తుపాకులతో... బాక్సైట్ తవ్వకాలు - భగ్గుమంటున్న మన్యం


తుపాకులతో... బాక్సైట్ తవ్వకాలు - భగ్గుమంటున్న మన్యం

తుపాకులతో...

పచ్చని అడవి బతుకులను బూడిద చేయడానికి ప్రభుత్వం నడుం భిగించింది. మన్యం ఆదివాసులంతా తమ జీవితాలను బుగ్గి చేయొద్దని వేడుకుంటున్నా, మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా.... చివరకు అధికార తెలుగుదేశం నాయకులు కూడా ఒద్దని చెబుతున్నా.... తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1212 హెక్టార్ల భూమిలో 222.84 మిలియన్ టన్నుల బాక్సైట్ తవ్వకం కోసం జీవో నెంబర్ 97 ను విడుదల చేసింది. ఎవ్వరు వ్యతిరేకించినా ఎన్ని పోరాటాలు జరిగినా పోలీసుల సహాయంతో తవ్వకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. బాక్సైట్ తవ్వకాలకు జిందాల్, ఆన్రాక్ కంపెనీలకు అనుమతినిస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఒకవైపు మావోయిస్టు పార్టీ మరో వైపు తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం పార్టీలన్నీ ఆందోళనలు నిర్వహించడంతో కాంగ్రెస్ ప్రభ్త్వం అనుమతులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అప్పుడు వ్యతిరేకించిన తెలుగుదేశం మాత్రం ఇప్పుడు అనుమతులు మంజూరు చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం పట్ల ఏజెన్సీ ప్రాంత టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. కొద్ది రోజుల క్రితం బాక్సైట్ తవ్వకాలు జరపవద్దనే డిమాండ్ తో మావోయిస్టులు ముగ్గురు తెలుగుదేశం నాయకులను కిడ్నాప్ చేసిన సమయంలో తనను కలిసిన నేతలతో చంద్రబాబు మాట్లాడిన మాటలకు ఇప్పటి చేతలకు పొంతన లేదని స్థానిక తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. ఆదివాసుల అభిప్రాయాలు పరగణలోకి తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరపబోమని హామీ ఇచ్చిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. పార్టీకి తమకన్నా కార్పోరేట్ కంపెనీలే ఎక్కువయ్యాయా అని ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్నలు మండి పడుతున్నారు. తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలవల్ల పర్యావరణం దెబ్బతినడమే కాక ఆ చుట్టూ పదిహేను కిలోమీటర్ల మేర ఉన్న అనేక ఆదివాసుల గ్రామాలు జీవనానికి పనికి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బాక్సైట్ ధూళి ప్రభావంతో ఆదివాసులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపత్యంలో..ఎట్టి పరిస్తితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరగనివ్వకూడదని, అందు కోసం ఎంతటి తీవ్రమైన పోరాటానికైనా సిద్దపడాలని మావోయిస్టు పార్టీ భావిస్తోంది. స్థానిక తెలుగు దేశం నాయకులతో సహా అన్ని పార్టీల నేతలు కూడా మావోయిస్టుల బాటలో నడవడానికి సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సభలు సమావేశాలు వివిధరకాల నిరసన రూపాలతో తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేస్తున్న ఆదివాసులు ఇక మిలిటెంట్ పోరాటాలకు సిద్దమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వమేమో బాక్సైట్ తవ్వకాలు సజావుగా జరిగేందుకు ఏ చర్యలకైనా సిదమవుతోంది. అవసరమైతే పోలీసుల సహాయంతో ఉద్యమాలను అణచివేసి, ఆదివాసులను వెళ్ళగొట్టి తవ్వకాలు సాగిస్తామనే ధీమా ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.

Keywords : bauxite, Maoists, Vishakapatnam, Chandrababu, TDP
(2019-05-16 21:41:59)No. of visitors : 1069

Suggested Posts


ʹఅటవీ సంపద ఆదివాసులదేʹ - మన్యంలో తీవ్రమైన మావోయిస్టుల పోరాటం

అటవీ సంపద పై ఆదివాసులదే అధికారం అంటూ మన్యంలో మావోయిస్టులు పోరాటం ఉదృతం చేశారు. విశాఖపట్నం మన్యంలో ఒక వైపు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టులు మరో వైపు కాఫీ తోటలను ఆదివాసుల పరం....

టీడీపీ సైట్ నుండి బాబు బాక్సైట్ లేఖను ఎందుకు మాయం చేశారు ?

విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల పై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారా ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరప వద్దని, అది రాజ్యాంగ విరుద్దమని డిశంబర్ 24, 2011న గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు బాక్సౖట్ తవ్వకాలకు అనుమతులు ఎలా ఇచ్చారు ? నిన్నటిదాకా తెలుగుదేశం వెబ్ సైట్ లో ఉన్న ఆ లేఖ ఇవ్వాళ్ళ ఎందుకు మాయమయ్యింది ?....

బాక్సైట్ తవ్వకాలు ఆపేయండి లేదంటే నక్సల్స్ బతకనివ్వరు - మంత్రి అయ్యన్నవేడుకోలు

ʹప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చు నక్సలైట్లను ఎదుర్కోలేంʹ ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ఆందోళన. విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి....

బాక్సైట్ నిరసన - మన్యం బంద్

విశాఖమన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మన్యం బంద్ జరగనుంది.....

బాక్సైట్ పోరు - మన్యం బంద్ సక్సెస్

విశాఖ మన్యం బంద్ విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకోసం అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం శనివారం బంద్ కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ బంద్ లో....

ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి

అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య మీద చాలా మంది అంగలారుస్తున్నారు. ఆదివాసుల నుంచి ఎదిగిన నాయకులను చంపేస్తారా? అంటున్నారు. ఒకవేళ ఆదివాసులు కాకపోయి ఉంటే అప్పుడు ఇంకో రకమైన నిట్లూర్పులు వినిపించేవి. అసలు ఎవర్నీ చంపే దాకా పరిస్థితులు పోకూడదు. దీని మీద ఎవరూ సిద్ధాంతాలు చెప్పనవసరం లేదు. అది చాలా మామూలు మానవతా వైఖరి. వివరాల్లోకి వెళితే ఎంతయినా మాట్లాడుకోవచ్చ

బాక్సైట్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

విషాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. మావోయిస్టుల నాయకత్వంలో గిరిజనుల పోరాటం, స్వపక్షం విపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో......

Search Engine

కోరాపుట్ ఎన్ కౌంటర్: నిజ నిర్దారణ బృందాన్ని అడ్డుకున్న పోలీసుల స్పాన్సర్ సంఘం
ఒడిశా బూట‌కపు ఎన్ కౌంటర్ కు నిరసనగా దండకారణ్య బంద్
ʹవీరన్న దూరమైనా పీడిత వర్గాల పోరాటంలో జీవించే ఉంటాడుʹ
ప్రొ.సుజాత సూరేపల్లికి TVV కి విరసం సంఘీభావం
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నేడు మావోయిస్టులా..?
సాయిబాబా నుండి సూరేపల్లి సుజాత వరకూ...! -ఎస్.ఏ. డేవిడ్
నిర్వాసితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.... హ‌క్కుల‌ కార్య‌క‌ర్త‌ల‌ను అరెస్టు చేశారు
బీజేపీ మళ్ళీ అధికారానికొస్తే....
Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions
వరంగల్ లో విద్యార్థులు, రచయితలు, మహిళలతో సహా ప్రజా సంఘాల నేతల అరెస్టు..ఖండించిన విరసం
#CloudyModi మేఘాల చాటున మోడీ యుద్దం... నెటిజనుల సెటైర్లు
ఈ దేశ విముక్తి పోరాటంలో తన నెత్తురుతో ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన కామ్రేడ్ స్వరూపకు జోహార్లు !
నరేద్ర‌ మోడీపై టైమ్ మ్యాగజైన్ సంచలన కథనం
సంస్కరణలు-ప్రజాస్వామ్యం
రాజస్థాన్ లో దళిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రేపు హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన
ఈ దేశం దళితులకేమిచ్చింది ?
భారత మాతకు పాకిస్తాన్ బిడ్డ రాసిన ఉత్తరం
ఎడ్సిమెట్ట ఆదివాసులపై హత్యాకాండ ‍- ఆరేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు
అవును నేను మావోయిస్టునే..!
సీజేకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు ముందు ఆందోళ‌న నిర్వహించిన‌ మహిళల అరెస్ట్
తమ పక్కన కూర్చొని భోజనం చేశాడని దళితుడిని కొట్టి చంపిన అగ్రకుల అహంకారులు
దళితుణ్ణి పెళ్ళి చేసుకున్నందుకు యువతిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన కన్న‌ తండ్రి
ప్రజాపోరాటాల సాక్షిగా ఆ గొంతు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది - అరుణోదయ రామారావుకు అరుణారుణ జోహార్లు.
అరుణోదయం ఆయన గానం..విప్లవం ఆయన ప్రాణం
సర్జికల్ దాడుల రాజకీయాలు
more..


తుపాకులతో...