ʹకమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని ఎత్తిపడదాం -విరసం

ʹకమ్యూనిజం

16-092021

పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్‌ పాత్‌ సృష్టికర్త, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్‌ అమెరికా పోరాట ఆచ‌ర‌ణ‌లో ఎత్తిప‌ట్టిన గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు కామ్రేడ్‌ గొంజాలోకు విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్‌, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది. దీనికి నిరసనగా ఈ ఏడాది జూలై నుంచి ఆయన ఆహారం తీసుకోవడం లేదు. జైలులో గొంజాలో ప్రారంభించిన నిరాహార పోరాటానికి సంఘీభావంగా లాటిన్‌ అమెరికా, యూరప్‌, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో గత రెండు నెలలుగా ప్రత్యక్ష ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన విడుదల కోరుతూ అన్ని దేశాల్లోని పెరూ రాయబార కార్యాలయాల ఎదుట నిరసనలు జరిగాయి. ఆయన ప్రాణాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలకు వినతులు వెల్లువెత్తాయి.
భారతదేశంలోని కొన్ని నగరాల్లోనూ గొంజాలో సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి. ఈ ఒత్తిళ్లకు తలవంచిన పెరూ ప్రభుత్వం చివరకు నావికా స్థావరంలోని ఆస్పత్రికి తరలించింది. జీవితాంతం సాగించిన కష్టతరమైన, దీర్ఘ‌కాలిక పోరాటాన్ని అక్కడా కొనసాగిస్తూనే గొంజాలో తుదిశ్వాస విడిచారు.
కనీసం రెండు దశాబ్దాలకాలం ప్రభాతాల జడిలో ప్రపంచాన్ని షైనింగ్‌పాత్‌ ఉద్యమం ముంచెత్తింది. ʹఇది విప్ల‌వాల యుగం* అని ప్రకటించిన చైనా సాంస్కృతిక విప్లవం ఈ ఉద్యమానికి స్ఫూర్తి. భారత్‌లో నక్సల్బరీ వసంతమేఘం, పారిస్‌లో ఆగ్రహ విద్యార్థులు, పెరూలో పైనింగ్‌పాత్‌ ఉద్యమం దాదాపు ఒకేసారి మొదలయ్యాయి. ఉత్పత్తి- ప్రయోగం-యుద్ధం ద్వారా నిర్మాణమయి, విస్తరించే దీర్ఘ‌కాలిక‌ సాయుధ పంథాను పెరూలో గొంజాలో నిర్మించారు. గొంజాలో ఆలోచనా విధానంగా దీనిని ఉద్యమ సహచరులు పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ఈ అవగాహన శరవేగంగా చొచ్చుకెళ్లింది. చాలా ప్రాంతాల్లో విప్ల‌వ భూసంస్కరణలను ఉద్యమం చేపట్టింది. ఉన్నత విద్యావంతుడైన గొంజాలో, తాను చేస్తున్న ప్రొఫెసర్‌ ఉద్యోగాన్ని వదిలి, 1960 చివర్లో పూర్తికాలం ఉద్యమజీవితాన్ని ఎంచుకున్నారు. విప్లవ తపనతో కొన్ని పొరపాట్లు చేసినప్పటికీ, యుద్ధ స్వభావాన్ని ప్రజా సంస్కృతే నిర్ధారించాలన్న మావోయిస్టు మూల సూత్రాన్ని పెరూలో ఆచరించి అద్భుత ఫలితాలను అందుకున్నారు. కేంద్ర కమిటీ సమావేశభవనంలో మిగతా నాయకులతోపాటు గొంజాలో 1992లో అరెస్తు అయ్యేనాటికి ఉద్యమం మూడువంతుల గ్రామాలను విముక్తిచేసి, పట్టణాలపై పట్టు బిగిస్తోంది. ఒక విప్లవ సంకేతంగా షైనింగ్‌పాత్‌ ప్రపంచవ్యాప్త పోరాటాలను, కవులు, రచయిత‌ల‌ను ఊపేస్తోంది.
అమెరికా సామ్రాజ్యవాదులు ఎల్‌ఐసీ (మంద్రస్థాయి యుద్ధం) పద్ధతుల్లో ఈ దశలోనే ఉద్యమంపై విరుచుకుపడ్డారు. పట్టణాలను అనుకొని ఉన్న మైదాన గ్రామాల్లో ఇన్ఫార్మర్‌ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకొన్నారు. ఉద్యమాన్ని అణచడానికి నమ్మకద్రోహులతో ప్రత్యేకంగా ఒక డిపార్టుమెంటునే పెరూ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎల్‌ఐసీ ఉచ్చును వెంటనే గ్రహించలేక, గ్రహించినా ప్రతివ్యూహం రచించేంత వ్యవధి లేక మూకుమ్మడిగా నాయకత్వమంతా ఒకేసారి దొరికిపోవడంతో పెరూలో తాత్కాలికంగా సామ్రాజ్యవాదులదే ʹపైచెయ్యిʹ అయింది. కోర్టులో గొంజాలో విచారణ ఒక ప్రహాసనంలా సాగింది. విచారణ మొద‌లైన కొన్ని గంటల్లోనే ఆయనకు కోర్టు రెండు యావజ్జీవ కారాగార శిక్షలను విధించింది. గొంజాలో క్షేమం కోసం, ఆయన విడుదల కోసం ప్రపంచమంతటా ఈ సమయంలో జరిగిన ఆందోళనల కారణంగానే అంత హడావుడిగా విచారణ తంతును పూర్తిచేశారు. పోరాట భూమిలో నిలిచిన గొంజాలోను నేరుగా ఎదుర్కోలేకపోయారు. కనీసం తమ చేతికి చిక్కిన తర్వాతైనా పెరూ పాలకులు ప్రశాంతతను పొందారా అంటే..అదీ లేదు.
ఎంత గడ్డు కాలమది! ఏ ఉద్యమానికైనా ఆటుపోట్లు సహజం. సాధించుకున్న విజయాలను ఒక్కోసారి కోల్పోవాల్సి రావచ్చుకూడా. అయినా మొండిగానైనా కాడిని వదిలిపెట్టకుండా ఉద్యమాన్ని నిలుపుకొనే ఉదంతాలెన్నో! పెరూ ఉద్యమ అనుభవం అలాంటిది కాదు. ప్రజలు తయారుచేసుకున్న నాయకత్వమంతా ఒక్క అరెస్టుతో తుడిచిపెట్టుకుపోయింది. అంతకుమించిన నష్టం ఎల్‌ఐసీ ట్రాప్‌లో పడి నాయకుల మధ్య పెరిగిపోయిన అపనమ్మకాలు. ఈ పరిస్థితుల్లో అరెస్టు అయి జైలుకు పోయినవారు పోగా బయట మిగిలిపోయిన కొద్దిమంది సైతం ఉద్యమాన్ని నిలబెట్టలేకపోయారు. ʹఉద్యమాన్ని మా శత్రువు ఏమీ చేయలేకపోయాడు. పరస్పర అపనమ్మకాలతో మేమే చంపుకొన్నాంʹ అని గోంజాలో నిజాయితీగానే అంగీకరించారు. ఇంత ప్రతికూలతలోనూ.. మావోయిస్టు ఉద్యమం, ప్రజాయుద్ధ సంస్కృతి పట్ల చివరివరకు ఆయన సానుకూల దృక్పథాన్నే ప్రదర్శించారు. ʹనేను ఈరోజు ఉండవచ్చు. లేకపోవచ్చు. కానీ ఆలోచనలు మాత్రం ఉంటాయి. అవి ఒకరి నుంచి ఒకరికి ప్రవహించినంత కాలమూ కమ్యూనిజం అజేయం. కమ్యూనిస్టులు జయిస్తారుʹ అన్న గొంజాలో సందేశాన్ని మనమంతా ఎత్తిపడదాం!
– అరసవిల్లి కృష్ణ, అధ్యక్షుడు
బాసిత్, ఉపాధ్యక్షుడు
రివేరా, సహాయ కార్యదర్శి
విప్లవ రచయితల సంఘం

Keywords : Dr Abimael Guzmán Reinoso, PERU, GONZALO, Virasam
(2024-04-24 23:17:31)



No. of visitors : 636

Suggested Posts


CPI (Maoist) demands release of veteran leader Gonzalo

he CPI (Maoist) Central Committee appealed to the world trade unions, progressive-democratic forces and human rights organisations to stage agitations for the release of a veteran Communist leader Abhiman Guzman alias Gonzalo.

ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలి -మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి

ప్రపంచ కార్మిక సంఘాలు, ప్రగతిశీల-ప్రజాస్వామ్య శక్తులు, మానవ హక్కుల సంస్థలకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కామ్రేడ్ గొంజాలో విడుదల కోసం ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేస్తూంది.

ప్రజాయుద్ధాలను తీవ్రతరం చేయడమే గొంజాలోకు నిజమైన నివాళి - మావోయిస్టు పార్టీ ప్రకటన

దాదాపు మూడు దశాబ్దాల నికృష్ణ జైలు జీవితంలో తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న ఎనభై ఆరు సంవత్సరాల పెరూ విప్లవ కమ్యూనిస్టు పార్టీ (పీసీపీ) నాయకుడు కామ్రేడ్ అభిమేల్ గుజ్మన్ (గొంజాలో)ను అమెరికా ఆదేశాల పై పెరూ ప్రభుత్వం సరైన చికిత్స అందకుండా చేసి అంతిమంగా

పెరూ మావోయిస్టు నాయకుడు గుంజాలో అమరత్వం ... భారత మావోయిస్టు పార్టీ ప్రకటన‌

పెరూ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు-అంతర్జాతీయంగా మావోయిజాన్ని విశ్వజనీన స్థాయిలో ప్రతిష్టించిన సైద్ధాంతిక వేత్తలలో అగ్రగణ్యుడు అయిన అభిమైల్ గుజ్ మెన్ (గుంజాలో) ఈ నెల 11, 2021న 86 సంవత్సరాల వయస్సులో అమరులైయ్యారు.

Long Live Chairman Gonzalo and Gonzalo Thought - Political and War Prisoners of Peru

The political prisoners and prisoners of war of the Communist Party of Perú before the physical departure of Dr Abimael Guzmán Reinoso, our beloved and respected Chairman Gonzalo, with unyielding revolutionary conviction, we forever reaffirm ourselves in: Learn from Chairman Gonzalo! and Incarnate Gonzalo Thought!, serving the people wholeheartedly.

Maoist Party Central Committee Red Homage to Comrade Abimael Guzman

Central Committee, CPI (Maoist) pays itʹs humble homage to 86 year old Comrade Manuel Ruben Abimael Guzman Reynoso (Gonzalo), founder leader and ex-Chairman of Communist Party of Peru – Shining Path who martyred on 11th September in the high security centre

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం వర్ధిల్లాలి -పెరూ రాజకీయ, యుద్ధ ఖైదీలు

చైర్మన్ గొంజాలో, గొంజాలో ఆలోచనా విధానం శ్రామికవర్గ, ప్రపంచ ప్రజల ఆలోచనలో, హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా వుంటుంది.

Homage to Peruʹs Communist Revolutionary leader Comrade Gonzalo !

CPI (ML)-New Democracy pays homage to revolutionary memory of Com. Abimael Guzman (popularly known as Comrade Gonzalo), leader of revolutionary movement of Peru, who died on September 11, 2021 at the Callao naval base near capital Lima.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹకమ్యూనిజం