ఖైదులో మూడు సంవత్సరాలు

ఖైదులో

28-08-2021

ఈరోజుకి సుధా భరద్వాజ్ అరెస్ట్ అయి మూడేళ్లు పూర్తయింది. అదే విధంగా, భీమకోరేగావ్ కేసుకు కూడా దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 16 మందిని అరెస్టు చేశారు (స్టాన్ స్వామి ఇటీవల నిర్బంధంలో మరణించారు). వారందరి మీదా మోడీపై హత్యాప్రయత్నం మొదలుకొని హింసను ప్రేరేపించడం వరకు తప్పుడు ఆరోపణలు ఉన్నాయి.

ఈ రోజు నాకు బల్గేరియా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు జార్జి డిమిట్రోవ్ కేసు గుర్తుకు వచ్చింది. అతన్ని 1933 లో ఫాసిస్ట్ జర్మనీలో రీచ్‌స్టాక్ పార్లమెంటును తగలబెట్టాడనే తప్పుడు ఆరోపణపై అరెస్టు చేసారు. డిమిత్రోవ్ తన కేసును స్వయంగా వాదించాలని నిర్ణయించుకున్నాడు. తన ʹరక్షణ (డిఫెన్స్)ʹ సాకుతో అప్పటి జర్మన్ ఫాసిజంపై ప్రత్యక్ష దాడిని ప్రారంభించి, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానాన్ని గొప్పగా ప్రచారం చేశాడు. ఈ కారణంగా అతని కీర్తి ఐరోపా అంతటా వ్యాపించింది. మొత్తం జర్మనీలో ఒకే ఒక్క ధైర్యవంతుడు ఉన్నాడని, అది కూడా బల్గేరియన్ అని యూరప్ అంతటా ఒక సామెత ఉంది.

ఈ రోజు మనం మన దేశంలో 15 మంది ధైర్యవంతులు ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు. వీరే కాకుండా జైళ్లలోనూ బయటా కూడా భారతదేశ పాలకుల క్రూర ఫాసిజాన్ని ఎదుర్కొంటూ భారతదేశ బంగారు భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహించే ధైర్యవంతులు ఇంకా వేలాది మంది ఉన్నారు. భీమకోరేగావ్ కేసులోని ఈ 15 మంది ఖైదీలు భారతదేశం నలుమూలల నుండి మాత్రమే కాకుండా అన్ని కులాల నుండి వచ్చిన వారు కావడం గమనార్హం.

ఇటీవల, సురేంద్ర గాడ్లింగ్, తన తల్లి సంవత్సరీకం సందర్భంగా ఒక వారం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు, జైలుకు వెళ్లడానికి ఒక రోజు ముందు సాయిబాబాతో పాటు జీవిత ఖైదు అనుభవిస్తున్న ప్రశాంత్ రాహి సహచరి చంద్రకళతో ఫోన్‌లో తన చిరపరిచితమైన నవ్వుతో మాట్లాడి, అస్సలు ఆందోళన పడవద్దని ధైర్యం చెప్పారు. మేము జైల్లో ఫిట్‌గా ఉన్నాం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఇది విన్న చంద్రకళ మనసు నిండిపోయింది. జైలులో అన్ని చిత్రహింసల మధ్య నివసిస్తున్న వ్యక్తి బయట స్నేహితులకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నిజమే, భీమకోరేగావ్ నుండి వచ్చిన ఈ సాహసికులు భారతదేశ భవిష్యత్తుకు ప్రాతినిధ్యం వహిస్తారు.

పెట్టుబడిదారీ విధానంలో గతం వర్తమానాన్ని శాసిస్తుందని మార్క్స్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టోలో రాశాడు. ఒకవేళ మార్క్స్ నేటి భారతదేశాన్ని చూసినట్లయితే, పెట్టుబడిదారీ విధానంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది, భవిష్యత్తును నిర్బంధంలో ఉంచుతుంది అని జోడించి ఉండేవాడు.

- మనీష్ ఆజాద్
తెలుగు అనువాదం : పద్మ కొండిపర్తి

Keywords : bhima koregaon, BK16, sudha bharadwaj, surendra gadling, professor siababa, stan swamy
(2024-04-24 23:22:04)



No. of visitors : 844

Suggested Posts


bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌

కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది.

UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి

భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది.

Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది.

Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర

బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది.

కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఖైదులో