నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌


నిర్దోషి 14 ఏళ్ళ జైలు జీవితం... అమీర్ ఖాన్ కన్నీటి, పోరాట‌ గాథ‌

22-09-2021

ఈ దేశంలో బూటకపు కేసులు బనాయించి అనేక మంది ముస్లింలను, దళితులను, విప్లవ కారులను, ప్రజా పక్షం వహించే మేదావులను జైళ్ళలోకి నెడుతున్నారు పాలకులు. అలా జైళ్ళలో దశాబ్దాల తరబడి మగ్గి నిర్దోషులుగా బైట‌డినవాళ్ళే ఎక్కువ మంది. అలా అన్యాయపు కేసులతో శిక్షపడకుండానే జైళ్ళలో మగ్గిపోయిన వాళ్ళలొ మొహమ్మద్ అమీర్ ఖాన్ ఒకరు. 1998 లో కిడ్నాప్ చేశారు పోలీసులు, చిత్రహింసలకు గురి చేశారు. చివరకు 19 బాంబు పేలుళ్ళ కేసులు ఆయన మీద బనాయించి జైళ్ళో తోశారు. 14 ఏళ్ళ న్యాయ పోరాటం తర్వాత‌ ఆయన జైలు నుండి నిర్దోషిగా విడుదలయ్యారు. అరెస్టయ్యే నాటికి ఆయన వయసు 18 ఏళ్ళు. ఆయన విడుదలయ్యి బైటికొచ్చేనాటికి ఆయన 32 ఏళ్ళ వయస్కుడు. తండ్రి చనిపోయాడు, తల్లి పక్షవాతానికి గురయ్యి మంచానపడింది..... అమీర్ అరెస్టు, కేసు వివరాలు, న్యాయ పోరాటం...ఆయన జైలుకు వెళ్ళాక కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్ళు... బైటికి వచ్చాక పడ్డ కష్టాలు... వీటన్నిటి సమాహారంగా....అమీర్ తరపున వాదించిన లాయర్ నందితా హక్సర్, అమీర్ తో కలిసి రాసిన పుస్తకమిది. ఇంగ్లీషులో ఈ పుస్తకం పేరు ʹFramed as a Terroist... My 14 Year Stuggle to Prove My Innocenceʹ . ఈ పుస్తకాన్ని తెలుగులో కె ఉషారాణి అనువదించగా మలుపు పబ్లికేషన్స్ ప్రచురించింది. తెలుగులో ఈ పుస్తకం పేరు ʹతీవ్రవాదిʹ ముద్ర...నిర్దోషిత్వ నిరూపణకు పధ్నాలుగేళ్ళ పోరాటం.

(పైన వీడియోలో NDTV ʹప్రైమ్ టైం విత్ రవీష్ కుమార్ʹ ప్రోగ్రాంలో అమీర్ ఖాన్ గురించి, ఈ పుస్తకం గురించి వచ్చిన న్యూస్ ఐటెమ్..వీడియోలో ఈ న్యూస్ ఐటెమ్ టైం 13.17 నుండి 17.28 వరకు )

ఈ పుస్తకం గురించి రచయిత నందితా హక్సర్ తో సహా పలువురు మేదావుల అభిప్రాయాలు....

మహమ్మద్ అమీర్ ఖాన్ 1972 లొ జన్మించాడు. 1998 లో కిడ్నాప్ కు, చిత్రహింసలకు గురయి 19 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా జైలు పాలయ్యాడు. తిరిగి స్వేచ్చ పొందటం కోసం 14 ఏళ్ల పాటు పోరాటం చెయ్యవలసి వచ్చింది. స్వేచ్చా జీవి గా బయట పడేనాటికి ఆయన ప్రపంచం అనూహ్యంగా మారిపోయింది. తండ్రి చని పోయాడు. తల్లి పక్షవాతంతో మంచం పట్టింది. ఉద్యోగం లేదు. ఏ విధమైన జీవన భద్రత లేదు. ప్రాణం నిలుపుకోవటానికి నిత్యం పోరాడాల్సిన పరిస్ఠితి. అటువంటి స్థితిలో కూడా ఆయన వివక్షకు, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాలలో మమేకమయ్యాడు. ప్రజాతంత్ర హక్కులు, లౌకికతత్వం కోసం పనిచేశాడు. షబ్నమ్ హష్మి నెలకొల్పిన ʹఅన్షద్ʹ సంస్థ లో చేరి భారతదేశం నలుమూలలా తిరిగాడు. మైనారిటీ మతస్తుల, ఖైదీల, అణగారిన స్త్రీల, ఎల్ .జి.బి.టి హక్కుల కోసం చురుగ్గా పనిచేశాడు.
జాతీయ అంతర్జాతీయ సమాచార మాధ్యమాలలో అనేక ఇంటర్వూలు ఇచ్చాడు. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన అనేక సమస్యలపై అనర్గళంగా మాట్లాడేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తనకోసం 14 సంవత్సరాలు ఎదురు చూసిన అలియాను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ తమ కుమార్తెతో కలిసి పాత డిల్లీ లో ఉంటున్నారు.
‍ -నందితా హక్సర్ మనవ హక్కుల న్యాయవాది, ఉపాధ్యాయురాలు, రచయిత.

తీవ్రంగా కలిచివేసే సంఘటనలు, నమ్మశక్యం కాని అన్యాయానికి సాక్ష్యంగా నిలిచే పరిణామాలు, భరించరాని హింస కూడా ఓరిమి, ప్రేమ, మంచి కోసం ఎదురుచూపులు వ్యక్తపరిచే వింతైన కథలు,
‍ -హర్ష‌ మంద‌ర్

తీవ్రవాదిగా చిత్రణ, భయంకరమైన, హృదయ విదారకమైన పాత ఢిల్లీలో నివసించిన ఒక యువకుడి కథం. తీవ్రవాదిగా చిత్రించబ‌డి దాదాపు 14 సంవత్సరాలు జైలులో పెట్టబడిన అతని కథ‌.
కష్టతరమైన సంక్లిష్టమైన చట్టాలతో సుదీర్ఘకాలం పోరాటం చేసి చిత్రహింసలను, ఒంటరి ఖైదును జయించిన వీరుని గాథ మొహమ్మద్ అమీర్ ఖాన్ తాను పెరిగిన ప్రజాతంత్ర విలువలకి లౌకితత్వానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. ఓటమిని అంగీకరించని వ్యక్తి. తన కుటుంబం గురించి తాను కన్న కలలను సాకారం చేసుకునే వరకు కృషి చేసిన వ్యక్తి. తనను దాదాపు సర్వ నాశనం చేసిన దేశాన్ని వీడని వ్యక్తి

ఇదో మానవత్వానికి పరాకాష్టగా నిలిచే కథ, తీవ్రమైన అన్యాయాన్ని కూడా పట్టుదలతో ధైర్యంతో ఎదిరించి నిలిచిన వ్యక్తి కథ. ఇది కేవలం ఒక జ్ఞాపకాల సమాహారం కాదు. ప్రతి భారతీయుడు తప్పనిసరిగా వెంటనే చదవలసిన కథ‌: ప్రతి భారతీయుని చేతిలో ఉండవలసిన పుస్తకం

అమీర్ విడుదల, ఇంకా ఎంతో మంది తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొని విముక్తి పొందడం మన న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పునర్ స్థాపితం చేస్తుంది. కాని ఎంత మంది అమాయకులకు ఇంతటి అదృష్టం దక్కుతుంది. ʹనిర్దోషిగా రుజువయ్యేంతవరకు దోషిగా భావించడం, శిక్షాస్మృతిలోని న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది తప్పనిసరిగా అంతమవ్వాలి. అవిశ్రాంతంగా మానవ హక్కుల కోసం కృషిచేసే నందితా హ‌క్సర్ కన్నా బాగా అమీర్ కథను చెప్పేవారు ఇంకెవరుంటారు.
- ఫైజాద్ ముస్తఫా, వైస్ ఛాన్సలర్ నేషనల్ అకాడెమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్

ఈ పుస్తకం లభించు చోటు:

తెలంగాణ: నవతెలంగాణ అన్ని బ్రాంచీల్లో, నవ చేతన, నవోదయ బుక్ హౌజ్, హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ : విశాలాంధ్ర అన్ని బ్రాంచుల్లో, ప్రజా శక్తి అన్ని బ్రాంచుల్లో

ʹఅనేకʹ విజయవాడ‌

Keywords : Framed as a Terroist, Mohamed Amir Khan, Nandita Haksar, malupu
(2021-10-27 06:46:01)No. of visitors : 520

Suggested Posts


కశ్మీర్ బహిరంగ చెరసాల... 24న పుస్తకావిష్కరణ‌

ఏదో జరగబోతోందన్న సూచనలు కనిపించాయి. అదే జరగబోతోందన్న ఊహలు కూడా వినిపించాయి. అయినా, ఆగస్టు 5వ తేదీ ఉదయం ఖచ్చితంగా అదే జరిగేటప్పటికి దిగ్భ్రాంతి. ఒక్కసారిగా అనూహ్యంగా మారిపోయిన పరిస్థితి. అనేక వాదనల, ఆలోచనల, ఊహల, పరిష్కారాల- ప్రాతిపదికలన్నిటికీ కాళ్లకింద నేల కదిలిపోయింది. మన హ దయాలు కోతపడి, మెదళ్లు స్తంభించిపోయిన ఆ సమయంలోనే, వెనువెంటనే, నూతన పరిస్థితుల నవీ

45 మందిని చంపి నదిలో తోసేసిన‌ పోలీసుల హత్యాకాండపై...ఓ ఐపీఎస్ అధికారి పుస్తకం... ʹహాషీంపురా 22, మేʹ

హత్యలు జరిగినరోజున దినకూలీలు, నేతపనివాళ్లు అయిన దాదాపు నలబై ఐదు మంది ముస్లిం యువకులను పిఎసి పోలీసులు ట్రక్కు ఎక్కించి ఘజియాబాద్‌ జిల్లా మురాద్‌ నగర్‌ లో ఎగువ గంగ కాలువ దగ్గర కాల్చిచంపి మృతదేహాలను కాలువలోకి తోసేశారు. చనిపోయినట్టు నటించి కాలువలో ఈదుతూ బైటపడిన ప్రత్యక్షసాక్షి కథనం మేరకు, పౌరహక్కుల సంఘాల ఒత్తిడి మీద

Search Engine

Tripura: VHP ర్యాలీ సందర్భంగా మసీదు ధ్వంసం....మైనారిటీల‌ ఇళ్ళు, షాపులపై దాడి,దోపిడి
UP: లఖింపూర్ రైతుల హత్య కేసు.... యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం
333 రోజులు...600 మరణాలు...కుట్రలు, దాడులు, హత్యలను ఎదుర్కొంటూ అప్రతిహతంగా సాగుతున్న రైతాంగ ఉద్యమం
వరవరరావు బెయిల్ పొడిగింపు కేసు మళ్ళీ వాయిదా
#StandwithVV #StandwithBK15
ఒకచేత్తో కన్నీరు తుడుచుకొని మరొక చేత్తో ఎర్రజెండ ఎత్తుకొని.... పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్కే సంస్మరణ సభ‌
ఉద్యమ రైతుల ఆకలి తీరుస్తున్న‌ ఓ NRI ని ఇండియాలోకి రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం
ములుగు జిల్లాలో ఇవ్వాళ్ళ జరిగిన ఎన్ కౌంటర్ బూటకం - బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
Bhima Koregaon case:గౌతమ్ నవ్‌లఖా జీవన సహచరి హృదయ విదారకమైన ప్రకటన
100 కోట్ల వ్యాక్సినేషన్ పచ్చి అబద్దం - శివసేన
UP:సాయంత్రం 5 దాటాక పోలీసు స్టేషన్ కు వెళ్ళకండి - మహిళలకు BJP నాయకురాలి హెచ్చరిక‌
భగత్‌సింగ్‌ పుస్తకం ఉండటం చట్ట విరుద్ధం కాదన్న కోర్టు - నక్సల్‌ కేసులో కర్ణాటక ఆదివాసీ తండ్రీ , కొడుకుల విడుదల
రైతులకు నిరసన తెలిపే హక్కు ఉంది కానీ నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేసే హక్కు లేదు - సుప్రీం కోర్టు
రైతు ఉద్యమంపై చేతనానాట్యమంచ్ పాట - రిలీజ్ చేసిన మావోయిస్టు పార్టీ
చర్చల సందర్భంగా రామకృష్ణ రాసిన వ్యాసం
గత ఏడాది 59 వేల మంది పిల్లలు మిస్సింగ్...చౌక శ్రమ,బానిసత్వం,వ్యభిచారం లోకి నెట్టబడుతున్న పిల్లలు
UP రైతుల హత్య కేసు: కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను పదవినుండి తొలగించాలి -మేఘాలయ గవర్నర్ డిమాండ్.
UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది
విప్ల‌వంలో శాంతి నిర్వచనం -పాణి
మేము ఏటికి ఎదురీదుతాం - రామ‌కృష్ణ‌ ఇంట‌ర్వ్యూ
పీఎల్‌జీఏ ద్విదశాబ్ది వార్షికోత్సవాల సందర్భంగా RK సందేశం
అమరుడైన ప్రజా యుద్ద వీరుడు ఆర్కే - మావోయిస్టు పార్టీ ప్రకటన‌
RK మరణ వార్తలపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాలి...పౌర హక్కుల సంఘం డిమాండ్
లఖింపూర్ ఖేరీ లో రైతుల హత్య వెనుక కేంద్రమంత్రి హస్తం - యూపీ బీజేపీ నేత సంచలన ఆరోపణ
Haryana: రైతుల దెబ్బకు కార్యక్రమం రద్దుచేసుకొని వెనక్కు మళ్ళిన ముఖ్యమంత్రి
more..


నిర్దోషి