సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు


సీపీఎం పాలనలో ఫ‌రిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం ... జైళ్ళు కావవి చిత్ర హింసల శిబిరాలు

సీపీఎం

13-09-2021

అబు గరీబ్, పాపా 2 (జమ్ము కాశ్మీర్ లోని ఇంటరాగేషన్ కేంద్రం)లతో సహా నాజీ జర్మనీలో వుండిన ఆశ్చివిజ్ నమూనా నిర్బంధ క్యాంపులు, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా ఖైదీల ప్రాణాలు తీసే ఇటువంటి నిర్బంధ శిబిరాలను ఎవరూ ప్రశ్నించకపోవడం దురదృష్టకరం. త్రిసూర్‌లోని సూపర్ సెక్యూరిటీ జైలు మితిమీరిన అధికారాన్ని వినియోగించే ఒక ఉదాహరణగా మారుతోంది.

చట్టాల ద్వారా జైళ్లను నిర్మించారు, కేవలం గోడలతో కాదు అనే ప్రాథమిక భావనను సవాలు చేసి అలాంటి జైళ్లు చట్ట నియమాల్ని నీరుకారుస్తాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు రాజకీయ ఖైదీ కామ్రేడ్ డానిష్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్, వెల్ఫేర్ ఆఫీసర్ చేసిన బెదిరింపులను చూడాలి. చట్టం, న్యాయం అన్నీ జైలు గోడల లోపల ఉన్నాయని భావించే అటువంటి నియంతృత్వ పోకడలను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్య కేరళలోని ప్రజాస్వామిక వాదులు తప్పనిసరిగా ఐక్యమవ్వాలి.

ముందు రోజు అత్యంత భద్రత కలిగిన జైలులో హర్షద్ అనే ఖైదీని ఆరుగురు జైలు అధికారులు దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన హర్షద్‌కు చికిత్స కూడా చేయించలేదు. బయట వున్న మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తల ద్వారా మాత్రమే ఈ సమాచారం తెలిసింది. హై సెక్యూరిటీ జైలులో జరిగిన ఈ సమస్యకు సంబంధించి మేము హర్షద్ తండ్రితో కలిసి జైలుకు వెళ్లి హర్షద్‌ని కలిసి వివరాలు తెలుసుకుని మీడియాకు అందించాము.

విచారణ ఖైదీ డానిష్ ద్వారా ఈ వార్త బయటకేళ్ళిందని జైలు అధికారులు అతడిని బెదిరించారు. నిన్న ఉదయం డిప్యూటీ సూపరింటెండెంట్, వెల్ఫేర్ ఆఫీసర్ అతని సెల్‌ మీద దాడి చేస్తామని బెదిరించారు. ఈ సమాచారం మరొక మావోయిస్టు రాజకీయ ఖైదీ కామ్రేడ్ హరికి తెలిసింది. ʹఏడా మైరే .... ఇక్కడ జరుగుతున్నదంతా నువ్వు నాకు చెప్పాలి.. లేకుంటే నేను నిన్ను కొట్టి పైకి పంపించేస్తాము అని డిప్యూటీ సూపరింటెండెంట్ బెదిరించాడు. విచిత్రమేమంటే , సంక్షేమ అధికారి కూడా ఆ సమయంలో సెల్‌లో ఉన్నారు. డానిష్‌ని సెల్‌లో వుంచి తాళం వేసారు. ఫోన్ చేయడానికి కూడా అనుమతించలేదు. ఖైదీలను ఏడా (ఏరా) ... ఏమే అని పిలవవద్దని హైకోర్టు కేరళ పోలీసులను హెచ్చరిస్తే, జైలు సిబ్బంది విచారణ ఖైదీలను ఏరా మైరే (బూతు అర్ధంలో వాడే పదం) అని పిలుస్తోంది ..... వెంటనే కేరళ మానవ హక్కుల కమిషన్ కు పీపుల్స్ హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ ఫిర్యాదు చేసింది.

ఇక్కడ కొనసాగుతున్న హింసను గమనిస్తే హై సెక్యూరిటీ జైళ్లలో ఖైదీల జీవితాలకు భద్రత లేదనే వాస్తవం నిర్ధారితమవుతుంది. అంతేకాకుండా, జైలు అధికారులు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, ఖైదీలకు వచ్చిన పార్సిళ్ళను, పుస్తకాలను యివ్వడం లేదు. కుటుంబానికి ఫోన్ చేసుకొనే హక్కును కూడా నిరాకరిస్తున్నారు.. హక్కులను డిమాండ్ చేసినప్పుడు క్రూరమైన అణచివేతను అమలుచేస్తున్నారు .

అటువంటి పరిస్థితిని ప్రశ్నించినందుకే డానిష్‌ను కూడా బెదిరించారు. జాయింట్ సూపరింటెండెంట్, వెల్ఫేర్ ఆఫీసర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేరళలోని మానవ హక్కులు, పౌర హక్కుల కార్యకర్తలందరూ మానవ హక్కుల ఉల్లంఘనలకు, అధిక భద్రతా జైళ్లలో జరుగుతున్న హింసకు ప్రతిస్పందించాలి. హై సెక్యూరిటీ జైలును మూసివేయాలి.

సి పి రషీద్, మానవ హక్కుల కార్యకర్త, కేరళ

Keywords : kerala, prisones,Thrissurʹs super security jail Human Rights Movement, High Court,Kerala Human Rights Commission,
(2021-10-26 00:38:25)



No. of visitors : 353

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Search Engine

Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
లఖింపూర్ ఖేరీ లో రైతుల హత్య వెనుక కేంద్రమంత్రి హస్తం - యూపీ బీజేపీ నేత సంచలన ఆరోపణ
Haryana: రైతుల దెబ్బకు కార్యక్రమం రద్దుచేసుకొని వెనక్కు మళ్ళిన ముఖ్యమంత్రి
more..


సీపీఎం