చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు

చైర్మన్

29 ఏళ్ళ పాటు జైల్లో ఉన్న పెరూ మావోయిస్టు పార్టీ చైర్మన్ అభిమైల్ గుజ్ మెన్ (గొంజాలో ) ఈ నెల 11వ తేదీన జైల్లోనే అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా పెరూలోని వివిధ జైళ్ళలో ఉన్న రాజకీయ ఖైదీలు, యుద్ద ఖైదీలు విడుదల చేసిన ప్రకటన‌

ఛైర్మన్ గొంజాలో నుండి నేర్చుకోండి!
హృదయపూర్వకంగా ప్రజలకు సేవ చేయడంద్వారా గొంజాలో ఆలోచనావిధానాన్ని సాకారం చేద్దాం!
-పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం శ్రామికవర్గ, ప్రపంచ ప్రజల ఆలోచనలో, హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా వుంటుంది.

పెరూ కమ్యూనిస్ట్ పార్టీ నేత, మా ప్రియమైన మా ఛైర్మన్ గొంజాలో భౌతికంగా మన నుండి దూరమైన ఈ సమయంలో, పెరూ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయ ఖైదీలు, యుద్ధ ఖైదీలం విప్లవం పట్ల మొక్కవోని విశ్వాసంతో.. మమ్మల్ని పునరంకితం చేసుకొంటాం.

పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, పెరూ విప్లవానికి గొంజాలో ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. పెరూ కమ్యూనిస్ట్ పార్టీ పునర్నిర్మాణానికి నాయకత్వం వహించాడు. కార్మిక వర్గానికి అవసరమైన నూత‌న పార్టీని అందించాడు. అద్భుతమైన ప్రజా యుద్ధానికి నేతృత్వాన్నిచ్చాడు. పెరూ దేశచరిత్రలోనే అతి పెద్ద విప్లవకర సామాజిక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. పెరూ, ప్రపంచ విప్లవాలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలకు ఒక గొప్ప మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్‌గా శ్రామికవర్గ విశ్వజనీన భావజాలాన్ని అందించాడు. వ్యూహాత్మక, నిర్దిష్ట, సైద్ధాంతిక ఆయుధమైన గొంజాలో ఆలోచనా విధానాన్ని మనకు అందించాడు.

ప్రపంచంలోనే అతి ముఖ్యమైన విప్లవ రాజకీయ ఖైదీ అయిన ఛైర్మన్ గొంజాలో, ఏనాడూ పాలకుల ముందు మోకరిల్లలేదు. కమ్యూనిస్ట్ నిబ‌ద్ద‌త‌తో 29 సంవత్సరాల పాటు సైనిక జైలులో ఘోర‌మైన‌ హింసను, ఒంటరితనాన్ని దృఢంగా ఎదుర్కొన్నాడు. ప్రతిఘాతుక నేల కంద‌కాలను ప్రకాశవంతమైన పోరాట ప్ర‌వాహాలుగా మార్చే అద్భుతమైన సంప్రదాయాన్ని కొనసాగించాడు. అత్యంత కఠినమైన జైలు పరిస్థితులలో అలసిపోకుండా పోరాడాడు. పార్టీ, విప్లవాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అతను ప్ర‌పంచ విప్ల‌వోద్య‌మాల చ‌రిత్ర‌లో ఒక శాశ్వత ఉదాహరణగా నిలిచిపోతాడు.

అతని మరణానికి పెరూ ప్ర‌భుత్వం బాధ్యత వహించాలి. గ‌త పెరూ పాశ‌విక ప్ర‌భుత్వాల అణిచివేత‌ను కొన‌సాగిస్తున్న నేటి ఈ పాల‌కులు గొంజాలోను బ‌లితీసున్నారు. చివ‌రి రోజుల్లో కూడా తన భార్యను కలవడానికి అనుమతించని ఈ పాల‌కులు, ఈరోజు తన ప్రియమైన భర్తకు వీడ్కోలు చెప్పడానికి కూడా అనుమ‌తివ్వ‌లేదు. ముఖ్యంగా ఈ అమానుష‌త్వానికి నావికాదళం బాధ్యత వహించాలి. ఛైర్మన్ గొంజాలోకి నివాళులర్పించకుండా నిరోధించడానికి, అతని అవశేషాలను మాయం చేయడానికి కూడా ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను ఏమాత్రం గౌర‌వించ‌ని ఈ ప్ర‌భుత్వాలు కుట్ర చేశాయి.

ప్రెసిడెంట్ కాస్టిల్లో, గ‌త పాల‌కులు చేసిన దుష్ట చర్యల్లా కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా డాక్టర్ గుజ్మాన్ అవశేషాలను అతని భార్య ఎలెనా యెపారగ్వాయాకు అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఛైర్మన్ గొంజలో తన అరెస్ట్ సమయంలో తన కణతను సూచిస్తూ యిలా అన్నారు: "విప్లవకారులు చనిపోతే, వారు అనేకమ‍ందిలో జీవిస్తారు, వారి భావాల‌ను ఎప్పటికీ తుడిచివేయలేరు." అది తిరుగులేని నిజం: వారి ఆలోచనలు, కార్యాచరణ అమరం.

గొంజాలో అమ‌ర‌త్వంతో తీవ్ర వేదనని రెట్టింపు శక్తిగా మార్చుకొని రాజకీయ ఖైదీలు, యుద్ధ ఖైదీలమైన మేం ఛైర్మన్ గొంజాలో చేతిలోని ఎర్ర జెండాను ఎత్తిపట్టి, ఆయన మార్గంలో కొనసాగుతాం. మానవాళి మౌలిక విముక్తి అయిన కమ్యూనిజం దిశగా సోషలిస్ట్ విప్లవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాం.

హృదయపూర్వకంగా ప్రజలకు సేవ చేయడానికి ఉదాహరణ అయిన చైర్మన్ గొంజాలో జిందాబాద్!

-పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు
సెప్టెంబర్ 11, 2021.

Keywords : Dr Abimael Guzmán Reinoso, peru, GONZALO, death, martyr
(2024-04-22 18:31:34)



No. of visitors : 570

Suggested Posts


CPI (Maoist) demands release of veteran leader Gonzalo

he CPI (Maoist) Central Committee appealed to the world trade unions, progressive-democratic forces and human rights organisations to stage agitations for the release of a veteran Communist leader Abhiman Guzman alias Gonzalo.

ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలి -మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

ప్రపంచ కార్మిక సంఘాలు, ప్రగతిశీల-ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంస్థలకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూంది.

ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేయడమే గొంజాలోకు నిజమైన నివాళి - మావోయిస్టు పార్టీ ప్రకటన

దాదాపు మూడు దశాబ్దాల నికృష్ణ జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న ఎనభై ఆరు సంవత్సరాల పెరూ విప్లవ కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) నాయకుడు కామ్రేడ్ అభిమేల్ గుజ్మన్ (గొంజాలో)ను అమెరికా ఆదేశాల పై పెరూ ప్రభుత్వం సరైన చికిత్స అందకుండా చేసి అంతిమంగా

పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌

పెరూ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు-అంతర్జాతీయంగా మావోయిజాన్ని విశ్వజనీన స్థాయిలో ప్రతిష్టించిన సైద్ధాంతిక వేత్తలలో అగ్రగణ్యుడు అయిన అభిమైల్ గుజ్ మెన్ (గుంజాలో) ఈ నెల 11, 2021న 86 సంవత్సరాల వయస్సులో అమరులైయ్యారు.

Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru

The political prisoners and prisoners of war of the Communist Party of Perú before the physical departure of Dr Abimael Guzmán Reinoso, our beloved and respected Chairman Gonzalo, with unyielding revolutionary conviction, we forever reaffirm ourselves in: Learn from Chairman Gonzalo! and Incarnate Gonzalo Thought!, serving the people wholeheartedly.

Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman

Central Committee, CPI (Maoist) pays itʹs humble homage to 86 year old Comrade Manuel Ruben Abimael Guzman Reynoso (Gonzalo), founder leader and ex-Chairman of Communist Party of Peru – Shining Path who martyred on 11th September in the high security centre

ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ సృష్టికర్త, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు కామ్రేడ్‌ గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది.

Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !

CPI (ML)-New Democracy pays homage to revolutionary memory of Com. Abimael Guzman (popularly known as Comrade Gonzalo), leader of revolutionary movement of Peru, who died on September 11, 2021 at the Callao naval base near capital Lima.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


చైర్మన్