రైతులపై పోలీసుల దుర్మార్గ దాడి - రక్తసిక్తమైన హర్యాణా

రైతులపై

28-08-2021

హర్యాణా లో శనివారం నాడు రైతులపై పోలీసుల లాఠీ విరిగింది. పోలీసులు రైతులను తరిమి తరిమి కొట్టడంతో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. కేంద్రం తీసుకవచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పది నెలలుగా పోరాడుతున్న రైతులపై ప్రభుత్వాలు అనేక రకాల అణిచివేతకు గురి చేస్తున్నాయి. అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు, దుష్పచారం...ఇలా ఒఅక్టేమిటి ఏ అవకాశాన్నీ ఒదులుకోకుండా రైతులపై బీజేపీ ప్రభుత్వం దాడులకు దిగుతోంది.

మరో వైపు రైతులు కూడా అన్ని అణిచివేతలను తట్టుకుంటూ పదినెలలుగా రాజీలేని పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యాణా, ఉత్తరప్రదేశ్ లోని కొంత భాగంలో బీజేపీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్నారు రైతులు. ఈ నేపథ్యంలో శనివారం నాడు హర్యాణా లోని కర్నల్ లో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన మునిసిపల్ ఎన్నికలపై అనుసరించవల్సిన వ్యూహాలను చర్చించడానికి బీజేపీ నేతల సమావేశం జరిగింది. సమావేశం జరుగుతున్న కర్నాల్‌లోని ప్రేమ్ ప్లాజా హోటల్ వెలుపల రైతులు గుమిగూడడానికి ప్రయత్నించారు, కానీ వారిని పోలీసులు అక్కడకు చేరుకోకుండా అడ్డుకున్నారు.

దాంతో రైతులు బస్తారా టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని బ్లాక్ చేశారు.రహదారిపై మంచాలు వేసుకుని ఆ దారిలో వెళ్ళే బీజెపి నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలకు నల్ల జెండాలు చూపించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అప్పటికే అక్కడ మోహరించిన వేలాది మంది పోలీసులు రైతులపై విరుచుకపడ్డారు. పారిపోతున్న రైతులను విచక్షణా రహితంగా కొట్టారు. పోలీసు దెబ్బలకు తాళలేక కిందపడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళను కూడా పోలీసులు చుట్టుముట్టి మరీ కొట్టారు. పోలీసు దెబ్బల వల్ల అనేక మంది రైతుల తలలు పగిలాయి. పలువురి కాళ్ళూ, చేతులూ విరిగిపోయాయి.

పోలీసులు చేసిన ఈ దుర్మార్గ దాడిలో అనేక మంది రైతులు గాయాలపాలయ్యారు. కర్నాల్‌లో డ్యూటీ మేజిస్ట్రేట్‌గా నియమితులైన 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయుష్ సిన్హా ʹఉఠా ఉఠా కే మార్నే సబ్కోʹʹ (ప్రతి ఒక్కడిని పట్టుకొని కొట్టండి)అని అరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను అక్కడితో ఆగలేదు. ʹʹఇక్కడి మీరు ఉండటానికి అనుమతించే ప్రసక్తే లేదు. మేము రెండు రోజులుగా నిద్రపోలేదు. మీరు హాయిగా నిద్రతీసి వచ్చారు. ఒక్క నిరసనకారుడు కూడా నాదాకా చేరుకోలేడు. ఒకవేళ ఎవరైనా కష్టపడి చేరుకున్నా అతని తలపగలడ ఖాయం. అర్దమయ్యిందాʹʹ అంటూ రైతులను బెదిరించాడు ఆ ఐఏఎస్ అధికారి.

మరో వైపు రైతులపై బీజేపీ ప్రభుత్వం చేయించిన దుర్మార్గమైన దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను బ్లాక్ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు గుర్నామ్ సింగ్ చాధుని పిలుపునిచ్చారు. "నా సోదరులందరూ తమకు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాలకు వెంటనే చేరుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టోల్ ప్లాజాలు మీకు దూరంగా ఉంటే, సమీపంలోని హైవేలను బ్లాక్ చేయండి " అని చాధుని తన వీడియో సందేశంలో తెలిపారు.

దీని ఫలితంగా షాబాద్ (కురుక్షేత్ర) లోని జాతీయ రహదారిపై, బస్తారా టోల్ ప్లాజా, కల్కా-జిరాక్‌పూర్ హైవే (సూరజ్‌పూర్ టోల్ ప్లాజా)తో సహా మరో నాలుగు టోల్ ప్లాజాల వద్ద రైతులు రోడ్లను బ్లాక్ చేశారు.

BKU నాయకుడు గుర్నామ్ సింగ్ చాధుని కూడా బస్తారా టోల్ ప్లాజాకు చేరుకుని, ప్రభుత్వం రైతుల‌తో చర్చలు జరపకపోతే, రాష్ట్రంలోని టోల్ ప్లాజాలు, హైవేలను నిరవధికంగా బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. "జరగబోయే పరిణామాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాతో మాట్లాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి చేరుకోకపోతే, మేము నిరవధికంగా హైవేలు మరియు టోల్ ప్లాజాలను బ్లాక్ చేస్తాము. మా చేసిన ఏకైక తప్పు ఏమిటంటే మేము ఈ దేశాన్ని కార్పొరేట్లకు విక్రయించకుండా అడ్డుకుంటున్నాము. మా భూమిని అమ్మే హక్కు వారికి ఎవరు ఇచ్చారు, మన దేశాన్ని విక్రయించే హక్కు వారికి ఎవరు ఇచ్చారు? మేము రోడ్లపైనే చనిపోవడానికి కూడా సిద్దమే కాని ఇది జరగడానికి మేము అనుమతించము. ʹ గుర్నామ్ సింగ్ చాధుని అన్నారు.

రైతులపై దాడిని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, బుపిందర్ సింగ్ హుడా ఖండించారు. ఒక ప్రకటనలో, హుడా ఇలా అన్నాడు, "ఇది అనాగరికమైన చర్య‌. బిజెపి కార్యక్రమం జరుగుతున్న ప్రదేశానికి కనీసం 15 కిలోమీటర్ల దూరంలో రైతులు శాంతియుతంగా నిరసన తెలిపారు. రైతులపై ఇటువంటి చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశాలను స్పష్టంగా తెలియజేస్తున్నది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై నిష్పాక్షిక దర్యాప్తు జరపి దోషులను శిక్షించాలి. ఇది ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ముందుగా, వారు ఉద్దేశపూర్వకంగా అటువంటి ఘర్షణ పరిస్థితులను సృష్టించారు, రైతులను రెచ్చగొట్టడం ద్వారా ఆ ఘర్షణలో రైతులు పాల్గొనేట్టు చేసి ఆపై వారిపై కనికరం లేకుండా దాడి చేస్తారు.ʹʹ అన్నారు బుపిందర్ సింగ్ హుడా

Keywords : hayana, farmers protest, police attack, lathi charge, manoharlala khattar, bjp, congress, BKU
(2024-04-17 18:09:23)



No. of visitors : 803

Suggested Posts


రేపిస్టు బాబాకు బీజేపీ ఎందుకు మద్దతుగా నిలబడింది ?

18 మంది స్త్రీలపై అత్యాచారం చేశాడని, 400 మందిని నపుంసకులుగా మార్చాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఇతని బండారాన్ని బైటపెట్టిన జర్నలిస్టు హత్య, సాద్వి రేప్ కేసులో ప్రత్యక్ష సాక్షి రంజిత్ సింగ్ హత్య... రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించగల ఓట్లధేనువు... ప్రభుత్వాల మద్దతుతో భీభత్సం సృష్టించగల శక్తి యుక్తులున్నవాడు గుర్మిత్ రాంరహీమ్ బాబా....

పంచకులలో డేరాల హింసకు బీజేపీ ప్రభుత్వమద్దతు ఉంది... హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

రేప్ బాబా గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ కు మద్దతుగా నిల్చిన బీజేపీనే ఈ హింసకు మద్దతుగా నిల్చిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ హర్యాణా హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. హింసకు ప్రభుత్వమే మద్దతుగా నిల్చిందని కడిగిపడేసింది.

అంత గొప్ప రేపిస్టుకు శిక్ష వేయడం భారత సంస్కృతిని అపఖ్యాతి పర్చే కుట్రేనట‌ !

రేప్ ల బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ పై తమకున్న అభిమానాన్ని బహిరంగంగానే చాటాడు. పైగా కోర్టులనే తప్పుబట్టాడు. ʹ గుర్మిత్ సింగ్ ను కోట్లాది మంది ప్రజలు, అనుచరులు అనుసరుస్తున్నారు, గుర్మిత్ గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిపై కోర్టులు తీర్పులు వెలువరించడం భారతీయ సంస్కృతిని అపఖ్యాతి పర్చే కుట్రʹ అని ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు.....

ʹGet out!ʹ Haryana Sports Minister Anil Vij tells woman IPS officer, she stays put

Locked in an argument over liquor smuggling, the Haryana Health and Sports Minister Anil Vij on Friday shouted at a senior woman police officer and ordered her to ʹget outʹ of a meeting

న్యాయం అడిగినందుకు15 మంది దళితులపై రాజద్రోహం కేసు!

అక్రమంగా అరెస్టు చేసిన తమ వారిని విడుదల చేయాలని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులతో సహా 15 మంది దళితులపై రాజద్రోహం కేసు బనాయించింది హర్యాణా ప్రభుత్వం. తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసిన రెండురోజులకే ఆ దళితులపై రాజద్రోహం కేసు మోపారు....

ʹసంఘ్ʹ మంత్రి ఉవాచ‌...డేరాల హింస అతిసహజమైనదట !

పంచకుల తగలబెట్టిన, అనేక మంది మరణానికి కారణమైన , పేదల చిన్న వ్యాపారుల కోట్లాది రూపాయల ఆస్తులను తగలబెట్టిన, రెండు రాష్ట్రాల్లో దుర్మార్గమైన హింసకు పాల్పడిన రేపులబాబా అనుచరుల స్పందన అతి సహజమైనదట...

గో సంరక్షణ పేరుతో హరియాణాలో అరాచకం - అమాయకులపై దాడి చేసిన కాశాయ మూక‌

హర్యాణ రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో ఇస్సాన్ మహ్మద్, షాహజాద్, షకీల్, ఆజాద్ మహ్మద్ అనే నలుగురు ఆటోలో వెళ్తుండగా చేతుల్లో కర్రలు, రాడ్ లు పట్టుకున్న ఓ 20 మంది గుంపు ఆటోను ఆపి ఆనలుగురిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. గో మాంసం తీసుకువెళుతున్నారన్న....

హర్యాణాలోమూక దాడి - ముస్లిం యువకుడి హత్య‌

హర్యానా, మేవాట్ జిల్లాకు చెందిన జిమ్ ట్రైనర్ ఆసిఫ్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తిని ఆదివారం ʹజై శ్రీ రామ్ʹ అని నినాదాలు చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ విజిలెంట్ గ్రూపులు కొట్టి చంపారు.

ఇద్దరు దళిత బాలికలపై స్టేషన్ లో పోలీసుల సామూహిక అత్యాచారం -నిజనిర్దారణ రిపోర్టు

ఈ ఏడాది జూలైలో హర్యాణా లోని సోనిపత్ లోని పోలీసు పోస్టు లో ఇద్దరు దళిత బాలికలపై డజను మంది సిబ్బంది అత్యాచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆ విషయంపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ చండీగఢ్ కు చెందిన బేఖాఫ్ ఆజాది (భయం లేని స్వేచ్చ‌) గ్రూప్ నిజనిర్ధారణ రిపోర్టును అక్టోబర్ 27నాడు విడుదల చేసింది.

నేపాలీల్లా ఉన్నారని భారతీయులకు పాస్ పోర్ట్ నిరాకరించిన అధికారులు

పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక(NRC) తదితర అంశాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, హర్యాణాలో ఇద్దరు అమ్మాయిలు, తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రైతులపై