Jharkhand: CRPF క్యాంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం - భూమి యిచ్చేది లేదని తేల్చి చెప్పిన‌ ఆదివాసీలు

Jharkhand:

31-08-2021

ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా, నోవాముండీ తాలూకా, జెటెయా పోలీసు స్టేషన్ పరిధి, పోఖ్‌రపీ పంచాయితీ లోని జోజో కుబీర్ గ్రామంలోని ఆదివాసీలు తమ గ్రామానికి చెందిన ముండా లక్ష్మణ్ లాగురి అధ్యక్షతన ఆగస్టు 25 న జరిగిన గ్రామసభలో సమావేశమై ʹగ్రామంలో సిఆర్‌పిఎఫ్ శిబిరం ఏర్పడడం వల్ల గ్రామంలోని ప్రజల శాంతి, ఆదివాసీల మత, సంస్కృతులకి భంగం కలుగుతుంది, కాబట్టి గ్రామంలో సిఆర్‌పిఎఫ్ శిబిరాన్ని నిర్మించడానికి అనుమతించముʹ అని నిర్ణయించారు. ఆదివాసీ మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారంతా ప్రతిపాదిత CRPF శిబిరానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామసభాస్థలికి చేరుకున్నారు.

నిజానికి, జోజో కుబీర్ గ్రామానికి చెందిన ముండా (సాంప్రదాయ గ్రామాధికారి) లక్ష్మణ్ లగురికి నోముండి సర్కిల్ ఆఫీసర్ నుండి ఉత్తర్వు రూపంలో వచ్చిన ఒక లేఖలో, ఆగస్టు 27 న ఉదయం 11 గంటలకు అప్‌గ్రేడ్ చేసిన మిడిల్ స్కూల్ జోజో కుబీర్‌లో గ్రామసభ నిర్వహించాలని ఆదేశించారు. ఆగస్టు 25 న, ముండా లక్ష్మణ్ లగురి సర్కిల్ ఆఫీసర్‌కు తాను నిర్వహిస్తున్న గ్రామసభ గురించి సమాచారం అందించిన తర్వాత తన గ్రామంతో పాటు అనేక సమీప గ్రామాలకు చెందిన ఆదివాసీలను పిలిచి గ్రామసభ నిర్వహించారు.

ఈ గ్రామ సభలో, జజో కుబీర్ గ్రామానికి చెందిన జార్ఖండ్ ప్రభుత్వానికి చెందిన జనావాసం లేని ప్రాంతమైన (అనాబాద్)భూమి ఖాతా నంబర్ -2, ప్లాట్ నంబర్ -108/276 లో 5 ఎకరాల స్థలంలో సిఆర్‌పిఎఫ్ క్యాంపు భవన నిర్మాణం జరుగుతుందని జాజో కుబీర్ గ్రామానికి చెందిన ముండా ప్రతిపాదించారు. ఇందుకోసం పరిపాలనా స్థాయిలో ఆగస్టు 27 న గ్రామసభ జరగాలని నిర్ణయం జరిగింది.

దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గ్రామస్తులు ఏక కంఠంతో ప్రతిపాదిత CRPF శిబిరాన్ని వ్యతిరేకించారు. ఈ వెనుకబడిన గ్రామీణ ప్రాంతంలో చాలా మంది పేదలు ఆదివాసీలని, కనీసం ఏడాది పొడవునా తినడానికి పండేంత సాగు భూమి కూడా వారికి లేదు. నిరుపేదలకు అటువంటి పోడు భూమిని పంపిణీ చేయడానికి జార్ఖండ్ ప్రభుత్వ నిబంధన ఉంది. ముండా పేద ప్రజలకు బీడు భూమిని యివ్వవచ్చు.

చివరగా, ఆగష్టు 25 న జరిగిన గ్రామసభలో, సిఆర్‌పిఎఫ్ క్యాంపును ఇక్కడ నిర్మించడానికి అనుమతించబోమని గ్రామస్తులు నిర్ణయించారు. ఉమేశ్ లగురి అనే పోస్టాఫీసు ఉద్యోగి ఆగస్టు 27 న నిర్వహించే పరిపాలనా గ్రామసభను గ్రామస్తులు బహిష్కరిస్తారని, ఎట్టి పరిస్థితులలోనూ సిఆర్‌పిఎఫ్ క్యాంపును ఏర్పాటు చేయడానికి అనుమతించబోమని చెప్పారు. ఆగస్టు 25 న, గ్రామసభ మర్నాడు మళ్లీ గ్రామసభ నిర్వహించాలని నిర్ణయించింది.

ఆగస్టు 26 న జరిగిన గ్రామసభలో సిఆర్‌పిఎఫ్ శిబిరం కోసం భూమిని తీసుకోవడం కోసం ఆగస్టు 27 న ప్రతిపాదిత పరిపాలనా గ్రామసభను వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఒక దరఖాస్తును తయారుచేసి అందరి సంతకాలు తీసుకుని. ఆ దరఖాస్తును పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా DCకి అందజేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆ దరఖాస్తు కాపీని చైబాసా సూపరింటెండెంట్, జగన్నాథ్‌పూర్ SDO, జెట్యా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్, నోముండి సర్కిల్ ఆఫీసర్‌కు అందజేయాలని నిర్ణయించారు. దీనితో పాటు ఆగస్టు 27 న నిర్వహించే గ్రామసభను బహిష్కరించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

ప్రతిపాదిత CRPF శిబిరానికి వ్యతిరేకంగా గ్రామీణ ముండా క్రియాశీలత, ఆదివాసీల సంఘీభావ ఫలితాలు ఆగస్టు 27 న స్పష్టంగా కనిపించాయి. ఆగస్టు 27 న, CRPF క్యాంప్ నిర్మాణానికి ప్రతిపాదిత భూమికి సంబంధించి ప్రజల నుండి సమ్మతిని పొందేందుకు గ్రామసభ నిర్వహించడానికి నౌముండి సర్కిల్ కార్యాలయం నుండి అధికారులు-ఉద్యోగులు జాజో కుబీర్‌కు చేరుకున్నప్పుడు, గ్రామస్తులు సమైక్యంగా గ్రామసభను బహిష్కరించారు. ఫలితంగా, మొదట ముండాను, ఆ తరువాత గ్రామస్తులను ఒప్పించడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. గ్రామసభ నిర్వహించకుండానే గ్రామం నుండి వెనక్కు తిరిగి పోవాల్సి వచ్చింది.

janchowk.com సౌజన్యంతో...
తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : jharkhand, CRPF, CAMP, Adivasi, Tribal, tribals decided to not give land for crpf camp
(2024-04-14 00:03:53)



No. of visitors : 948

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


Jharkhand: