న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌


న్యాయవాది, CLC నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై హత్యాయత్నం....CLC ప్రకటన‌

17-09-21

న్యాయవాది, పౌర హక్కుల సంఘం నాయకులు గడ్డం సంజీవ్ కుమార్ పై జరిగిన హత్యాయత్నం పై నిజనిర్దారణ జరిపిన పౌరహక్కుల సంఘం విడుదల చేసిన ప్రకటన.

దండేపల్లి గ్రామము, ఎల్కతుర్తి మండలం, హన్మకొండ జిల్లా,తెలంగాణ రాష్ట్రం లో 14 సెప్టెంబర్,2021న గడ్డం సంజీవ్ కుమార్,న్యాయవాది, పౌర హక్కుల నాయకులు తన మోటార్ బైక్ పై ఇంటికి వస్తుండగా,బొలేరో జీబు ద్వారా దండేపల్లి గ్రామపోలిమేరల్లో ఎల్లబోయిన రమేష్,సంజీవ్ మోటార్ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి హత్యా యత్నం చేసిన ఘటనపై పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ,పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటిమరియు పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో ఈరోజు 17 సెప్టెంబర్,2021,శుక్రవారం నాడు సంజీవ్ స్వగ్రామమైన దండేపల్లి లో అతన్ని ,కుటుంబసభ్యులను మరియు గ్రామస్తులను కలిసి సేకరించిన నిజనిర్దారణ వివరాలు.....

దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం సంజీవ్ కుమార్ గత10 సంవత్సరాల నుండి హన్మకొండ మరియు హుజురాబాద్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ పౌర హక్కుల సంఘం లో హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నాడు. దండేపల్లి మరియు చుట్టు పక్కల గ్రామాల్లో దళితులకు అణగారిన వర్గాలకు అండగావుంటూ న్యాయవాద వృత్తి కొనసాగిస్తున్నాడు.గత మూడు సంవత్సరాలు గా దండేపల్లి కి చెందిన ఎల్లబోయిన రమేష్ గ్రామంలో దాడులు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్న సందర్భంగా, హుజురాబాద్ కోర్టులో రమేష్ నిందితుడుగా ఉన్న ఒక్క కేసు త్వరలో ట్రయల్ కి వస్తున్న పరిస్థితి. మరియు మానవ హక్కుల కమిషన్,తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో మరొక్క కేసులో రమేష్ నిందితుడుగా ఉన్న నేపథ్యంలో,గత కొద్దిరోజులుగా రమేష్, సంజీవ్ ను హుజురాబాద్ కోర్టుకేసును వాదించొద్దని, మానవ హక్కుల కమిషన్ కేసు నుంచి తప్పుకోవాలని,బెదిరింపులకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా సంజీవ్ ను చంపాలని పథకాలు పన్ని,ఎల్కతుర్తి-బాహుపేట నుండి దండేపల్లి గ్రామం వరకు కపుకాసి,14 సెప్టెంబర్,2021న సాయంత్రం గడ్డం సంజీవ్ కుమార్ తన మోటార్ బైక్ పై ఇంటికి వస్తుండగా,బొలేరో జీబు ద్వారా దండేపల్లి గ్రామపోలిమేరల్లో ఎల్లబోయిన రమేష్,సంజీవ్ మోటార్ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి నాడు.

ఈ ఘటనలో సంజీవ్ బైక్ పై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుండి బయట పడి, చిన్నచిన్న గాయాలయ్యాయి. ఉద్దేశ్య పూర్వకంగా రమేష్, సంజీవ్ ను చంపాలనే కుట్రకు వెనుక మద్దతుగా బలమైన మాఫియా, అధికార TRS పార్టీ అండదండలతో కొనసాగింది. సంజీవ్ పై దాడికి నిరసనగా హుజురాబాద్ బార్ అసోసియేషన్ వెంటనే స్పందించి 15 సెప్టెంబర్,2021న హుజురాబాద్ కోర్ట్ బహిష్కరించి, సంజీవ్ కు అండగా హుజురాబాద్ బార్ అసోసియేషన్, హుజురాబాద్ న్యాయ వాదులు నిలబడి ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినారు. మొదట రోడ్ ఆక్సిడెంట్ గా కేసు నమోదుకు ప్రయత్నం చేసింది రమేష్కు అండగా ఉన్న మాఫియా. కానీ హుజురాబాద్ బార్ అసోసియేషన్ మద్దతు వలన వెనక్కి తగ్గి హత్యాయత్నము కేసు రమేష్ పై నమోదు చేశారు.పౌర హక్కుల సంఘం సంజీవ్ పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది..
17 ఫిబ్రవరి,2021న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగమైన మంథని -పెద్దపెల్లి రోడ్డుపై కమాన్ పూర్ కల్వచెర్ల శివారులో హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు,గట్టు నాగలక్ష్మి దంపతులను అతి కిరాతకంగా పట్టపగలు నరికి చంపిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరిగిపోయాయి.

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలకు కొద్దిగా కూడా భ‌యపడక ప్రభుత్వం అండదండలతో మాఫియా రెచ్చిపోతున్న సందర్భంలోనే గడ్డం సంజీవ్ పై హత్యాయత్నం జరిగింది..
ఈ ఘటనపై పౌర హక్కుల సంఘం త్వరలో హై కోర్ట్ మరియు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు పిర్యాదు చేస్తోంది..
సంజీవ్ కు అండగా నిలబడిన హుజురాబాద్ బార్ అసోసియేషన్ ను న్యాయవాదులను ఈరోజు 2:30 గంటలకు పౌర హక్కుల సంఘం నిజనిర్దారణ నాయకులు కలిసి వారి నిరసనలకు కృతజ్ఞతలు తెలిపి సంజీవ్ పై దాడికి వ్యతిరేకంగా జరిగే పోరాటంకు అండగా ఉంటామని సంఘీభావం తెలిపాము.

ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజా సంఘాలు సంజీవ్ పై దాడి ఖండించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది..
సంజీవ్ పై హత్యాయత్నం కు ప్రధాన నిందితుడు ఎల్లబోయిన రమేష్ తో పాటు అతనికి వెనక సహకారాన్ని అందించిన మాఫియా పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి..

తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఆపివేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కార్యాచరణ చేపట్టాలి.....

నిజానిర్దారణ లో పాల్గొన్న వారు..
1)మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పౌరహక్కుల సంఘంతెలంగాణ.
2)GAV ప్రసాద్, అధ్యక్షులు ,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం
3)శ్రీపతి రాజగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
4.పోగుల రాజేశం, E C మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
5..కడ రాజయ్య, E C మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
6.బొడ్డుపెల్లి రవి, E C మెంబర్,ఉమ్మడి కరీంనగర్ జిల్లా పౌరహక్కుల సంఘం.
7.బాలసాని రాజయ్య, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా.
8.K. రవిందర్, ప్రజా సంఘాల నాయకులు..
మరియు పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు....
దండేపల్లి,హన్మకొండ జిల్లా..
హుజురాబాద్ కరీంనగర్ జిల్లా..
సాయంత్రం 4:40గంటలు..
17 సెప్టెంబర్,2021,శుక్రవారం..

Keywords : CLC, Hanmakonda, Wrangal, Attack on advocate, lakshman
(2021-10-26 22:28:43)No. of visitors : 653

Suggested Posts


ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

Solidarity statement by Democratic Studentsʹ Association for Comrade Tipu Sultan
పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
more..


న్యాయవాది,