సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్


సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్

సీనియర్

15-09-2021

సీపీఐ మావోయిస్టు ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ దుబాసీ శంకర్ ఎలియాస్ మహేందర్ అరెస్టయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని బాయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేందర్ ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ తెలిపారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహేందర్ ను, కిరణ్ అనే మరో మావోయిస్టు నాయకుణ్ణి కోరాపుట్ జిల్లా బైతులగూడా బ్లాక్, కాటపాడు పంచాయతీ పరిధిలోని కొడవ బాతి గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వారిని వెంటనే విడుదల చేయాలని ఆంధ్రా - ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ నిన్న డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే మహేందర్ ను అరెస్టు చేసినట్టు చూయించిన పోలీసులు కిరణ్ మాత్రం లొంగిపోయినట్టు చూయించారు. కోరాపుట్ జిల్లాలోని బాయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో డివిఎఫ్, బిఎస్‌ఎఫ్ మరియు ఎస్‌ఓజి సంయుక్తంగా చేపట్టిన సంయుక్త కూంబింగ్ ఆపరేషన్లో మహేందర్ ను అరెస్టు చేశామని ఆ సమయంలో అతని సహచరులు పోలీసులపై కాల్పులు జరిపారని అయితే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో వాళ్ళు పారిపోయారని డీజీపీ ప్రకటించారు.

భద్రతా సిబ్బంది మహేందర్ వద్ద నుండి INSAS రైఫిల్, 10 రౌండ్ల మందుగుండు సామగ్రి, మొబైల్ ఫోన్, రేడియో, ఇయర్‌ఫోన్, అమెజాన్ కిండిల్, రూ .35,000 నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని డీజీపీ తెలిపారు. .

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుబాసి శంకర్ ఎలియాస్ మహేందర్ ది సిద్దీపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చేట్ల నర్సంపల్లి గ్రామం. ఆయన‌దాదాపు 34 ఏళ్ళుగా అఙాతంలో ఉన్నారు. 1987లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన నిజామాబాద్ జిల్లా ఇంద్రప్రియాల్ దళంతో పని చేశారు. 2003 లో ఉత్తర తెలంగాణ‌ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా పదోన్నతి పొందారు. 2004 లో ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో పని చేయడానికి వెళ్ళారు. 2010 లో అతను స్టేట్ మిలిటరీ కమిషన్ సభ్యుడుగా నియమించబడ్డారు. ప్రస్తుతం మహేందర్ ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ గా, స్టేట్ మిలిటరీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు.

Keywords : odisha, maoists, dubasi shankar, mahendar, dgp, abhay, arrest, encounter
(2021-10-26 00:44:56)



No. of visitors : 440

Suggested Posts


Maoist posters on Russian Revolution in Narayanpatna

Maoist posters resurfaced in Narayanpatna of Koraput district with the rebels appealing people to participate in the week-long centenary celebrations of the Russian Revolution from November 7-13 across the State....

Successful bandh in Odisha

The bandh was convened to demand the immediate arrest of the accused for gang rape of a minor girl in Kunduli, control of violence against tribal women and a solution to the Mahanadi area. The movement of vehicles was affected in the five districts due to the bandh, according to the reports....

మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ ‍-ఒడిశాలో అనేక చోట్ల ఎన్నికల వాయిదా

మల్కన్ గిరి, కోరాపూట్, గంజా‍ం, గణపతి, కొందమాల్ జిల్లాల్లో వందలాది గ్రామాల్లో పార్టీ ప్రచారం ముమ్మరంగాసాగుతోంది. అనేక గ్రామాల్లో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. చిత్రకొండ సమితిలోని 18 పైగా పంచాయితీల్లో, 2 జిల్లా పరిషథ్ జోన్లలో, కటాఫ్ ఏరియాలోని 9 పంచాయితీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు వేయకపోవడంతో అధికారులు అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు....

పోలీసు అరాచకాలను నిరసిస్తూ ఎస్పీ ఆఫీస్ ను ముట్ట‌డించిన ఆదివాసీలు

తమ గ్రామాలపై దాడులు, అరెస్టులు, స్త్రీలపై అత్యాచారాలు తక్షణం ఆపివేయాలని , కూంబింగ్ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది ఆదివాసులు ఒడీశా రాయగడ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అడవిపై ఆధారపడి జీవించే తమపై.....

Maoist movement puts Odisha cops on toes

THE intelligence inputs on movement of a small group of Maoists in the tri-junction area of Angul, Nayagarh and Cuttack rural district, has put Odisha Police on alert. Cops have started combing operation in Angul district amid reports of Maoist movement at Satkosia-Narasinghpur border.

Where is gau rakshaks - Vehicle in Amit Shahʹs convoy hits cow in Odisha

At a time when the incidents of lynchings in the name of ʹgau rakshaʹ are being reported from across the country, a vehicle in BJP president Amit Shahʹs motorcade hit a cow during his Odisha tour on Thursday, leaving the animal wounded and prompting a sarcastic....

Maoist posters warn informers in Odishaʹs Kalahandi district

A couple of Maoist posters appealing to the villagers not to become police informers was found at Lakhbahali near Pahadpadar village under Lanjigarh block of Kalahandi district on Thursday. The Maoists have also appealed to the locals to observe ʹSahid Divasʹ on Thursday....

మతం మారాడని ఓ బాలుడిని ముక్కలుగా నరికి చంపిన మతోన్మాదులు

ఓ కుటుంభం మతం మారిందన్న‌ కోపంతో మతోన్మాదులు ఓ 14 ఏళ్ళ బాలుడిని ముక్కలుగా నరికి చంపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కెండుగుడ అనే గ్రామంలో ఉంగా మద్కామి అతని కుమారుడు సమరూ మద్కామీ మూడు సంవత్సరాల‌ క్రితం క్రైస్తవ మతంలోకి మారారు.

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు

ఓడిశా లో ఓ బాలికపై పోలీసు స్టేషన్ లోనే ఇన్‌స్పెక్టర్ తో సహా పలువురు పోలీసులు కొన్ని రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. మార్చ్ 25 న సుందర్ గడ్ జిల్లా బిరమిత్రపూర్ లో జరిగిన ఓ ప్రదర్శనలో పాల్గొనడానికి 13 ఏళ్ళ బాలిక వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ ప్రదర్శన రద్దయ్యింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులు కూడా లేవు.

ఒడిశాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 60 గ్రామాల ఆదివాసీల నిరసన

భారతదేశంలోని అత్యంత ఖనిజ సంపన్న రాష్ట్రాలలో ఒడిశా ఒకటి, మొత్తం దేశంలో వున్న 3,010 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వల్లో 60% ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి.

Search Engine

Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
లఖింపూర్ ఖేరీ లో రైతుల హత్య వెనుక కేంద్రమంత్రి హస్తం - యూపీ బీజేపీ నేత సంచలన ఆరోపణ
Haryana: రైతుల దెబ్బకు కార్యక్రమం రద్దుచేసుకొని వెనక్కు మళ్ళిన ముఖ్యమంత్రి
more..


సీనియర్