ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలి -మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

ప్రముఖ

02-09-2021

పెరు కమ్యూనిస్ట్ పార్టీ (పిసిపి) ఛైర్మన్ గొంజాలోను, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 1992 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. గత 29 సంవత్సరాలుగా అతడిని జైలులో పూర్తిగా ఒంటరిగా ఉంచారు. 86 ఏళ్ళ వయసుగల గొంజాలోను విడుదల చేయాలని ప్రపంచ కార్మిక సంఘాలు, ప్రగతిశీల-ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంస్థలకు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

ప్రపంచ కార్మిక సంఘాలు, ప్రగతిశీల-ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంస్థలకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూంది.

కామ్రేడ్ గొంజాలోను తక్షణమే విడుదల చేయాలనే పోరాటానికి సిపిఐ (మావోయిస్ట్)పార్టీ మద్దతుగా నిలుస్తుంది!

పెరు కమ్యూనిస్ట్ పార్టీ (పిసిపి) ఛైర్మన్ గొంజాలోను, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో పాటు 1992 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. గత 29 సంవత్సరాలుగా అతడిని జైలులో పూర్తిగా ఒంటరిగా ఉంచారు.

ఖైదు, పూర్తిగా ఒంటరితనం, 86 సంవత్సరాల వయస్సులో కామ్రేడ్ గొంజాలో పట్ల వ్యవహరిస్తున్న తీవ్ర అమానవీయ వైఖరి అత్యంత హేయనీయమైనది. సమాజంలో మార్పు గురించి ఆలోచించే, పనిచేసే వారందరూ ఈ పరిస్థితి పట్ల శ్రద్ధ పెట్టి ఆలోచించాల్సిన అవసరం వుంది.

ʹరక్తం విప్లవాన్ని ముంచేయదు, పోషిస్తుందిʹ అని ఛైర్మన్ గొంజాలో అన్నారు. కామ్రేడ్ గొంజాలో పెరూలో, ప్రపంచంలోని పీడిత ప్రజల పట్ల నిబద్ధతతోనూ, ప్రపంచ సోషలిస్ట్ విప్లవం విజయం పట్ల విశ్వాసంతోనూ దృఢంగా నిలబడ్డారు. అతను ఇప్పుడు తన ప్రియమైన ప్రజల, పార్టీ కార్యకర్తల మధ్య ఉండాల్సిన అవసరం వుంది.

సోరియాసిస్‌తో సహా దీర్ఘకాలిక అనారోగ్యంతో, ఫాసిస్ట్ పెరూ దోపిడీ రాజ్య చెరసాలలో మరణించబోతున్నాడు. అతను మరణించకూడదు. కాబట్టి ప్రపంచంలోని సామ్రాజ్యవాదుల మద్దతు ఉన్న పెరూ రాజ్య క్రూరత్వానికి వ్యతిరేకంగా మన స్వరాన్ని పెంచుదాం.

కామ్రేడ్ గొంజాలోను తక్షణమే విడుదల చేయాలనే పోరాటంలో సిపిఐ (మావోయిస్టు) పాల్గొంటుంది. ప్రపంచంలోని విప్లవ, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులన్నీ అతని విడుదల కోసం పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కామ్రేడ్ గొంజాలో అరెస్ట్, అతన్ని అత్యంత క్రూరమైన చిత్రహింసలపాలు చేయడం అనేది, సామ్రాజ్యవాదులు, వారి దళారీ పాలకులు తమ సుదీర్ఘ ఆర్థిక, విత్త సంబంధ సంక్షోభాన్ని అధిగమించడానికి, దోపిడీ చేయడానికి, ప్రపంచ విప్లవోద్యమాన్ని అణిచివేసేందుకు చేసే ప్రయత్నాలలో భాగమే. కానీ ʹజీవిత ఖైదువిధించడం లేదా ఉరి తీయడం విప్లవాన్ని ఆపలేదుʹ.

పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, కామ్రేడ్ గొంజాలోకు యిచ్చే మద్దతు వెల్లువ ద్వారా దీనిని నిరూపిద్దాం.

కామ్రేడ్ గోంజాలో ʹవిచారణʹ

పెరూలో 1980లలో ప్రారంభమైన విప్లవోద్యమం అణగారిన ప్రజలలోకి చొచ్చుకుపోయి, ఇతర దేశాల్లోలాగానే ఆ దేశ పాలక వర్గాలను వణికించింది. ఉద్యమం సాధించిన సత్వర విజయాలు, పాలక వర్గాలు తమ దోపిడీ శక్తులని కాపాడుకోవడానికి తీవ్రమైన చర్యలు తీసుకునేలా చేసాయి. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పెరూ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆచూకీ తెలుసుకోవడానికి, వారిని అరెస్టు చేయడానికి ఒక విభాగాన్ని నియమించిన ఫలితంగా ఈ అరెస్టులు జరిగాయి.

అరెస్టయిన కొద్ది కాలం నుంచే కామ్రేడ్ గొంజాలో కుటుంబాన్ని, న్యాయవాదిని కలవడానికి తిరస్కరించారు. పెరువియన్ రాష్ట్రం అతని అత్యవసర విచారణ అనేక విధాలుగా అంతర్జాతీయ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా హడావిడిగా కొన్ని గంటలు మాత్రమే కొనసాగింది. ఒక చిన్న ఉక్కు పంజరం మధ్యలో వున్న కుర్చీ మీద కామ్రేడ్ గొంజాలోను కూర్చోబెట్టారు. అతని రాజకీయ, సైద్ధాంతిక నమ్మకాల గురించి మాత్రమే విచారణ జరిగింది.

పిసిపికి నాయకత్వం వహించే బాధ్యతను చైర్మన్ గొంజాలో సగర్వంగా అంగీకరించాడు. కోర్టు చట్టబద్ధతను అంగీకరించడానికి నిరాకరించాడు. మూడున్నర గంటలపాటు చేసిన ప్రసంగంలో ఇలా అన్నాడు -

ʹప్రజల బిడ్డలుగా మేము ఇక్కడ ఉన్నాము. మేము ఈ కందకాలలో పోరాడుతున్నాము, ఇది కూడా పోరాటమే, మేము కమ్యూనిస్టులం కాబట్టి ఈ పోరాటం చేస్తాము! ఎందుకంటే మేము ప్రజల ప్రయోజనాలను, పార్టీ సూత్రాలను, ప్రజల యుద్ధాన్ని సంరక్షిస్తాము! అదే మేం చేసింది, చేస్తున్నది, చేయబోయేది కూడా.ʹ

కామ్రేడ్ గొంజాలో జీవిత సహచరి మిరియం (ఎలెనా ఇపర్రగిర్రే) కూడా జైలు పాలయ్యారు. ఆమె మొదట ప్రక్కనే ఉన్న సెల్‌లో ఉండేది, కాని తరువాత మహిళా జైలుకు తరలించి అక్కడ ఒంటరిగా ఉంచారు.

ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర, దక్షిణ అమెరికాలో రక్షణ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. అబిమెల్ గజ్‌మన్ జీవితాన్ని రక్షించమనే పిలుపు మీద ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బెల్జియం, బ్రిటన్, కెనడా, చిలీ, కొలంబియా, డెన్మార్క్, ఎల్‌సాల్వడార్, ఫ్రాన్స్, జర్మనీ, గాడేలోప్, ఇరాన్, ఇరాక్, ఇటలీ, కీన్యా, మార్టింక్యూ, మెక్సికో, నేపాల్, నెదర్‌ల్యాండ్స్, దక్షిణ ఆఫ్రికా, స్పైన్, శ్రీలంక, టునిసియా, టర్కీ, అమెరికా దేశాల నుండి ప్రఖ్యాత న్యాయవాదులు, పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు, ఇతర ప్రభుత్వ నాయకులు, విద్యావేత్తలు, ప్రసిద్ధ సంగీతకారులు, రచయితలు, కళాకారులు,గొంజాలోను విడుదల చేయాలంటూ లేఖలు రాశారు. అంతర్జాతీయ అత్యవసర కమిటీ (IEC) మద్దతుదారులు, ఇతర సంబంధిత వ్యక్తుల ప్రతినిధులు అనేక దేశాలలో పెరూ రాయబార కార్యాలయాలకు వెళ్ళారు. ఛైర్మన్ గొంజాలో ప్రాణానికి వున్న ప్రమాదానికి నిరసనగా లేఖలు, టెలిగ్రామ్‌లు, ఫ్యాక్స్‌‌లు రాయబార కార్యాలయాలు, అధ్యక్ష భవనంలోకి వెల్లువెత్తుతున్నాయి.

IEC ఏర్పాటు చేసిన మొదటి అంతర్జాతీయ ప్రతినిధి బృందం ʹవిచారణʹ కోసం లిమా చేరుకుంది.

"షైనింగ్ పాత్" అని పిలువబడే హింసాత్మక, ప్రజాస్వామ్య వ్యతిరేక తీవ్రవాద గ్రూపుతో పోరాడాలనే సంకల్పంతోవున్న పెరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది" అని సెప్టెంబర్ 24 న, అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఛైర్మన్ గొంజాలోను పట్టుకోగలిగినందుకు DINCOTE ని అభినందించింది. అక్టోబర్ 20 నాడు యుఎస్ స్టేట్ డిపార్ట్‌‌మెంట్ ప్రతినిధి " పశ్చిమ భూగోళంలో అత్యంత భయంకరమైన తీవ్రవాద ఉద్యమానికి మిస్టర్ గొంజాలో నాయకుడు. అతడిని విచారించిన న్యాయ విచారణలపై మాకు ఎలాంటి వ్యాఖ్య లేదు." అని పునరుద్ఘాటించాడు.

అజానియా నాయకుడు స్టీవ్ బికో; భారతదేశంలో నక్సల్బరీ రైతాంగ తిరుగుబాటు మావోయిస్టు నాయకుడు చారు మజుందార్; టర్కీలో మావోయిస్టు నాయకుడు ఇబ్రహీం కెపక్కయా; బంగ్లాదేశ్ మావోయిస్టు నాయకుడు శిరాజ్ శిక్దర్, చియాంగ్ చింగ్ అనుమానాస్పద "ఆత్మహత్య"మొదలైన జైలు హత్యలను సామ్రాజ్యవాదులు చేయించారు లేదా ఆమోదించారు. అమెరికా తన దేశ జైళ్లలో, బ్లాక్ పాంథర్ నాయకుడు జార్జ్ జాక్సన్‌ను "తప్పించుకునే" ప్రయత్నంలో కాల్చి చంపేసింది, ప్యూర్టో రికన్ జాతీయ నాయకుడు పెడ్రో అల్బిజు క్యాంపొస్ జైలు గది గోడలలో రేడియోధార్మిక పదార్థాన్ని వుంచింది.

కాలోడ్ నావికా స్థావరంలోని జైలులో కామ్రేడ్ గొంజాలోను ఒంటరిగా వుంచడం ప్రపంచ విప్లవోద్యమంలో మొదటిదీ లేదా చివరిదీ కాదు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో దోపిడీ, అణచివేత, ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది. సామ్రాజ్యవాదులు ఆర్థిక, విత్త సంబంధ సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత కాలంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ జీవించే హక్కు, జీవనోపాధి కోసం పోరాడుతున్నప్పుడు, మనం ఐక్యమై శాయశక్తులా పోరాడాలి.


Keywords : CPI Maoist, Peru Communist Party, Gonzalo,CPI (Maoist) demands release of veteran leader Gonzalo
(2024-04-24 23:21:00)



No. of visitors : 1213

Suggested Posts


CPI (Maoist) demands release of veteran leader Gonzalo

he CPI (Maoist) Central Committee appealed to the world trade unions, progressive-democratic forces and human rights organisations to stage agitations for the release of a veteran Communist leader Abhiman Guzman alias Gonzalo.

ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేయడమే గొంజాలోకు నిజమైన నివాళి - మావోయిస్టు పార్టీ ప్రకటన

దాదాపు మూడు దశాబ్దాల నికృష్ణ జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న ఎనభై ఆరు సంవత్సరాల పెరూ విప్లవ కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) నాయకుడు కామ్రేడ్ అభిమేల్ గుజ్మన్ (గొంజాలో)ను అమెరికా ఆదేశాల పై పెరూ ప్రభుత్వం సరైన చికిత్స అందకుండా చేసి అంతిమంగా

పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌

పెరూ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు-అంతర్జాతీయంగా మావోయిజాన్ని విశ్వజనీన స్థాయిలో ప్రతిష్టించిన సైద్ధాంతిక వేత్తలలో అగ్రగణ్యుడు అయిన అభిమైల్ గుజ్ మెన్ (గుంజాలో) ఈ నెల 11, 2021న 86 సంవత్సరాల వయస్సులో అమరులైయ్యారు.

Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru

The political prisoners and prisoners of war of the Communist Party of Perú before the physical departure of Dr Abimael Guzmán Reinoso, our beloved and respected Chairman Gonzalo, with unyielding revolutionary conviction, we forever reaffirm ourselves in: Learn from Chairman Gonzalo! and Incarnate Gonzalo Thought!, serving the people wholeheartedly.

Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman

Central Committee, CPI (Maoist) pays itʹs humble homage to 86 year old Comrade Manuel Ruben Abimael Guzman Reynoso (Gonzalo), founder leader and ex-Chairman of Communist Party of Peru – Shining Path who martyred on 11th September in the high security centre

ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ సృష్టికర్త, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు కామ్రేడ్‌ గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది.

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం శ్రామికవర్గ, ప్రపంచ ప్రజల ఆలోచనలో, హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా వుంటుంది.

Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !

CPI (ML)-New Democracy pays homage to revolutionary memory of Com. Abimael Guzman (popularly known as Comrade Gonzalo), leader of revolutionary movement of Peru, who died on September 11, 2021 at the Callao naval base near capital Lima.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ప్రముఖ