దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక


దేశ రైతాంగపై మరో కుట్ర ... వ్యవసాయాన్నిఅమెరికా, ఇండియా కార్పోరేట్లకు అప్పగించే ప్రణాళిక

దేశ

18-09-2021

మొత్తం వ్యవసాయ వ్యవస్థకు (agricultural infrastructure) డిజిటల్ రూపం (digital form) యిచ్చే సాకుతో రైతుల వ్యక్తిగత సమాచారాన్ని అగ్రిస్టాక్ (Agristack)పేరుతో సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, మరోవైపు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ కంపెనీల చేతిలో పెట్టాలనే ఆసక్తితో ఉంది. ఈ పని కోసం ఎన్నుకొన్న ఐదు డిజిటల్ కంపెనీలలో, సిస్కోCISCO అనే అమెరికన్ కంపెనీ కూడా ఉంది, అయితే మన ప్రధాని భారతదేశాన్ని స్వీయ ఆధారిత దేశంలా చేయాలని నిరంతరం ఉపన్యాసాలు ఇస్తున్నాడు.

వీటిలో అంబానీ జియో ప్లాట్‌ఫాం లిమిటెడ్ (Jio Platform Limited)కూడా ఉంది, త్వరలో అంబానీ వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున కనిపిస్తాడనడంలో సందేహం లేదు. మోడీ జీ స్నేహితుడు, గౌతమ్ అదానీ Ambani ఇప్పటికే ఆపిల్ తోటలు యింకా ఏమేమి నడుపుతున్నాడో తెలియదు. వ్యవసాయం-రైతుల డిజిటల్ రూపం కోసం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ (Union Agriculture Minister Narendra Singh Tomar) నిర్ణయించిన ఇతర కంపెనీలు – నింజాకార్ట్ (Ninjacart), ITC లిమిటెడ్, నేకెడెస్క్ ఈ మార్కెట్స్ లిమిటెడ్ ((NCDEX e Markets Limited).

ఈ ఒప్పందంపై సంతకం చేస్తున్నప్పుడు, వ్యవసాయము, రైతులకి సంబంధించిన సమగ్ర సమాచారాన్నంతా ఒకే చోట వుంచవచ్చనీ అందువల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఉత్పత్తిని పెంపొందిస్తుందని, పెద్ద ఎత్తున ప్రైవేట్ కంపెనీల రాక, కొత్త టెక్నాలజీ లభిస్తుందని, రైతులకు లాభాలు పెరుగుతాయని వ్యవసాయ మంత్రి చెప్పాడు. రైతులు వ్యతిరేకిస్తున్న మూడు కొత్త వ్యవసాయ చట్టాల (Farm Laws) సమయంలో కూడా యివే విషయాలను చెప్పారని జ్ఞాపకం చేసుకోవాలి.

అతిపెద్దదైన, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అగ్రిస్టాక్ కింద, రైతులకు ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్య (Farmerʹs Identification Number) ఇస్తారు, దీని కోసం ప్రతి రైతు నుంచి వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. చాలా మంది రైతు నాయకులు ఏదైనా ప్రైవేట్ లేదా బహుళజాతి కంపెనీలకు(Private or Multinational Firms) తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం ప్రతిదీ చాప కింద నీరులా నిశ్శబ్దంగా చేస్తుంది, ఏదో ఒక రోజు దేశంలో ప్రతి రైతు వ్యక్తిగత సమాచారం అంబానీ లేదా అదానీ దగ్గర వుందని తెలుస్తుంది - అదే ప్రభుత్వం కోరుకుంటున్నది.

అగ్రిస్టాక్ తర్వాత ఉత్పత్తి పెరుగుతుందని వ్యవసాయ మంత్రి అంటున్నాడు, కానీ ప్రభుత్వ డేటా ప్రకారం, ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరమూ పెరుగుతూనే వుంది. ఎన్ని సమస్యలు వున్నప్పటికీ రైతులు దేశ డిమాండ్ కంటే ఎక్కువ ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నారు, సమస్యంతా గిట్టుబాటు ధర, నిల్వ వసతులు, సత్వర చెల్లింపు. ఈ సమస్యలన్నింటిపై ప్రధానమంత్రి, వ్యవసాయ మంత్రి రైతులకు బోలు హామీలను మాత్రమే ఇస్తారు - సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

చిన్న రైతుల గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని, వారి కోసం అనేక చర్యలు తీసుకున్నానని ప్రధాని అలీగఢ్‌లో చెప్పారు. ఈ విషయంలో, తాను మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌తో సమానమన్నాడు. దేశంలోని 10 మందిలో 8 మంది రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ పొలం ఉందని, ఆయన ఈ రైతుల కోసం నిరంతరం పని చేశారని మోదీ జీ చెప్పాడు. ప్రధానమంత్రి రైతుల గురించి మాట్లాడినప్పుడు, వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే అతను, అతని ప్రభుత్వం పార్లమెంటు మొదలుకొని బయటి సమావేశాల వరకు ప్రతిచోటా రైతుల గురించి, వ్యవసాయ చట్టాల గురించి అబద్ధాలే చెప్పారు. వాటి గురించి రైతులతో మాట్లాడే బదులు, చట్టపరమైన అబద్ధాలను వ్యాప్తి చేయడానికి, అతని మంత్రి-మార్బలాన్ని వీధుల్లోకి కూడా తీసుకువచ్చాడు.

రైతుల విషాదం కేవలం ప్రభుత్వమూ, బిజెపికి మాత్రమే పరిమితం కాదు, ఏ సమాజమైతే వారిని అన్నదాతగా ప్రకటిస్తుందో అదే సమాజపు ప్రధాన స్రవంతి మీడియా, సామాజిక మాధ్యమం వారిని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. పంటల కనీస మద్దతు ధర కోసం కొత్త చట్టాన్ని కూడా రూపొందించాలని రైతులు కోరుకుంటున్నారు, అయితే MSP తొలగించబడదని ప్రధాని స్వయంగా చెప్పారని రైతులకు అంతకంటే యింకేం కావాలని మీడియా, సోషల్ మీడియాలో పదేపదే ప్రసారం చేస్తోంది

మీడియా, సోషల్ మీడియాలో ప్రధానమంత్రి మాటలను బ్రహ్మవాక్యాలని, దేశ చట్టం అని చెబుతూ బిజెపి కార్యకర్తలు, మీడియా వ్యక్తులు, అంధ భక్తులు, రైతులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ముందుగా నోట్ల రద్దు సమయంలో మన గొప్ప ప్రధాని మాటలు, వాగ్దానాలను సమీక్షించాలి. వాస్తవమేమంటే, ప్రధానమంత్రి చెప్పేదానికి సరిగ్గా విరుద్ధంగా అవుతుంది.

నోట్ల రద్దు సమయంలో కూడా ప్రధానమంత్రి అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధిని కోరుకున్నారు, కానీ అదానీ-అంబానీ ధనవంతులు అయ్యారు, వెనుకబడినవారు మరింత వెనుకబడిన వారుగా మారారు. కొత్త వ్యవసాయ చట్టాల సందర్భంలో మళ్లీ ప్రధాన మంత్రి వెనుకబడిన ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, నోట్ల రద్దు ఫలితం పరిణామం మళ్ళీ ముందుకు వస్తుంది. ప్రభుత్వ మండీలు అక్కడే ఉంటాయని ప్రధాన మంత్రి అంటున్నారు, కానీ ఆ మండీలు వున్న రాష్ట్రాలలోని రైతులే కొత్త వ్యవసాయ చట్టాలకు అత్యంత వ్యతిరేకంగా వున్నారు అనే విషయాన్ని మర్చిపోయాడు.

సమాజంలో కూడా, రైతుల ఆత్మహత్యలు లేదా ఉద్యమాల సమయంలో మాత్రమే రైతుల గురించి చర్చ జరుగుతుంది. వాస్తవానికి, వినియోగదారుడు, పెట్టుబడిదారీ మార్కెట్ రైతులు, సమాజం మధ్య లోతైన అగాధాన్ని సృష్టించింది. ఒకప్పుడు దుకాణాలలో ధాన్యాన్ని బస్తాలలో ఉంచేవారు, కొనుగోలుదారులు ధాన్యం కొనేటప్పుడు రైతుల గురించి కూడా ఆలోచించేవారు. నేటి యుగం ఆహార ధాన్యాలది కాదు, ప్యాకెట్లలో వచ్చే ఉత్పత్తులది. ఈ ప్యాకెట్లను మనం యితర పారిశ్రామిక ఉత్పత్తిని కొంటామో అలానే కొంటాము. వాటిని వినియోగించేటప్పుడు, పరిశ్రమలపై దృష్టి వుంటుంది తప్ప పొలాల మీద కాదు.

హరిత విప్లవం తరువాత, పోషకాహార లోపం సమస్య మరింత తీవ్రమవుతున్నప్పటికీ, పర్యావరణ సంక్షోభం మరింతగా తీవ్రతరమవుతున్నప్పటికీ, భూగర్భజలాలు మరింత లోతుకి వెళ్తున్నాపోతున్నప్పటికీ ఆహార సంబంధిత ఉత్పత్తుల కొరత మాత్రం ముగిసింది. ఇంతకు ముందు వుండిన కరువు భయం మనస్సు నుండి మాయమైపోయింది, దానితో పాటు రైతులు కూడా సమాజపు చివరి అంచులకు చేరుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు కూడా రైతుల సమస్యలపట్ల ఉదాసీనంగా మారాయి. నేటి యుగంలో పరిస్థితి ఏమిటంటే, వ్యవసాయాన్ని కూడా పెట్టుబడిదారీ విధానం దృష్టితో చూస్తున్నారు, ఒక పరిశ్రమలాగా నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన అతి పెద్ద వాస్తవం ఏమిటంటే, చాలా పెద్ద స్థాయిలో చేసిన శ్రమలో ఏదీ ఖచ్చితంగా ఉండదు. దీనిలో, రైతు శ్రమ, పెట్టుబడి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా చోట్ల విద్యుత్ మరియు నీరు కూడా అందుబాటులో ఉన్నాయి - ఇవన్నీ వున్న తర్వాత కూడా , వాతావరణం సరిగా లేకపోతే సర్వనాశనమైపోతుంది.

వ్యవసాయం అనేది ఎలాంటి పనంటే శ్రమ, పెట్టుబడి, కాపలా కాసిన తర్వాత కూడా పెట్టుబడిదారీ పరిభాషలో దిగుబడి లేదా ఉత్పత్తికి హామీ ఉండదు. అయినప్పటికీ కోట్లాది మంది రైతుల మనోస్థైర్యమే వారిని వ్యవసాయం చేపట్టడానికి ప్రోత్సహిస్తుంది. అంతా సవ్యంగా జరిగి, దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ, పెట్టుబడి అయినా మార్కెట్ నుండి తిరిగి వస్తుందో లేదో తెలియదు.

(janjwar.com సౌజన్యంతో....)
తెలుగు అనువాదం : పద్మ కొడిపర్తి

Keywords : farmers, india, modi, bjp, ambhani, adani, america,CISCO,Modi Government Plan to hand over agriculture to US and Indian corporates
(2021-10-26 22:21:03)No. of visitors : 419

Suggested Posts


దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

రైతుల‌ ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా

కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు.

Search Engine

Solidarity statement by Democratic Studentsʹ Association for Comrade Tipu Sultan
పెగాసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు
Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
more..


దేశ