖ్యమైన, ఖరీదైన విభాగం.

2015 జనవరి నాటికి అమెరికా ఆక్రమిత దళాలు తమ ʹఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడంʹ (ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సామ్రాజ్యవాద యుద్ధం పేరు)ను ముగించి, యుద్ధ బాధ్యతను ANDSF కి అప్పగించాయి. ఆక్రమిత దళాలు యుద్దభూమికి దూరంగా ఉండి, వాయుసేనకు మద్దతునివ్వడం, ANDSF కి శిక్షణనివ్వడం మాత్రమే చేసినప్పటికీ, దేశ ఆక్రమణ కొనసాగింది. అయినా తాలిబాన్ తిరుగుబాటు కొనసాగింది, ANDSF కి భారీ నష్టాన్ని కలిగించింది.

పేదలు, నిరుద్యోగుల నుండి ANDSF లోకి నియామకాలు జరిపి, సామ్రాజ్యవాద ఆక్రమణలో ఉన్న బూర్జువా దళారి రాజ్యనిర్మాణ ప్రణాళిక కోసం వారిని బలిపశువుల్ని చేశారు. ఏప్రిల్‌లో విలేకరుల సమావేశంలో అమెరికా బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బిడెన్, తాలిబన్‌ల75,000 తో పోలిస్తే ANDSF 350,000 వున్నాయని గొప్పగా చెప్పాడు. ఆఫ్ఘన్ దళాలు మెరుగైన సాయుధసంపత్తిని, సన్నద్ధతను కలిగివున్నాయని కూడా పొగిడాడు. తన వైమానిక మద్దతు లేకుండా ANDSF నిలువగలదని అమెరికా ప్రభుత్వం భావించింది. కానీ ANDSF అనేది నిబద్ధత, పోరాడే రాజకీయ సంకల్పం లేని కిరాయి శక్తి కావడం వల్ల వారి అంచనా తప్పింది.

కీలుబొమ్మ పాలన అవినీతివల్ల చాలా అపఖ్యాతి పాలైంది. పారిపోయిన చివరి రాష్ట్రపతి ఘనీ, ANDSF లో అత్యధిక భాగాన్ని నియంత్రించే తన అంతర్గత మంత్రిత్వ శాఖను ʹఅవినీతి హృదయ స్పందనʹ అని పిలిచాడు. ప్రభుత్వ అధికారులు నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ తమ స్థానాన్ని ఏదో ఒకటి సంపాదించే అవకాశంగా భావించారు. అమెరికా వైమానిక మద్దతు ఉపసంహరణ జరగగానే ANDSF వేగంగా కుప్పకూలింది, తాలిబాన్లకు తమ స్థానాలను అప్పగించి పారిపోయింది. ఫారోల (ప్రాచీన ఈజిప్ట్ పాలకులు) వలె జీవిస్తున్న బూర్జువా దళారి వర్గానికి చెందిన రాజ్యం కోసం పోరాడటానికి, చనిపోవడానికి వారు ఇష్టపడటం లేదని స్పష్టమైంది.

రాజ్య సంస్థలు ప్రజలపై భారంగానూ, అణచివేత వ్యవస్థలుగానూ వున్నాయి; సేవల పరంగా ప్రజలు వాటి నుండి అతి తక్కువ పొందుతున్నారు, దాని అవినీతి, క్రూరత్వంతో చాలా బాధపడుతున్నారు. ఈ రాజ్యం ధనికుల ప్రయోజనాలను మాత్రమే నెరవేరుస్తుంది. రాజకీయ ఉన్నత వర్గాల మధ్య ఎవరి భవనం లేదా రాజభవనం పెద్దది అనే పోటీ కనిపిస్తుంది. లేదా, ఇంటి నుండి ఆఫీసు వరకు, ఉదాహరణకు, ఎవరు అత్యధిక సంఖ్యలో బుల్లెట్‌ప్రూఫ్ SUV లు, సాయుధ గార్డులతో వెళ్తారు అనే పోటీ కనబడుతుంది.

గత ఇరవై ఏళ్ళుగా అమెరికా సామ్రాజ్యవాదులకు సేవ చేస్తున్న ఈ పాలకవర్గంలో రెండు శిబిరాలు వున్నాయి. పాశ్చాత్య విధాన రూపకర్తలకు ఇష్టమైన పాశ్చాత్య విద్యావంతులైన సాంకేతిక నిపుణుల శిబిరం ఒకటి; వారికి రాజకీయాధికారంలో సింహ భాగం ఉంది. దేశం నుండి పారిపోయిన రాష్ట్రపతి అష్రఫ్ ఘనీ, మొదటి శిబిరానికి మంచి ఉదాహరణ, ఎందుకంటే, 2001 లో ఆఫ్ఘనిస్తాన్‌కు రాకముందు, అతను జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

పాలనలో వున్న రెండవ శిబిరం యుద్దప్రభువులుగా ప్రసిద్ధి చెందింది. ఈ యుద్దప్రభువులు ఆఫ్గనిస్తాన్‌ను ఆక్రమించడంలో అమెరికా సామ్రాజ్యవాదులకు సహాయం చేసారు; అమెరికన్ సామ్రాజ్యవాద ఆక్రమణకు సిపాయిలుగా పనిచేశారు. రెండు శిబిరాలు సమానమైన అవినీతి, ప్రజా వ్యతిరేక లక్ష్యాలతో తమ సామ్రాజ్యవాద యజమానులకు లోబడి ఉంటాయి.

వారి సంపదను విస్తరించడం తక్షణ, ప్రాథమిక లక్ష్యం. ప్రభుత్వ సంస్థలు ధనవంతులయ్యే యంత్రాంగం మాత్రమే. దోపిడీలో ప్రతి ఒక్కరి వాటా ఎల్లప్పుడూ వారి రాజకీయ శక్తి, ప్రభావాన్ని బట్టి వుంటుందనుకోండి. ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్ పూర్వ రాష్ట్రపతి కర్జాయ్, ఉపరాష్ట్రపతి ఫాహిమ్, వారి ఆప్తులు ఒక ప్రైవేట్ బ్యాంక్, కాబూల్ బ్యాంక్ నుండి 1 బిలియన్ డాలర్లను దోచుకున్నారు; అంటే ప్రభుత్వ డబ్బును కొన్ని ప్రైవేట్ చేతుల్లోకి సరళంగా బదిలీ చేయడం. గత ఇరవై సంవత్సరాలలో, పాలక వర్గాల ఆధిపత్య నిచ్చెనమెట్ల క్రమంలో అగ్రస్థానంలో వున్నవారు ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను అత్యధికంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల్ని స్వంత ఆస్తిగా మార్చడం, అంటే స్వాధీనం చేసుకోవడం ద్వారా మూలధనం చేకూర్చడం అనేది దేశ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

పాలక వర్గాల సంపద, అధికారాల ఆడంబరాలు దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా వుండేవి. సంపద, అధికారాల అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన ఈ ఫారోలను (ప్రాచీన ఈజిప్ట్ పాలకులు)చూసి ప్రజలు వాస్తవానికి దిగ్భ్రాంతులయ్యారు. అయితే వారిని ద్వేషించారు కూడా. అలాంటి దుబారా అధికారం, అవినీతిని దుర్వినియోగం చేయడాన్ని, సాధారణీకరించడాన్నికూడా ప్రోత్సహించింది. అందువల్ల, వ్యవస్థ పై నుండి కింది వరకు అవినీతిమాయమైపోయింది. ప్రభుత్వ సైనికులు కూడా మందుగుండు సామగ్రి, చమురు, గ్యాస్‌ను దొంగిలించి చాలా తరచుగా వారి శత్రువులైన తాలిబాన్‌లకు అమ్ముకున్నారు.

కాబూల్‌లో కీలుబొమ్మ పాలనా సంక్షోభం అమెరికా సామ్రాజ్యవాద సంక్షోభం లాగానే ఉంటుంది. అది చట్టబద్ధతకు సంబంధించిన సంక్షోభం. కీలుబొమ్మ పాలనకు చట్టబద్ధత లేదు; అది సామ్రాజ్యవాద ప్రయోజనాల సేవలో ఉన్న పాలన. తన సైనికుల దృష్టిలో కూడా దానికి చట్టబద్ధత లేదు. ఆదాయం కోసం అక్కడ ఉన్నామని సైనికులకు తెలుసు. కీలుబొమ్మ పాలన యిచ్చే డొల్ల నినాదాలను సైనికులు కూడా నమ్మరు; కీలుబొమ్మ పాలనలో ఉన్నతాధికారులు తమ సొంత నినాదాలనే విశ్వసించరని వారికి తెలుసు.

కీలుబొమ్మ పాలన డొల్లతనం, కుళ్ళు వల్ల తాలిబాన్లకు శీఘ్ర విజయం సాధ్యమైంది. కీలుబొమ్మ పాలనను కాపాడటానికి, అమెరికా సామ్రాజ్యవాదులు దోహా శాంతి ప్రక్రియను ప్రారంభించారు. తాలిబాన్లను కీలుబొమ్మల పాలనలో విలీనం చేసి, కీలుబొమ్మ పాలన, తాలిబాన్‌ల మధ్య శాంతిని నెలకొల్పడానికి దోహా ప్రక్రియ ఉద్దేశించబడింది.

అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆప్ఘనిస్తాన్ పాలనను పక్కకుపెట్టి తాలిబాన్‌లతో సుదీర్ఘ చర్చలు జరిపారు. దోహాలో అమెరికా దౌత్య ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని ఇప్పుడు పూర్తిగా స్పష్టమైంది; వారు తాలిబాన్ల ప్రతిష్టను మాత్రమే పెంచారు, వారికి అంతర్జాతీయ వేదికను అందించారు, కాబూల్‌లో కీలుబొమ్మ పాలన చట్టబద్ధత సంక్షోభాన్ని తీవ్రతరం చేశారు.

కాబూల్‌ని తాలిబాన్ స్వాధీనం చేసుకోవడంతో, అమెరికా సైనిక ప్రయత్నాల పరాజయాన్ని మాత్రమే కాకుండా, అమెరికా దౌత్యపరమైన వైఫల్యాన్ని మరింత స్పష్టంగా చూస్తున్నాం. ఆగస్టు 31 న వెళ్లాల్సిన చివరి అమెరికన్ దళాలు వెళ్లిపోయే వరకు కూడా తాలిబాన్లు రాజధానిని స్వాధీనం చేసుకోవడాన్ని అమెరికా ఆపలేకపోయింది.

తాము భవిష్యత్ రాజకీయ వ్యవస్థ యొక్క ఖచ్చితమైన ఆకృతి గురించి సంప్రదింపుల ప్రక్రియలో ఉన్నామని కాబూల్‌లో జరిగిన మొదటి విలేకరుల సమావేశంలో తాలిబాన్ ప్రతినిధి చెప్పారు. ఈ శీఘ్ర విజయాన్ని తాలిబాన్లు కూడా వూహించినట్లు లేరు. తాలిబాన్లకు వారి భవిష్యత్తు రాజకీయ వ్యవస్థ గురించి ఖచ్చితమైన ఆలోచన, రూపురేఖలు లేవు.

భవిష్యత్తు వ్యవస్థ ʹ ఇస్లామిక్ʹగానూ, ʹసమగ్రమైనదిʹగానూ ఉంటుంది అని వారు నొక్కిచెబుతున్నారు. ఇప్పుడు ప్రతీఘాతుక విదేశీ శక్తుల, ప్రత్యేకించి పాకిస్తాన్ సహాయంతో తాలిబాన్ యుద్ధంలో విజయం సాధించింది కాబట్టి, వారు తమ రాజకీయ వ్యవస్థ రూపాన్ని దేశంపై నిర్దేశిస్తారు. ఏదేమైనా, ఇస్లామిక్ ఎమిరేట్‌ను పున: స్థాపించాలనే వారి సైద్ధాంతిక నిబద్ధత, అంతర్జాతీయ గుర్తింపు సాధించాలనే డిమాండ్ల మధ్య ఇప్పుడు తాలిబాన్లు చిక్కుకున్నారు.

ఈ ఉద్రిక్తతకు వారి కార్యకలాపాలలోనే అంతర్గత ఘర్షణను మండించే సామర్థ్యం ఉంది. అత్యున్నత మత నాయకుడు నేతృత్వంలో ముల్లాల కౌన్సిల్ పాలించే ఇస్లామిక్ ఎమిరేట్ అని పిలిచే ప్రభుత్వ వ్యవస్థకు ఏ మాత్రం ప్రజాదరణ లేదని తాలిబాన్లకు తెలుసు.

తాము సంప్రదింపులు జరుపుతున్నామని, తమ వ్యవస్థకు వేరే పేరు ఉండవచ్చని తాలిబాన్ ప్రతినిధి సూచించారు. తమ వ్యవస్థకు ఇస్లామిక్ ఎమిరేట్ కాకుండా మరొక పేరు పెట్టడానికి సిద్ధపడటం ద్వారా, తాలిబాన్లు రాజకీయ వెసులుబాటుకు, సామ్రాజ్యవాదుల, పాలక వర్గాల ఇతర శక్తుల ప్రయోజనాలకు స్థానం కల్పించడానికి, బహుశా వారితో రాజకీయ అధికారాన్ని పంచుకోడానికి సుముఖత చూపుతున్నారు,

అయితే, తాలిబాన్లకు ఇప్పుడు హింసపై గుత్తాధిపత్యం ఉంది. ఉద్భవిస్తున్న రాజకీయ వ్యవస్థ, దాని పేరు ఏమైనప్పటికీ, తాలిబాన్ల ఆధిపత్యంలో ఒక మతపరపరిపాలన ఉంటుంది. కొరడాతో అమలు చేసే భూస్వామ్య బూర్జువా దళారీ వర్గాల కఠినమైన మతశాసిత పరిపాలనా నియంతృత్వంగా వుంటుంది. మతశాసిత పరిపాలన మహిళలు, మతపరమైన, జాతీయ అల్పసంఖ్యాకులపైన సామాజిక అణచివేతను పెంచుతుంది. ఈ మతశాసిత పరిపాలన కింద జాతీయ, లైంగిక దురహంకారం భయంకరంగా ఉంటుంది.

అందువలన, విప్లవ శిబిరం రాబోయే పోరాటానికి సంసిద్ధమవాలి. ఇప్పుడు ప్రధాన వైరుధ్యం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు, భూస్వామ్య బూర్జువా దళారీ వర్గాలు, వారి సామ్రాజ్యవాద గురువుల మధ్య ఉంది. వివిధ సామ్రాజ్యవాద, ప్రతిఘాతుక విదేశీ శక్తుల మధ్య వైరుధ్యాలు-సహకారాన్ని ప్రతిబింబిస్తూ పాలక వర్గాలలో విభిన్న ప్రతిఘాతక శిబిరాల మధ్య వైరుధ్యమూ, సహకారమూ కొనసాగుతుంది. వారి మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్తగా అభివృద్ధి చెందుతున్న అర్ధ భూస్వామ్య/అర్ధ-వలస పాలన విదేశీ సామ్రాజ్యవాదులకు లోబడి ఉంటుంది.

ఈ ప్రాంతంలో అమెరికన్ సామ్రాజ్యవాదుల తిరోగమనమూ, క్షీణతవల్ల, కొత్త పాలన రష్యన్ సామ్రాజ్యవాదులకు, చైనా సామాజిక సామ్రాజ్యవాదులకు దగ్గరగానూ, లోబడి ఉంటుంది ... నిస్సందేహంగా అమెరికన్ సామ్రాజ్యవాదము, మిత్రదేశాలు కూడా దేశ, ప్రాంత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటూనే ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు ఇప్పటికీ వివిధ ప్రతిఘాతుక శిబిరాల మధ్య వైరుధ్యాలను తీవ్రతరం చేసే అంతర్-సామ్రాజ్యవాద శత్రుత్వానికి కార్యక్షేత్రంగా ఉంటాయి. ఏదేమైనా, తాలిబాన్ కేంద్రంగా భూస్వామ్య బూర్జువా దళారీ వర్గాల అర్ధ-భూస్వామ్య, అర్ధ-వలసరాజ్యాల పాలన ఏర్పడటానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు మద్దతు ఇస్తారు.

విశాల ప్రజానీకం తాలిబాన్లను ద్వేషిస్తుంది. అందువల్ల, చాలా మంది ప్రజలు ఆ పాలన నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు. తాలిబాన్ల అభివృద్ధి నిరోధక స్వభావం వారిని ప్రజలనుండి మరింత దూరం చేస్తుంది; ప్రజలను తాలిబాన్ల ప్రతిఘాతుక, ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేక పోరాటాలు, ప్రతిఘటనలవైపు నెడుతుంది.

విప్లవ శిబిరం రాబోయే సవాళ్లు, అవకాశాల కోసం సంసిద్ధమవ్వాలి. కొత్తగా ఉద్భవిస్తున్న పాలన వర్గ, లింగ, జాతి అణచివేతల ప్రాణాంతకమైన సమ్మిశ్రణంగా వుండి, అర్ధ-భూస్వామ్య, అర్ధ-వలసరాజ్యాల కాలం చెల్లిన అణచివేత, దోపిడీల సామాజిక సంబంధాలకు హామీనిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్ట్ (మావోయిస్ట్) పార్టీ విప్లవ శిబిరాన్ని బలోపేతం చేయడంలో, విప్లవకర ప్రత్యామ్నాయాన్ని అందించడంలో తన పాత్ర పోషించడానికి కృషి చేయాలి.

ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్)

20 ఆగస్ట్ 2021

(ఆఫ్ఘనిస్తాన్ మావోయిస్టు పార్టీ అధికారిక వెబ్ సైట్ sholajawid.org సౌజన్యంతో)
తెలుగు అనువాదం: పద్మకొండిపర్తి

Keywords : afghanistan, maoist party, taliban, america
(2021-12-04 08:56:51)No. of visitors : 1360

Suggested Posts


ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

అమెరికన్ సామ్రాజ్యవాదులకు అఫ్ఘానిస్తాన్లో అవమానకరమైన ఓటమి ఎదురైంది. అఫ్ఘానిస్తాన్లో అమెరికా పరాజయం , అన్నింటికంటే ఎక్కువగా, సామ్రాజ్యవాదులు కాగితపు పులులనే విషయాన్ని, మరొకసారి ధృవీకరించింది.

అఫ్ఘ‌నిస్తాన్ మావోయిస్టు పార్టీ చైర్మన్ కామ్రేడ్ జియా అమర్ రహే !

ఆఫ్ఘనిస్తాన్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చైర్మన్, పార్టీ వ్యవస్థాపక సభ్యులు, మేధోవంత నాయకుల్లో ఒకరైన కామ్రేడ్ జియా తన 68 వ యేట గుండెపోటుతో అమరులయ్యారనే విషయాన్ని పార్టీ సభ్యులకు, మద్దతుదారులకు, మిగిలిన మావోయిస్ట్ పార్టీలకు, అంతర్జాతీయంగా వివిధ మావోయిస్టు పార్టీలకు, మార్క్సిస్టు - లెనినిస్ట్ - మావోయిస్టు పార్టీలకు తెలియజేయడానికి తీవ్రంగా చింతిస్తున్నా

Afghanistan Maoist Party statement on current situation in Afghanistan

The collapse of puppet regime, the disgraceful defeat of the US imperialism and the rise of the Taliban fundamentalism to power

మహిళలు ఇకపై సంకెళ్లలో వుండరు,తాలిబన్లపై పోరాటం కొనసాగిస్తాం -ఆఫ్ఘన్ విప్లవ మహిళా సంఘం (RAWA)

త 20 సంవత్సరాలలో, మా డిమాండ్లలో ఒకటి అమెరికా/ నాటో ఆక్రమణను అంతం చేయడం. వారు తమ ఇస్లామిక్ ఛాందసవాదుల్ని, సాంకేతిక నిపుణులను తమతో తీసుకెళ్లిపోయి, ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా వదిలేస్తే యింకా బాగుంటుంది. ఈ ఆక్రమణ కేవలం రక్తపాతం, విధ్వంసం, గందరగోళాలకు దారితీసింది. వారు మా దేశాన్ని అత్యంత అవినీతికర, రక్షణ రహిత, మాదకద్రవ్యాల మాఫియాదేశంగా, ముఖ్

Search Engine

తమతో కలిసి భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల మూక‌
అబుజ్‌మడ్ ఆదివాసీల ఆందోళన! పోలీసు క్యాంపు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన‌
రేపు కామ్రేడ్ సునీల్@రవి సంస్మరణ సభ‌
కంగనా రనౌత్ కు చుక్కలు చూపించిన పంజాబ్ రైతులు
వరవరరావు మెడికల్ బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా !
PLGA :ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమరత్వం... 22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
PLGA వారోత్సవాలు.... మావోయిస్టు జగన్ ప్రకటన‌
PLGA వారోత్సవాలు ప్రారంభం.... అడ్డుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ
పీఎల్జీఏ వారోత్సవాలు....22 ఏళ్ళ‌ నెత్తుటి జ్ఝాపకం..
శ్రీ‌శ్రీ‌కి ప‌ల్లకి మోత: వాళ్లు ఊరేగించింది ఫ్యూడ‌ల్ బ్రాహ్మ‌ణీయ సంస్కృతిని -పాణి
కోబాడ్ ఘాండీని బహిష్కరించిన‌ మావోయిస్టు పార్టీ
ʹచనిపోయిన రైతుల సమాచారం లేదు,వారి కుటుంబాలకు సహాయం చేసే ప్రసక్తే రాదుʹ
bhima koregaon case: సుధా భరద్వాజ్ కు బెయిల్
అనేక త్యాగాలతో... అడ్డంకులు, కుట్రలు దాటుకొని సాగుతున్న పోరాటానికి ఏడాది పూర్తి
ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె సైరన్ మోగించిన సింగరేణి కార్మికులు
ఒడిశాలో బాక్సైట్ గనుల తవ్వకం ప్రాజెక్ట్: ప్రజల నిరసన
ప్ర‌జ‌ల‌పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప్రపంచం - పాణి
కిషన్ జీ అమరత్వం రోజున (నవంబర్24) ప్రపంచవ్యాప్త నిరసనలు - ʹప్రహార్ʹ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాలని ‍మావోస్టు పార్టీ పిలుపు
ఈ నెల 25న హైదరాబాద్ లో రైతుల మహా ధర్నా...రాకేష్ తికాయత్ రాక‌
ప్రధానికి రైతుల బహిరంగ లేఖ‌ !
రేపు లక్నో కిసాన్ మహాపంచాయ‌త్ ను జయప్రదం చేయండి -కిసాన్ మోర్చా పిలుపు
భారత్ లో మావోయిస్టులపై మారణకాండకు నిరసనగా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు
MP:జీతం అడిగినందుకు దళితుడి చేయి నరికేసిన యజమాని
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యుల అరెస్టుకు నిరసనగా 4 రాష్ట్రాల్లో మూడు రోజుల బంద్
SKM:ఉద్యమం కొనసాగుతుంది,నవంబర్ 29 నుండి పార్లమెంట్ మార్చ్ జరుగుతుంది -కిసాన్ మోర్చా ప్రకటన‌
more..


ఆఫ్ఘనిస్తాన్‌లో