ODISHA:నదిని మళ్ళించే ప్రాజెక్టుకు నిరసనగా ఆందోళ‌నలు...ఉక్కుపాదం మోపుతున్న‌ ప్రభుత్వం

ODISHA:నదిని

27-08-2021

ఓడిశాలోని ఖరోసోత్రా నదిని దారి మళ్ళించే ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలో పెరుగుతున్న‌ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఖరోసోత్రా నది నుండి నీటిని మళ్లించే ప్రాజెక్టు దగ్గరకు వెళ్ళిన 24 మందిని ఒడిశా ప్రభుత్వం అరెస్టు చేసింది, 1,000 కేసులను నమోదు చేసింది., 2021ఆగస్టు 10 నుండి ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని ఖరోసోత్రా నది నుండి నీటిని మళ్లించాలనే ప్రతిపాదనను నిరసిస్తూ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త శ్రీకాంత నాయక్‌ను పోలీసులు ఆగస్టు 25 న బలవంతంగా తీసుకెళ్లి కటక్ ఆసుపత్రి బయట వదిలేశారు. మర్నాడు, ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు కటక్‌లోని శ్రీరామ చంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని ICU లో చేర్చారని తెలుస్తోంది.

సెంటర్ ఫర్ పాలసీ, గవర్నెన్స్ అండ్ అడ్వకేసీ, యువ ఒడిషా ఫౌండేషన్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు తేజేశ్వర్ పరిదా ఈ విషయాన్ని ధృవీకరించారు. అతను ఆగస్టు 25 ఉదయం కేంద్రపారా జిల్లా ప్రధాన కార్యాలయం ఆసుపత్రిలో అతడిని కలిశారు.

సాయంత్రం ఆలస్యంగా, అతడిని కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి బలవంతంగా పంపించారు. ఆసుపత్రి రద్దీగా ఉంది, బెడ్ ఖాళీ లేకపోవడంతో, నిరసనగా, అతను బయటకు వచ్చి చెట్టు కింద పడుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలోని వైద్య వార్డులో ఉన్నాడు అని ఆగస్టు 26న చివరగా తెలిసిన వార్త.

45 ఏళ్ల నాయక్ కేంద్రపారాలో మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆగస్టు 10 న నిరసన చేపట్టారు. రూ. 754 కోట్ల భారీ మంచి నీటి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. ఇది కేంద్రపారా జిల్లాలోని ఖరోసోత్రా నుండి పొరుగున ఉన్న భద్రక్ జిల్లాలోని అయిదు లక్షల మంది ప్రజలకు నీటిని మళ్లించే ప్రణాళిక.

ఈ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందబోతున్నవారు భద్రక్‌లోని నాలుగు బ్లాక్‌లలో వున్న 91 గ్రామ పంచాయితీలలో నివసిస్తున్నారు.
తాగునీటి అవసరాల కోసం నీటిని మళ్లిస్తున్నారు కానీ నది ఎండిపోతే 220 గ్రామాల్లో వ్యవసాయాన్ని ఈ ప్రాజెక్ట్ నాశనం చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. కేంద్రపారాలోని ఔల్, రాజకానికా బ్లాక్‌లలో విస్తరించి ఉన్న ఈ గ్రామాల్లో దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.

నాయక్ స్థానిక ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమంలో భాగమైన NGO సంభాభనలో పని చేస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న‌అతడి పరిస్థితి విషమించడంతో అధికారులు ఆగస్టు 15న నిరసన వేదిక నుంచి తొలగించి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కానీ అతను ఆహారం తీసుకోవడానికి నిరాకరించి, నిరాహార దీక్షను కొనసాగించాడు.

ʹభారతదేశం వాటర్ మ్యాన్ʹ గా పేరు పొందిన రాజేంద్ర సింగ్, కేంద్రపారా వద్ద ఆగస్ట్ 24 న నాయక్‌ను కలిశారు. ʹఇప్పటికే కొరత ఉన్న నదీ పరీవాహక ప్రాంతం నుండి నీటిని మళ్లించడం వలన సముద్రపు నీరు ఎగువకు వచ్చి జిల్లా వ్యవసాయ కార్యకలాపాలను దెబ్బతీస్తుంది. ఈ మెగా తాగునీటి ప్రాజెక్ట్ కోసం నది నుండి మంచి నీటిని మళ్లించడం వల్ల నదీతీర గ్రామస్తులు ఉప్పునీటి చొరబాటుకు గురవుతారుʹ అని సింగ్ అభిప్రాయపడుతున్నారు.

ఆగస్టు 12 నాడు ఖరోసోత్రానది ఒడ్డున గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు అధిక సంఖ్యలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి భారీగాడ గ్రామంలోని ప్రాజెక్టు స్థలంలోకి ర్యాలిగా వెళ్లారు.

వారు అనేక వాహనాలు, డీజిల్ ఆయిల్ ట్యాంకర్, అంబులెన్స్, మూడు ఎర్త్-మూవింగ్ మెషీన్‌లు, మరియు ప్రాజెక్ట్ ప్రదేశంలోని రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ (ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్) క్యాంపు కార్యాలయాలను ధ్వంసం చేశారు. పోలీసు, ప్రభుత్వ, RWSS అధికారులపై దాడి కూడా చేశారు. ప్రతీకారంగా, ప్రాజెక్ట్ పనికి అడ్డుపడ్డారనే ఆరోపణపై పోలీసులు ఆగస్టు 13 న 24 మంది నిరసనకారులను అరెస్టు చేశారు.

ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తేజేశ్వర్ పరిదా అనేక సూచనలు చేశారు: నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలి. నీటిని నిల్వ చేయడానికి నదిపై బ్యారేజీ నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించాలి, ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేదా అభివృద్ధి కమిషనర్ లేదా ఏదైనా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఇందులో ఈ ప్రాజెక్టు వల్ల లబ్దిపొందేవారందరూ, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, నీటి వనరులు, తాగునీరు శాఖలతో సహా అన్నీ ప్రభుత్వ విభాగాలు, అలాగే పర్యావరణవేత్తలు, ముఖ్యంగా భితార్కనిక జాతీయ ఉద్యానవనం వంటి మడ అడవుల పర్యావరణ వ్యవస్థలలో పనిచేసిన అన్ని ప్రభుత్వ శాఖలు ఈ కమిటీలో ఉండాలి.

ఖారోసోత్రా నది ఉద్యానవనం గుండా వెళుతుంది, ఈ ప్రాజెక్ట్ దాని ఉప్పునీరు లేదా లోతులేని నీటిలో వుండే మొసలి జనాభా భవిష్యత్తుని సందిగ్ధంలోకి నెట్టేస్తుంది. నిరసనకారులపై ఉన్న కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలి. అరెస్టు చేసిన 24 మందిని విడుదల చేయాలి. సంభాషణ ప్రక్రియ కొనసాగాలి. ఈ సంభాషణ నిరసనకారులు, పర్యావరణవేత్తలు, ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ మధ్య జరగాలి తప్ప జిల్లా కలెక్టర్‌తో కాదు. ఉన్నతాధికారులు పాల్గొంటే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రాజెక్ట్ కోసం సలహాదారును ప్రభుత్వం ఎన్నుకోవాలి. పొడి కాలంలో ప్రభావ అంచనా నివేదికను తయారు చేయాలి.

భద్రక్ జిల్లాలోని ప్రజలకు తాగునీరు ఇవ్వడానికి నిరసనకారులు అభ్యంతరం చెప్పరు. కానీ, బహుళజాతి కంపెనీలకు నీటిని మళ్లించడానికి ఇది ఒక ముసుగు అని వారు భయపడుతున్నారు. బదులుగా, కొన్ని ఇతర స్థానిక నదుల నుండి నీటి లవణ నిర్మూలన ప్రక్రియ చేయవచ్చని వారు ప్రతిపాదిస్తున్నారు.

(downtoearth.org.in సౌజన్యంతో...)
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Keywords : odisha, Kharosotra, Kendrapara district,Activist protesting Odishaʹs plan to divert river forcibly removed from protest site, in hospital
(2024-04-18 19:55:57)



No. of visitors : 379

Suggested Posts


Successful bandh in Odisha

The bandh was convened to demand the immediate arrest of the accused for gang rape of a minor girl in Kunduli, control of violence against tribal women and a solution to the Mahanadi area. The movement of vehicles was affected in the five districts due to the bandh, according to the reports....

Maoist posters on Russian Revolution in Narayanpatna

Maoist posters resurfaced in Narayanpatna of Koraput district with the rebels appealing people to participate in the week-long centenary celebrations of the Russian Revolution from November 7-13 across the State....

మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ ‍-ఒడిశాలో అనేక చోట్ల ఎన్నికల వాయిదా

మల్కన్ గిరి, కోరాపూట్, గంజా‍ం, గణపతి, కొందమాల్ జిల్లాల్లో వందలాది గ్రామాల్లో పార్టీ ప్రచారం ముమ్మరంగాసాగుతోంది. అనేక గ్రామాల్లో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. చిత్రకొండ సమితిలోని 18 పైగా పంచాయితీల్లో, 2 జిల్లా పరిషథ్ జోన్లలో, కటాఫ్ ఏరియాలోని 9 పంచాయితీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు వేయకపోవడంతో అధికారులు అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు....

Maoist movement puts Odisha cops on toes

THE intelligence inputs on movement of a small group of Maoists in the tri-junction area of Angul, Nayagarh and Cuttack rural district, has put Odisha Police on alert. Cops have started combing operation in Angul district amid reports of Maoist movement at Satkosia-Narasinghpur border.

పోలీసు అరాచకాలను నిరసిస్తూ ఎస్పీ ఆఫీస్ ను ముట్ట‌డించిన ఆదివాసీలు

తమ గ్రామాలపై దాడులు, అరెస్టులు, స్త్రీలపై అత్యాచారాలు తక్షణం ఆపివేయాలని , కూంబింగ్ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది ఆదివాసులు ఒడీశా రాయగడ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అడవిపై ఆధారపడి జీవించే తమపై.....

Maoist posters warn informers in Odishaʹs Kalahandi district

A couple of Maoist posters appealing to the villagers not to become police informers was found at Lakhbahali near Pahadpadar village under Lanjigarh block of Kalahandi district on Thursday. The Maoists have also appealed to the locals to observe ʹSahid Divasʹ on Thursday....

మతం మారాడని ఓ బాలుడిని ముక్కలుగా నరికి చంపిన మతోన్మాదులు

ఓ కుటుంభం మతం మారిందన్న‌ కోపంతో మతోన్మాదులు ఓ 14 ఏళ్ళ బాలుడిని ముక్కలుగా నరికి చంపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కెండుగుడ అనే గ్రామంలో ఉంగా మద్కామి అతని కుమారుడు సమరూ మద్కామీ మూడు సంవత్సరాల‌ క్రితం క్రైస్తవ మతంలోకి మారారు.

Where is gau rakshaks - Vehicle in Amit Shahʹs convoy hits cow in Odisha

At a time when the incidents of lynchings in the name of ʹgau rakshaʹ are being reported from across the country, a vehicle in BJP president Amit Shahʹs motorcade hit a cow during his Odisha tour on Thursday, leaving the animal wounded and prompting a sarcastic....

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు

ఓడిశా లో ఓ బాలికపై పోలీసు స్టేషన్ లోనే ఇన్‌స్పెక్టర్ తో సహా పలువురు పోలీసులు కొన్ని రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. మార్చ్ 25 న సుందర్ గడ్ జిల్లా బిరమిత్రపూర్ లో జరిగిన ఓ ప్రదర్శనలో పాల్గొనడానికి 13 ఏళ్ళ బాలిక వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ ప్రదర్శన రద్దయ్యింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులు కూడా లేవు.

సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్

సీపీఐ మావోయిస్టు ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ దుబాసీ శంకర్ ఎలియాస్ మహేందర్ అరెస్టయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని బాయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేందర్ ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ తెలిపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ODISHA:నదిని